సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలి | bapatla mla kona raghupati in anantapur | Sakshi
Sakshi News home page

సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలి

Published Sun, Nov 27 2016 10:06 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలి - Sakshi

సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలి

–బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి సూచన
–ఘనంగా సాగిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం


అనంతపురం కల్చరల్‌ : బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి సూచించారు.  ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో నిర్వహించిన  'బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం'లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్‌  అందిస్తున్న పథకాలన్నీ అందరూ సద్వినియోగం చేసుకోలేక పోవడంతో గతంలో విడుదలైన నిధుల్లో  సగానికి పైగా మిగిలిపోయాయని విచారం వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఐవైఆర్‌ కృష్ణారావుకు అందరం రుణపడి ఉండాలన్నారు.

ఒకప్పుడు జాతి మొత్తాన్ని ప్రభావితం చేసిన బ్రాహ్మణులు నిస్తేజం అవుతున్నారని, పూర్వ వైభవం కోసం పాటుపడాలన్నారు. మొత్తం 178 మంది ఎమ్మెల్యేలలో ఒకే ఒక్క బ్రాహ్మణ ఎమ్మెల్యే అని  తనను అందరూ కొనియాడుతున్నా బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గిపోతున్నందుకు బాధగా ఉందన్నారు.    ప్రస్తుతం బ్రాహ్మణ సంఘాల్లో  ఆధిపత్య పోరు నడుస్తుండడం బాధాకరమన్నారు.  త్వరలో గుంటూరు వేదికగా లక్షలాది మంది బ్రాహ్మణులతో బ్రాహ్మణ గర్జన నిర్వహిస్తామని అన్ని సంఘాల వారు ఒకే వేదికపైకి వచ్చేలా చూస్తామన్నారు. బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెమ్మనూరు సుదర్శన శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం బ్రాహ్మణ సమాజాన్ని అసభ్యకరంగా, అసహ్యకరంగా చిత్రీకరిస్తున్నారని, ఇటువంటి భావజాలాన్ని తీవ్రంగా ఖండించాలన్నారు.

ఆ సంఘం రాష్ట్ర నాయకులు రాంజీ, రామరాజు, బలరామకృష్ణమూర్తి, బ్రాహ్మణ వెల్ఫేర్‌  కార్పొరేషన్‌ డైరెక్టర్‌ శ్యామారావు, జిల్లా కో ఆర్డినేటర్‌ సూగూరు రఘునాథరావు, సోమశేఖర శర్మ, రవిప్రసాద్‌  తదితరులు   మాట్లాడారు.   కోన రఘుపతి దంపతులను   ఘనంగా సన్మానించారు.   వైఎస్సార్‌సీపీ నాయకులు రెడ్డివారి నాగరాజు, శ్యామసుందర శాస్త్రి తదితరులతో పాటు అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల  బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు  పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement