
సాక్షి, మంగళగిరి: కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర శాసన సభ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. కరోనా బారిన పడి గుంటూరు జిల్లా చినకాకాని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్న ఆయన గురువారం డిశ్చార్జి అయ్యారు. ఆసుపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా బారిన పడితే అధైర్యపడకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్స తీసుకుంటే కరోనా నుంచి కోలుకోవచ్చన్నారు. కరోనా చికిత్సను ప్రభుత్వం ఆరోగ్యశ్రీలోకి తెచ్చి చికిత్స అందిస్తోందని, దీంతో పేదలు చికిత్స తీసుకుని కోలుకుంటున్నారని చెప్పారు. (రాష్ట్ర పరిధిలోనిదే..)
Comments
Please login to add a commentAdd a comment