
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడలోని గాయత్రి ఫంక్షన్ హాల్‌లో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు నిర్వహించిన అభినందన సభకు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి హాజరయ్యారు.ఈ సందర్భంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపికైన మల్లాది విష్ణుకు అభినందనలు తెలిపారు. కోన రఘుపతి మాట్లాడుతూ.. బ్రాహ్మణుల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందని వారి కోసమే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట నిలబెట్టుకున్నారని రఘుపతి వెల్లడించారు. గత ప్రభుత్వం బ్రాహ్మణులను అణిచివేసిందని, కానీ మా ప్రభుత్వం ఏర్పడిన 7నెలల్లోనే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణులకు పెద్ద పీట వేసిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌లో మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను మంజూరు చేసి వైఎస్ జగన్ మాట నిలబెట్టుకున్నారని విష్ణు వెల్లడించారు.
(‘బ్రాహ్మణుల దశాబ్దాల కల సాకారం’)