సాక్షి, విజయవాడ: రెడ్‌జోన్ ఉన్న ప్రతి ప్రాంతంలో రేషన్ డోర్ డేలివరీ చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం తీసుకువచ్చిన ‘గడప దాటితే కరోనా.. గడప గడపకి కిరాణా’ నజరానాను మంత్రితో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జేసీ మాధవీలత, సబ్ కలెక్టర్ ధ్యాన్‌చంద్‌లు గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చేప్పుకునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు హైదరాబాద్‌లో కూర్చుని కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కరోనాపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజల్లోకి వెళితే తెలుస్తుందని ఆయన అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబుకు వంతపాడుతూ ప్రజా సమస్యలు పట్టనట్లు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. లాక్‌డౌన్ సమయంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తీర్చడంతో తమ ప్రభుత్వం ముందుందని మంత్రి తెలిపారు.
ఎమ్మెల్యే మాల్లాది విష్ణు మాట్లాడుతూ... ఇంటింటికి రేషన్ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా కొనసాగేలా చర్యలు తీసుకుంటుమని హామీ ఇచ్చారు. ఈ నెల 27 వరకు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ అందిస్తామని తెలిపారు. ప్రజల సంక్షేమ కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని, అపోహలు నమ్మి ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment