kona raghupati
-
పండుగ వేళ కోనంత కుటుంబంతో స్పెషల్ చిట్ చాట్
-
‘గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలి’
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తున్నారని, బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. తిరుపతిలో శనివారం బ్రాహ్మణ సంఘాల నేతలు వారు సమావేశమయ్యారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులను తిరిగి నియమించారని గుర్తుచేశారు. బ్రాహ్మణుల మనోభావాలను సీఎం జగన్ కాపాడారన్నారు. వంశపారంపర్య అర్చకత్వం కొనసాగింపుపై బ్రాహ్మణులు సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉన్నారు అని తెలిపారు. సామాన్య కుటుంబానికి చెందిన గురుమూర్తికి సీఎం జగన్ టికెట్ ఇచ్చారని, తిరుపతి ఉప ఎన్నికల్లో ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘బ్రాహ్మణుల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేశారు. బ్రాహ్మణుల పూర్వవైభవాన్ని సీఎం జగన్ ఇనుమడింపజేశారు. చంద్రబాబు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. దేవాలయాలను కూల్చిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తున్నాం. బ్రాహ్మణ పేదల కోసం రూ.790 కోట్లతో ఈబీసీ నేస్తం. త్వరలోనే ఈబీసీ నేస్తంపై వర్క్‌షాప్ పెడతాం’ అని తెలిపారు. -
వెంకన్న సన్నిధిలో పలువురు ప్రముఖులు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి, గజల్ శ్రీనివాస్ వంటి ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘కుటుంబ సమేతంగా స్వామి వారి ఆశీస్సులు పోందడం చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సార్లు దర్శించుకున్న, ఎన్ని సార్లు చూసిన తనివి తీరని ఒక దివ్యమంగళ స్వరూపం స్వామి వారిది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. త్వరగా వ్యాక్సిన్ రావాలని స్వామి వారిని కోరుకున్నాను. ఏపీలో కరోనాతో ఒక పక్క.. వరదలతో మరో పక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంలో కూడా స్వామి వారిపై భక్తితో తిరుమలకు వచ్చి ఆయన ఆశీస్సులు పోందడం ఆనందదాయకం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరింత శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు సాయం చేయమని స్వామి వారిని వేడుకున్నాను. గతంలో లాగానే తిరుమలకు వచ్చే పర్యాటకులకు బ్రహ్మోత్సవాల అనంతరం దర్శనం కల్పిస్తాం’ అన్నారు. (చదవండి: శ్రీవారికి కానుకగా బంగారు శఠారి) వకుళ మాత ఆలయ నిర్మాణం చాలా సంతోషం: గజల్ శ్రీనివాస్ భారత్ సేవ్ టెంపుల్స్‌లో భాగంగా మా చిరకాల కోరిక వకుళ మాత ఆలయం నిర్మాణం జరడం చాలా సంతోషంగా ఉంది అన్నారు గజల్ శ్రీనివాస్. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాతృత్వంతో వకుళ మాత ఆలయం రూపకల్పన జరగడం చాలా ఆనందం. కరోనా సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ స్వచ్చ తిరుమలను అందంగా తీర్చి దిద్దిన టీటీడీని అభినందిస్తున్నాను. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రండి’ అని కోరారు. (చదవండి: ఆయన్ని చూస్తుంటే వైఎస్సార్ గుర్తుకు వచ్చారు) విపత్తుల నుంచి ప్రజలను కాపాడాలని కోరాను: కోన రఘుపతి కరోనా, ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలందరిని కాపాడాలని స్వామి వారిని వేడుకున్నాను అన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. ‘వేంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపై ఉంది. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. కరోనా సమయంలో టీటీడీ ఏకాంతంగా స్వామి వారి వాహన సేవలు నిర్వహించినప్పటికి ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తోంది’ అని తెలిపారు. -
మల్లాది విష్ణును అభినందించిన డిప్యూటీ స్పీకర్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు నిర్వహించిన అభినందన సభకు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి హాజరయ్యారు.ఈ సందర్భంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపికైన మల్లాది విష్ణుకు అభినందనలు తెలిపారు. కోన రఘుపతి మాట్లాడుతూ.. బ్రాహ్మణుల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందని వారి కోసమే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట నిలబెట్టుకున్నారని రఘుపతి వెల్లడించారు. గత ప్రభుత్వం బ్రాహ్మణులను అణిచివేసిందని, కానీ మా ప్రభుత్వం ఏర్పడిన 7నెలల్లోనే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణులకు పెద్ద పీట వేసిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్లో మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను మంజూరు చేసి వైఎస్ జగన్ మాట నిలబెట్టుకున్నారని విష్ణు వెల్లడించారు. (‘బ్రాహ్మణుల దశాబ్దాల కల సాకారం’) -
తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రి జయరామ్, తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తదితరులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం కోన రఘుపతి మాట్లాడుతూ... స్పీకర్ స్థానాన్ని కోడెల శివప్రసాదరావు దుర్వినియోగం చేశారని విమర్శించారు. కోడెలపై సొంతపార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చని అన్నారు.మంత్రి జయరాం మాట్లాడుతూ... గ్రామ వాలంటర్లు, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నామని, పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాల బిల్లు తెచ్చామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించడం శుభపరిణామం అని కడియం శ్రీహరి అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సోమ, మంగళవారం బ్రేక్ దర్శనం రద్దు వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు గంటల్లో పూర్తవుతోంది. భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేసినట్లు జేఈవో ధర్మారెడ్డి తెలిపారు. శనివారం 95వేల మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. అధిక రద్దీ వద్ద సోమ, మంగళవారం బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు జేఈవో తెలిపారు. కాగా శ్రీవారికి హుండీ ఆదాయం ద్వారా రూ.2.61 కోట్లు లభించాయి. మరోవైపు తిరుమలలో పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం నుంచి 13వ తేదీ వరకూ ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట, రెండోరోజు పవిత్ర సమర్పణ, చివరి రోజు పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. -
సీఎం జగన్ సీఎస్‌వోగా పరమేశ్వరరెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతాధికారిగా (సీఎస్ఓ) పి.పరమేశ్వరరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి కె.ఆర్.ఎం.కిషోర్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పి.పరమేశ్వరరెడ్డి ప్రస్తుతం నెల్లూరు అడిషనల్ ఎస్పీగా (అడ్మినిస్ట్రేషన్) పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి సీఎస్‌వోగా నియమించారు. డిప్యూటీ స్పీకర్‌కు కేబినెట్ ర్యాంకు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
-
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉభయసభలు మంగళవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. నూతనంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఐదురోజులపాటు కొనసాగాయి. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, సభ్యులు ఎమ్మెల్యేలుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అనంతరం, స్పీకర్‌గా తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఎన్నికయ్యారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ వాడీవేడిగా జరిగింది. మొత్తం 19 గంటల 25 నిమిషాలపాటు అసెంబ్లీ సమావేశాలు నడిచాయి. ఈ సమావేశాల్లో 175మంది సభ్యులు ప్రసంగించారు. అనంతరం ప్రత్యేక హోదాపై శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. -
తండ్రి ఎమ్మెల్యేని చేస్తే ...తనయుడు మంత్రిని..
సాక్షి, గుంటూరు: విశ్వసనీయతకు మరోసారి ఫలితం దక్కింది. వైఎస్ కుటుంబం నమ్మినవారిని వదిలిపెట్టదన్న విషయం మళ్లీ రుజువైంది. నాడు తమకోసం ఎమ్మెల్యే పదవులను త్యజించారనే కారణంతో ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టారు. సామాజిక న్యాయం పాటిస్తూ జిల్లా నుంచి ఎస్సీ మహిళ మేకతోటి సుచరిత, బీసీ వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాబినెట్లో చోటు కల్పించి తమను నమ్ముకున్నవారికి ఎప్పుడూ అన్యాయం జరగదనే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల్లో ఓటమి చెందిన మోపిదేవికి మంత్రి పదవి ఇచ్చి అక్కున చేర్చుకున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి జిల్లాకు సముచిత స్థానం కల్పించారు. నమ్మకానికి పెద్దపీట మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ జిల్లాలో మొదటి నుంచి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అనుచరుడిగా పేరుపొందారు. 1999లో కూచినపూడి నియోజకవర్గం (ప్రస్తుతం రద్దయింది) నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మోపిదేవి 2004లో సైతం అక్కడి నుంచే విజయం సాధించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి కాగానే మోపిదేవికి తన క్యాబినెట్లో స్థానం కల్పించారు. 2009లో సైతం తన క్యాబినెట్లో మంత్రి పదవి కట్టబెట్టి జిల్లాలో తన అనుచరుడిగా చూసుకుంటూ వచ్చారు. వైఎస్సార్ మరణా నంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో జైలుకు వెళ్లి, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ వైఎస్సార్ కుటుంబంపై ఉన్న విశ్వాసంతో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ జగన్ 2019లో సైతం మోపిదేవిని రేపల్లె నుంచి బరిలో నిలిపారు. అనూహ్యంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో స్వల్ప తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. జిల్లాలో 15 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందిన విషయం తెలిసిందే. వీరిలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనే లెక్కలు వేసుకుంటున్న తరుణంలో నమ్ముకున్న వారికి తమ కుటుంబం ఎన్నడూ అన్యాయం చేయదని రుజువు చేస్తూ ఓటమి పాలైన మోపిదేవికి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాబినెట్లో స్థానం కల్పించారు. బలహీన వర్గానికి చెందిన మోపిదేవికి మంత్రిపదవి దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మోపిదేవికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తగిన న్యాయం చేశారంటూ అంతా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ఎమ్మెల్యేని చేస్తే ...తనయుడు మంత్రిని చేశాడు జిల్లాలో ఎస్సీ మహిళ ఎమ్మెల్యేగా మూడో సారి గెలుపొందిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు తన కేబినెట్లో స్థానం కల్పించి ఆమె చేసిన త్యాగం వృథా కాలేదనే విషయాన్ని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుజువు చేశారు. 2006లో రాజకీయాల్లోకి వచ్చి ఫిరంగిపురం నుంచి జెడ్పీటీసీగా గెలిచిన మేకతోటి సుచరిత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన ప్రత్తిపాడు టిక్కెట్టు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన కొద్దినెలలకే ఆయన దుర్మరణం పాలవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలన్ని మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్జగన్ బయటకు వచ్చిన మరుక్షణం వైఎస్సార్‌పై ఉన్న అభిమానంతో సుచరిత ఎమ్మెల్యే పదవికి సైతం తృణప్రాయంగా వదిలేసి ఆయన తనయుడు వైఎస్ జగన్ వెంట నడిచారు. ఆమెపై అనర్హత వేటు వేసినప్పటికీ వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2012 ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైనప్పటికీ 2019 ఎన్నికల్లో మాత్రం విజయఢంకా మోగించారు. మూడుసార్లు గెలిచిన సుచరితకు తన కేబినెట్లో స్థానం కల్పించి తమ కుటుంబాన్ని నమ్మిన వారికి అండగా నిలబడతారనే విషయాన్ని వైఎస్జగన్ చేతల్లో చేసి చూపారు. సుచరితను తండ్రి వైఎస్సార్ ఎమ్మెల్యేను చేస్తే ఆయన తనయుడు వైఎస్ జగన్ ఏకంగా మంత్రిని చేసి విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా తమను నమ్మితే వారికి పెద్ద పీట వేస్తామనే విషయాన్ని రుజువు చేసిచూపారు. సుచరితకు మంత్రి పదవి కట్టబెట్టడంపై ఎస్సీ సంఘాల నేతలు, జిల్లాప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తండ్రి స్పీకర్.. తనయుడు డిప్యూటీ స్పీకర్ బాపట్ల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు 1967, 1972, 1978 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. కోన ప్రభాకరరావు రాష్ట్ర మంత్రిగా, స్పీకర్‌గా, మహారాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు. అప్పట్లో తండ్రి కోన ప్రభాకర్ స్పీకర్‌గా పనిచేయగా, ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించడం విశేషం. మృదుస్వభావి అయిన కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్ పదవి దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
వారసులొచ్చారు..
సాక్షి, గుంటూరు : జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ వారసులు విజయదుందుభి మోగించారు. తమ వారసత్వ రాజకీయాలను కొనసాగించారు. ప్రజా సేవలో రాణిస్తున్నారు. నరసరావుపేట ఎంపీ, గురజాల, మాచర్ల, బాపట్ల, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వారి తాతలు, తండ్రులు, మామల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించడం విశేషం. అయితే జిల్లాలో గెలిచిన రాజకీయ వారసులంతా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నుంచి గెలుపొందడం మరో విశేషం. ఎంపీగా భారీ మెజార్టీ జిల్లాలోని నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి, 1.53 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన లావు శ్రీకృష్ణదేవరాయలు తండ్రి విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత అయిన లావు రత్తయ్య కావడం అందరికి తెలిసిన విషయమే. అయితే లావు రత్తయ్య వేర్వేరు పార్టీల తరఫున రెండు సార్లు ఎంపీగా పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. ఆయన రాజకీయ వారసునిగా శ్రీకృష్ణదేవరాయలు రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసిన మొదటిసారే ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందడం విశేషం. వరుసగా నాలుగో సారి.. మాచర్ల ఎమ్మెల్యేగా వరుసగా నాల్గో సారి విజయం సాధించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మొదటి వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించారు. గతంలో అక్కడ ఎవరైనా ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజలు పక్కన పడేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం వరుసగా నాల్గో సారి ఎమ్మెల్యేగా గెలుపొంది జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన బాబాయి పిన్నెల్లి సుందరరామిరెడ్డి పల్నాడులో మంచి పేరు సంపాదించినప్పటికీ 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999లో మరో బాబాయి పిన్నెల్లి లక్ష్మారెడ్డి సైతం పోటీ చేసి ఓటమి చెందారు. 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన రామకృష్ణారెడ్డి అప్పటి నుంచి 2009, 2012, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయ పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. అన్నాబత్తుని వారసుడు.. తెనాలి నుంచి పోటీ చేసి గెలుపొందిన అన్నాబత్తుని శివకుమార్ తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ 1983, 1985 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడమే కాకుండా మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన అన్నాబత్తుని శివకుమార్ 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొంది తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మామ స్ఫూర్తితో.. పొన్నూరు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిలారి వెంకట రోశయ్య ఐదు సార్లు వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అల్లుడు కిలారి వెంకట రోశయ్య. 2009 ఎన్నికల్లో తెనాలి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో మాత్రం అనూహ్యంగా పొన్నూరు నుంచి పోటీ చేసి సంచలన విజయం సాధించారు. కోన కుటుంబం నుంచి.. బాపట్ల ఎమ్మెల్యేగా రెండో సారి గెలుపొందిన కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు 1967, 1972, 1978లో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతోపాటు రాష్ట్ర మంత్రిగా, స్పీకర్‌గా కూడా పనిచేశారు. ఆయన తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కోన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మూడో తరం నేత మహేష్‌రెడ్డి రాష్ట్రంలోనే చెప్పుకోదగ్గ రాజకీయ కుటుంబంగా పేరొందినది కాసు కుటుంబం. మూడో తరానికి చెందిన కాసు మహేష్‌రెడ్డి ఎమ్మెల్యేగా గురజాల నుంచి పోటీ చేసి గతంలో ఎన్నడూ లేనంత భారీ మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. మహేష్‌రెడ్డి తాత కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా, గవర్నర్‌గా పనిచేశారు. మరో తాత కాసు వెంగళరెడ్డి రాజ్యసభ్య సభ్యుడిగా, ఎమ్మెల్సీగా, జిల్లాపరిషత్ చైర్మన్‌గా అనేక ఉన్నత పదవులు పొందారు. కాసు మహేష్‌రెడ్డి తండ్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. మహేష్‌రెడ్డి మొదటిసారిగా వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా గురజాల నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొంది కాసు కుటుంబంలో మూడో తరం రాజకీయ నేతగా పేరొందారు. -
సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలి
–బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి సూచన –ఘనంగా సాగిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం అనంతపురం కల్చరల్ : బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి సూచించారు. ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో నిర్వహించిన 'బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం'లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ అందిస్తున్న పథకాలన్నీ అందరూ సద్వినియోగం చేసుకోలేక పోవడంతో గతంలో విడుదలైన నిధుల్లో సగానికి పైగా మిగిలిపోయాయని విచారం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఐవైఆర్ కృష్ణారావుకు అందరం రుణపడి ఉండాలన్నారు. ఒకప్పుడు జాతి మొత్తాన్ని ప్రభావితం చేసిన బ్రాహ్మణులు నిస్తేజం అవుతున్నారని, పూర్వ వైభవం కోసం పాటుపడాలన్నారు. మొత్తం 178 మంది ఎమ్మెల్యేలలో ఒకే ఒక్క బ్రాహ్మణ ఎమ్మెల్యే అని తనను అందరూ కొనియాడుతున్నా బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గిపోతున్నందుకు బాధగా ఉందన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణ సంఘాల్లో ఆధిపత్య పోరు నడుస్తుండడం బాధాకరమన్నారు. త్వరలో గుంటూరు వేదికగా లక్షలాది మంది బ్రాహ్మణులతో బ్రాహ్మణ గర్జన నిర్వహిస్తామని అన్ని సంఘాల వారు ఒకే వేదికపైకి వచ్చేలా చూస్తామన్నారు. బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెమ్మనూరు సుదర్శన శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం బ్రాహ్మణ సమాజాన్ని అసభ్యకరంగా, అసహ్యకరంగా చిత్రీకరిస్తున్నారని, ఇటువంటి భావజాలాన్ని తీవ్రంగా ఖండించాలన్నారు. ఆ సంఘం రాష్ట్ర నాయకులు రాంజీ, రామరాజు, బలరామకృష్ణమూర్తి, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్యామారావు, జిల్లా కో ఆర్డినేటర్ సూగూరు రఘునాథరావు, సోమశేఖర శర్మ, రవిప్రసాద్ తదితరులు మాట్లాడారు. కోన రఘుపతి దంపతులను ఘనంగా సన్మానించారు. వైఎస్సార్సీపీ నాయకులు రెడ్డివారి నాగరాజు, శ్యామసుందర శాస్త్రి తదితరులతో పాటు అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
'అది కొన్ని ఛానళ్ల తప్పుడు ప్రచారం మాత్రమే'
హైదరాబాద్: పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలకు బాపట్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి తెరదించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వచ్చిన ఊహాగానాలపై కోన గురువారం మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. కొన్ని ఛానల్స్ తనపై తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయన్నాని విమర్శించారు. ఎప్పటికీ వైఎస్సార్ సీపీలోనే ఉంటాయనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 'నన్ను, పార్టీని గెలిపించిన ప్రజలను మోసం చేయనని' తెలిపారు. కొన్ని ఛానల్స్ నైతిక విలువలకు దిగజారి తనపై కట్టుకథలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. -
సమైక్యం జగన్‌తోనే సాధ్యం
బాపట్లటౌన్, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజన విషయంలో కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర ప్రజలను నమ్మించి ముంచేశాయని వైఎస్సార్ సీపీ నాయకులు ధ్వజమెత్తారు. సమైక్య నినాదంతో తమ పార్టీ పోరాటాలు చేస్తుంటే కాంగ్రెస్, టీడీపీల నేతలు మాత్రం బయటకు సమైక్యవాదులమేనంటూ మేకపోతు గంభీరాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌తోనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. బాపట్ల రథంబజారు సెంటర్లో శుక్రవారం రాత్రి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇక్కడ సమైక్యాంధ్ర...అక్కడ జై తెలంగాణ అంటూ ద్వంద వైఖరి అవలంభిస్తున్న చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రాష్ర్టం మొత్తం తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే కనీసం సమావేశానికి కూడా హాజరు కాకపోవడం కుమ్మక్కులో భాగం కాదా అని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. బెల్టుషాపుల ఘనత బాబుదే.. గ్రామాల్లో సైతం ఇంటికో బెల్టుషాపు ఏర్పడిందంటే ఆ ఘనత చంద్రబాబుదేనని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా సమైక్యం అంటున్న తరుణంలో అక్కడ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి, సీమాంధ్రలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరగటం రాజకీయ డ్రామా కాదా అని నిలదీశారు. ఎన్ని ఎత్తుగడలు పన్నినా ప్రజలు నమ్మకపోవడంతో మతిభ్రమించిన బాబు నోటికొచ్చినట్లు మాట్లాడటం, దాన్ని ఎల్లోమీడియా కథలుగా ప్రచురించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి దిక్చూచి జగన్ రాబోయే రోజుల్లో రాష్ట్రానికి దిక్చూచి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఒక వైపు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఒంటిచేత్తో పోరాడుతున్న యోధుడు జగన్ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం ఆయన వల్లే సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున, మైనార్టీ విభాగం కన్వీనర్ సయ్యద్ మాబు, బీసీ విభాగం కన్వీనర్ దేవళ్ళ రేవతి, విద్యార్థి విభాగం కన్వీనర్, యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులున్నారు.