సాక్షి, విజయవాడ: ఈ నెల 31 వరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం లాక్‌డౌన్ కాలపరిమితి మే 31తేదీ వరకు పోడగించిన నేపథ్యంలో దర్శనాలను నిలిపిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను యధావిధిగా కొనసాగించాల్సిందిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక దేవాలయాల్లో సాంప్రదాయం ప్రకారం నిత్య పూజలు కొనసాగుతాయని చెప్పారు. అదే విధంగా ఆర్జిత సేవల కోసం ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు జరిపి పరోక్షంగా సేవలు అందించే విధంగా అన్ని దేవాలయాల్లో ఏర్పాటు చేసుకోవాలని కార్యనిర్వాహక అధికారులు ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment