సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన వరం అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినా.. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది మాత్రం రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. పోలవరం సందర్శనకు ఆదివారం డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందుచూపుతో కాల్వలను తవ్వించడం ద్వారా పోలవరం పనులు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్ట్ లేకుండా కాలువలు తవ్వుతున్నారని అప్పట్లో ప్రతిపక్షాలు ఎద్దేవా చేశారని, కానీ ఆ కాలువల ద్వారానే ఇప్పుడు నీరు తరలించడం జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని కొంతమంది వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చదవండి: పోలవరం నిర్మాణంలో కీలక ఘట్టం
పోలవరం ప్రాజెక్టు డిజైన్ ప్రకారమే పనులు జరుగుతున్నాయని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. అంతే తప్ప ఏ ఒక్క అంగుళం ఎత్తు తగ్గించడం లేదని స్పష్టం చేశారు. అప్పట్లోనే సేకరణ చేయడం వల్ల ఇప్పుడు కర్చు తగ్గిందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. పోలవరం పనులు గురించి తెలుసుకోవాలనే ఇవాళ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చానన్నారు. అనుకున్న ప్రకారం ప్రభుత్వం పోలవరం పూర్తి చేస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment