
సాక్షి, గుంటూరు: బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ కార్పొరేషన్‌లో చేర్చడంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణులను బీసీలలో చేరుస్తున్నారంటూ వస్తున్న పుకార్లు ఎవరూ నమ్మెద్దు. బీసీ కార్పొరేషన్ ద్వారానే గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఏ లక్ష్యంతో, ఏ ఉద్దేశ్యంతో అయితే కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారో ఆ విధంగానే బ్రాహ్మణ కార్పొరేషన్ పనిచేస్తుంది. పథకాల నిర్వహణ మాత్రమే బీసీ కార్పొరేషన్ పర్యవేక్షణ చేస్తుంది.
బ్రాహ్మణ కార్పొరేషన్‌పై రాజకీయ పరంగా విమర్శలు చేయడం తగదు. నవరత్నాల ద్వారా పేద బ్రాహ్మణులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. నవరత్నాల్లో లేని పథకాలను బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అందిస్తాం. అవగాహన లేని వారే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నూతన జిల్లాల ఏర్పాటు కొనసాగుతోంది. సీఎం చెప్పిన తర్వాత కచ్చితంగా అమలవుతాయి. జనగణన వలన కొంత జాప్యం అవుతుంది. వచ్చే సాధారణ బడ్జెట్‌లోపే జిల్లాల ఏర్పాటు ఉండొచ్చు' అని మంత్రి తెలిపారు.