ఐవైఆర్‌ను తొలగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
అమరావతి: బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఐవైఆర్‌ను తొలగిస్తే ఇచ్చిన జీవో అంతా తప్పుల తడకగా ఉంది. ఆ జీవోలో నియామకం తేదీని ప్రభుత్వం తప్పుగా పేర్కొంది. జూన్ 29, 2016లో ఐవైఆర్ కృష్ణారావు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకం అయితే, జూన్ 19, 2017లో జాయిన్ అయినట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా వేమూరి
మరోవైపు ఏపీ బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా వేమూరి ఆనంద సూర్యని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు చైర్మన్గా కొనసాగానున్నారు. ఇంతకు ముందు చైర్మన్‌గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌లు షేర్ చేయడంతో సీఎం చంద్రబాబు తొలగించిన సంగతి తెల్సిందే.