vemuri ananda surya
-
అలా మాట్లాడితే.. సమాజం హర్షించదు
సాక్షి, గుంటూరు రూరల్: రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డిని విమర్శించే అర్హత సాధినేని యామిని, వేమూరి ఆనంద్ సూర్యలకు లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యుడు కోనూరు సతీష్‌శర్మ ధ్వజమెత్తారు. గుంటూరులోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిశర్మ నోరు అదుపులో ఉంచుకుంటే మంచిదన్నారు. బ్రాహ్మణ మహిళలను రాజకీయ నాయకులు గౌరవిస్తారు కాబట్టి పేరులో శర్మ అని తగిలించుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చనుకుంటోందని ఎద్దేవా చేశారు. విమర్శలు హుందాగా ఉండాలి కానీ, బజారు మనుషులు మాట్లాడినట్లు మాట్లాడితే సమాజం హర్షించదన్నారు. చంద్రబాబు మెప్పు కోసం నోటికొచ్చినట్లు మాట్లాడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హితవు పలికారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య తిరుమల శ్రీవారి బంగారం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధం లేదంటూ చేసిన వ్యాఖ్యలు మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతున్నారని చెప్పకనే చెప్పినట్లుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని మంత్రులు విమర్శిస్తున్న వైనం చూస్తుంటే రూ.లక్షల కోట్ల ప్రభుత్వ అవినీతి ఎక్కడ బయటకు వస్తుందోనని భయపడుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జంగా జయరాజు, శేషం సుబ్బారావు, వడ్రానం శివ, తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రతిష్టకు భంగం కలిగించేలా రమణ దీక్షితులు వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బ్రహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రమణ దీక్షితులు ఆగమ శాస్త్ర విలువలను మంటగలిపరంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అర్చకులను తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నుంచి దూరం చేయడానికి రమణ దీక్షితులు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు నమ్మక ద్రోహి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పింక్ డైమండ్ అనేదే లేదని జడ్జీల కమిటీలు ప్రకటించాయని చెప్పారు. రూబీ ముక్కలైందని మీరే కదా నిర్ధారించారు అంటూ ఐవైఆర్‌ను నిలదీశారు. రమణదీక్షితులు నాటకం వెనుక మోదీ, అమిత్ షా ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల శ్రీవారి పోటు దగ్గర రిపేర్లు చేస్తున్నప్పుడు 2వ ప్రాకారంలో వంట చేయొచ్చని చెప్పింది రమణ దీక్షితులేనని వెల్లడించారు. టీడీపీ ఎంపీ మురళీ మోహన్ వేంకటేశ్వర స్వామిని ‘వెంకన్న చౌదరి’ అనడం ఆయన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. వేంటేశ్వర స్వామి అన్ని కులాలకు దేవుడని అన్నారు. అయినా వేంకటేశ్వర స్వామిని మురళీ మోహన్ ఏమన్నారో తాను వినలేదని చెప్పారు. వినిపిస్తామని మీడియా ప్రతినిధులు చెప్పడంతో సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఈ విషయంపై మళ్లీ మాట్లాడుతానంటూ వెళ్లిపోయారు. -
ఐవైఆర్‌ను తొలగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
అమరావతి: బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఐవైఆర్‌ను తొలగిస్తే ఇచ్చిన జీవో అంతా తప్పుల తడకగా ఉంది. ఆ జీవోలో నియామకం తేదీని ప్రభుత్వం తప్పుగా పేర్కొంది. జూన్ 29, 2016లో ఐవైఆర్ కృష్ణారావు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకం అయితే, జూన్ 19, 2017లో జాయిన్ అయినట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా వేమూరి మరోవైపు ఏపీ బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా వేమూరి ఆనంద సూర్యని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు చైర్మన్‌గా కొనసాగానున్నారు. ఇంతకు ముందు చైర్మన్‌గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్బుక్లో పోస్టింగ్‌లు షేర్ చేయడంతో సీఎం చంద్రబాబు తొలగించిన సంగతి తెల్సిందే.