కమీషన్ల కోసమే కదా ఆ ప్రాజెక్టును మీరు తీసుకున్నారు
వేల కోట్ల కమీషన్ కొట్టేయవచ్చనే కదా ప్రాజెక్టును మీ ప్రభుత్వం తీసుకుంది
ఇది ఏ కాంట్రాక్టర్‌కైనా అర్థమవుతుంది
పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని మోదీ వ్యాఖ్యానించలేదా?
డయా ఫ్రం వాల్ ముందుగా నిర్మించడం మీరు చేసిన చారిత్రాత్మక తప్పిదం కాదా?
మీరు చేసిన తప్పుల్ని మాపై రుద్దే యత్నం చేస్తున్నారు
సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు ధ్వజం
తాడేపల్లి: పోలవరం ప్రాజెక్టు విషయంలో తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అబద్ధాలు, అసత్యాలతో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడాన్ని తూర్పారబట్టారు అంబటి రాంబాబు.
ఈ మేరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఆధారాలతో సహా మీడియాకు వివరించారు అంబటి.
అసలు స్పిల్‌వే చానల్ పూర్తి కాకుండా, అప్రోచ్ చానల్ పూర్తి కాకుండా, నది డైవర్షన్ పూర్తి కాకుండా కాపర్ డ్యామ్‌ను ప్రారంభించి డయా ఫ్రం వాల్‌ను నిర్మించడం గత చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన చారిత్రాత్మక తప్పిదమన్నారు.
దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టుని మీరు ఎందుకు వారి దగ్గర్నుంచి తీసుకున్నారని అంబటి ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రాజెక్టుకు నిధులను ముందు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందని, ఆపై మీరు ఇవ్వమని 2013-14 రేట్లతో 2016వ సంవత్సరంలో అంగీకరించడం ద్రోహం, చారిత్రాత్మక తప్పిదం కాదా? అని నిలదీశారు. 2018 సంవత్సరానికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి చంద్రబాబు అపరభగీరథుడు అనిపించుకునే ప్రయత్నం చేసి.. ఇప్పుడు ఆ తప్పులను మా మీద రుద్దే యత్నం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మాపై మీరు చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆ ప్రాజెక్టును మీరు పూర్తి చేసేటట్లు లేరనే విషయం అర్థం అవుతుందని, మళ్లీ జగనే దాన్ని పూర్తి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
అంబటి రాంబాబు ఏమన్నారంటే...
- మా ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో చిన్న తప్పుకూడా జరగలేదు
- వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు
- కరోనా సమయంలో కూడా పోలవరం ప్రాజెక్టు పనులు ఆగలేదు
- జగన్ అంటే భయం కాబట్టే చంద్రబాబు దూషిస్తున్నారు
- ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబుకు అహం పెరిగింది
- పోలవరంపై చంద్రబాబుకు శ్రద్ధ లేదు
- పోలవరం ప్రాజెక్టు విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కృషి వెలకట్టలేనిది
- ఆయన హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక అనుమతులొచ్చాయి
- వైఎస్సార్ ఎన్నో అనుమతులు తీసుకొచ్చారు
- వైఎస్సార్ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమైంది
- పోలవరం ప్రాజెక్టు అంత తేలికగా అర్థం కాదు కాబట్టే చాలా స్టడీ చేసి నిర్ణయానికి వచ్చాం
- పదేపదే జగన్‌ను దూషించాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు
- ఇచ్చిన వాగ్దాలను నిలబెట్టుకోవాలని జగన్ అంటే బాబుకు భయం
- మీరు చేసిన తప్పిదాల వల్లే పోలవరం సర్వనాశనం అయ్యిందనే విషయాన్ని కచ్చితంగా నిరూపించగలం
- దీనికి సంబంధించి నిపుణులను కనుక్కోండి
- వాస్తవం ఏంటో చెప్పండి అని అడగండి
- డయా ఫ్రమ్ వాల్ ఎందుకు కొట్టుకుపోయిందో అడగండి
- మీకు చెప్పడానికి వారు భయపడతారు కూడా.. ఎందుకంటే మీరు నాల్గోసారి ముఖ్యమంత్రి కాబట్టి
- బాబు హయాంలోనే డయా ఫ్రం వాల్ కొట్టుకుపోయింది
- పదే పదే దూషిస్తూ జగన్‌పై నింద వేసే ప్రయత్నం చేస్తున్నారు
- వైఎస్సార్ కలలుగన్న ప్రాజెక్టు కాబట్టే పూర్తి తపనతో పని చేశాం
- చంద్రబాబు చేసిన తప్పులు వల్లే పోలవరం ప్రాజెక్ట్ నాశనం
- ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం
- పోలవరం జాతీయ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది
- అసలు కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టింది..దీనికి సమాధానం చెప్పండి
- ఈ ప్రాజెక్టు మీరు తీసుకోవడానికి గల కారణాలేంటి?
- కమీషన్లు కొట్టేయడానికే తీసుకున్నారు
- వేల కోట్ల ప్రాజెక్టు కాబట్టే కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంది.
- జాతీయ ప్రాజెక్టు అయినటువంటి పోలవరాన్ని నీ కరప్షన్ కోసం తీసుకోవడం జరిగిందనే విషయం అందరికీ తెలుసు
- కాంట్రాక్టర్లకు ఎక్కువ సొమ్ముకు ప్రాజెక్టును ఇచ్చావంటే దాంట్లో అర్థమేంటి
- అందులో కమీషన్లు కొట్టేదామనే కదా చంద్రబాబు
- ఇది ఏ కాంట్రాక్టర్‌కైనా అర్థమవుతుంది
- డబ్బులు కాజేయడం కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తీసుకున్నాడని ఆనాటి ప్రధాని, ఇప్పటి ప్రధాని, మీ సహచరుడు నరేంద్ర మోదీనే చెప్పారు
- పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని మోదీనే వ్యాఖ్యానించారంటే అందులో అర్థమేంటి?
Comments
Please login to add a commentAdd a comment