హైదరాబాద్: పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలకు బాపట్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి తెరదించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వచ్చిన ఊహాగానాలపై కోన గురువారం మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. కొన్ని ఛానల్స్ తనపై తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయన్నాని విమర్శించారు.
ఎప్పటికీ వైఎస్సార్ సీపీలోనే ఉంటాయనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 'నన్ను, పార్టీని గెలిపించిన ప్రజలను మోసం చేయనని' తెలిపారు. కొన్ని ఛానల్స్ నైతిక విలువలకు దిగజారి తనపై కట్టుకథలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.