తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తున్నారని, బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. తిరుపతిలో శనివారం బ్రాహ్మణ సంఘాల నేతలు వారు సమావేశమయ్యారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులను తిరిగి నియమించారని గుర్తుచేశారు. బ్రాహ్మణుల మనోభావాలను సీఎం జగన్ కాపాడారన్నారు. వంశపారంపర్య అర్చకత్వం కొనసాగింపుపై బ్రాహ్మణులు సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉన్నారు అని తెలిపారు. సామాన్య కుటుంబానికి చెందిన గురుమూర్తికి సీఎం జగన్ టికెట్ ఇచ్చారని, తిరుపతి ఉప ఎన్నికల్లో ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
అనంతరం బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘బ్రాహ్మణుల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేశారు. బ్రాహ్మణుల పూర్వవైభవాన్ని సీఎం జగన్ ఇనుమడింపజేశారు. చంద్రబాబు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. దేవాలయాలను కూల్చిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తున్నాం. బ్రాహ్మణ పేదల కోసం రూ.790 కోట్లతో ఈబీసీ నేస్తం. త్వరలోనే ఈబీసీ నేస్తంపై వర్క్‌షాప్ పెడతాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment