malladhi vishnu
-
చంద్రబాబుపై ‘ఈసీ’కి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు
సాక్షి,తాడేపల్లి: సీఎంజగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి(సీఈవో) ముఖేష్‌కుమార్ మీనాకు వైస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నారాయణమూర్తి సోమవారం సీఈవోను కలిశారు. ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎంను చంపాలని మాట్లాడటం దారుణమన్నారు. ‘చంద్రబాబు వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేశాం. ఐవీఆర్ఎస్ కాల్ల ద్వారా చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఫిర్యాదు చేశాం.ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై తప్పుడు వీడియోను ప్రచారం చేశారు. పృథ్విరాజ్,టీడీపీ,జనసేనపై చర్యలు తీసుకోవాలని కోరాం. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఆ పార్టీలు మళ్లీ మా మీద ఆరోపణలు చేస్తున్నాయి’ అని అన్నారు. -
‘రాయలసీమ ద్రోహి చంద్రబాబు’
సాక్షి, కర్నూలు: రాష్ట్రాభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. చంద్రబాబును ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కాగా, మంత్రి జయరాం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సానుభూతి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబుకు ఇప్పటికే చివరి ఎన్నికలు అయిపోయాయి. 2024 ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయరు. చంద్రబాబును ఇప్పటికే ప్రజలు తిరస్కరించారు అని అన్నారు. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజం.. సాక్షి, అనంతపురం: తన రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రజలను నిత్యం మోసం చేయడమే చంద్రబాబు నైజం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే దుర్భాషలాడతారా?. వికేంద్రీకరణవాదులపై అనుచిత వ్యాఖ్యలు చేసి నిజస్వరూపాన్ని చూపించారు. ఏపీ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉండటం ప్రజల దురదృష్టం. రాష్ట్ర ప్రయోజనాలతో చంద్రబాబు, పవన్ చెలగాటం ఆడుతున్నారు. అమరావతిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రాజధాని నిర్మించలేకపోయారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు.. సాక్షి, విజయవాడ: అభివృద్ధిని, సంక్షేమాన్ని చూడలేక చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరావతి నా నినాదం అని చంద్రబాబు రాయలసీమలో చెప్పలేకపోయాడు. చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాయలసీమ ద్రోహి చంద్రబాబు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. ఇకనైనా మీ భాషను మార్చుకోకపొతే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. -
‘అమర్‌రాజ ఫ్యాక్టరీ అమెరికాలో ఉంటే.. 25 ఏళ్ల జైలు శిక్ష పడేది’
అనంతపురం: అమర్‌రాజ ఫ్యాక్టరీపై ఎల్లోమీడియా వక్రభాష్యం చెబుతోంది అంటూ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. అమర్‌రాజ ఫ్యాక్టరీ అమెరికాలో ఉండి ఉంటే వారు చేసిన కాలుష్యానికి.. 25 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానాలు వేసేవారు అని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది చంద్రబాబే అని మహ్మద్ ఇక్బాల్ ఆరోపించారు. పేద ప్రజల వ్యతిరేకి చంద్రబాబు విజయవాడ: పేద ప్రజల వ్యతిరేకి చంద్రబాబు.. రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం, బీజేపీకి క్యాడర్ లేదన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పులిచింతల ప్రాజెక్ట్ పనులను చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. పేదల ఇళ్లపైనా చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. రాష్ట్రంలో పేద ప్రజలకు సీఎం జగన్ అండగా నిలిచారని మల్లాది విష్ణు తెలిపారు. -
టీడీపీ హయాంలో విజయవాడ అభివృద్ధిని విస్మరించారు: ఎమ్మెల్యే విష్ణు
-
టీడీపీ రాజకీయం కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తోంది
-
ఆ ప్రాంతాలకు రేషన్ డోర్ డెలివరి: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: రెడ్‌జోన్ ఉన్న ప్రతి ప్రాంతంలో రేషన్ డోర్ డేలివరీ చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం తీసుకువచ్చిన ‘గడప దాటితే కరోనా.. గడప గడపకి కిరాణా’ నజరానాను మంత్రితో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జేసీ మాధవీలత, సబ్ కలెక్టర్ ధ్యాన్‌చంద్‌లు గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చేప్పుకునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు హైదరాబాద్‌లో కూర్చుని కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కరోనాపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజల్లోకి వెళితే తెలుస్తుందని ఆయన అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబుకు వంతపాడుతూ ప్రజా సమస్యలు పట్టనట్లు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. లాక్డౌన్ సమయంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తీర్చడంతో తమ ప్రభుత్వం ముందుందని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే మాల్లాది విష్ణు మాట్లాడుతూ... ఇంటింటికి రేషన్ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా కొనసాగేలా చర్యలు తీసుకుంటుమని హామీ ఇచ్చారు. ఈ నెల 27 వరకు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ అందిస్తామని తెలిపారు. ప్రజల సంక్షేమ కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని, అపోహలు నమ్మి ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే పేర్కొన్నారు. క్వారంటైన్ నుంచి వెళ్లేటప్పుడు రూ. 2,000 సాయం -
మల్లాది విష్ణును అభినందించిన డిప్యూటీ స్పీకర్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు నిర్వహించిన అభినందన సభకు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి హాజరయ్యారు.ఈ సందర్భంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపికైన మల్లాది విష్ణుకు అభినందనలు తెలిపారు. కోన రఘుపతి మాట్లాడుతూ.. బ్రాహ్మణుల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందని వారి కోసమే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట నిలబెట్టుకున్నారని రఘుపతి వెల్లడించారు. గత ప్రభుత్వం బ్రాహ్మణులను అణిచివేసిందని, కానీ మా ప్రభుత్వం ఏర్పడిన 7నెలల్లోనే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణులకు పెద్ద పీట వేసిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్లో మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను మంజూరు చేసి వైఎస్ జగన్ మాట నిలబెట్టుకున్నారని విష్ణు వెల్లడించారు. (‘బ్రాహ్మణుల దశాబ్దాల కల సాకారం’) -
'బాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు'
సాక్షి, విజయవాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి, విభజన చట్టంలోని అంశాలు అమలు కాకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారకుడని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మండిపడ్డారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం గత ఐదేళ్లలో టీడీపీ నేతలు రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారని విమర్శించారు. మేము అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని చూస్తుంటే బీజేపీ నేతలకు బాధ ఎందుకు కలుగుతుందో తనకు అర్థం కావడం లేదన్నారు. కాషాయ కండువా కప్పుకున్న సుజనాచౌదరి అమరావతి ముసుగులో ఐదేళ్లలో టీడీపీ చేసిన అక్రమాలు వెలికి తీస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ మూబు ముక్కలయిందని పొంతనలేని వ్యాఖ్యలు చేస్తూ సుజనా ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారని తెలిపారు. పూటకో మాట మాట్లాడే పవన్‌కి జనం తీర్పు ఇచ్చిన తర్వాత కూడా బుద్ధి రాలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు అండ్ కో చేస్తున్న కుట్రలను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. పత్రికలను అడ్డం పెట్టుకొని అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజాభిప్రాయమే మాకు శిరోధార్యమని, అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ అంతిమ లక్ష్యమని మల్లాది విష్ణు వెల్లడించారు. (ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి) -
దిశ ఘటన ఎవరు ఊహించనిది: సుమన్
సాక్షి, విజయవాడ: ఆడపిల్లలకు విద్యతో పాటు ఆత్మరక్షణ శిక్షణ కూడా చాలా అవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడలోని ఓ కార్యక్రమంలో ఆయనతో పాటు సినీ నటుడు సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిఒక్కరికి కరాటే ఎంత అవసరమో దిశ ఘటనతో అర్థం అయ్యిందని వాఖ్యానించారు. అనంతరం సుమన్ మాట్లాడుతూ.. దిశ ఘటన ఎవరు ఊహించనిది అని, మహిళలకు ఆత్మ రక్షణ అవసరమని గత ముప్ఫై ఏళ్లుగా ప్రతి కార్యక్రమంలో చెప్పుకొస్తున్నామన్నారు. వారంలో రెండు రోజులు మహిళలకు ఆత్మరక్షణ క్లాసులు పెట్టాలని, విద్యార్థినిలకు కూడా 6వ తరగతి నుంచే ఈ క్లాసులను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పాఠశాలల్లో ఆత్మరక్షణ క్లాసుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ అయిదుగురికి డిప్యూటీ సీఎం పదువులు ఇచ్చారని, అలాగే మహిళలకు ప్రాధాన్యతనిస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అన్నారు. భారతదేశంలో చట్టాలు బలహీనంగా ఉన్నాయని, చట్టాలను పటిష్ట పరచాలని ఆయన వ్యాఖ్యానించారు. -
‘మతం ముసుగులో పవన్ రాజకీయాలు’
సాక్షి, విజయవాడ: మతాలు గురించి మాట్లాడే హక్కు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఉందా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భక్తి, మతంతో రాజకీయాలు చేయాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 40 దేవాలయాలను కూలదోస్తే పవన్ కల్యాణ్, బీజేపీ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. కాగా దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజులు జరిగితే పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పుష్కరాల సమయంలో చంద్రబాబు ప్రచార పిచ్చికి 30 మంది చనిపోతే పవన్ ఎందుకు నోరు మెదపలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు పవన్ కల్యాణ్ కంటికి కనిపించటం లేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఒక మతానికో, కులానికో చెందిన వారు కాదని.. పిచ్చోడిలా పవన్ ప్రవర్తిస్తే ప్రజలు ఒప్పుకోరని ఆయన ధ్వజమెత్తారు. హిందుమతం ముసుగులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. గతంలో క్రిస్టియన్ మతం గురించి పవన్ కల్యాణ్ గొప్పగా మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. పవన్ కల్యాణ్‌కు ప్రజలు రెండు చోట్ల బుద్ది చేప్పినా ఆయన తీరు మారలేదని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో పవన్ కీలుబొమ్మలా మారాడని, పవన్ ఓ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 100 మంది చంద్రబాబులు వచ్చిన సీఎం జగన్‌ను ఏమి చేయలేరని అన్నారు. సీఎం జగన్, పార్లమెంటు సభ్యులు విజయసాయి రెడ్డిల గురించి మాట్లాడే అర్హత బుద్దా వెంకన్నకు లేదన్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు షిఫ్ట్‌ల వారిగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని తెలిపారు. బీజేపీలో ఉండి టీడీపీ మాటలు మాట్లాడుతున్న సుజనా చౌదరి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే చంద్రబాబుకు, పవన్‌కు ఇసుక, ఇంగ్లీష్, రాజధాని తప్ప మాట్లాడానికి ఏమి కనిపించడం లేదని ఎమ్మెల్యే విష్ణు ఎద్దేవా చేశారు. -
‘సహకార రంగాన్ని బాబు పూర్తిగా నాశనం చేశారు’
సాక్షి, విజయవాడ: సహకార రంగం బతికి బట్టకట్టింది అంటే కేవలం అది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వలనే అని మంత్రి పేర్ని నాని ప్రశంసించారు. తండ్రి అడుగు జాడల్లోనే కోపరేటివ్ రంగాన్ని బలపరిచే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో సహకార రంగం పూర్తిగా నాశనమైందని విమర్శించారు. అనంతరం వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక సహకార రంగం ఊపిరి పోసుకుందన్నారు. కోపరేటివ్ రంగాన్ని బలపరిచేవిధంగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఉంటుందన్నారు. సహకార రంగ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తూ.. ఉద్యోగుల నమ్మకాన్ని సీఎం వైఎస్ జగన్ కాపాడతారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ రైతు పక్షపాతి అని అభివర్ణించారు. బ్యాంకింగ్, సహకార వ్యవస్థను ముఖ్యమంత్రి బలోపేతం దిశగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో సహకార సంఘం కుదేలయిందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అయితే సహకార రంగంలో రెండంచెల విధానాన్ని వైఎస్సార్ తీసుకొచ్చారని గుర్తుచేశారు. సహకార రంగాన్ని వైఎస్సార్ ముందుండి నడిపించారని, అదేవిధంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం మరింత ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు. -
‘బాబుకు సొంత ఎమ్మెల్యేల మద్దతే లేదు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని నేరుగా ఎదుర్కోలేకనే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న ఇసుక దీక్షకు ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే మద్దతు ఇవ్వట్లేదని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని, దానిపై విచారణ జరగకుండా టీడీపీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దానిలో భాగంగానే పలువురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని మంత్రి వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘తిరుపతి, శ్రీశైలం, విజయవాడ ఐ ల్యాండ్‌లో అన్యమత ప్రచారం జరిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. తిరుమలలో సోలార్ ప్యాన్లను శిలువగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారం కోసమే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. ప్రజల విశ్వాసాలను దెబ్బతీయాలని చూస్తే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. హిందూ దేవాలయాల అభివృద్ధి కొరకు తొలి బడ్జెట్లోనే రూ. 234 కోట్లు కేటాయించాం’ అని అన్నారు. గత ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలైనా.. టీడీపీ నేతలకు బుద్ధి రావడంలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. ‘సీఎం వైఎస్ జగన్‌పై కుట్రతోనే చంద్రబాబు నాయుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నంలో తాముంటే.. ఇలా అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు. గడిచిన ఐదు నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాం. చంద్రబాబు హయాంలోనే విజయవాడ దుర్గ గుడిలో క్షుద్రపూజలు చేశారు. రాజమండ్రి పుష్కరాల్లో బాబు ప్రచారం కోసం భక్తుల ప్రాణాలు తీశారు. అర్చకుల మేలు కోసం చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా?. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కల్యాన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. అని విమర్శించారు. -
జర్నలిస్ట్ నుంచి ఈ స్థాయికి వచ్చాను: మంత్రి
సాక్షి, అమరావతి: విజయవాడలోని కల్చరల్ ఆఫ్ సొసైటీలో ఫోటోగ్రాఫర్ జర్నలిస్టుల అవార్డ్స్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొని ఫోటో గ్రాఫర్లకు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. తానూ ఒక జర్నలిస్ట్‌గా పని చేసి ఈ స్థాయికి వచ్చానని గుర్తుచేశారు. ఎక్కడి నుంచి వచ్చినా మన మూలాల్ని మర్చిపోకూడదని, రిపోర్టర్ కన్నా ఫొటోగ్రాఫి చాలా కష్టమైన పని అని అన్నారు. మాజీ సీఎం ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు తాను జర్నలిస్టునని, అప్పుడు ఒక ఫొటోగ్రాఫర్.. ఎన్టీఆర్ కనురెప్ప నుంచి కారుతున్న నీటి బిందువును కెమెరాలో బంధించారని చెప్పారు. ఆ ఫొటో చూశాక తనకు ఫొటోగ్రాఫర్లపై మరింత గౌరవం పెరిగిందన్నారు. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్స్ అందరితో కలిసి పనిచేసిన తాను.. ఇప్పుడు వారికే అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఫోటోల సాక్ష్యంతోనే ఎన్నో కేసులు తీర్పులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ సీతారాం మాట్లాడుతూ.. ఫోటోగ్రాఫర్స్‌కి అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచం అంతమయ్యేవరకు ఫోటోగ్రఫీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. టూరిజం పరంగా విశాఖ రిషికొండని మరింత అభివృద్ధి చేయాలని ప్రత్యేక ప్రణాళిలు రచిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగనమోహన్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం సమయంలో తల్లి కొడుకుల భావోద్వేగాన్ని ఫొటోలో బంధించడం చాలా ఆనందంగా ఉందన్నారు.విజయవాడ నగరం అంతా ఫోటోగ్రాఫర్స్ పై ఆధారపడి ఉందిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. ఫోటోగ్రాఫర్స్ కి అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ రోజున ఫోటోగ్రాఫర్ ఫంక్షన్ జరగడం చాలా ఆనందరంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. -
పనులన్నీ త్వరిగతిన పూర్తి: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ : విజయవాడలోని భవానిపురంలో ఈ నెల 26, 27, 28 తేదిల్లో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణులు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి సీటిలోని రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ కాలువల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ.. సకాలంలో పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వం విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో పనులన్నింటిని త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
చంద్రబాబు పాలనలో హిందుధర్మంపై దాడి
-
‘చంద్రబాబు మహాకూటమి మాయగాడు’
సాక్షి, విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో హిందుధర్మంపై దాడి జరుగుతోందని వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు. టీడీపీ నేతలు అర్చకులు, పురోహితులు, దేవాలయాలపై దాడులకు పాల్పపడుతున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గుప్తనిధుల తవ్వకం అడ్డుకున్నాడని, మల్లికార్జున శర్మ అనే వ్యక్తిని తీవ్రంగా అవమానించారని అన్నారు. గాంధీ జయంతి రోజున తూర్పుగోదావరి జిల్లాలో మల్లికార్జున శర్మ అనే పురోహితుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పురోహితుడు ఆత్మహత్యకు పాల్పడినా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన మండిపడ్డారు. తిరుమల స్వామివారి అభరణాలు మాయం అయితే విచారణ కూడా జరగలేదని, దుర్గగుడిలో క్షుద్రపూజలు చేసిన వారిపై ఇప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పాలనలో హిందుధర్మానికి రక్షణ కరువైంది. ఏకంగా అమ్మవారి చీరనే దొంగిలించారు. హిందూధర్మ పరిరక్షణ రాష్ట్రంలో కరువైంది. అర్చకులకు జీతాలు పెంచలేదు. పురోహితుల పరిస్థితి దయనీయం. టీటీడీలో అక్రమాలు, అన్యాయాలు ప్రశ్నిస్తే రమణ దీక్షితుల్ని తొలగించారు. చంద్రబాబుకు అర్చకులు, పురోహితులు అంటే ఎందుకు అంత ద్వేషం?. మల్లికార్జున శర్మ కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వాలి. ఘటపై విచారణ జరిపించాలి’ అని అన్నారు. మహాకూటమి మాయగాడు.. చంద్రబాబుకి బుద్దిచెప్పే రోజు త్వరలోనే రానుందని వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిజ స్వరూపాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ బయటపెట్టారని అన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపెట్టుకోవడం దౌర్భాగ్యంమని.. బాబు మహాకూటమి మాయగాడని ఆయన ఎద్దేవా చేశారు. పలు సర్వేలు ఏపీలో వైఎస్ జగన్ సీఎం అవుతారని తేల్చిచెప్పాయని, చంద్రబాబుని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. -
రాజధాని అంటే బందరు, ఏలూరు రోడ్లేనా..?
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): రాజధాని ప్రాంతం అంటే కేవలం ఏలూరురోడ్డు, బందరురోడ్డు, గన్నవరం నుంచి అమరావతికి వెళ్లే రోడ్లేనా నగరంలో మిగిలిన 59 డివిజన్లలో ప్రాంతాలు కనిపించడం లేదా.. ఏళ్ల తరబడి ఇక్కడి ప్రజలు పడుతున్న బాధలను పట్టించుకోరా అని వైఎస్సార్సీపీ సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రభుత్వాన్ని నిలదీశారు. సింగ్‌నగర్‌లోని ఆయన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. విష్ణు మాట్లాడుతూ సత్యనారాయణపురం, రైల్వేకాలనీ, వన్‌టౌన్ ప్రాంతాలలో జరుగుతున్న హత్యలు, శివారు ప్రాంతాల్లో జరుగుతున్న చోరీల సంఘటనలు వింటుంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. ప్రజల కనీస అవసరాలను కూడా తీర్చలేని అసమర్థ ప్రభుత్వ పాలన సాగుతోందని విమర్శించారు. తాగునీరు లేక, డ్రైనేజీలలో మురుగునీరు తొలగించక నాలుగేళ్ల నుంచి నగర ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకోని ప్రభుత్వ పాలకులు ఇప్పుడు గ్రామదర్శిని, ఇంటింటికి టీడీపీ అనే పేరుతో తిరగడం సిగ్గుచేటని అన్నారు. గతంలో నాలుగు సార్లు ప్రజలు చెప్పిన సమస్యలను పరిష్కరించకుండా ఇప్పుడు మళ్లీ పర్యటనలు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, 12 వేల ఇళ్లను టీడీపీ పాలకులు, నాయకులు తమ అనుచరులకు పంచుకోవడం, మరికొన్ని అమ్ముకోవడం చేశారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ పూర్తి విచారణ చేపట్టి నిజమైన నిరుపేదలకు ఇల్లు అందేలా చూడాలని కోరారు. ప్రభుత్వ పథకాలను, పింఛన్లను టీడీపీ నాయకులు వారి ఇళ్ల వద్ద పార్టీ కార్యాలయాల్లో పంపిణీ చేస్తుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. రాజీవ్‌నగర్‌లో నిర్మించిన కళ్యాణమండపాన్ని టీడీపీ నాయకులు తమ ఆఫీస్‌లా వాడుకోవడంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నగర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. -
ఆంధ్రరత్న భవన్‌కు చేరుకున్న 'రాజీవ్' ర్యాలీ
విజయవాడ: రాజీవ్‌గాంధీ సద్భావన ర్యాలీ బుధవారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు సి.రామచంద్రయ్య, కనుమూరి బాపిరాజు, మల్లాది విష్ణు స్వాగతం పలికారు. ఈ సద్భావన యాత్ర 19వ తేదీన ఢిల్లీ చేరుతుందని మల్లాది విష్ణు తెలిపారు. దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన నేత రాజీవ్‌గాంధీ అని ఆయన కొనియాడారు. దేశంలో తీవ్రవాదాన్ని అంతమొందించాల్సిన అవసరముందని మల్లాది విష్ణు పేర్కొన్నారు.