సాక్షి,తాడేపల్లి: సీఎంజగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి(సీఈవో) ముఖేష్‌కుమార్ మీనాకు వైస్‌ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నారాయణమూర్తి సోమవారం సీఈవోను కలిశారు. ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎంను చంపాలని మాట్లాడటం దారుణమన్నారు.
‘చంద్రబాబు వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేశాం. ఐవీఆర్‌ఎస్ కాల్‌ల ద్వారా చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఫిర్యాదు చేశాం.ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై తప్పుడు వీడియోను ప్రచారం చేశారు.
పృథ్విరాజ్,టీడీపీ,జనసేనపై చర్యలు తీసుకోవాలని కోరాం. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఆ పార్టీలు మళ్లీ మా మీద ఆరోపణలు చేస్తున్నాయి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment