
సాక్షి, అమరావతి : సస్పెండ్‌కు గురైన తమ సభ్యులను తిరిగి సభకు అనుమతించాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని టీడీపీ ఎమ్మెల్యేలు కోరారు. ఈమేరకు మంగళవారం టీడీపీ సభ్యులు గంటా శ్రీనివాసరావు, కరణం బలరాంలు డిప్యూటీ స్పీకర్‌ను కలిసి సస్పెన్షన్ ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి కారణాలు లేకుండానే సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల వినతిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్.. ఈ అంశాన్ని అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ చీప్‌విప్ శ్రీకాంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. అధికార, విపక్షాల సభ్యులతో డిప్యూటీ స్పీకర్ చర్చలు జరుపుతున్నారు.
(చదవండి : అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్)
Comments
Please login to add a commentAdd a comment