Brahmin welfare corporation
-
సీఎం వైఎస్ జగన్ హయాంలోనే బ్రాహ్మణులకు సంపూర్ణ సంక్షేమం
-
బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజికవర్గానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పి.విశ్వరూప్, జోగి రమేశ్, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్యాలయంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్‌గా పేరి కామేశ్వరరావు (పీకే రావు) ప్రమాణ స్వీకారం చేశారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజంలో బ్రాహ్మణుల సమస్యలు తెలిసిన పేరి కామేశ్వరరావు వంటి సీనియర్ నాయకుడిని కార్పొరేషన్ చైర్మన్‌గా సీఎం జగన్ నియమించడం అభినందనీయమన్నారు. విశ్వరూప్ మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవం కలిగిన పేరి కామేశ్వరరావు బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. జోగి రమేష్ మాట్లాడుతూ రానున్నకాలంలో బ్రాహ్మణులకు మరింత మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కోన రఘుపతి మాట్లాడుతూ వంశపారంపర్య అర్చకత్వం, అర్చకులకు వేతనాల పెంపు సీఎం జగన్ పాలనలోనే జరిగాయని చెప్పారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ అర్హులైన బ్రాహ్మణులకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రూ.600 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. పేరి కామేశ్వరరావును దేవదాయశాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, విజయవాడ మాజీ మేయర్ జంధ్యాల శంకర్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సుందరరామ శర్మ, ఏపీ అర్చక సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు ఆత్రేయ బాబు, అనంతబాబు, కార్పొరేషన్ జీఎం జి.నాగసాయి, పలు బ్రాహ్మణ సంఘాల నాయకులు అభినందించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీ సుసర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలి’
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తున్నారని, బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. తిరుపతిలో శనివారం బ్రాహ్మణ సంఘాల నేతలు వారు సమావేశమయ్యారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులను తిరిగి నియమించారని గుర్తుచేశారు. బ్రాహ్మణుల మనోభావాలను సీఎం జగన్ కాపాడారన్నారు. వంశపారంపర్య అర్చకత్వం కొనసాగింపుపై బ్రాహ్మణులు సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉన్నారు అని తెలిపారు. సామాన్య కుటుంబానికి చెందిన గురుమూర్తికి సీఎం జగన్ టికెట్ ఇచ్చారని, తిరుపతి ఉప ఎన్నికల్లో ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘బ్రాహ్మణుల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేశారు. బ్రాహ్మణుల పూర్వవైభవాన్ని సీఎం జగన్ ఇనుమడింపజేశారు. చంద్రబాబు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. దేవాలయాలను కూల్చిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తున్నాం. బ్రాహ్మణ పేదల కోసం రూ.790 కోట్లతో ఈబీసీ నేస్తం. త్వరలోనే ఈబీసీ నేస్తంపై వర్క్‌షాప్ పెడతాం’ అని తెలిపారు. -
బ్రాహ్మణుల సంక్షేమానికి నూతన పథకం
సాక్షి, అమరావతి: పేద బ్రాహ్మణ కుటుంబాల్లో ఉపనయనం (ఒడుగు) చేసుకోవడానికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసే నూతన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్ణయించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించడానికి కసరత్తు జరుగుతోంది. 7–16 ఏళ్ల మధ్య వయసున్న పేద బ్రాహ్మణులు ఉపనయనం చేసుకుంటే ఈ ఆర్థిక సాయం అందజేస్తారు. (చదవండి: పై తరగతులకు పటిష్టమైన అడుగులు) మరోవైపు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే బ్రాహ్మణ యువతకు ‘భారతి’ పథకంలో భాగంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేయడానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఫిబ్రవరి 29వ తేదీ వరకు కార్పొరేషన్ వెబ్‌పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏడాదికి రూ.6 లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో ఒక విడత ఆర్థిక సహాయం పొందిన వారు అనర్హులు. కనీసం ఏడాది కాలం మాస్టర్స్ డిగ్రీ చదవడానికి విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రూ.100 కోట్లతో వివిధ పథకాలు అమలవుతున్నాయని, 15 వేల మంది బ్రాహ్మణులకు ప్రతి నెలా పింఛను ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వేదవ్యాస, గాయత్రి, కల్యాణమస్తు, గరుడ, భారతి తదితర పథకాల కింద ఇప్పటిదాకా 22,056 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారందరికీ త్వరలో ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. (చదవండి: మీ చర్యలు స్ఫూర్తిదాయకం) -
ఐవైఆర్‌పై అవమానకర వేటు
- బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగింపు - కొత్త చైర్మన్‌గా వేమూరి ఆనంద సూర్య నియామకం సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావుకు ఘోర అవమానం జరిగింది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, అర్చక సంక్షేమ సంఘం చైర్మన్ పదవుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అర్థంతరంగా తొలగించింది. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పక్కనపెట్టింది. చైర్మన్ పదవీ కాలం మూడేళ్లు కాగా, ఆయనను కేవలం ఏడాదిన్నర పాటే కొనసాగించింది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో టీడీపీ నేత వేమూరి ఆనంద సూర్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అర్చక సంక్షేమ సంఘం చైర్మన్ పదవి గురించి ఉత్తర్వుల్లో పేర్కొనకపోవడం గమనార్హం. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా చిన్న గుళ్లలోపనిచేసే అర్చకులకు వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలిపే తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని అర్చక సంక్షేమ సంఘం చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్న ఐవైఆర్ కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో టీడీపీ నేతల ప్రమేయం లేకుండా చేయడంతోపాటు టీడీపీ మేనిఫెస్టోలోని హామీలను గుర్తుచేసి, వాటిని అమలు చేయాలని గట్టిగా పట్టుబట్టడం వంటివి ఐవైఆర్‌పై సీఎం చంద్రబాబులో అసహనాన్ని పెంచినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్‌కు నిధుల విషయమై ముఖ్యమంత్రిని కలిసేందుకు ఐవైఆర్ ప్రయత్నించినా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ పెద్దలు అనూహ్యంగా ఐవైఆర్ సోషల్ మీడియాలో పేర్కొన్న కొన్ని పాత పోస్టింగులను తెరపైకి తీసుకొచ్చారు. వాటినే సాకుగా చూపి ఆయనను పదవుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త చైర్మన్ హైదరాబాద్ టీడీపీ నేత: ఐవైఆర్ స్థానంలో బ్రాహ్మణ కార్పొరేషన్ కొత్త చైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన వేమూరి ఆనంద సూర్య హైదరాబాద్ టీడీపీ శాఖలో కీలకంగా పనిచేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన ఆనంద సూర్య ప్రస్తుతం పూర్తిగా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. గత ఎన్నికల్లో మల్కాజ్గిరి, ముషీరాబాద్ అసెంబ్లీ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ కోసం ఆయన ప్రయత్నించారు. -
సీఎం కోసం ఆరు నెలలు తిరిగినా దర్శనం దొరకలేదు
రాజధానిపై చాలా అంశాలున్నాయి.. పుస్తకంగా రాస్తా: ఐవైఆర్ కృష్ణారావు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా తప్పుకొమ్మంటే రాజీనామా చేసేవాడిని సాక్షి, అమరావతి: ఆరు నెలలుగా శతవిధాలా ప్రయత్నించినా ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్ మెంట్ దొరకలేదని, ఈ పరిణామం మనసుకు తీవ్ర బాధ కలిగించినా వెనుకబడిన బ్రాహ్మణ సమాజం ప్రయోజనాల కోసం భరిస్తూ.. పనిచేస్తూ వచ్చానని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్, అర్చక సంక్షేమ సంఘం మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. ఆయన మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌లు, షేరింగ్‌లపై ప్రభుత్వం ఎలాంటి వివరణ అడగలేదన్నారు. అడిగి ఉంటే కచ్చితంగా సమాధానం చెప్పి ఉండేవాడినని వెల్లడించా రు. అయితే, విదేశాల నుంచి కొందరు ఫోన్ చేసి తనను పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యం కలిగించింద న్నారు. నీవే తల్లివి.. నీవే తండ్రివి.. అంటూ భజన చేయడం తన వల్ల కాదని స్పష్టం చేశారు. కృష్ణారావు ఇంకా ఏం చెప్పారంటే... ‘‘నన్ను బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించారని ఇంతకు ముందే టీవీలో చూశాను. తప్పుకొమ్మని అడిగితే వెంటనే రాజీనామా చేసేవాడిని. తొలగించాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వానికి నాకంటే మైలేజీ ఇచ్చేవారు ఉంటే వారికే పదవి ఇచ్చుకోవచ్చు. నేను కోరుకునేది ఒక్కటే. బ్రాహ్మణుల అభివృద్ధి లక్ష్యం దెబ్బతినకుండా పనిచేసే వారికే ఈ బాధ్యతలు అప్పగించాలి. సమర్థులు చాలామంది ఉండొచ్చు. ఇది చాలదు, ఇంకా చేయాలన్న తపన ముఖ్యం. జీతం లేకుండా పనిచేస్తున్నా... ముఖ్యమంత్రిని కలవడానికి గత ఆరు నెలల్లో నాలుగుసార్లు సీఎం పేషీకి వెళ్లాను. అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ పరిణామం బాధ కలిగించినా బ్రాహ్మణ సమాజం కోసం భరించాను. జవాబుదారీతనంతో పని చేయడం లేదంటూ నాపై చేసిన విమర్శలు అవాస్తవం. నాకు కేబినెట్ ర్యాంక్ ఇవ్వలేదు. ఇచ్చామని చెబుతున్నారు. రూ.2 లక్షల జీతం అని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇలా నాపై పెద్ద అభాండాలు వేశారు. నేను జీతం లేకుండా పనిచేస్తున్నా. కొన్ని సౌకర్యాలు మాత్రమే ఉపయోగించుకుంటున్నాను. పెద్ద పోస్టు వదులుకున్నా... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా పదవీ విరమణ చేయగానే నాకు సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ పోస్టు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అది పెద్ద పోస్టు అయినా నేను వద్దన్నాను. మా సమాజానికి(బ్రాహ్మణ) వేరే కార్యక్రమాలు చేయాల్సి ఉందని, అందువల్ల బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే లక్ష్య సాధనకు పట్టుదలతో, ఇష్టంతో పనిచేస్తానని చెప్పా. నా విజ్ఞప్తికి ఒప్పుకునే ఆ పదవి ఇచ్చారు. బ్రాహ్మణ కార్పొరేషన్లో చాలామంది తెలుగుదేశం పార్టీ వారే సభ్యులుగా ఉన్నారు. ఏ సమాచారం ఉన్నా నేను వారికి చెప్పేవాడిని. బ్రాహ్మణ కార్పొరేషన్ సమావేశం సమాచారం టీడీపీ ఎమ్మెల్యేలకు చేరడం లేదని, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు చేరుతోందనేది మరో విమర్శ. కార్పొరేషన్ సమావేశం వివరాలను నేను సమన్వయకర్తలకు పంపుతాను. వారు ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వడం లేదంటే టీడీపీలోనే ఏదో పెద్ద లోపం ఉండి ఉండాలి. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి రుణాలు వైఎస్సార్సీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని ఇంకో విమర్శ చేస్తున్నారు. అలాంటి ఆరోపణలపై నాకు అభ్యంతరాలున్నాయి. టీడీపీ, వైఎస్సార్సీపీ అని ఉంటారా? లబ్ధిదారుల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ అని ఉండరు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి, జన్మభూమి కమిటీల ప్రమేయం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేశాం. బీజేపీ ప్రచారానికి విశాఖకు వెళ్లారని కూడా ఆరోపించారు. గుంటూరులో యడవల్లివారి సత్రం, నెల్లూరులో అయ్యలూరివారి సత్రాన్ని బ్రాహ్మణులకు ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని నేను దేవాదాయ శాఖ మంత్రిని కోరాను. ముఖ్యమంత్రికి ఫైల్ పంపితే పనికాదని, మంత్రి స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాలని చెప్పాను. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళితే ఆ ఫైల్ ఆగిపోతుంది. మంత్రి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే నన్ను విశాఖకు ప్రచారానికి రమ్మని కోరారు. టీడీపీకి బీజేపీ మిత్రపక్షం, పైగా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వారు పిలిచినందున నేను వెళ్లాను. చరిత్రను వక్రీకరిస్తే రాయితీనా? గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వడం సరికాదని పోస్ట్ పెట్టా. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నా. చరిత్రను వక్రీకరించిన సినిమాకు పన్ను రాయితీ ఎలా ఇస్తారు? బాహుబలి చిత్రాన్ని ఎక్కువ షోలు ప్రదర్శించేందుకు అనుమతించడాన్ని కూడా తప్పుబట్టా. టీటీడీ ఈవో పదవిని దక్షిణాది వ్యక్తికి ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్తరాది వ్యక్తిని నియమించాల్సిన అవసరం ఏముందని నాకనిపించింది. ఇవన్నీ కేవలం వారం రోజుల్లో పెట్టిన పోస్టింగ్‌లు, షేరింగ్‌లే. పొలిటికల్ మైలేజీ రావడం లేదని నాపై పెద్ద అభాండం వేశారు. అదేమిటో నాకు అర్థం కావడంలేదు. పొలిటికల్ మైలేజీ అంటే... నీవే తల్లివి.. నీవే తండ్రివి.. అంటూ భజన చేయాలా? అది నావల్ల అయ్యే పనికాదు. టీడీపీకి బ్రాహ్మణ సమాజాన్ని తాకట్టు పెట్టానని నాపై మా వారిలో విమర్శ ఉంది. ప్రతి లబ్ధిదారుడికి ముఖ్యమంత్రి సంతకంతో లెటర్ పంపుతున్నాం. ఇంతకంటే మైలేజీ ఇచ్చే వారుంటే మంచిదే.. పదవి ఇచ్చుకోవచ్చు. పదవులు ఆశించలేదు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఉద్దేశం నాకు లేదు. నాకు అంత అంగబలం, అర్ధబలం లేవు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన నేను ఎమ్మెల్యే కావాలని కోరుకుం టానా? ఎమ్మెల్యే పదవో, ఇంకేదో నేను ఆశించలేదు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. చైర్మన్ హోదా లో నేను జీతమేమీ తీసుకోవడం లేదు. ఏం తప్పు చేశానని నాపై అభాండాలు వేస్తున్నారో తెలియదు. జేసీ, కేశినేని నాని ఏం మాట్లాడినా చర్యలు తీసుకోరు. ఈ విషయంలో నేను స్పందించిన దాంట్లో తప్పేమీ లేదు. జాతీయ స్థాయి నాయకులు సర్పంచ్ స్థాయి దాటలేదని నేను స్పందించా. నాపై రియాక్ట్ అయిన వ్యక్తి ఒక టీడీపీ కార్యకర్త. ఇక ‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్ రవికిరణ్ ఇంటూరి అరెస్ట్ విషయంలో నేను చాలా ఫీలయ్యాను. ప్రజలకు వాస్తవాలు చేరడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజాలు చేరడం లేదు. ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబును లగడపాటి రాజగోపాల్ కలిస్తే తప్పులేదు కానీ, నేను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిని కలిస్తే తప్పా? ఇదేనా పాలసీ? బాపట్లలో శిక్షణ కార్యక్రమం పెట్టేటప్పుడు స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతిని ఆహ్వానించారు. అప్పుడే ఆయనను ఎందుకు పిలిచారని నన్ను ప్రశ్నించారు. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేను పిలవాల్సి ఉంటుందని స్పష్టంగా చెప్పాం. వ్యక్తిగత హోదాలో పిలిస్తే నేను ఎమ్మెల్యే కోన రఘుపతిని కలిశా. రాజధానిపై చాలా అంశాలు ఉన్నాయి. అవి ప్రజలకు తెలియాల్సి ఉంది. అన్ని అంశాలను పుస్తకంగా రాస్తా’’ అని ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. తప్పుడు తేదీలతో జీవో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగిస్తూ ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన జీవో తప్పుల తడకగా ఉంది. తేదీలను తప్పుగా పేర్కొన్నారు. 2017 జూన్ 29వ తేదీన కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరే షన్ ౖచైర్మన్‌గా నియమించినట్లు, ఆ పదవి నుంచి ఆయనను మంగళవారం (2017 జూన్ 20) తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజానికి కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా 2016 జనవరి 29న నియమించారు. -
‘ఆయన ఏం పోస్టింగ్స్ పెట్టారో తెలియదు’
అమరావతి: ఐవైఆర్ కృష్ణారావు ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ... ఐవైఆర్ ఏం పోస్టింగ్‌లు పెట్టారో తనకు తెలియదన్నారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి వ్యతిరేకంగా మాట్లాడటం సమంజసం కాదని యనమల అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఆరు నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నది తనకు తెలియదన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ఐవైఆర్ ఎక్కువ నిధులు అడిగారని, అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాధ్యం కాదని చెప్పామన్నారు. అంతేకాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్లో ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేయాలని ప్రయత్నించారని, అయితే అందుకు తాము అంగీకరించలేదన్నారు. కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారనే ఆరోపణలతో ఐవైఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఏపీ సర్కార్ తొలగించిన విషయం తెలిసిందే. బ్రాహ్మణ కార్పొరేషన్ నూతన చైర్మన్‌గా వేమూరి ఆనంద సూర్యను నియమిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఐవైఆర్ ఇలా చేస్తారనుకోలేదు: పరకాల
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...ఐవైఆర్ కృష్ణారావుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనడం సరికాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. సీఎంను ఎప్పుడైనా కలిసే స్వేచ్ఛ ఆయనకు ఉందని, ఐవైఆర్ అలా మాట్లాడతారని తాము ఊహించలేదన్నారు. పరకాల ప్రభాకర్ మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ కృష్ణారావు అంటే మాకు చాలా గౌరవం. రాష్ట్రానికి మీ సేవలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆయనను పిలిచి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. మూడేళ్ల పదవీ కాలానికి ఆయనను చైర్మన్‌గా నియమించారు. చంద్రబాబుకు ఐవైఆర్‌పై చాలా నమ్మకం ఉంది. బ్రాహ్మణ కార్పొరేషన్ చాలా పద్ధతిగా నడుస్తోంది. లోటు బడ్జెట్ ఉన్నా బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అధిక నిదులు కేటాయించాం. ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు కొన్ని కట్టుబాట్లకు లోబడి ఉండాలి. వాటిని అనుసరించి మాట్లాడాలి, ప్రవర్తించాలి. ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా విమర్శించడం ఎంతవరకూ సమంజసం. పార్టీకి భజన చేయాలని ఎవరూ అడగలేదు. అడగరు కూడా. ప్రభుత్వ పథకాలను సమర్థంగా చేయాలనే అడుగుతారు. అయితే ప్రభుత్వానికి, శాసనసభ, శాసనమండలికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై అభ్యంతరం తెలిపాం. అంతేతప్ప కృష్ణారావుపై ప్రభుత్వపరంగా ఎలాంటి ఆంక్షలు లేవు. బ్రాహ్మణ కార్పొరేషన్లో ఎలాంటి రాజకీయాలు లేవు. ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వాన్ని విమర్శించారు. అందుకే ఆయనను పదవి నుంచి తొలగించాం. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసినవారిని ఐవైఆర్ సమర్థించడంలో ఔచిత్యం లేదు. గౌతమీపుత్ర శాతకర్ణి, బాహుబలి, సోషల్ మీడియా గురించి ఆయన అంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఐవైఆర్ నిబద్ధత, నిజాయితీ పట్ల మాకు ఎలాంటి 'సందేహాలు లేదు. ఇప్పటికీ ఆయనపై అమితమైన గౌరవం ఉంది.’ అని అన్నారు. -
ఐవైఆర్‌ను తొలగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
అమరావతి: బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఐవైఆర్‌ను తొలగిస్తే ఇచ్చిన జీవో అంతా తప్పుల తడకగా ఉంది. ఆ జీవోలో నియామకం తేదీని ప్రభుత్వం తప్పుగా పేర్కొంది. జూన్ 29, 2016లో ఐవైఆర్ కృష్ణారావు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకం అయితే, జూన్ 19, 2017లో జాయిన్ అయినట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా వేమూరి మరోవైపు ఏపీ బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా వేమూరి ఆనంద సూర్యని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు చైర్మన్‌గా కొనసాగానున్నారు. ఇంతకు ముందు చైర్మన్‌గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్బుక్లో పోస్టింగ్‌లు షేర్ చేయడంతో సీఎం చంద్రబాబు తొలగించిన సంగతి తెల్సిందే. -
నా మీద పెద్ద అభాండం వేశారు: ఐవైఆర్
హైదరాబాద్ : బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించడంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో తన ఫేస్బుక్లో పోస్టులపై వివరణ ఇచ్చారు. ‘నన్ను బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించారని విన్నాను. అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని. తనను ఆ పదవి నుంచి తీసేశారని టీవీలో చూశాను. సీఎం కానీ, ఆయన కార్యాలయం నుంచి కానీ నాకు ఎలాంటి ఫోన్ రాలేదు. వివరణ అడగలేదు, అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని. కానీ నన్ను రాజీనామా చేయమని అడిగేవారిని చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. నాకు ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇంతవరకూ వివరణ అడగలేదు. ముఖ్యమంత్రిని కలవడానికి ఆరు నెలలు నుంచి ప్రయత్నిస్తున్నా. కానీ ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు. నా ఇగో హర్ట్ అయిందని అధికారులకు చెప్పాను. నేను జవాబుదారీతనంతో పని చేయడంలేదన్న విమర్శలు అవాస్తవం. నా మీద పెద్ద అభాండం వేశారు. నాకు కేబినెట్ ర్యాంక్ ఇవ్వలేదు. ఇచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా నాకు రెండు లక్షల జీతం అని కూడా ప్రచారం చేస్తున్నారు. నేను జీతం లేకుండా పనిచేస్తున్నా. అయితే కొన్ని సౌకర్యాలు మాత్రమే ఉపయోగించుకుంటున్నాను. కావాలని నేను అడిగా.. బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి కావాలని నేనే అడిగి తీసుకున్నా. నా విజ్ఞప్తికి ఒప్పుకునే ఆ పదవి ఇచ్చారు. బ్రాహ్మణ కార్పోరేషన్లో చాలామంది టీడీపీ వారే సభ్యులుగా ఉన్నారు. ఏ సమాచారం ఉన్నా నేను వారికి చెప్పేవాడిని. బ్రాహ్మణ కార్పొరేషన్ సమావేశం సమాచారం ఇవ్వడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఆ మెసేజ్‌లు పంపించే వ్యక్తులు టీడీపీ కార్యకర్తలే. వాళ్ల నుంచి మెసేజ్‌లు వెళ్లలేదంటే పార్టీలో ఏదో సమస్య ఉన్నట్లే లెక్క. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి రుణాలు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని చెబుతున్నారు. అలాంటి ఆరోపణలపై నాకు అభ్యంతరాలున్నాయి. లబ్దిదారుల్లో టీడీపీ, వైఎస్ఆర్ సీపీ ఉండరు. లబ్దిదారుడు...లబ్దిదారుడే. జన్మభూమి కమిటీల ప్రమేయం లేకండా లబ్దిదారులను ఎంపిక చేశాం. లబ్దిదారులకు, పార్టీకి ముడిపెట్టడం సరికాదు. బీజేపీ ప్రచారానికి విశాఖ వెళ్లిన మాట వాస్తవం. విశాఖలో రెండు సత్రాలను బ్రాహ్మణులకు ఇస్తూ దేవాదాయశాఖ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ప్రచారానికి రమ్మని బీజేపీ మంత్రి అడిగారు. నేను వెళ్లాను. సత్రం క్రెడిట్ సీఎం చంద్రబాబుకే ఇచ్చా. ఇప్పటివరకూ ప్రచారం గురించి ప్రశ్నించని వ్యక్తలు...ఇప్పుడెందుకు ప్రశ్నిస్తున్నారో అర్థం కావడం లేదు. నాకు ఆ ఉద్దేశ్యం లేదు... ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఉద్దేశం నాకు లేదు. నాకు అంత అంగబలం, అర్థబలం లేదు. సీఎస్‌గా పని చేసి అన్ని అనుభవించిన వ్యక్తిని ఎమ్మెల్యే కావాలని కోరుకుంటానా?. ఎమ్మెల్యే పదవో... ఇంకేదో నేను ఆశించలేదు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. కార్పొరేషన్ చైర్మన్ హోదాలో నేను జీతమేమీ తీసుకోవడం లేదు. ఏం తప్పు చేశానని నాపై అభాండాలు వేస్తున్నారో తెలీదు. జేసీ దివాకర్ రెడ్డి విషయంలో నేను స్పందించిన దాంట్లో తప్పేమీ లేదు. జాతీయ స్థాయి నాయకులు సర్పంచ్ స్థాయి దాటలేదని నేను స్పందించా. నాపై రియాక్ట్ అయిన వ్యక్తి ఒక టీడీపీ కార్యకర్త. ఇక పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ అరెస్ట్ విషయంలో నేను చాలా ఫీలయ్యాను. ఫేస్బుక్ ఉన్నదే అభిప్రాయాలు చెప్పడానికి. డొనాల్డ్ ట్రంప్, మాల్యా నుంచి శ్రీకాకుళం అరటిపండు వరకూ నేను అన్నింటిపై స్పందించా. చరిత్రను వక్రీకరించిన సినిమాకు రాయితీనా? గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇవ్వడం సరికాదని పోస్ట్ పెట్టా. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నా. చరిత్రను వక్రీకరించిన సినిమాకు పన్ను రాయితీ ఎలా ఇస్తారు?. అలాగే టీటీడీ ఈవో దక్షిణాది వ్యక్తికి ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్తరాది వ్యక్తిని నియమించాల్సిన అవసరం ఏముందని నాకనిపించింది. పొలిటికల్ మైలేజ్ రావడం లేదని నాపై పెద్ద అభాండం వేశారు. పొలిటికల్ మైలేజ్ రావాలంటే భజన చేయాలా? నేను అలాంటి వ్యక్తిని కాను. భజన కావాలనుకంటే అలాంటి వ్యక్తిని పెట్టుకోవాల్సింది. ఏపీ ప్రజలకు వాస్తవాలు చేరడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజాలు వెళ్లడం లేదు. న్యూట్రల్ న్యూస్ పేపర్ లేకపోవడంతో చాలా విషయాలు వారికి తెలియడం లేదు. ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. చంద్రబాబును లగడపాటి రాజగోపాల్ కలిస్తే తప్పులేదు కానీ, నేను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిని కలిస్తే తప్పా?. బాపట్లలో స్థానిక ఎమ్మెల్యేను కలవడంలో తప్పేముంది. ఏపీ రాజధాని భూములపై త్వరలో పుస్తకం రాస్తా. అన్ని విషయాలను అందులో వెల్లడిస్తా. మరిన్ని కథనాలు... వేటుకు ఐవైఆర్ ఫేస్బుక్ పోస్టులే కారణమా? ‘ఐవైఆర్ తొలగింపు మంచి నిర్ణయం’ ఐవైఆర్ కృష్ణారావుపై ఏపీ ప్రభుత్వం వేటు