
సాక్షి, గుంటూరు: రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభకానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. హోంమంత్రి సుచరిత, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, పలువురు ఎమ్మెల్యేలు కోవిడ్ టెస్టులు చేయించుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీకి ఇతరులను అనుమతించడం లేదని తెలిపారు. కేబినెట్ ర్యాంక్ ఉన్న వారుకుడా ఒకరిని మాత్రమే వెంట తెచ్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు. శాసన సభ్యులకు ప్రత్యేకంగా కరోన నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు.
(చదవండి: అసెంబ్లీ నిర్వహణపై ఉన్నతస్థాయి సమావేశం)