సాక్షి,తాడేపల్లి:చంద్రబాబు అవగాహనారాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సోమవారం(డిసెంబర్16) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
‘పోలవరంపై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నాడు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి అసలు కారణం ఎవరు. కాఫర్‌డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రమ్‌వాల్ కడతారా? చంద్రబాబుకు పోలవరం ఏటీఎం అని ప్రధాని మోదీ అనలేదా. టీడీపీ అవినీతి చేసిందని సాక్షాత్తూ ప్రధాని మోదీ పార్లమెంట్‌లో అనలేదా. 2018లోనే చంద్రబాబు పోలవరం పూర్తి చేస్తామన్నారు..అప్పుడెందుకు పూర్తి చేయలేకపోయారు?
కేంద్రం రూ.12,157 కోట్లు విడుదల చేయడానికి వైఎస్సార్‌సీపీయే కారణం లోయర్‌కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేసింది మేమే. పోలవరం కీలక పనులు మా హయాంలోనే పూర్తయ్యాయి’అని అంబటి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment