సాక్షి, విజయవాడ : లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేవాలయాలు తేవరడానికి అనుమతులు ఇచ్చిందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు.రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లలో ఉన్న దేవాలయాల్లోకి భక్తులను అనుమతించబోమన్నారు. దేవాలయాలకు వచ్చే భక్తులు క్యూ లైన్ ద్వారా కచ్చితంగా 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని తెలిపారు. మాస్క్ ఉన్నవారినే దేవలయాల్లోకి అనుమతిస్తామని, ప్రవేశద్వారం వద్దనే లోనికి వచ్చే భక్తులకు థర్మల్ స్కానింగ్, హ్యాండ్ స్యానిటైజర్ అందుబాటులో ఉంచామన్నారు. ఆలయాల ప్రాంగణాలలో ఉమ్మి వేయడం నిషిద్ధమన్నారు.
(ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప.. మీరే చెప్పండి)
ఈ నెల 8, 9 తేదీల్లో అన్ని దేవాలయాల ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహిస్తామని,10 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనల ప్రకారం భక్తులకు దర్శనానికి అవకాశం ఇస్తామని వెల్లడించారు. కాగా పరిస్థితుల బట్టి కేశకండనశాల, భక్తులకు అన్నదానం వంటి చర్యలకు సంబంధించి ఆలయ అధికారులే నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఆలయాల్లోనూ శఠగోపం, తీర్ధ ప్రసాదాలు ఉండవన్నారు. భక్తులందరూ కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ ఫోన్ లో కచ్చితంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఏ దేవాలయం అంతరాలయంలోకి అనుమతి లేదని వెల్లంపల్లి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment