నా రక్తం ఇస్తా.. ఆపరేషన్ చేయండి | will give blood and do operation to her, says Kona raghupathi | Sakshi
Sakshi News home page

నా రక్తం ఇస్తా.. ఆపరేషన్ చేయండి

Published Wed, Jan 21 2015 9:12 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

నా రక్తం ఇస్తా.. ఆపరేషన్ చేయండి

నా రక్తం ఇస్తా.. ఆపరేషన్ చేయండి

*వైద్యులతో ఎమ్మెల్యే కోన రఘుపతి


 బాపట్ల: ‘సార్.. నాకు ఆపరేషన్ చేయరంట.. నన్ను గుంటూరు వెళ్లమంటున్నారు’ అంటూ ఓ గర్భిణి  బాపట్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఎదుట బోరుమంది. గణపవరానికి చెందిన గర్భిణి అన్నామణి మంగళవారం బాపట్ల ఆస్పత్రికి చేరుకుని ఆపరేషన్ చేసి తనను, బిడ్డను కాపాడాలని కోరింది.
 
 బీ పాజిటివ్ బ్లడ్ లేకపోవటంతో గుంటూరు వెళ్లాలని వైద్యులు సూచించారు. ఆ సమయంలో ఆస్పత్రిలో అభివృద్ధి పనులు పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే దృష్టికి అన్నామణి తన బాధను తీసుకెళ్లగా.. స్పందించిన ఆయన ‘నాది బీ పాజిటివ్ బ్లడ్.. నా బ్లడ్ తీసుకుని ఆపరేషన్ ప్రారంభించండి’ అని ముందుకొచ్చారు. చివరకు ఎమ్మెల్యే చొరవతో గుంటూరులోని బ్లడ్‌బ్యాంకు నుంచి  అదే గ్రూపు రక్తం తెప్పించి వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement