IYR KRISHNARAO
-
ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి అస్సలు వాడలేదు: శ్యామలరావు
అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని, టీటీడీకి అపవిత్రం జరిగిపోయిందని చంద్రబాబు చేస్తున్న ప్రచారం అంతా బోగస్ అని తేలిపోయింది. చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు దుష్ప్రచారం వల్లే టీటీడీ పవిత్రత మంటగలుస్తోందని మరోసారి స్పష్టమైపోయింది. బాబు నియమించిన టీటీడీ ఈవో శ్యామలరావు మాటల్లో ఈ విషయం బట్టబయలైంది. శనివారం ప్రఖ్యాత ఆంగ్ల వెబ్సైట్ ది ప్రింట్‌తో శ్యామలరావు మాట్లాడుతూ ‘‘తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన 10 ఆవునెయ్యి ట్యాంకర్లలో నాలుగింటిలో నాణ్యత తగ్గినట్లు టీటీడీ నిపుణులు నిర్ధారించారు. జులై 6న వచ్చిన రెండు ట్యాంకర్లలో, జులై 12న వచ్చిన మిగిలిన ట్యాంకర్లలోని శ్యాంపుల్స్ను సేకరించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సెంటర్‌కు పంపించాం. ఆ నెయ్యిని 100శాతం ఉపయోగించలేదు.’’ అని శ్యామలరావు చెప్పారు. ఎన్డీడీబీ రిపోర్ట్‌లో జంతుసంబంధమైన, వెజిటబుల్ ఫ్యాట్లకు సంబంధించిన కల్తీ జరిగినట్లు తేలడంతో ఆ నాలుగు ట్యాంకర్లను పక్కన పెట్టి ఏఆర్డైరీకి తిప్పి పంపించామని శ్యామలరావు చెప్పారు. అసమయంలో టీటీడీకి ఐదు ఏజెన్సీలు నెయ్యి సరఫరా చేస్తున్నాయని, అందులో ఏఆర్ డైరీ ట్యాంకర్లలోనే నెయ్యి తక్కువ నాణ్యత ఉన్నట్లు తేలిందని ఆయన తెలిపారు. కల్తీ అయిన నెయ్యిని ప్రసాదాల తయారీకి అస్సలు వాడలేదంటూ శ్యామలరావు చెప్పినట్లు ది ప్రింట్లో వచ్చిన కథనం లడ్డూలలో కల్తీ ఎక్కడుంది? : ఐవైఆర్ కృష్ణారావు ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం తిరస్కరించిన కల్తీనెయ్యి గురించే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆరోపణలు చేస్తుంటే ఇక తిరుపతి లడ్డూలలో కల్తీ ఎక్కడుంది? ’’ అని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు. ఆయన ది ప్రింట్ ప్రతినిధితో మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు దన్నుగా మరేదైనా గట్టి ఆధారం లేకపోతే ఇది కచ్చితంగా చంద్రబాబుకు, టీడీపీకి బూమరాంగ్ వంటిదేనని వ్యాఖ్యానించారు. చర్యతీసుకోవడం మానేసి రాజకీయమా? ‘‘టీటీడీలో ఒక సిస్టమ్‌ను అనుసరిస్తాం. సాంకేతిక, ఆర్థిక అర్హతల ఆధారంగానే సరఫరాదారును ఎంపిక చేస్తారు. ఎంపికైన ఏజెన్సీ కల్తీ వంటి ఏదైనా తప్పు చేస్తే దానిని గుర్తించి చర్య తీసుకోవడం ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత. అది మానేసి దీనిని రాజకీయంచేయడం ఎంత వరకు సబబు?’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని టీటీడీ అధికారి ఒకరు ది ప్రింట్ ప్రతినిధికి చెప్పారు. వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ! టీటీడీకి ఈ ఏడాది జూలై 6, జూలై 12వ తేదీల్లో ఓ సరఫరా సంస్థ రెండేసి ట్యాంకర్లు చొప్పున ఆవు నెయ్యిని సరఫరా చేసింది. టీటీడీ మార్కెటింగ్ అధికారి, సంస్థ ప్రతినిధి సమక్షంలో ట్యాంకర్ సీల్ తొలగించి నెయ్యిని కలియతిప్పి.. ఒక్కో ట్యాంకర్ నుంచి మూడు శాంపిళ్ల చొప్పున సేకరించి అదే రోజు తిరుమలలో టీటీడీ ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్‌లో వేర్వేరుగా పరీక్షలు చేసిన ముగ్గురు టెక్నీషియన్లు టెండర్లో పేర్కొన్న ప్రమాణాల మేరకు నెయ్యి నాణ్యత లేదని తేల్చుతూ జూలై 8, 14న నివేదిక ఇచ్చారు. దాంతో తిరుపతిలో టీటీడీ గోడౌన్ బయట నుంచే ఆ రెండు ట్యాంకర్ల నెయ్యిని టీటీడీ అధికారులు వెనక్కి పంపేశారు. కల్తీ నెయ్యిని శ్రీవారి లడ్డులో వినియోగించడం కాదు కదా కనీసం తిరుపతిలోని టీటీడీ గోడౌన్‌లోకి కూడా అనుమతించడం లేదన్నది దీనిద్వారా స్పష్టమవుతోంది. -
ప్రాధాన్యతల లేమిలో భారత్–పాక్
రుతుపవన వర్షాలు భారత ఉపఖండం అంతా వ్యాపిస్తాయి. కృత్రిమంగా ఏర్పడిన దేశ సరిహద్దులను ఈ వర్షాలు లెక్క చేయవు. కురిస్తే మొత్తం ఉప ఖండం అంతా కుంభ వృష్టి. లేకపోతే వర్షాభావ పరిస్థితులు, కరువు. ఈ సంవత్సరం అంతటా కుంభవృష్టి. ఇక దానితో పాటు వచ్చే వరదలు, మలేరియా డెంగీలాంటి అనారోగ్యాలు సరిహ ద్దుకు అటు ఇటు ఒకే రకంగా ప్రజలను పీడిస్తు న్నాయి. వర్షాకాలంలో పురపాలక శాఖ అసమర్థతతో ఉంటే మోకాలు లోతు లేదా నడుము లోతు నీళ్లలో రోడ్లపై నడవాల్సి ఉంటుంది. అది సింధ్ హైదరాబాద్ అయినా దక్కన్ హైదరాబాద్ అయినా. 70 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా భారత్–పాక్ దేశాలు ఈ ప్రాథమిక సమస్యలను అధిగమించడంలో విఫలమైనాయి. దీన్ని విస్మరించి రెండు దేశాలలో చర్చ ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ విషయంలో ఎవరి వాదన పైచేయిగా ఉన్నది అనే దానిపై నడుస్తుంది. ప్రతి ఏటా జరిగే ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో అన్ని దేశాలు తమ దేశ పరిస్థి తులను, ప్రపంచంలోని ప్రధాన సమస్యలపై వారి విధానాన్ని వివరించడం ఆనవాయితీ. భారత ఉపఖండంలోని మూడు ప్రధాన దేశాల అధిపతులు సెప్టెంబర్ నెలలో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఆ దేశ పురోగతి సమస్యల విషయం విశదీకరిస్తూ బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాట సమయంలో జరిగిన మార ణహోమాన్ని గురించి కూడా ప్రస్తావించారు. భారతదేశంతో సరిహద్దు సమస్య లేకపోవటం బంగ్లాదేశ్ తన అంతర్గత వ్యవహారాల మీద, దేశ అభివృద్ధి మీద పూర్తి దృష్టి సారించడానికి తోడ్ప డింది. ఈనాడు బంగ్లాదేశ్ ఆర్థికంగా చక్కని పురోగతి సాధిస్తున్నది. భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌లో అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలను, స్వచ్ఛభారత్ లాంటి ప్రధాన కార్యక్ర మాలను తన ఉపన్యాసంలో వివరించారు. ఎటొచ్చీ కొంత తేడాగా నడిచిన ఉపన్యాసం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ది. పర్యావరణ సమస్యల గురించి ప్రస్తావనతో ప్రారంభమైన ప్రసంగం, అంతర్జాతీయ నల్లధన మార్పిడి ఏ విధంగా వారి దేశానికి నష్టం కలి గిస్తుందని వివరిస్తూ, ఇస్లామిక్ తీవ్రవాదం అసలు సమస్య కాదు పొమ్మన్నారు. ఇక ప్రధా నంగా తన ఉపన్యాసంలో కశ్మీర్ గురించి ప్రస్తా వించారు. కశ్మీర్ గురించి ఐక్యరాజ్యసమితి వేది కపై ప్రముఖంగా ప్రస్తావిస్తారు అని అందరూ ఊహించినప్పటికీ ఆయన ప్రసంగించిన విధా నం ఒక రాజ్యాధినేత ఐరాస వంటి అంతర్జా తీయ సంస్థలో ప్రసంగించాల్సిన స్థాయిలో లేదు. శాపనార్థాలతో సాగిన ఆయన ప్రసంగంలో.. 370 రద్దు వల్ల కశ్మీర్లో మారణహోమం జరుగు తోందని, ఈ సమస్య అణు యుద్ధానికి దారి తీయవచ్చని పేర్కొన్నారు. భారత్‌లోని ముస్లిం లను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశారు. కశ్మీర్లో అటువంటి మారణహోమం జరగా లని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు ఇమ్రాన్ చెప్పకనే చెప్పారు. కశ్మీర్ వాసులకు నష్టం జరిగినా పర్వా లేదు మాకు రాజకీయ లబ్ధి కావాలనేది ఆయన కోరికగా కనిపిస్తుంది. ఇక అణు యుద్ధ ప్రస్తావన తీసుకురావడం ఒక రకంగా ఆయన అనుభవ రాహిత్యం చాటుతోంది. ఐక్యరాజ్య సమితి సభలో ఇటువంటి హెచ్చరిక చేసినందున దీనిని తీవ్రంగా పరిగణించి పాకిస్తాన్ అణు కేంద్రాల పైన ఐక్యరాజ్యసమితి పూర్తి నియంత్రణ తీసుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక భారత దేశంలోని ముస్లింలను రెచ్చగొట్టడానికి ఆయన చేసిన ప్రయత్నం ఆయన రాజకీయ అవివేకాన్ని చాటుతుంది. 370 ప్రకరణ తొలగింపును భార తదేశంలో మత ప్రాంతీయ విభేదాలకు అతీ తంగా ప్రజలందరూ సమర్థిస్తున్నారు అనే సత్యాన్ని ఆయన గుర్తించలేకపోయారు. ఐక్య రాజ్యసమితిలో ఈ విధంగా మాట్లాడినా, విలేకర్ల సమావేశంలో మాత్రం కశ్మీర్ సమస్య పరిష్కా రానికి భారత్‌తో యుద్ధం మార్గం కాదన్నారు. ఉన్న వాస్తవాన్ని గుర్తించి మరొక వేదికపై ప్రస్తా వించటం అభినందనీయం. సైన్యాన్ని అదుపులో పెట్టగలిగిన ప్రజా పాలకులు అధికారం చేపట్ట నంతవరకు పాకిస్తాన్ దేశ సమస్యలు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ‘ ‘ iyrk45@gmail.com -
రైతుహక్కుల పరిరక్షణే ప్రధానం
వ్యవసాయ వంగడాల అభివృద్ధిలో ప్రభుత్వ సంస్థలతో పోటీపడుతూ దేశీయ వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టిన బహుళజాతి సంస్థలు రైతు సంక్షేమం దృష్ట్యా పని చేస్తాయి అనుకుంటే అది మన భ్రమే. కేవలం లాభాపేక్షతోనే ఇవి తమ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. తమ లాభాలను రక్షించుకునే ప్రక్రియలో భాగంగానే ఈ రోజు చిన్న సన్నకారు రైతుల పైన కూడా కోటి రూపాయల వరకు నష్టపరిహారం కోరుతూ పెప్సీ కంపెనీ గుజరాత్ కోర్టులో దావా వేయటానికి వెనకాడలేదు. బహుళజాతి సంస్థలు సరఫరా చేసిన విత్తనాలు మొలకెత్తక పోయినా, లేక నేడు గుజరాత్లో లాగా వారి హక్కులను అతిక్రమించారని కేసులు వేసినా వ్యక్తిగతంగా రైతు ఈ సంస్థలతో పోరాటం జరిపే పరిస్థితి లేదు. అందుకనే ’మొక్కలలో రకాలు వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ చట్టం’లో రైతుల ప్రయోజనాల్ని పరిరక్షించే విధంగా మార్పులు తీసుకురావడం అవశ్యం. ఈమధ్య గుజరాత్ రాష్ట్రంలో పెప్సీ కంపెనీ వారు రైతుల పైన కోర్టులో కోటి రూపాయల నష్టపరిహారం కోరుతూ కేసులు వేశారు. తాము సంపాదించిన పేటెం ట్‌కు విఘాతం కలిగించే విధంగా విత్తనాలు ఉపయోగించి వ్యవసాయం చేశారనేది వారి మీద మోపబడిన ప్రధాన అభియోగం. 2001వ సంవత్సరంలో రూపొందించిన ’మొక్కలలో రకాలు రైతుల హక్కుల పరిరక్షణ చట్టం’ (ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్) ఉల్లంఘనకు గానూ రైతులపై ఈ కేసు పెట్టారు. 1989వ సంవత్సరం నుంచి భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంతో మొదలుపెట్టి ఒప్పంద వ్యవసాయ విధానం ద్వారా(కాంట్రాక్ట్ ఫార్మింగ్) వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకం చేస్తూ ఉన్న పెప్సీ కంపెనీ దాదాపు 30 ఏళ్ల అనుభవం తరువాత ఈరోజు రైతులపై కేసులు పెట్టటం కొంత విచిత్రంగానే కనిపిస్తుంది. కానీ పెప్సీ కంపెనీ పెట్టిన ఈ కేసు మూలంగా ’ మొక్కలలో రకాలు రైతుల ప్రయోజనాల పరిరక్షణ చట్టం’లోని కొన్ని లొసుగుల అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పై చట్టంలో సెక్షన్ 39 కింద వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ గురించి చెప్పారు. బ్రాండింగ్ చేసి వాణిజ్యపరంగా అమ్మనంతవరకు వ్యవసాయదారుల చేత రక్షిత వంగడాల వాడకాన్ని ఈ సెక్షన్ కింద పరిరక్షించటం జరి గింది. కానీ ఇదే చట్టంలో సెక్షన్ 28 కింద కొత్త వంగడాలను అభివృద్ధి చేసిన సంస్థలకు తాము కానీ తమ చేత లైసెన్స్ పొందిన వ్యక్తులు గానీ ప్రత్యేకంగా వినియోగించే అవకాశాన్ని కల్పించింది. ఈ రెండు సెక్షన్లలోని పరస్పర విరుద్ధ అంశాలను ఈ కేసులలో కోర్టులు పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పెప్సీ కంపెనీ ఈ అంశాలను కోర్టు బయట పరిష్కరించుకోవటానికి సుముఖత చూపటం బట్టి ఈ అంశాలు ఇప్పట్లో కోర్టుల్లో తేలే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ ఉదంతం నుంచి మన దృష్టికి వచ్చిన ప్రధానమైన అంశాలు ఈ కింది విధంగా ఉంటాయి. 1. ప్రపంచ వాణిజ్య సంస్థకు అనుబంధంగా తయారైన ఖీఖఐ్కS లాంటి మేధోసంపత్తి హక్కుల నుంచి భారత ప్రభుత్వం బయటకి వచ్చే అవకాశం ఉందా! 2. బహుళ జాతి సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఒప్పంద వ్యవసాయ విధానానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? 3. రైతుల హక్కులను పరిరక్షించడానికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ మూడు అంశాలు ఒక్కొక్కటి పరిశీలిద్దాం. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) ఏర్పాటు కావడానికి ముందు వ్యవసాయ పరిశోధన వంగడాల అభివృద్ధి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వరంగ సంస్థల్లో జరుగుతూ ఉండేది. ఈ సంపద అంతా జాతీయ సంపదగా పరిగణించారు కాబట్టి పరిశోధనకు అవసరమైనటువంటి నిధులు ప్రజాధనం ద్వారా సమకూర్చారు కాబట్టి ఈ పరిశోధన వల్ల వచ్చే ఫలితాలు అందరు రైతులకు అందుబాటులో ఉండేవి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటుతో ఈ విధానం మారింది. మేధోసంపత్తికి పరిహారం సమకూర్చే విధంగా ట్రిప్స్ అగ్రిమెంటు ప్రపంచ వాణిజ్య సంస్థ విధి విధానాల్లో భాగంగా పొందుపరిచారు. ఈ మొత్తం ప్రక్రియ అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యతిరేకంగా నడిచింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ముందు పారిశ్రామిక సర్వీస్ రంగాల్లో డబ్ల్యూటీవో ద్వారా సరళీకృత విధానాలను విజయవంతంగా ప్రవేశపెట్టి ట్రిప్స్ అగ్రిమెంట్ ద్వారా పేటెంటింగ్ కాపీరైట్ చట్టాలను బలపరిచి అభివృద్ధి చెందిన దేశాలు తమ ప్రయోజనాలను పూర్తిగా పరీక్షించుకున్నారు. వ్యవసాయరంగంలో సరళీకృత విధానాన్ని అమలు చేస్తామని వాగ్దానం చేసినా దోహా రౌండ్ చర్చలు విఫలం కావడంతో వ్యవసాయ రంగ సరళీకృత విధానాల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వచ్చే ప్రయోజనాలు ఎండమావులు గానే మిగిలిపోయాయి. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ రంగానికి ఇచ్చే సబ్సిడీలు అంతకుముందు లాగానే కొనసాగుతున్నాయి. పూర్తిగా వ్యవసాయ రంగాన్ని సరళీకృతం చేసి, అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ రంగానికి సబ్సిడీలను నియంత్రణ చేయగలిగి ఉంటే అభివృద్ధి చెందే దేశాల వ్యవసాయ ఉత్పత్తులకు అభివృద్ధి చెందిన దేశాలలో విస్తృత మార్కెట్ ఏర్పడి ఉండేది. తదనుగుణంగా ఇక్కడి రైతుల ఆదాయాలు గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండేది. వ్యవసాయ రంగంపై జరిగిన దోహా రౌండ్ చర్చలు విఫలం కావటంతో అటువంటి అవకాశం లేకుండా పోయింది. డబ్ల్యూటీవో సంస్థ ఆధ్వర్యంలోని ట్రిప్స్ అగ్రిమెంట్ ద్వారా వచ్చిన మేధో సంపత్తి పరిరక్షణ విధానానికి అనువుగా మన చట్టాలు మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒక విధంగా డబ్ల్యూటీవో చట్రంలో ట్రిప్స్ చక్రంలో ఇతర దేశాలతో పాటు మనం కూడా బంధితులమయ్యాం. తదనుగుణంగా మన చట్టాల్లో తెచ్చిన మార్పు 2001 సంవత్సరంలోని మొక్కలలో రకాలు వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ చట్టం. ఈ చట్టం కిందనే ఈరోజు పెప్సీ కంపెనీ గుజరాత్లో రైతుల మీద కేసులు పెట్టింది. అంతర్జాతీయ ఒప్పందాల దృష్ట్యా ఈ చట్టాన్ని రద్దు చేసుకునే అవకాశం లేనందువల్ల చట్టం లోపలే ఏ విధంగా వ్యవసాయదారుల హక్కులను పరిరక్షించాలి అనే అంశంపైన ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. ఇక రెండో ప్రధానమైన అంశం ఈ బహుళ జాతి సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఒప్పంద వ్యవసాయానికి(కాంట్రాక్ట్ ఫార్మింగ్) ప్రత్యామ్నాయ విధానం ఏమైనా ఉందా! కొంతవరకు సహకార వ్యవసాయ విధానం ఈ ఒప్పంద వ్యవసాయ విధానానికి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయవచ్చు. కానీ దీనికి బలమైన నాయకత్వం అవసరం ఎంతైనా ఉంది. సహకార రంగంలో ఒక అమూల్ సంస్థ తప్పితే దేశంలో ఇంకెక్కడ సహకార సంస్థలు బలపడి రైతులకు దీర్ఘకాలంలో ప్రయోజనం కల్పించిన దాఖలాలు కనిపించడం లేదు. బహుళజాతి సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఒప్పంద వ్యవసాయ విధానంలో రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయి అనేది కూడా వాస్తవం. మొట్టమొదటిది అంతర్జాతీయ మార్కెట్‌ను, చిన్నకమతాల రైతులను అనుసంధానం చేసే సామర్థ్యం బహుళజాతి సంస్థలకే ఉంటుంది. నాణ్యమైన వంగడాల సరఫరా, వ్యవసాయ ఉత్పత్తులను ఆధునిక పద్ధతుల్లో నిల్వ చేయటం, ప్రాసెసింగ్ సదుపాయాలు కల్పించటం తద్వారా వ్యవసాయోత్పత్తుల విలువను పెంచటం ఈ బహుళ జాతి సంస్థల ద్వారానే సాధ్యమవుతుంది. సరైన ప్రత్యామ్నాయం వాటికి లేదు కనుక వ్యవసాయ రంగంలో కొన్ని పరిమితులు, షరతులకు లోబడి పనిచేసే విధంగా బహుళజాతి సంస్థల ఆధ్వర్యంలో ఒప్పంద వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఆదాయం పెరగడానికి దోహదపడుతుంది. కానీ ప్రభుత్వాలు ఈ బహుళ జాతి సంస్థలపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. రైతు సంక్షేమం దృష్ట్యా అవి పనిచేస్తాయి అనుకుంటే అది మన భ్రమే. కేవలం లాభాపేక్షతోనే ఈ కంపెనీలు తమ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అటువంటి లాభాలను రక్షించుకునే ప్రక్రియలో భాగంగానే ఈ రోజు చిన్న, సన్నకారు రైతులపైన కూడా కోటి రూపాయల వరకు నష్టపరిహారం కోరుతూ పెప్సీ కంపెనీ గుజరాత్లో కోర్టులో దావా వేయటానికి వెనకాడలేదు. వ్యవసాయం చేసుకోవలసిన రైతులను కక్షదారులుగా మారిస్తే పరిమితి లేని వనరులున్న ఈ బహుళ జాతి సంస్థలపై రైతులు పోరాటం చేసే పరిస్థితే లేదు. బహుళజాతి సంస్థలు సరఫరా చేసిన విత్తనాలు మొలకెత్తక పోయినా, లేక ఈనాడు గుజరాత్లో లాగా వారి హక్కులను అతిక్రమించారని కేసులు వేసినా వ్యక్తిగతంగా రైతు ఈ సంస్థలతో పోరాటం జరిపే పరిస్థితి లేదు. ఇక్కడనే ప్రభుత్వాలకు చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నది. బహుళజాతి సంస్థలతో ఉత్పన్నమైన ఎటువంటి కేసుల విషయంలో కూడా రైతుల తరఫున పోరాడే బాధ్యత ప్రభుత్వం చేత ఏర్పాటు చేసిన సంస్థ స్వీకరించాలి. పూర్తిగా వ్యాజ్యం అయ్యే ఖర్చులు ఈ సంస్థ భరించే విధంగా మార్పులు తీసుకురావాలి. రైతు లను కేవలం వ్యవసాయానికే పరిమితం చేసి అనవసరమైన కోర్టు కేసులు వారి నెత్తి మీద లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ సంస్థ రైతులకు అండగా కోర్టు కేసులు నడపటానికి అనువుగా చట్ట సవరణ ప్రభుత్వం తీసుకురావాలి. అట్లాగే ఆ సంస్థలకు కావలసిన ఆర్థిక పరిపుష్టిని ఏర్పాటు చేయాలి. అప్పుడే నిర్భయంగా వ్యవసాయదారుడు బహుళజాతి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వ్యవసాయ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడంలో నిమగ్నం కాగలుగుతాడు. ఇంకొక ప్రధాన విషయం మనదేశంలో ఈ చట్టాన్ని రూపొందించేటప్పుడు పూర్తిగా పేటెంట్ విధానానికి వెళ్లకుండా రైతుల ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని sui generisవిధానంలో ఈ ‘మొక్కలలో రకాలు వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ చట్టం’ని రూపొం దించారు. ఈ చట్టం అమలులో ఉండి 20 సంవత్సరాలు అవుతుంది కనుక ఇది ఎంతవరకు రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో సఫలీకృతమైంది అనే విషయాన్ని ఒకసారి సమీక్షించుకొని ట్రిప్స్ విధానానికి ప్రతికూలం కానంతవరకు తగిన మార్పులను వ్యవసాయదారుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా తీసుకురావాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
‘జార్ఖండ్ అలా చేస్తే.. ఏపీ మాత్రం అందుకు విరుద్ధం’
సాక్షి, గుంటూరు : అభివృద్ధి పేరిట అడ్డగోలుగా అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని జనచైతన్య వేదిక సదస్సులో పాల్గొన్న వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయానికి, ఖర్చుకు పొంతన లేకుండా పోయిందని సదస్సులో పాల్గొన్న ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. విచ్చలవిడి ఖర్చులతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి రూ. 30 వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపారని, కానీ ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పలేదని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిదులను ఏపీ పాలకులు కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని ఆరోపించారు. జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కేంద్ర నిధులను విద్య, వైద్యానికి ఖర్చు చేయగా.. ఏపీలో అందుకు విరుద్ధంగా పప్పు బెల్లాలకు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేశారని కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత ఆదాయమో శ్వేత పత్రం విడుదల చేయాలి.. అప్పుచేయటం తప్పుకాదని, కానీ ఎందుకు అప్పులు చేస్తున్నామనే విషయాన్ని పాలకులు గుర్తించాలని సదస్సులో పాల్గొన్న ఆర్థికవేత్త కేసీ రెడ్డి అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీ స్థితిగతులపై చర్చించడం తప్పుకాదని అన్నారు. 11.5 శాతం వృద్ధిరేటు సాధించామని చెబుతున్న పాలకులు ఏ రంగాన్ని అభివృద్ధి చేశారో చెప్పాలని, ఏ రంగం మీద ఎంత ఆదాయం వచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పుల వ్యవహారంపై దేశవ్యాప్త చర్చ జరగాలని స్పష్టం చేశారు. -
ఇలాంటి పాలన వద్దే వద్దు..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలపై సామాన్యులు, పేదలు, యువత, మహిళలు, రైతులే కాకుండా మాజీ ఉన్నతాధికారులు, మాజీ న్యాయమూర్తులు, విద్యావంతులు, పర్యావరణవేత్తలు ఇలా అన్ని రంగాల ప్రముఖులు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా అక్రమాలు, అరాచకాలేనని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు తన వర్గం వారే తప్ప బడుగు, బలహీన వర్గాల సంక్షేమం పట్టదని, రాష్ట్రంలో ప్రకృతి వనరుల్ని అడ్డంగా దోచేశారని తూర్పారా బట్టారు. ఈ అవినీతి పరంపరపై పలువురు ప్రముఖులు ఎవరెవరు ఏమన్నారంటే.. చంద్రబాబుకు విలువలు లేవు కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన చంద్రబాబు పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఆయనను మించిన అవినీతిపరుడు, అసమర్ధుడు, వెన్నుపోటుదారుడు ఎవరున్నారు? ఇంకొకర్ని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు? ఆయన పెద్ద జాదూ.. అన్ని కులాలను, మతాల్ని మోసం చేశాడు. వాజ్‌పేయితో కలుస్తానంటే ఆ వేళ ముస్లింలు వద్దన్నారు. అయినా బీజేపీతో చేతులు కలిపాడు. ఆ తర్వాత అవే మసీదుల్లో మీటింగులు పెట్టి.. నన్ను క్షమించండి, మరెప్పుడూ కలవనన్నాడు. మళ్లీ మోదీతో కలిశాడు. వంగి వంగి దండాలు పెట్టాడు. ఇప్పుడు తిడుతున్నాడు. నిన్నటి దాకా రాహుల్ గాంధీని, సోనియా గాంధీని తిట్టి ఇప్పుడు వాళ్లకు దండాలు పెడుతున్నాడు. ప్రత్యేక హోదాలో ఏముందీ? అన్నది చంద్రబాబే. ప్యాకేజీయే మంచిదని చెప్పాడు. మళ్లీ నల్లచొక్కా వేసుకుని హోదా కావాలంటున్నాడు. - పోసాని కృష్ణమురళీ, సినీనటుడు ముస్లింలను బాబు వంచించారు ముస్లింలను నిలువునా వంచించిన వ్యక్తి చంద్రబాబునాయుడు. బాబు పాలనలో మైనారిటీలు ఎప్పుడూ సంతోషంగా లేరు. గుజరాత్ అట్టుడికిపోతూ అమాయక ముస్లింలు ఊచకోతకు గురైతే.. ముసిముసి నవ్వులు నవ్విన వ్యక్తి చంద్రబాబు. హైదరాబాదీ ముస్లిం యువకులను గుజరాత్ పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి జైళ్లలో పెడితే చంద్రబాబు ఏం చేశారు. నాటి ప్రధాని వాజ్‌పేయీ, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీలకు తన మౌనంతో బాసటగా నిలిచి.. ముస్లింలను దగా చేసింది చంద్రబాబు కాదా? వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను ప్రకటించి అమలు చేశారు. అది ఎంత మేలు చేసిందో ముస్లింలు కళ్లారా చూశారు. ఆ ఫలాలు అనుభవించిన ఎంతోమంది ఉన్నత స్థితికి చేరుకున్నారు. అలాంటి మహానేత కుమారుడిగా వైఎస్ జగన్‌ను వారు అవే కళ్లతో చూస్తున్నారు. కచ్చితంగా ముస్లిం సమాజం అంతా జగన్‌కు అండగా నిలవాలి, నిలుస్తుంది కూడా! ప్రతి ముస్లిం కుటుంబం కూడా వైఎస్‌ను తమ కుటుంబ సభ్యుడిగా భావించేవారు. జగన్‌ను కూడా అలానే భావిస్తున్నారు. - అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధినేత ఇరిగేషన్ అంతా పెద్ద స్కాం ఓట్ల కోసమే ఎన్నికల ముందు వివిధ కులాలు, వర్గాలకు కార్పొరేషన్ల ఏర్పాటును చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఒక సామాజికవర్గం మేలు కోసం తప్ప సీఎంగా ఆయన చేస్తున్నదేమీ లేదు. టీడీపీ నాయకులు కాగితాలపైన కంపెనీలు సృష్టించి విలువైన భూములు కబ్జా చేశారు. డ్వాక్రా సంఘాల ముసుగులో అడ్డగోలుగా ఇసుకను అమ్ముకుని వేల కోట్లు దండుకున్నారు. కేంద్రం చేయాల్సిన పోలవరం ప్రాజెక్టును తీసుకుని దాన్ని ఏ రకంగానూ ముందుకు పోనీయకుండా చేశారు. కాంట్రాక్టర్లకు భారీ లాభాలు వచ్చేలా చేసి.. ఇష్టమొచ్చినట్లు సబ్ కాంట్రాక్టులు ఇచ్చేశారు. ఇరిగేషన్ ఒక పెద్ద స్కామ్. ‘నాకేంటి?’ అన్న తరహాలో బాబు ఆలోచన ఉంటుంది. ప్రగతి సాధించలేక వైఫల్యాన్ని వేరొకరిపై నెట్టేందుకు నవనిర్మాణ దీక్షలు, ధర్మ పోరాట దీక్షలు చేశారు. రాష్ట్రంలో ఈ అయిదేళ్లలో చంద్రబాబు ఒక్క ఓడరేవు కట్టారా? - ఐవైఆర్ కృష్ణారావు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎన్నికల సమయంలోనే ఈ గిమ్మిక్కులేంటి? సరిగ్గా ఎన్నికల సమయంలో పథకాల పేరుతో డబ్బుల్ని జమ చెయ్యడమేంటి. ఉపాధి హామీ పథకంలో రెండేళ్ల పాటు పనిచేసిన కూలీలకు రూపాయి కూడా ఇవ్వలేదు. చెమటోడ్చి పనిచేసిన వారికి నెలకు రూ.10 వేలపైనే రావాల్సి ఉండగా.. వాటిని ఇవ్వకుండా పసుపు–కుంకుమ అంటూ.. రూ.10 వేలు ఇవ్వడం ఏం న్యాయం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. ఇటీవల సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో సుమారు 15 మంది ఐఏఎస్‌లకు అప్పనంగా స్థలాలు కట్టబెట్టారు. ఎందుకిలా ఇచ్చారు, రైతుల వద్ద నుంచి భూములు లాక్కున్నది ఐఏఎస్‌లకు ఇచ్చేందుకా. ఎంత దారుణం. – ఈఏఎస్ శర్మ, విశ్రాంత ఐఏఎస్ ఎక్కడ చూసినా అవినీతి, బంధుప్రీతి అక్రమ సొమ్ముతో ఎమ్మెల్యేలను ఇష్టమొచ్చినట్లు కొన్నారు. ప్రజాతీర్పుకు విలువ లేకుండా చేశారు. ఓటుకు పది వేలు ఇచ్చేందుకు సైతం సిద్ధమంటున్నారు. అధికారులను బెదిరించి, భయపెట్టి పార్టీ కార్యకర్తల్లా మార్చేశారు. గత ఐదేళ్లలో పార్టీయే ప్రభుత్వం, ప్రభుత్వమే పార్టీ అన్నట్లుగా వ్యవహరించారు. నయానో భయానో అధికారులను తమ దార్లోకి తెచ్చుకున్నారు. ఫలానా పనికి ఫలానా రేటంటూ వాటాలు పంచుకున్నారు. కాంట్రాకర్లకు బిల్లులు చెల్లించాలంటే.. లంచం ఇవ్వాల్సిందే. కాంట్రాక్ట్ రావాలంటే కమీషన్లు ఇవ్వాల్సిందే. మంత్రులు తప్పు చేస్తే ముఖ్యమంత్రికి చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యమంత్రే తప్పు చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి.. ఎవరికి చెప్పుకోవాలి..? రాజధాని కోసం మూడు పంటలు పండే భూములను లాక్కున్నారు. భూములు ప్రభుత్వపరం కాక ముందే.. విదేశీ కంపెనీలకు పందేరం పెట్టారు. - జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి మోసకారి బాబును నమ్మొద్దు చంద్రబాబు పాలనలో బీసీలకు ఎలాంటి మేలు జరగలేదు. ఇపుడు 5 ఏళ్లు, అంతకు ముందు 9 ఏళ్లు పరిపాలించిండు. గడ్డపారలు, బర్రెలు, గొర్రెలు, సుత్తెలు, బుట్టలు, చిన్నచిన్న కులవృత్తులు చేసుకుంటూ అర్ధాకలితో బతకమని.. ఇవే కదా ఇస్తానన్నాడు. వాళ్లు మంచి ఉద్యోగాలు సంపాదించేందుకు ఏమైనా చేసిండా? కనీసం ఫీజు రీయింబర్స్‌మెంటునైనా పూర్తిగా ఇవ్వలేదు. మారుతున్న సమాజానికి అనుగుణంగా బీసీలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యం జగన్‌కు ఉంది. చంద్రబాబు ఆలోచన ఎంతసేపూ బీసీలు కుల వృత్తులను నమ్ముకొని అలాగే ఎదగకుండా ఉండాలని ఉంది. చంద్రబాబుది అవకాశవాదం. కులాలు, మతాల మధ్య పంచాయితీ పెట్టి పబ్బం గడుపుకోవడం దుర్మార్గం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు వస్తాయని గట్టిగా నమ్ముతున్నాం. పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టండని చెబితే జగన్ చేసి చూపించాడు. ఏపీలో బీసీలంతా తనకు ఓటేస్తారన్న కుయుక్తితో చంద్రబాబు నన్ను వాడుకున్నాడు. బీసీలను ఉపయోగించుకుని సీఎం కాగానే అవసరం తీరాక వదిలేశాడు. - ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పోలవరంలో బాబు చేసిందేమీ లేదు పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చిందొకరు. జాతీయ ప్రాజెక్ట్‌గా చేసిందొకరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఖర్చుపెట్టింది మరొకరు. మరి పోలవరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. సింగపూర్ తరహాలో రాజధానని పదేపదే చెప్పడం ఆత్మన్యూనతాభావం. భారతీయ ఇంజనీర్ల పర్యవేక్షణలో రాజధాని నిర్మిస్తే మురికివాడలుగా మారుస్తారని చంద్రబాబు పేర్కొనడం ఎంత దారుణం. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే ఆ ప్రాంతంలో తన సామాజికవర్గానికి చెందిన బినామీలతో తక్కువ ధరకు భూములు కొనిపించారు. మేకిన్ ఇండియాలో భాగంగానే అనంతపురంలో కియో కంపెనీ ఏర్పాటైంది. అది తన ఘనతగా చెప్పుకోవడం సరికాదు. హంద్రీనీవా పూర్తయితే రాయలసీమలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. హంద్రీనీవాను పూర్తి చేయకుండా.. చేతులారా రాయలసీమను ఈ ప్రభుత్వం నాశనం చేసింది. - వై.వెంకట్రామి రెడ్డి, ఏపీపీఎస్సీ మాజీ ఛైర్మన్ సంపద సృష్టి పెద్ద మాయ రాష్ట్రాభివృద్ధిపై బాబు చెప్పేవన్నీ అబద్ధాలు, అర్ధసత్యాలే. సంపద సృష్టి అనేది పెద్ద మాయ. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగన్నారు. రైతులకు రూ.88 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంటే.. తీరా మాఫీ రూ.15వేల కోట్లకు మించలేదు. బలవన్మరణాలకు పాల్పడే రైతులకు చంద్రన్న బీమా అన్నారు. అదెక్కడ ఇచ్చారో చెప్పండి. 4, 5 తుపాన్లు వస్తే ఎంతమందికి సాయం చేసారు.? ఎందుకు శ్వేతపత్రాన్ని విడుదల చేయలేదు. 2014 ఎన్నికలకు ముందు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు. ఉద్దానం కిడ్నీ వ్యాధి పీడితులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. ఆచరణలో ఒకే ఒక్క డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే.. అదికూడా సరిగా పనిచేయడం లేదు. - డాక్టర్ దొంతిరెడ్డి నరసింహారెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు చంద్రబాబు 14 ఏళ్ల పాలన కుతంత్రాలు, దోపిడీతోనే నడిచింది. సమాజంలో కులాల మధ్య విభేదాలకు బీజం నాటారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన వ్యవస్థలను దిగజార్చి, కోర్టు స్టేలతో విచారణ నుంచి తప్పించుకుంటున్నారు. విచారణ జరగకుండా వాయిదాలు వేయించుకున్న మాత్రాన సచ్ఛీలుడైపోరు. ఏదొక రోజు కోర్టు బోను ఎక్కక తప్పదు. కొత్త పార్టీలను మాయచేసి ప్రతిపక్షంపై ఉసిగొల్పుతున్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీలోని ద్వితీయ శ్రేణి నేతలు ప్రజల సొమ్మును దోచుకుతిన్నారు. అగ్రిగోల్డ్, సదావర్తి భూములు, విశాఖ భూ కుంభకోణం, అమరావతి అవినీతి భాగోతం.. ఇలా ఇంత తీవ్రమైన అవినీతి ఏపీలో ముందెన్నడూ జరగలేదు. ఇదంతా కేవలం చంద్రబాబు అసమర్ధ, అవినీతి పాలన వల్లే. - పి.విజయ్‌బాబు, సమాచారహక్కు చట్టం మాజీ కమిషనర్ చంద్రబాబు పాలనలో అంతులేని అవినీతి రాష్ట్రంలో 35 ఏళ్లలో ఇంత దౌర్భాగ్యమైన పాలన చూడలేదు. రాజధాని నిర్మాణాన్ని సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకున్నారు. ఇసుక, మట్టితో సహా సహజ వనరుల్ని అడ్డంగా దోచేశారు. నీరు–చెట్టు, ఉపాధి హామీ అన్నింటా అక్రమాలే. పెండింగులోని సాగునీటి ప్రాజెక్టుల అంచనాలు మూడు రెట్లు పెంచి దోచుకున్నారు. జాతీయ రహదారి నిర్మాణానికి కి.మి.కు రూ. 17 కోట్ల నుంచి రూ. 26 కోట్లయితే.. అమరావతిలో కి.మీ. రూ. 36 కోట్లు పోస్తున్నారు. ఇంటి నిర్మాణంలో చ.అడుగుకు రూ. 2 వేలు ఖర్చవుతుంటే అమరావతిలో తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణంలో చ.అడుగుకు రూ. 11,000 ఖర్చు పెట్టారు. ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేని పోలవరం ప్రాజెక్టు విహారయాత్రలకు రూ. 400 కోట్లు దోచిపెట్టారు. మితిమీరిన దుబారా, అక్రమాలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. పీఎంఏవై ఇళ్లకు పక్క రాష్ట్రంతో పోల్చితే మన వద్ద చ.అడుగుకు రూ. వెయ్యికి పైగా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. 36.5 కోట్ల చదరపు అడుగులకు ఎంత అవినీతి జరుగుతుందో చూడండి. రాజధానిలో శిలాఫలకాలు, సభలు, ఆర్భాటాల కోసం రూ. 350 కోట్లు ఖర్చు చేశారు. హైదరాబాద్‌లోనూ, అమరావతిలోనూ రెండు చోట్ల క్యాంపు ఆఫీసులకు సొబగులు, ఫాంహౌస్‌ల హంగులకు వందల కోట్లు వృథా చేశారు. - అజేయకల్లం, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అర్చకుల కడుపు కొట్టారు వంశపారంపర్య హక్కుల్లో అర్చకులకు పదవీ విరమణ లేదని సుప్రీం, హైకోర్టులు చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా పదవీ విరమణను తెరపైకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 34 వేల ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, వారి కుటుంబాలు దుర్భర స్థితిలో ఉన్నాయి. టీడీపీ హయాంలో అర్చకులకు ఎలాంటి గౌరవ, మర్యాదలు లేక చాలా కష్టాలు పడుతున్నారు. 2017 డిసెంబర్లో మరమ్మతుల పేరిట 25 రోజులు పోటును మూసివేసి లోపల గోడల్ని పగులగొట్టారు. పోటు వద్ద పల్లవులు, చోళులు, పాండ్యులు, మరికొందరు రాజులు ఇచ్చిన ఆభరణాలు ఉన్నాయని తెలుసుకుని ఈ తవ్వకాలు జరిపారు. వెయ్యికాళ్ల మండపం కూల్చివేసిన సమయంలో భోషాణాల్లో ఆభరణాలు లభ్యమైనట్టు తెలిసింది. – రమణ దీక్షితులు, టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు విశాఖలో రూ. లక్ష కోట్ల కుంభకోణం విశాఖలో హుద్‌హుద్ బీభత్సం కంటే ఈ ఐదేళ్లలో నగరానికి భూబకాసురులు కోలుకోలేనంత నష్టం చేకూర్చారు. ఉత్తరాంధ్రను టీడీపీ సర్కారు పూర్తిగా దగాచేసింది. మళ్ళీ ఈ పాలకులే వస్తే ఇక్కడి వనరులు మొత్తాన్ని ఊడ్చేస్తారు. విశాఖ జిల్లాలో జరిగిన భూ దోపిడీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. రూ.లక్ష కోట్ల భూ కుంభకోణమని పత్రికలే రాశాయి. మునుపెన్నడూ లేనివిధంగా విశాఖ జిల్లాలో సహజ, ఇంధన వనరుల్ని దోచేశారు. రాష్ట్రంలో ప్రాథమిక రంగాలైన విద్య, వైద్య వ్యవస్థల్ని నాశనం చేశారు. పసుపు కుంకుమ పేరిట ఎన్నికలకు ముందు డబ్బులు జమ చేయడమేంటి...? ఇది ఎన్నికల తాయిలం కాదా? ఈ ఐదేళ్ళ నుంచి ఎందుకు చేయలేదు.? - కేఎస్ చలం, యూపీఎస్సీ మాజీ ఇన్చార్జ్ చైర్మన్ దారుణంగా ఇసుక దోపిడీ ఏపీలో ఇసుకను రాజకీయ మాఫియా దోచుకుంటోంది. కృష్ణా, గోదావరి నదుల్లో ఇసుకను అధికార పార్టీ దోచేస్తోంది. రాష్ట్రమంతా అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ దందాలో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు. సీఎం నివాసానికి సమీపంలోనే ఇసుక దోపిడీ సాగుతోంది. ఈ దోపిడీపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. - రాజేందర్ సింగ్, ప్రముఖ పర్యావరణవేత్త ఇష్టారాజ్యంగా అంచనాల పెంపు పట్టిసీమ ఎత్తిపోతల్లో రూ.374 కోట్లు దోచేశారు. పోలవరం ప్రాజెక్టులో అంచనాలు పెంచి కాంట్రాక్టర్లకు రూ.1853 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు. రాష్ట్రంలోని 44 సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని ఏకంగా రూ. 27,403.74 కోట్లకు పెంచేసి.. ఒక్కటీ పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టుల తొలి అంచనా వ్యయం రూ.49,107.78 కోట్లు కాగా, 2017 మార్చి 31 నాటికి పూర్తి చేస్తామన్నారు. అది పూర్తి చేయకపోగా అంచనా వ్యయాన్ని రూ.76,511.52 కోట్లకు పెంచారు. – కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ( కాగ్) డిస్కంలను ముంచేస్తారా?.. సీఎస్ దినేష్ అభ్యంతరం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భారీ విద్యుత్ కొనుగోలు కుంభకోణానికి తెరతీయగా.. అప్పటి సీఎస్ దినేశ్ కుమార్ అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ముఖ్యమంత్రి మాత్రం ఆ అంశాన్ని కేబినెట్లో పెట్టి రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని.. ఈ దశలో ఎక్కువ ధరకు సుజ్లాన్ అనే ప్రైవేట్ సంస్థ నుంచి పవన విద్యుత్ కొనుగోలు అవసరం లేదని సీఎస్ దినేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఏడాదికి డిస్కమ్స్ రూ.2000 కోట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయని.. ఈ సమయంలో పవన విద్యుత్‌ను యూనిట్ రూ.4.84 పైసలకు కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడంపై అభ్యంతరం తెలిపారు. రూ.3.46 పైసలకే ఇచ్చేందుకు ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చాయన్న అంశాన్ని గుర్తు చేశారు. సీఎస్ టక్కర్ నిరాకరణ.. చట్టాన్నే మార్చేసిన సీఎం రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ కంపెనీల ప్రతిపాదనల్ని సీఆర్డీఏ అధ్యయనం అనంతరం సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి పంపాలి. అందుకు విరుద్ధంగా ఆర్థిక మంత్రి నేతృత్వంలోని మంత్రుల కమిటీ, సీఎం ఆమోదం అనంతరం ప్రతిపాదనల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి పంపారు. దీనిపై సీఎస్ టక్కర్ తీవ్రంగా స్పందించారు. సీఎం, మంత్రుల కమిటీ ఆమోదం తెలిపితే.. అప్పుడు ఆ ప్రతిపాదనల్ని మంత్రివర్గానికి పంపాలని, అధికారులతో కూడిన అథారిటీకి కాదన్నారు. శాఖలన్నీ ఫైలుపై తమ అభిప్రాయాలను వెల్లడించాలని సీఎస్ టక్కర్ స్పష్టం చేయడంతో చంద్రబాబు ఏకంగా చట్టాన్నే మార్చేశారు. ఆ చట్టంలో సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ కి అధికారాలు తొలగిస్తూ ఏకంగా సవరణలు తీసుకువచ్చారు. ఇప్పుడు ఇదే అంశంపై హైకోర్టులో పిల్ దాఖలుకాగా.. విచారణకు స్వీకరించిన హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీలో చెత్తపాలన బిహార్‌తో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. బిహార్‌లో మ్యూజియం నిర్మాణానికి కాంట్రాక్టు తీసుకుని సకాలంలో పూర్తి చేశాం. ఎక్కడా ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి మేం ఇచ్చిన డిజైన్లు ఎంపికచేశామన్నారు. తర్వాత ఇష్టానుసారంగా సూచనలిచ్చారు. సీఆర్డీఏ స్వతంత్రంగా పనిచేయడం లేదు. నేతల రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడమే తప్ప తామేం చేయలేమని సీఆర్డీఏ ఉద్యోగుల సంభాషణల్లో మాకు తెలిసింది. ఏపీలో చెత్తపాలన సాగుతోంది. - పుమిహికో, మాకీ అసోసియేట్స్ చంద్రబాబు బీసీ, కాపు వ్యతిరేకి చంద్రబాబు బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకి. బీసీలు, ఎస్సీలు న్యాయమూర్తులు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాపులకు ప్రకటించిన 5 శాతం రిజర్వేషన్ న్యాయస్థానాల్లో నిలవదని బాబుకు కూడా తెలుసు. కాపులపై ఆయనకు చిత్తశుద్ధిలేదు. ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీ, ఒక బ్రాహ్మణుడిని న్యాయమూర్తులుగా సిఫార్సు చేసినప్పుడు.. వాళ్లందర్నీ తిరస్కరిస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కేంద్రానికి లేఖ రాశారు. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించే వాళ్లు న్యాయమూర్తులు కాకూడదన్నది చంద్రబాబు లెక్క. వాళ్ల(చంద్రబాబు) అడుగులకు మడుగులొత్తే వాళ్లే కావాలి. కాపులకు రిజర్వేషన్‌పై మంజునాథ్ కమిషన్ వేశారు. మంజునాథ్ నివేదిక ఇవ్వడానికి ముందే కమిషన్‌లో ముగ్గురు సభ్యులను చంద్రబాబు మేనేజ్ చేసి.. రాత్రికి రాత్రి వారితో ఒక రిపోర్టు రాయించుకుని, చైర్మన్‌ను పక్కన పెట్టారు. - జస్టిస్ ఈశ్వరయ్య, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి -
చంద్రబాబు ఏపీని అప్పుల రాష్ణ్రంగా మార్చారు
-
చంద్రబాబుపై ఐవైఆర్ ధ్వజం
సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వేజోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా దీన్ని స్వాగతించాల్సింది పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీని స్వాగతించిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు హోదా ఇవ్వాలంటూ జిమ్మికులు చేస్తున్నారని విమర్శించారు. -
‘కౌరవ సభను తలపించిన చంద్రబాబు దీక్ష’
సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వ్యంగ్యాస్త్రాలు సందించారు. చంద్రబాబు దీక్ష కౌరవ సభను తలపించిందని ఆయన ట్విట్ చేశారు. దీక్షపై ఐవైఆర్ స్పందిస్తూ.. ‘‘చంద్రబాబుతో శకుని మాట్లాడిన దృశ్యం కనిపించింది. లక్ష్మణ్ కూమార్ కూడా సభకు వచ్చి వెళ్లారు. ధుర్యోదన ధర్మపోరాట దీక్ష సభకు హాజరుకాలేదు.’’అని ట్విటర్లో పేర్కొన్నారు. నిన్న ఢిల్లీలో చంద్రబాబు నిర్వహించిన దీక్షకు కాంగ్రెస్ నేతలు హాజరైన విషయం తెలిసిందే. వారిని ఉద్దేశించే ఐవైఆర్ ఈ ట్విట్లు చేసినట్లు తెలుస్తోంది. This looks like #kauravasabha which divided #AP than a #dharmaporatasabha. Dhrutarashtra is having a word with the CM. Sakuni can be seen in the picture. Laxman Kumar came and went. Duryodhana did not attend the meeting. Duryodhana need not necessarily be a male . pic.twitter.com/Q6wsq8fTAL — IYRKRao , Retd IAS (@IYRKRao) February 12, 2019 -
పుస్తకాన్ని చదివి అర్థం చేసుకున్నప్పుడే ప్రయోజనం
సాక్షి,హైదరాబాద్: పుస్తకాన్ని చదివి అర్థం చేసుకున్నప్పుడే దానికి విలువ చేకూరుతుందని, తీసుకెళ్లి షోకేసుల్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదని ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కె. రోశయ్య అన్నారు. ఏపీ మాజీ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు రాసిన ‘నవ్యాంధ్రతో నా నడక’పుస్తకంతో పాటు ‘దిస్ దట్ ఎవ్రిథింగ్’.., ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాలను ఆదివారం ఫ్యాప్సీలో రోశయ్య ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా మంది పుస్తకాలు తీసుకెళ్తుంటారే కానీ, వాటిని చదవరని, అలాంటి వాళ్లతో ప్రయోజనం ఉండదన్నారు. వృత్తిపరంగా ఐవైఆర్ కృష్ణారావు అనుభవాలు, రాజకీయనేతలతో ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటి పర్యవసానాలను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇతరులను కించపరచడానికో లేక.. డైరెక్షన్ చేయడానికో ఈ పుస్తకం రాయలేదని, వృత్తిపరంగా ఎదుర్కొన్న అనుభవాలను, ఎంచుకు న్న ధోరణిలో రాశారన్నారు. భారత్‌టుడే చీఫ్ ఎడిట ర్ జి.వల్లేశ్వర్ పుస్తక సమీక్ష చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తుండటాన్ని చూస్తే ప్రజాస్వామ్యంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని మాజీ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ సంపాదకుడు ఎంవీఆర్ శాస్త్రి మాట్లాడుతూ విభజన సమయంలో ఓ అధికారి ఎదుర్కొన్న ఇబ్బందులకు ప్రతిరూపమే ఈ పుస్తకమన్నారు. రచయిత ఐవైఆర్ మాట్లాడుతూ ఏపీ విభజనకు దారి తీసిన పరిస్థితులు, ఆ తర్వాత ఆగమేఘాలపై రాజధాని తరలింపు వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులు, జవాబుదారీతనం లేని సీఎంఓలో పని చేయడం వల్ల జరిగిన నష్టాలను ఇందులో వివరించానన్నారు. -
రాష్ట్రంలో 52 లక్షల బోగస్ ఓట్లు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల జాబితాలో 52.67 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీలు ఐవైఆర్ కృష్ణారావు, అజేయ కల్లం వెల్లడించారు. నగరంలోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల జాబితాలోని అవకతవకలపై శనివారం మీడియా సమావేశం జరిగింది. ఇందుకు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐవైఆర్ మాట్లాడుతూ.. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో 3.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 52.67 లక్షల నకిలీ ఓటర్లు ఉండటం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమన్నారు. 2–3 శాతం ఓట్ల తేడతో జయాపజయాలు ఉంటున్న నేటి పరిస్థితుల్లో 15 శాతం నకిలీ ఓట్లు ఉండటం దుర్మార్గమన్నారు. అజేయ్ కల్లం ప్రసంగిస్తూ.. అధునాతన సాఫ్ట్వేర్ ఉపయోగించి నకిలీ ఓట్లను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లుగా కూడా నమోదైన వారు 18 లక్షల మంది ఉన్నారన్నారు. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 26వేల నకిలీ ఓట్లను గుర్తించగా అందులో 18 వేల ఓటర్లను తొలగించారని ఇంకా 8 వేల ఓట్లు కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ పార్టీలు, కేంద్ర ఎన్నికల సంఘం, ప్రజాసంఘాలు అప్రమత్తమై ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని పిలుపునిచ్చారు. అధికారులు, జన్మభూమి కమిటీలు కుమ్మక్కై జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. జన్మభూమి కమిటీలతో ఏపీ అధికార యంత్రంగం కుమ్మక్కు కావడంవల్లే నకిలీ ఓట్లు కొనసాగుతున్నాయన్నారు. ఓటరు కార్డులను ఆధార్‌కు లింకు చేయడంతోపాటు బయోమెట్రిక్ విధానాలను అమలుచేయడం ద్వారా వీటిని నిరోధించవచ్చన్నారు. జాబితాలో అక్రమాలు జరిగితే స్థానిక అధికార యంత్రాంగాన్ని బాధ్యులను చేసి శిక్షించాలన్నారు. 34లక్షల డూప్లికేటెడ్, రిపీటెడ్ ఓట్లు ఓటరు అనలెటిక్స్ మరియు స్ట్రాటాలజీ టీమ్ సభ్యులు తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ.. ఏపీలోని 175 నియోజవర్గాల్లో 34,13,000 ఓట్లు డూప్లికేటెడ్, రిపీటెడ్‌గా ఉన్నాయని ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. – 18లక్షల మందికి పైగా రెండు రాష్ట్రాల్లో ఓట్లున్నాయని.. ఇవి ఏ విధంగా వచ్చాయో ఆధారాలతో ఎన్నికల కమిషన్‌కు చూపించాం. – 10 కేటగిరీల కింద డూప్లికేట్ ఓట్లను విభజించాం. – అలాగే, సెప్టెంబర్ 1, 2018న విడుదల చేసిన ఓటరు జాబితాలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. భర్త స్థానంలో భార్య పేరు మార్చడం, ఇంటి నెంబర్లు వేర్వేరుగా నమోదు చేసి నకిలీ ఓట్లు సృష్టించారు. – ఒకటే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నాయి. వయస్సు తేడా చూపించి ఓటరుగా నమోదు చేయించుకున్నారు. ఈ విధంగా 24,928 కేసులు నమోదయ్యాయి. – ఇంటి పేర్లు, అసలు పేర్లు అటూఇటూ మార్చి మొత్తం 92,198 ఓట్లు నమోదు చేశారు. పుట్టిన ఏడాదికే ఓటు హక్కు ఇదిలా ఉంటే.. 18 ఏళ్లకే ఓటు హక్కు ఉండాలని.. కానీ, రాష్ట్రంలో పుట్టిన ఏడాదికే ఓటు హక్కు ఇచ్చారని ఆయన విస్మయం వ్యక్తంచేశారు. ప్రపంచంలో 124 సంవత్సరాల 2 రోజులు బతికినట్లు రికార్డులు ఉంటే .. మన రాష్ట్ర ఓటర్ల జాబితాలో 352 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఉన్నారన్నారు. ఇలాంటివి 6,118 ఓట్లు నమోదు అయ్యాయన్నారు. పీపుల్స్ రిప్రజంటేషన్ యాక్ట్ ప్రకారమైతే.. ఇలాంటి తప్పులు చేసిన వారిపై ఏడాది జైలుశిక్ష విధించాలని చెబుతోందని ఆయన గుర్తుచేశారు. అలాగే, ఇలాంటివి దేశంలో ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్లు గుర్తించలేవని,, సాఫ్ట్వేర్ ఆప్డేట్ చేయకపోవడంతో కూడా ఇలా జరుగుతుందని లోకేశ్వర్‌రెడ్డి చెప్పారు. సమావేశంలో రీసెర్చ్ స్కాలర్ ఓటరు అనలెటిక్స్ మరియు స్ట్రాటాజీ టీమ్ సభ్యులు జీవీ సుధాకర్‌రెడ్డి, జన చైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సలీమ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. -
అసంతృప్తిగా ఉన్నారా.. ఓటు గల్లంతే..!
సాక్షి, అమరావతి : ఏపీలో ప్రభుత్వ పాలనపై అసంతృప్తిగా ఉన్న వారి ఓట్లను టీడీపీ ప్రభుత్వం తొలగించే అవకాశం ఉందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణరావు అభిప్రాయపడ్డారు. గత కొంతకాలంగా తమకు ప్రభుత్వ పాలనపై సంతృప్తిగా ఉన్నారా.. అంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. అసంతృప్తిగా ఉన్నామని చెపితే ఓటర్ జాబితా నుంచి వారి పేరును తీసివేసే అవకాశం ఉందన్నారు. ఎందుకైనా మంచిది.. కొన్ని రోజుల తరువాత ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఒక సారి చూసుకోవడం ఉత్తమం అని ఆయన సూచించారు. ఆదివారం ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనపై రోజురోజుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. చాలా మంది ప్రజలు ఆయన పాలనపై అసంతృప్తిగా ఉన్నారన్నారు. -
అవినీతి నిరోధకచట్టం.. పారదర్శకత
సందర్భం ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమిలో ఐఏఎస్ ఆఫీసర్ల శిక్షణ రెండు భాగాలుగా జరుగుతుంది. తొమ్మిది నెలల మొదటి భాగం శిక్షణ తరువాత జిల్లాలలో శిక్షణకు వెళ్లి తిరిగి మూడు నెలల రెండో భాగం శిక్షణకు అధికారులు ముస్సోరికి వస్తారు. మా శిక్షణ సమయంలో రెండో భాగం శిక్షణకు వచ్చినప్పుడు అకాడమి పరిపాలనాధికారిగా అప్పు గారు ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో శిక్షణ చాలా ఉత్సాహపూరితంగా నడిచింది. చిన్న చిన్న గ్రూపులలో చాలా అంశాలు చర్చించేవాళ్ళం. అందులో ఒక అంశం నాకు బాగా గుర్తు. సమర్థవంతమైన అవినీతి అధికారి లేదా అసమర్థుడైన నిజాయితీపరుడైన అధికారులలో ఎవరు మెరుగు అనే అంశం. తర్వాత మెల్లగా తెలిసిన విషయం ఏమిటంటే అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని సెక్షన్ల మూలంగా నిజాయితీపరుడైన సమర్థవంతమైన అధికారిని అవినీతిపరుడిగా చిత్రీకరించే అవకాశాలున్నాయని. నిర్ణయాలు తీసుకోని అధికారులు, అవినీ తిపరులైన, ఫైళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకునే అధికారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పదవుల్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయని. చాలామంది నిజాయితీపరులు, సమర్థులు అయిన అధికారులకు ఇబ్బంది కలిగించిన సెక్షన్ 13(1)డి(జీజీ)(జీజీజీ). ఒక ప్రభుత్వ అధికారి తన అధికారిక స్థానాన్ని దుర్వినియోగపరిచి ఎవరికైనా మేలు చేకూర్చినా లేక తన చర్యల ద్వారా ఇంకెవరికైనా మేలు కలగజేసినా.. అది ప్రజాహితానికి అనుగుణంగా లేకపోతే దుష్ప్రవర్తనగా పరిగణిస్తారు. న్యాయస్థానాలు తమ తీర్పుల ద్వారా అధికార దుర్వినియోగానికి విస్తృత నిర్వచనాన్ని ఇచ్చారు. తనకు అధికారం లేకపోయినా నిర్ణయం తీసుకోవటం నుంచి హేతుబద్ధంగా లేని నిర్ణయాల వరకు, అవసరం లేని అంశాలు పరిగణనలోకి తీసుకోవటం, అవసరమైన అంశాలు పరిగణలోకి తీసుకోకపోవటం అన్నీ అధికార దుర్వినియోగ నిర్వచనం కిందికి తీసుకొని రావడం జరిగింది. కానీ, అధికారులు తీసుకునే ఏ నిర్ణయాన్నయినా అధికార దుర్వినియోగంగా చిత్రీకరించి నేరపూరితమైన దుష్ప్రవర్తన కింద చర్య ప్రారంభించవచ్చు. అలాగే ప్రతి పరిపాలనాపరమైన చర్య ఎవరో ఒకరికి మేలు చేకూరుస్తుంది. ఇక ప్రజాహితం అనేది కోర్టుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఒక సమయంలో ఉన్న సమాచారానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో పరిశీలిస్తే మరొకరకంగా గోచరించవచ్చు. ఈ రెండు సెక్షన్ల కనుగుణంగా పరిశోధనా సంస్థలు నిజాయితీపరులైన సమర్థ అధికారులపై చర్యలు ప్రారంభించాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు విధివిధానాలను సరిగ్గా పాటించలేదు అనే ఒకే నెపం మీద నేరపూరిత చర్యలు వీరిపై మోపారు. ఎటువంటి అవినీతిగానీ, ఆర్థికంగా లాభపడ్డారని గానీ ఆధారాలు లేకపోయినా కేవలం నిర్ణయం తీసుకునేటప్పుడు జరిగిన విధాన లోపాలను నేరపూరిత లోపాలుగా పరిగణించి చర్యలు ప్రారంభించారు. దీనితో అధికారులలో నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక రకమైన భయం ఏర్పడింది. ఈ అంశాలను గుర్తించే ఈనాడు ప్రభుత్వం అవినీతి నిరోధక చట్టంలో మౌలికమైన మార్పు తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగపరి చినా, ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినా నేరపూరితమైన చర్యగా పరిగణిస్తారు. అంతకు ముందు చట్టంలో ఉన్న 13 సెక్షన్ సమూలంగా మార్చడం జరిగింది. అధికారులు తీసుకున్న చర్యల మూలంగా ఎవరికైనా లబ్ధి జరిగితే వారు నేరపూరిత చర్య జరిపినట్టుగా భావించే విధానాన్ని పూర్తిగా తొలగించారు. నిజాయితీగా, సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవాలనుకునే అధికారులకు భవిష్యత్తులో దర్యాప్తు సంస్థల నుంచి ఇబ్బందులు ఉంటాయని భావించకుండా పనిచేసుకునే అవకాశాన్ని ఈ మార్పులు కల్పిస్తాయి. కానీ పరిశోధనా సంస్థలు ఏ ప్రభుత్వ ఉద్యోగిపై అయినా విచారణ చేయాలంటే ప్రభుత్వ అనుమతి ఈ చట్ట సవరణ ద్వారా తప్పనిసరి చేశారు. ఈ మార్పులు పరిశోధనా సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి ప్రతిబంధకం కావచ్చు. దీనికి బదులు నిరంతరంగా అనుమతినిచ్చే అధికారాన్ని ఒక అధికారుల కమిటీకి అప్పగించి ఉంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉండేది. ఏ అవినీతి నిరోధక చట్టమైనా ఒక్క నిజాయితీపరుడైన అధికారిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. కొందరు అవినీతిపరులు తప్పించుకున్నా ఫర్వాలేదు. నిజాయితీపరుడైన అధికారి ఇబ్బందికి గురైతే అధికారుల మనోసై్థర్యం దెబ్బతింటుంది. దీనితో నిర్ణయాలు తీసుకోవటానికి జంకుతారు. దీని దుష్ప్రభావం అభివృద్ధి కార్యక్రమాల అమలు మీద ఉంటుంది. వ్యాసకర్త ఐవైఆర్ కృష్ణారావు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
వరదలనూ వదలని రాజకీయాలు
విదేశీ సహాయం తీసుకోవడం ద్వారా ఒక రాష్ట్రానికి అధిక సాయం లభిస్తే ఇంకో రాష్ట్రానికి తక్కువ సహాయం జరిగి సహాయక చర్యల్లో వ్యత్యాసాలు వచ్చే అవకాశ ముంది. ఇలాంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుని తీసుకోలేదు. కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి చాలా అనుభవజ్ఞులే అయినప్పటికీ యూఏఈ వరదసాయాన్ని కేంద్రం తిరస్కరించడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సహేతుకమైనవి కావనిపిస్తోంది. మరికొందరు దక్షిణాది రాష్ట్రాల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. విధి విధానాలను అనుసరించి జరిగే విపత్తుల నివారణ నిర్వహణ కార్యక్రమాలను ఈ కోణంలో చూడటం దురదృష్టకరం. కేరళలో వచ్చిన వర దలు గత వందేళ్లలో ఆ రాష్ట్రం చూడని వర దలు. ఈ ప్రకృతి వైప రీత్యాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు పూర్తి అవగాహన, పరస్పర సహకా రంతో పనిచేశాయి. బాధితులను రక్షించడంలో, వారికి సహాయ సహకారాలు అందించడంలో జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్డీఆర్ఎఫ్), స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషించాయి. పూర్తి సమన్వయంతో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు చేతనైతే తమవంతు సహాయం అందించడం లేదా నైతిక మద్దతు ప్రకటించడం వదిలేసి కొంతమంది అసందర్భ, అనుచిత వ్యాఖ్యలు చేయడమే తమ ప్రధాన కార్యక్రమంగా పెట్టుకున్నారు. దక్షిణ భార తదేశంలో జరిగే ఉపద్రవాలకు కేంద్రం సరైన సహ కారం అందించడం లేదని బాధ్యతారహితంగా, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఉపద్రవ సహాయక కార్యక్రమాలతో సంబంధంలేని, అవగాహన లేని వ్యక్తులు చేసే వ్యాఖ్యలు గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ సాక్షాత్తు కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉపద్రవlసహా యక కార్యక్రమాలను పర్యవేక్షించే వ్యక్తి వ్యాఖ్యలు చేసినప్పుడు వాటికి ప్రాధాన్యం సంతరిస్తుంది. ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ట్విట్టర్లో రాష్ట్రప్రభుత్వం వరదల సహాయం కోసం కేంద్రాన్ని రూ. 2,200 కోట్లు అడిగిందని. కేంద్రం రూ. 600 కోట్లు ఇచ్చిం దని, యూఏఈ ప్రభుత్వం రూ. 700 కోట్లు ఇస్తా మంటే కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని అర్థం వచ్చేలాగా ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యానాల ఉచితాను చితాలను విశ్లేషించే ముందు భారతదేశంలో విప త్తులను ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యవస్థీకృత విధానం ఉన్నదో పరిశీలిద్దాం. ఈనాడు ప్రపంచంలో చాలా దేశాలలో లేని విధంగా విపత్తులను ఎదుర్కోవడానికి భారత దేశంలో చక్కని విధివిధానాలు రూపొందించారు. అమెరికా కత్రినా తుపాను ఎదుర్కొన్న విధానంతో పోల్చుకుంటే భారతదేశం వరదలు–తుపాన్లు వంటి ఉపద్రవాలు చాలా సమర్థంగా ఎదుర్కొంటున్నది. 2005లో కేంద్ర ప్రభుత్వం విపత్తుల పర్యవేక్షణ చట్టాన్ని రూపొందించింది. అదేవిధంగా విపత్తుల నిర్వహణ ప్రణాళిక తయారుచేశారు. ఈ ప్రణాళికను ఐక్యరాజ్యసమితి విపత్తుల నివారణ, నిర్వహణ కోసం రూపొందించిన సెండాయ్ సమావేశపు విధి విధానాలకు అనుగుణంగా రూపొందించారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జాతీయ ఉప ద్రవ పర్యవేక్షణ వ్యవస,్థ రాష్ట్రస్థాయిలో ముఖ్య మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపద్రవ పర్యవేక్షణ వ్యవస్థ, జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఉపద్రవ పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అదే విధంగా ఉపద్రవ సమయాలలో సహాయ రక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక ప్రత్యేక బలగం ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేశారు. ఉపద్రవ సహాయ రక్షణ కార్యక్రమాలలో శిక్షణనిచ్చి సామర్థ్యాలు పెంచ డానికి ఒక ప్రత్యేక శిక్షణా సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంస్థ దక్షిణభారత కార్యాలయం ఆంధ్ర ప్రదేశ్‌లోని గన్నవరం సమీపంలో రూపుదిద్దుకుం టోంది. వీటన్నిటికీ మించి ఉపద్రవ సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వ ర్యంలో ఒక కమిటీ, రాష్ట్రస్థాయిలో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మరో కమిటీ, జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తాయి. ఈ కమిటీలు రోజువారీగా వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం ద్వారా మీటింగులు నిర్వహించుకొని ఉపద్రవ నివారణ రక్షణ కార్యక్రమాలకు దిశానిర్దేశం చేస్తుంటాయి. ఉప ద్రవ నివారణ, రక్షణ కార్యక్రమాలను నిర్వహించ డంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బలగాలు, అధికా రులు పూర్తి సమన్వయంతో సహకారంతో పనిచేయ డంలో ఈ కమిటీలు చాలా ప్రధాన పాత్ర పోషి స్తాయి. హుదూద్ తుపాన్ సందర్భంలో ఈ కమిటీల పాత్రను, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల నుంచి పూర్తి సహాయ సహకారాలను నేను ప్రత్యక్షంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య కార్యదర్శిగా చూశాను. రక్షణ హోం శాఖ కార్యదర్శులను అర్ధరాత్రి అపరాత్రి సమ యాల్లో కూడా ముఖ్య విషయాల్లో ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయి. వారి స్పందన కూడా సమస్యల పరిష్కారానికి అనుకూలంగా ఉండేది. నేడు కేరళ వరదలు ఎదుర్కోవడంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయని అనుకోవటానికి అవకాశాల్లేవు. వివాదమంతా ఆర్థిక సాయం గురించే! ఇక ఎటొచ్చి సమస్యంతా ఆర్థిక సహాయం గురించే. విపత్తుల నివారణకు, నిర్వహణకు కావాల్సిన ఆర్థిక సదుపాయాలకోసం విధి విధానాలను ఆర్థిక సంఘాలు నిర్దేశిస్తాయి. 2005 విపత్తుల నిర్వహణ చట్టం తర్వాత వచ్చిన 13, 14 ఆర్థిక సంఘాలు ఈ అంశంపై దృష్టి పెట్టి విపత్తు నిర్వహణకు కేంద్ర స్థాయిలో, రాష్ట్రస్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ఎస్, డీఆర్ఎఫ్ అనే రెండు నిధులను ఏర్పాటు చేశాయి. కేంద్రం కొన్ని ప్రత్యేక డ్యూటీల ద్వారా కేంద్ర స్థాయి నిధికి వనరులు సమీకరిస్తోంది. అదనంగా బడ్జెట్ నుంచి అవసరాన్నిబట్టి కేటాయిస్తోంది. రాష్ట్రస్థాయి నిధికి ఈ కేంద్ర నిధి నుంచే ఆర్థిక సంఘం నిర్ణయించిన విధంగా నిధుల కేటాయింపు జరుగుతుంది. 14వ ఆర్థిక సంఘం ముందు ఎన్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం 75 శాతం, రాష్ట్రాలు 25 శాతం భరించేవి. 14వ ఆర్థిక సంఘం కేంద్రం 90 శాతం, రాష్ట్రాలు 10 శాతం భరించేటట్లు నిర్ణయించింది. 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన అవార్డును అనుసరించి 2015 –20 మధ్య వివిధ రాష్ట్రాలకు కేంద్రం నుంచి విపత్తుల నిర్వహణకు రూ. 55 వేల కోట్ల కేటాయింపులు జరి గాయి. గత సంవత్సరాల్లో విపత్తు నిర్వహణలో రాష్ట్రాలు పెట్టిన ఖర్చు ఆధారంగా ఈ కేటాయిం పులు జరిగాయి. ఇది శాస్త్రీయ విధానం కాదని గుర్తించి విపత్తుల సూచికను రాష్ట్రాలవారీగా తయా రుచేయాలని 14వ ఆర్థిక సంఘం అభిలషించింది. ఇది కష్టసాధ్యమైన విషయంగా గుర్తించి అంతకు ముందు విపత్తులపై రాష్ట్రాలు చేసిన ఖర్చులను కొలబద్దగా తీసుకుని రాష్ట్రాలకు కేటాయింపులు చేశారు. ఇందువల్ల ఇంతకుముందు ఉపద్రవాలు ఎదుర్కొన్న రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు జరి గాయి. ఉదాహరణకు ఈ ఐదేళ్ల కాలంలో అంటే 2015 నుంచి 2020 దాకా కేంద్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి రూ. 2,186కోట్లు మధ్యప్రదేశ్‌కు రూ. 4,363 కోటు,్ల మహారాష్ట్రకు రూ. 7,376కోట్లు కేటా యించగా, కేరళకు ఈ ఐదేళ్లలో ఈ నిధి కింద కేటాయింపు రూ. 919 కోట్లు మాత్రమే. ఇంతకు ముందు సంవత్సరాల్లో కేరళలో ఉపద్రవాలు లేనం దువల్ల అవి ఉన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ రాష్ట్రానికి కేటాయింపులు తక్కువే జరిగాయి. అందు వల్ల ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనడానికి కేరళ ఎక్కువ ఆర్థిక సహాయం అడగటానికి హేతుబద్ధమైన ప్రాతి పదిక ఉంది. ఎక్కువ కేటాయింపులు జరిగిన రాష్ట్రాల్లో ఉపద్రవాలు రానప్పుడు కేటాయించిన నిధులను వెనుకకు తీసుకునే వెసులుబాటునూ 14వ ఆర్థిక సంఘం కల్పించినట్టు లేదు. అలాంటి వెసు లుబాటు ఉంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద అదనపు భారం పడకుండా ఖర్చు కాని రాష్ట్రాల నుంచి ఈ నిధులను కేరళ లాంటి రాష్ట్రానికి మళ్లించే అవకాశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం కనుక 15వ ఆర్థిక సంఘం అయినా ఈ అంశంపై దృష్టి సారిస్తే బాగుంటుంది. ఏదైనా విపత్తు సంభ వించినప్పుడు ప్రధానమంత్రి విపత్తు ప్రాంతాలు పరిశీలించి ప్రకటించే సాయం తాత్కాలికమైనది. పూర్తి సహాయాన్ని నిపుణుల బృందం వచ్చి పరిశీ లించాక నిర్ధారిస్తారు. వెంటనే నిర్వహించవలసిన రక్షణ, సహాయ కార్యక్రమాలకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం లేదు. విదేశీ సాయంపై అధికారం కేంద్రానిదే విదేశీ సహాయం విషయాల్లో ఈ అంశాల్లో నిర్ణయా« ధికారాన్ని విపత్తుల నివారణ ప్రణాళిక కేంద్రప్రభు త్వానికి వదిలేసింది. విదేశీ సహాయం తీసుకోవడం ద్వారా ఒక రాష్ట్రానికి అధిక సాయం లభిస్తే మరో సారి ఇంకో రాష్ట్రానికి తక్కువ సహాయం జరిగి సహా యక చర్యల్లో వ్యత్యాసాలు వచ్చే అవకాశముంది. ఇలాంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకో లేదు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు విదేశీ సాయం లేనప్పుడు ఎలా దాన్ని ఎదుర్కోవాలో ఆలోచించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి అంశాలన్నిం టిని సమగ్రంగా పరిశీలించి జాతీయ విపత్తులకు విదేశీ సహాయం తీసుకోలేదు. అదే సంప్రదాయాన్ని ఈనాడు ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించాక కొనసాగించడానికి నిర్ణయించినట్టుగా కనిపిస్తోంది. యూఏఈ ప్రభుత్వం నుంచి వస్తుందనుకున్న సహాయం ఊహా పరమైనదేనని తెలిసిపోయింది. కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి చాలా అనుభవజ్ఞులు. పై అంశాలేవి వారికి తెలియనివి కావు. ఈ పై అంశాల దృష్ట్యా వారు చేసిన వ్యాఖ్యలు సహేతుకమైనవి కావ నిపిస్తోంది. మరికొందరు ఉత్తర, దక్షిణ భారత అంశాలను ప్రస్తావించి దక్షిణాది రాష్ట్రాల విష యంలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. విధి విధానాలను అనుసరించి జరిగే విపత్తుల నివా రణ నిర్వహణ కార్యక్రమాలను ఈ కోణంలో చూడ టం దురదృష్టకరం. నిజం చెప్పాలంటే ఇలాంటి విపత్తే తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి ప్రాంతా ల్లో వస్తే దేశం ఇంత నిశితంగా చూసి ఉండేది కాదు. సహాయ సహకారాలు అంతంతమాత్రంగానే ఉండి ఉండేవి. కారణం ఆ రాష్ట్రాల వెనుకబాటుతనం. సమర్థ నాయకత్వ లోపం. దక్షిణాది రాష్ట్రాల్లో పరి స్థితులు వేరు. భవిష్యత్తులో తమ సమస్యలను స్పష్టంగా వినిపించగల, సాధించుకోగల సమర్థ నాయకత్వాలు కలిగిన దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల కన్నా ఈ విషయాల్లో ముందే ఉంటాయి. వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ‘ iyrk45@gmail.com ఐవైఆర్ కృష్ణారావు -
బాండ్ల విక్రయంతో నష్టమే తప్ప లాభం లేదు: ఐవైఆర్
అమరావతి: రాజధాని బాండ్ల విక్రయంతో ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణా రావు పేర్కొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..బ్యాంకు వడ్డీ కంటే అధికంగా చెల్లిస్తామని విక్రయాలు చేపడుతున్నారని...దీని వల్ల ప్రజలపై భారీగా భారం పడే అవకాశముందన్నారు. షేర్ మార్కెట్లో ఓవర్ సబ్‌స్రైబ్ మంచిదే కానీ బాండ్ల విక్రయంలో మంచిది కాదన్నారు. రూ.60 వేల కోట్లతో ఎలక్షన్ ఇయర్లో టెండర్లు పిలవడం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై భారీగా భారం పడుతుందన్నారు. బాండ్ల ద్వారా వచ్చేదంతా అప్పే అవుతుందని, మళ్లీ రీయింబర్స్మెంట్ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రజలపై భవిష్యత్‌లో పెద్దభారం పడుతుందని అంచనా వేశారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి, అధిక వడ్డీ చెల్లించినపుడు స్పందన బాగా ఉంటుంది.. ప్రస్తుతం రాష్ట్ర స్థూల వార్షిక ఆదాయం 29 శాతం ఉంది..బాండ్ల ద్వారా వచ్చే రూ.60 వేల కోట్ల అప్పుతో ఆదాయంలో అప్పు శాతం 29 నుంచి 35 శాతానికి పెరుగుతుందని వెల్లడించారు. దీని వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోతుందని, ప్రజలపై మరింత భారం పడే అవకాశముందన్నారు. మహానగర వ్యామోహం అనేది రాష్ట్రానికి గుదిబండగా మారనుందని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం వరకు అయితే రూ.5 వేల కోట్లు సరిపోతాయని స్పష్టం చేశారు. -
తిరుమలపై ఆధిపత్య రాజకీయం
ఎవరైనా కార్యక్రమాలు సరిగా నిర్వహించకపోయినా, సంస్థ ప్రయోజనాలకు నష్టం కలిగేలా ప్రవర్తించినా వారిపై చర్య తీసుకొనే అధికారం టీటీడీకి, ఆ సంస్థను శాసించే ప్రభుత్వానికి ఎప్పుడైనా ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో రమణ దీక్షితులు ప్రవర్తనలో లోపాలుంటే తగిన చర్యలు తీసుకోవచ్చు. దాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. కానీ ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తినపుడు వాటికి సమాధానం ఇవ్వకుండా, న్యాయపరమైన అధికారాలను పరిశీలించకుండా చర్యకు ఉపక్రమించడం దారుణం. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన అంశానికి పూర్తి భిన్నంగా ఎందుకు చర్య తీసుకున్నదీ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాచీన తమిళ సాహి త్యంలో వడ వెంగడం (ఉత్తర దిశగా ఉన్న పర్వ తం)గా అభివర్ణించిన తిరుమల క్షేత్రం చాలా పురాత నమైంది. ఎందరో రాజులు, ఎన్నో రాజవంశాల ఆద రణ ఈ హిందూ దేవాలయానికి లభించింది. వైష్ణవ మతాన్ని అభిమానించిన యాదవ రాజుల కాలంలో, విజయనగర రాజుల పాలనలో∙ఇది వైష్ణవ క్షేత్రంగా రూపుదిద్దుకుంది. రామానుజాచార్యులు ఏర్పరచిన విధి విధానాలను అనుసరించి ఈనాటికీ ఆలయ నిర్వహణ జరుగుతోంది. రామానుజాచార్యులు తిరుమల ఆలయం దర్శించకముందే ఇక్కడ కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ఆయన వాటిని స్థిరీక రిస్తూ తిరుమలలో మరికొన్ని కొత్త విధానాలు ప్రవేశపెట్టారు. ఆయన ఆమోదం పొందిన రెండు ప్రధాన సంప్రదాయాలైన సన్నిధి గొల్ల అర్చక వ్యవస్థ, సన్నిధి గొల ్లఅర్చకత్వ కైంకర్యం తిరుమల ఆలయం ఏర్పడిననాటి నుంచీ ఉన్నాయి. విష్ణుమూర్తి శేషాచలం కొండల మీద ఒక పుట్టలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఓ ఆవు పాలను పుట్టలోకి విడవడం, అది గమనించిన పసు లకాపరి ఆవును అదిలించబోతే ఆ కర్ర విష్ణుమూర్తికి తగులుతుంది. ముందు కోపంతో శపించబోయిన విష్ణుమూర్తి ఆ యాదవుని ప్రార్థన మన్నించి తాను ఆ క్షేత్రంలో వెలసినప్పుడు ప్రథమ దర్శనం కలిగే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆ విధంగా ఏర్పడిన కైంకర్యమే సన్నిధి కైంకర్యం. నాలుగు కుటుంబాలకు అర్చకత్వం గోపీనాథ్ అనే అర్చకునికి వెంకటేశ్వరస్వామి కలలో కనిపించి తన విగ్రహం గురించి వివరించడంతో ఏర్పడిన కైంకర్యమే అర్చక కైంకర్యం. గోపీనాథ్ వార సులుగా ప్రకటించుకున్న నాలుగు కుటుంబాలవారు తిరుమల క్షేత్రంలో వైఖానస ఆగమ పద్ధతిలో అర్చ కత్వం నిర్వహిస్తున్నారు. ఈ కుటుంబాల ఇంటి పేర్లు పెద్దింటి, గొల్లపల్లి, తిరుపతమ్మ, పైడిపల్లి. ఈ రెండు అతి ప్రాచీన కైంకర్యాలే కాకుండా రామానుజాచా ర్యులు పన్నెండో శతాబ్దంలో ఆకాశగంగ నుంచి స్వామివారి కార్యక్రమాలకు జలాలు తెచ్చే కైంక ర్యాలు తన మేనమామ అయిన తిరుమలనంబికి అప్పగించారు. అదేవిధంగా తిరుమలక్షేత్రంపై ఉద్యానవనాన్ని నిర్వహించి స్వామివారిసేవకు పుష్పాలు సమర్పించే సౌకర్యాన్ని తన ప్రియశిష్యుడైన ఆనందాళ్వార్కు అప్పగించారు. అదేవిధంగా ఆలయాల్లో కైంకర్యాలు సక్రమంగా జరిగేటట్టు చూడటానికి, అర్చకులకు సహాయపడటానికి రామానుజులవారు జీయర్ వ్యవస్థను కూడా ఏర్పాటుచేశారు. కాలక్రమేణా ఈ కైంకర్యాల సంఖ్య 56కు పెరిగింది. ఇందులో పూల దండలు కట్టే యమునోతరి కైంకర్యం నుంచి ముగ్గు వేసే కైంకర్యం వరకు ఉన్నాయి. ఆర్జిత సేవల్లో వచ్చే ఆదాయాల్లో భాగాలు కేటాయించడం ద్వారా ఈ కైంకర్యాలు మిరాశీలుగా రూపొందాయి. ఈమిరాశీ విధానాన్ని 1986 దేవాదాయ చట్టం ద్వారా రద్దు చేశారు. ఈ మిరాశీ వ్యవస్థ రద్దయ్యే దాకా ఈ నాలుగు కుటుంబాల వారు వంతులుగా రెండు సంవత్సరాలకు ఒక కుటుంబం చొప్పున పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఒక విధంగా ఈ విధానానికి ఉడుపి శ్రీకృష్ణుని ఆలయ నిర్వహణకు పోలిక ఉంది. అక్కడ మఠాలు వంతుల ప్రకారం ఆలయ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఇక్కడ కుటుంబాలు వంతుల వారీగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించే విధానం ఏర్పడింది. మిరాశీ వ్యవస్థ రద్దుతో ఈ వంతుల విధానం పోయి ఈ నాలుగు కుటుంబాల నుంచి నలుగురు పెద్దవారిని ప్రధానార్చకులుగా నియ మించే పద్ధతి అమల్లోకి వచ్చింది. ఈ విధానం కొనసాగుతున్న సమయంలో 2007లో వైఎస్ రాజ శేఖరరెడ్డి ప్రభుత్వం ఈ చట్టానికి సవరణ తెచ్చి ఈ కైంకర్యాలకు వారసత్వ హక్కులు పునరుద్ధరించింది. ఆదాయంలో వాటా కల్పించే మిరాశీ విధానాన్ని మాత్రం పునరుద్ధరించలేదు. కేవలం ఈ చట్ట సవ రణ ద్వారా వారసత్వ హక్కులు మాత్రమే గుర్తిం చారు. ఇక ప్రస్తుతం ప్రధాన అర్చకుల్లో ఒకరైన ఏవీ రమణ దీక్షితులు చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని అంశాలను లేవనెత్తడం, వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు 65 సంవత్సరాలు నిండాయనే నెపంతో ఆయనతో పాటు మరికొంత మంది ప్రధాన అర్చకులను తొలగించడం తెలిసిందే. అర్చకులకు ఎన్నికల హామీని మరచిన టీడీపీ తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు ప్రారంభించినపుడు కొన్ని వర్గాలను పార్టీ చారిత్రకంగా దూరం చేసుకుందనీ, వారిని మళ్లీ ఆకట్టుకోవడానికి ప్రత్యేక కృషి అవసరమని పార్టీ లోని మేధో వర్గం భావించింది. తదనుగుణంగా పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపకల్పనలో ఈ వర్గాలను దగ్గర చేసుకోవడంపై దృష్టి సారించారు. ఈ క్రమం లోనే తెలుగుదేశం మేనిఫెస్టోలో ఒక పేజీ బ్రహ్మణ సామాజిక వర్గానికి కేటాయించారు. ఈ సామాజిక వర్గ సమస్యలను వివరంగా ప్రస్తావించిన ఈ పేజీలో ఒక ప్రధాన అంశంగా అర్చకుల విషయం పొందు పరచారు. అందులో ఏడో ప్రధాన అంశంగా ‘దేవా లయ పూజారులకు పదవీ విరమణ ఉండద’ని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోని ఈ వాగ్దానం చది వారో లేదోగాని అంతవరకు ఓటు వేయటానికి ఆసక్తి చూపని ఈ సామాజికవర్గానికి చెందిన అనేక మంది ఉత్సాహంతో తెలుగు దేశం పార్టీకి ఓటు వేయడానికి ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాక తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి భిన్నంగా అర్చకుడు 65 ఏళ్లకు మించి కైంకర్యం నిర్వహించే హక్కు లేదని ప్రకటించారు. ఒక వంశంలో ప్రధాన అర్చకుడుగా ఒకరే ఉంటే మిగిలిన వారికి అవకాశం ఎలా వస్తుం దనే కోత్త అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చారు. ఫలితంగా అర్చకుల మధ్య కీచులాటలు మొదల య్యాయి. దీనికంతటికీ కారణం రమణ దీక్షితులు పత్రికా సమావేశంలో కొన్ని అంశాలను ప్రస్తావించడమే. లేవనెత్తిన అంశాల్లో కొన్ని గంభీరమైనవి. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. ఆ పనిచేయకుండా రమణ దీక్షితులుపై ఎదు రుదాడి ప్రారంభించారు. ఎవరైనా కార్యక్రమాలు సరిగా నిర్వహించక పోయినా, సంస్థ ప్రయోజనా లకు నష్టం కలిగేలా ప్రవర్తించినా వారిపై చర్య తీసు కొనే అధికారం టీటీడీకి, ఆ సంస్థను శాసించే ప్రభు త్వానికి ఎప్పుడైనా ఉంటుంది. సాధారణ పరిస్థి తుల్లో రమణ దీక్షితులు ప్రవర్తనలో లోపాలుంటే తగిన చర్యలు తీసుకోవచ్చు. దాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కాని ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తినపుడు వాటికి సమాధానం ఇవ్వకుండా, న్యాయపరమైన అధికారాలను పరిశీలించకుండా చర్యకు ఉపక్రమిం చడం దారుణం. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన అంశానికి పూర్తి భిన్నంగా ఎందుకు చర్య తీసుకున్నదీ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవాదాయ శాఖ అధికార యంత్రాంగం తిరుమల తప్ప మిగిలిన అన్ని దేవా దాయాలపై అక్కడి ధార్మిక వ్యవస్థ సిబ్బందిపై పూర్తి ఆధిపత్యాన్ని గత 30–40 ఏళ్లలో సాధించింది. పూర్తి ఆధిపత్యం చిక్కని క్షేత్రం తిరుమల తిరుమల అనువంశిక అర్చక వ్యవస్థలో విషయ పరి జ్ఞానం కలిగి, అధికారుల నియంత్రణకు పూర్తిగా దాసోహం అనకుండా నిలబడగలిగిన అర్చకులు రమణ దీక్షితులు. మిగిలిన వారికి ఆయనకున్న శక్తి సామర్థ్యాలు లేవు. ఆయన తొలగింపుతో తిరుమల క్షేత్రాన్ని చంద్రబాబు నాయుడు తన అనుకూల అధి కారగణం సాయంతో అప్రతిహతంగా ఏలవచ్చు. పదవీ విరమణ అనే అంశం తిరుమల కన్నా చిన్న దేవాలయాలకు చాలా ప్రధాన సమస్య. సరైన ప్రత్యామ్నాయాన్ని ఆలోచించకుండా 1986 దేవాదాయ చట్టం ద్వారా అనువంశిక ధర్మకర్తలను తొలగించడం, ఈనాములను రద్దు చేయడం, వారసత్వ హక్కులను తీసేయడం జరి గింది. దీనితో చిన్న దేవాలయాల పరిస్థితి దారు ణంగా తయారైంది. అనువంశిక ధర్మకర్తల స్థానంలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా దేవస్థాన పాలక మండలులు ఏర్పాటు చేసి వాటి పెత్తనం కింద అర్చకుడిని పెట్టారు. ఇక దేవాదాయ, ధర్మాదాయ శాఖను విస్తరించి అధికారుల అజమాయిషీ పెంచారు. వీరందరి కిందా ఆదాయం లేని, జీతాలు చాలని అర్చక, ధార్మిక సిబ్బంది నలిగిపోతున్నారు. విచిత్రమేమిటంటే సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రకారం దేవాలయానికి వచ్చే ఆదాయంలో మొదట అర్చ కులు, ధార్మిక ఉద్యోగుల జీతాలు భరించాలి. అయితే ఆచరణలో ముందు లౌకిక ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికే ఆదాయం ఉపయోగిస్తున్నారు. ఈ వాస్తవాన్ని ప్రశ్నించేవారే కనిపించడం లేదు. అర్చకులకు, ధార్మిక సిబ్బందికి అక్కడ సంభావన ఇవ్వడానికి ఏమీ మిగలడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా రూపొందించినదే ముసాయిదా ప్రభుత్వ ఉత్తర్వు 76. అర్చకులకు, ఇతర ధార్మిక సిబ్బందికి పదవీ విరమణ లేకుండా చేయడానికి ప్రభుత్వ ఉత్తర్వు రూపొందించారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోని అంశాలకను గుణంగానే దేవాలయాల నిర్వహణపై రూపొందిం చిన ఉత్తర్వు ఇది. కానీ ఈ ప్రభుత్వం ఈ ముసా యిదా ఉత్తర్వుకు పురిటిలోనే సంధి కొట్టింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించడా నికి నాలుగేళ్లుగా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు రమణ దీక్షితులు వివాదం రావడంతో ఒక నెలలో ముసా యిదా ఉత్తర్వు అంశం పరిష్కరిస్తామని అస్మదీయ ప్రసార మాధ్యమాల ద్వారా లీకులు ఇచ్చారు. ఉత్తర్వు ఇవ్వదల్చుకుంటే ఒక్కరోజులో పని. ఇది ప్రాథమిక ప్రకటన తర్వాత అభ్యంతరాలు తెలిపే గడువు ముగిసి ఏడాది దాటినా ఉత్తర్వు వెలువడ లేదు. ఇప్పటికైనా ఈ ఉత్తర్వును వెంటనే జారీ చేస్తే ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపే వారిలో నేను ప్రథముడిగా ఉంటాను. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
అమరావతి–ఎవరి రాజధాని?
ఇటీవల రాజకీయ వర్గాలలోనూ, సోషల్ మీడియాలోనూ వార్తల్లో ఉన్న పుస్తకం శ్రీ ఐ.వై.ఆర్.కృష్ణారావు రాసిన ‘‘అమరావతి – ఎవరి రాజధాని?’’. ఈ పుస్తకం మార్చి–2018లో ప్రచురితమైంది. రాజధాని నగరానికి అంతకుముందే పునాదులుపడ్డాయి, భవనాలు వెలిశాయి, కార్యాలయాలు పనిచేయడం మొదలుపెట్టాయి. ఈ సందర్భంలో ఈ పుస్తకం రావడం గత జల సేతుబంధనమేనా (వెళ్ళిపోయిన నీటికి ఆనకట్ట కట్టడం) అనే భావన పాఠకుల మనస్సులో మెదిలే అవకాశం ఉంది. అంతమాత్రమే అయితే పుస్తకానికి చారిత్రక విలువ మాత్రమే ఉంటుంది. కానీ అందులో మిగతా అంశాల్ని ప్రస్తావించారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో ఏవిధంగా సమతౌల్యం సాధించాలి అనే విషయాన్నీ, ఇప్పటికైనా ప్రభుత్వం కొన్ని తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలి అని చెప్పారు. అంతేకాక వాస్తవాల్ని తెలుసుకునే అధికారం ప్రజలకు ఉందన్న ఉద్దేశం రచయితది. వివిధ దేశాల్లో రాజధానులు ఎలా ఏర్పడ్డాయి, ఎలాంటి ప్రాతిపదికల్ని విశ్లేషించి నిర్మిం చారు అన్న విషయంపై రచయిత పరిశోధన చేశారు. భౌగోళిక ఉనికి, అన్ని ప్రాంతాలకూ ఆమోదయోగ్యంగా ఉండటం, ఏ ప్రాంతానికీ, వర్గానికీ అక్రమ లాభాన్ని చేకూర్చకుండా ఉండటం, భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాలుండటం మొదలైన వాటిని పరిగణనలో తీసుకుని రాజధాని నగరాల్ని ఎన్నుకుంటారు. చారిత్రక నేపథ్యాన్నీ, మిగతా దేశాల్లో అనుభవాన్నీ, మనదేశంలో మిగతా నగరాల అనుభవాన్నీ మొదటి ఐదు అధ్యాయాలలో రచయిత అందించారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రాష్ట్రాన్ని ఇచ్చిన సందర్భంలో ఉన్న ఆలోచనావిధానం 2014లో ప్రభుత్వం మారగానే పూర్తిగా మారింది. శివరామకృష్ణన్ కమిటీ ఎన్ని అడ్డంకుల్నీ, సహాయ నిరాకరణను ఎదుర్కొని తమ నివేదిక అందించిందీ ఇందులో చూడగలం. అయినప్పటికీ ఆ కమిటీ ఇచ్చిన స్పష్టమైన నివేదికను పూర్తిగా తృణీకరించి తమదైన శైలిలో నిర్ణయాన్ని తీసుకోవడం అప్రజాస్వామికంగా జరిగిందని రచయిత అభిప్రాయం. నిజానికి కొత్త రాజధాని ఏర్పాటు వినూత్నంగా ఆలోచించడానికి ఒక గొప్ప అవకాశం. సంకుచిత రాజకీయ, వర్గ, వ్యాపార ప్రయోజనాల్నీ ఎంచుకున్నందువల్ల వినూత్నంగా ఆలోచించే అవకాశాన్ని ప్రభుత్వం ఎలా కోల్పోయిందీ ఈ పుస్తకంలో పలుచోట్ల చూడగలం. ప్రభుత్వం మారిన వెంటనే రాజధాని నగరాన్ని ప్రభుత్వ మోతుబరి పెద్దలే ఎలా నిర్ణయించారు అని పుస్తకం వివరిస్తుంది. సంబంధిత వర్గాలతోనూ, ప్రతిపక్ష పార్టీలతోనూ ఏ సంప్రదింపులూ జరగలేదని రచయిత అభిప్రాయం. ఎన్నికల ముందు చేసిన ప్రభుత్వ అధ్యయనాలన్నింటినీ పక్కన ఉంచి కొత్త ప్రభుత్వం ఏకపక్షమైన నిర్ణయం తీసుకుని ఒక ప్రాంతానికీ, ఒక వర్గానికీ లాభదాయకంగా ఉండేట్టు పనిచేసిందని రచయిత వివరించారు. ప్రభుత్వ యంత్రాంగానికంతటికీ అధిపతిగా ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల్లో అధికారులు ఎలా నిస్సహాయంగా ఉంటారో రచయిత స్పష్టంగా చెప్పారు. ఉద్యోగంలో చేరినపుడు ప్రభుత్వాధికారులు రాజ్యాంగానికీ, రాజ్యాంగ విలువలకూ కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారు. రాజకీయనాయకులు కూడా ఇలాంటి ప్రమాణమే చేస్తారు. అయినా అధికార యంత్రాంగానికీ, అధికార పార్టీకీ అభిప్రాయభేదాలు వస్తూంటాయి. ఇద్దరూ ప్రజల సంక్షేమాన్ని గూర్చి మాట్లాడినా రాజకీయ వర్గాలకు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ మారుతున్న రాజకీయ వర్గాల గూర్చి రచయిత ‘కాంట్రాక్టర్ క్లాస్ నాయకులు’( p.76) అని నిర్మొహమాటంగా చెప్పారు. రాజధాని నగరాన్ని ఎన్నుకోవడం ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని మరొకచోట (p.81) పేర్కొన్నారు. పట్టణ నిర్మాణ రంగంలో వస్తున్న మార్పుల్నీ, కొత్త ఆలోచనల్నీ ఈ పుస్తకం వివరిస్తుంది. గ్రీన్ ఫీల్డ్ సిటీ (పొలాల స్థలంలో కొత్త పట్టణాలు తయారుకావడం) అనే ప్రయోగం మనదేశంలోనే కొన్నిచోట్ల విఫలమైన విషయాన్ని ఇందులో చూస్తాం. అలాగే భూమి సేకరణ (land pooling) చేయాల్సిన విధానం, చేసిన విధానం రెంటినీ రచయిత విశ్లేషిం చారు. బెదిరింపులు, ఊహాలోక నిర్మాణం అనే ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం భూసేకరణ చేయడం విచారకరమైన విషయం. తరతరాలుగా వచ్చిన భూముల్ని, తాము ఎంతో ప్రేమగా చూసుకున్న భూముల్ని వదులుకోవడంలో రైతులు ఎంత మానసిక క్షోభను అనుభవించారో రచయిత (p.90) వివరించారు. గొప్ప నైతిక రాజ్యంగా అందరూ భావించే సింగపూర్ లాంటి దేశాలు విదేశవిధానాల్లో ఎంత అనైతికంగా ఉంటాయి అన్నది అందరికీ తెలి యని విషయం. సింగపూర్ డొల్లతనాన్ని కూడా (p.94) రచయిత వర్ణించడాన్ని చూడగలం. ఎవరి రాజధాని? అనే ప్రశ్నతోనే ఇది ప్రజల రాజధాని కాదని స్పష్టంగా చెప్పారు. రచయిత ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కావడం వల్ల వారికి విషయాలపై పూర్తి అవగాహన, పూర్తి సమాచారం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి పంపకం ఉండాలని రచయిత సూచించారు. ప్రజాసమస్యలపై ఆలోచించే ప్రతి పౌరుడూ, విద్యార్థులూ అందరూ చదవాల్సిన పుస్తకమిది. కేవలం వర్గ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని రాజధానిపై నిర్ణయాలు తీసుకున్నారని ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ఇద్దరు ప్రముఖులూ తెలపడం కూడా గమనించదగింది. కె. అరవిందరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ -
ప్రజాధనం కాదు ప్రజలపై భారం..!
ప్రజాధనంతో ప్రజా రాజధాని అనే పేరిట 3.5. 2018 నాడు నేను రాసిన వ్యాసానికి 8.5.2018 నాడు సాక్షి దినపత్రికలో సీఆర్డీఏ జాయింట్ డైరెక్టర్ శ్రీని వాస్ వివరణ ఇచ్చారు. దానిపైన నాస్పందన ఇక్కడ పొందుపరుస్తున్నాను. గ్రీన్ ఫీల్డ్ మహా నగర నిర్మాణం వ్యాపారపరంగా లాభసాటికరమైన కార్యక్రమం కాదని అందుచేత దీనికోసం అప్పులు చేస్తే అప్పులను తీర్చే భారం ప్రజల మీద పడుతుందనేది నా వ్యాసంలోని ప్రధాన అంశం. సీఆర్డీఏ వారు పేర్కొన్న ఉదాహరణలు పూర్తిగా పోల్చడానికి వీలులేనివి. ఈ సందర్భంగా బొంబాయి నగరానికి దగ్గరగా ఉన్న బాంద్రా కుర్ల కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రజల నుంచి బాండ్ల రూపంలో వనరులు సేకరించడాన్ని ఉదాహరిం చారు. ముంబై చాలా అభివృద్ధి చెందిన నగరం. దాని పరిసర ప్రాంతాలైన బాంద్రా కుర్ల ప్రాంతాల్లోని భూమి ధరలు సహజంగానే ఎక్కువ ఉంటాయి. అటువంటి ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలకు టౌన్‌షిప్‌లు నిర్మించటానికి బాండ్ల రూపంలో ధనాన్ని సేకరిస్తే దానిని తిరిగి అక్కడ జరిగే వాణిజ్య కార్యక్రమాల ద్వారా తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. కానీ అమరావతి ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా మనం రూపొందిస్తున్నాం. కృత్రిమంగా ఈనాడు నెలకొన్న భూమి ధరలు శాశ్వతంగా ఉండే అవకాశం లేదు. అటువంటి ధరలను ఆధారం చేసుకుని ప్రణాళిక రూపొందించుకోవడం భవిష్యత్తులో సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఆ చుట్టుపక్కల జరిగే వాణిజ్య కార్యక్రమాలను అనుసరించి కానీ అమరావతిలో ఈనాడు జరుగుతున్న కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని కానీ అటువంటి ధరలు దీర్ఘకాలంలో కొనసాగే అవకాశాలు కనిపిం చటం లేదు. ఈ స్థితిలో ఈ ప్రణాళిక లాభసాటిగా లేనప్పుడు దీని ద్వారా వచ్చే లాభాలతో అప్పులు అవకాశం చాలా తక్కువ. అప్పుడు ఈ భారం పన్నుల రూపంలో ప్రజల మీద పడే పడుతుంది. ఈ విధంగా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులుగా మహానగర నిర్మాణాలు చేసిన దేశాలలో ఆర్థికపరమైన ఒడుదుడుకులు సంభవించాయి. ఉదాహరణకు బ్రెజిల్ దేశంలోని రాజధాని నిర్మాణ కార్యక్రమం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దివాలాకు కారణమైంది. ఆ దేశంలో సైనిక పరిపాలనకు దారి తీసింది. ఊహించని ఆర్థిక వనరులు ఉన్న ఉన్న నైజీరియా, మలేషియా లాంటి దేశాలు మాత్రమే పెట్రోల్ ఆదాయాన్ని మహా నగర నిర్మాణానికి ఉపయోగించి ఆర్థిక ఒడుదుడుకులను తట్టుకోగలిగాయి. కాబట్టి బాంద్రా కుర్ల కాంప్లెక్స్ ఉదాహరణలు చూపించి అమరావతి నగర నిర్మాణానికి ప్రజల నుంచి బాండ్ల ద్వారా వనరుల సేకరణను సమర్థించుకోవటం పొరపాటు. ఇక రెండో ఉదాహరణ ఎన్టీపీసీ లాంటి వాణిజ్య సంస్థలు. ఈ వాణిజ్య సంస్థలలో వాణిజ్య పరమైన లావాదేవీలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అటువంటి కార్యక్రమాలకు వారు వనరుల సేకరణ బ్యాంకుల ద్వారా సేకరించవచ్చు బాండ్ల రూపంలో ప్రజల నుంచి కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న రుణాలను వాణిజ్యపరమైన కార్యక్రమాల ద్వారా వచ్చే లాభాల నుంచి మాత్రమే తిరిగి చెల్లిస్తారు. రుణాల సేకరణకు వెళ్ళకుండా ప్రజల ద్వారా బాండ్లను స్వీకరించటంలో ఆర్థిక సంస్థలకు కొంత వెసులుబాటు ఉన్నది అనేది వాస్తవం. కేంద్ర ప్రభుత్వ అనుమతితో కొన్ని పన్ను రాయితీలు ప్రకటించటం ద్వారా మౌలిక సదుపాయాల బాండ్ల ద్వారా వనరులు సేకరించవచ్చు. కానీ ఏదైనా వాణిజ్యపరంగా లాభసాటి అయిన కార్యక్రమానికి మాత్రమే ఈ వనరుల సేకరణ జరిగినప్పుడు తిరిగి చెల్లించే బాధ్యత కూడా ఆ సంస్థ పైనే ఉంటుంది. వాణిజ్యపరంగా లాభసాటి కానప్పుడు తప్పకుండా ఈ భారం పన్నుల రూపంలో ప్రజల మీద పడుతుంది. అమరావతి నిర్మాణానికి ఇటువంటి బాండ్ల రూపంలో ప్రజల నుంచి వనరులు సేకరించిన తిరిగి వాటిని తీర్చే బాధ్యత పన్నుల రూపంలో ప్రజల మీద పడే అవకాశం ఉన్నది. ఒక గ్రీన్‌ఫీల్డ్ నగరం వాణిజ్యపరంగా లాభదాయకంగా నిర్మించిన దాఖలాలు ఎక్కడా లేవు. అలాంటి ప్రయత్నాలు జరిగిన చోట అనూహ్యమైన వనరులు ఉంటే తప్పితే ఆర్థిక సంక్షోభాలు చోటుచేసుకున్న దాఖలాలే కనిపిస్తాయి. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
సీమలో హైకోర్టు ఎందుకు పెట్టరు ?
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. ఆదివారం అనంతపురం లలిత కళా పరిషత్తులో అభివృద్ధి వికేంద్రీకరణ-రాయలసీమ లో హైకోర్టు అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాల్సిన బాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కోస్తాలో రాజధాని ఏర్పాటు చేసినప్పుడు, రాయలసీమలో హైకోర్టు ఎందుకు పెట్టరని ఆయన ప్రశ్నించారు. అధికార వికేంద్రీకరణ, సామాజిక న్యాయంపై రాజకీయ పార్టీలు వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని అని, దానివల్లే పారిశ్రామిక రాయితీలు వస్తాయని ఐవైఆర్ అన్నారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల విధానం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. బెంగళూరు-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల సీమకు ఎంతో ప్రయోజనం జరుగుతుందని, వెంటనే ఈ డిమాండ్‌ను కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు లక్ష్మణ్ రెడ్డి, రంగారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డు జడ్జి కృష్ణప్ప, జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్షణ్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగులు పాణ్యం సుబ్రమణ్యం, గోవిందరాజు, గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ పద్మ పాల్గొన్నారు. -
అమరావతి జన రాజధాని కానే కాదు
కొమ్మినేని శ్రీనివాసరావుతో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు రాష్ట్రంలోని మూడు విభిన్న ప్రాంతాల ఆమోదం పొందేలా చైతన్యవంతంగా ప్రయత్నాలు చేయకపోతే అమరావతి ప్రజారాజధాని అయ్యే అవకాశాలు లేవని విభజనానంతర ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కుండబద్దలు కొట్టారు. రాజధాని గురించి ప్రశ్నిస్తేనే రాష్ట్ర ద్రోహివి అంటూ ఎదురు దాడులకు దిగితే పరిష్కారం లభించదని, ఒక నిర్దిష్ట వర్గం తప్పితే మిగతా సామాజిక వర్గాలేవీ అమరావతిని ఎందుకు తమ సొంతం చేసుకోలేదనే అంశంపై ప్రభుత్వం, పాలకులు ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఆలోచనలు, నిర్ణయాలూ వాస్తవికతా ప్రాతిపదికన జరిగి ఉంటే విభజన చట్టంలో పొందుపర్చిన అధికారిక భవనాలన్నీ కేంద్రం ఇచ్చిన రూ. 2,500 కోట్లతో ఇప్పటికే కట్టేసి ఉండవచ్చు కానీ లక్షకోట్ల వ్యయంతో ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నిర్మాణం అనే భ్రమల్లో మునిగితేలుతున్నందువల్లే అక్కడ నాలుగేళ్ల తర్వాత కూడా ఒక శాశ్వత నిర్మాణమూ చోటు చేసుకోలేదన్నారు. తటస్థత, ఉమ్మడి అభిప్రాయం పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించదలిచిన అమరావతి నిర్మాణం భవిష్యత్తులో పలు సమస్యలను ఎదుర్కోక తప్పదంటున్న ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకం రాశారు. ఎవరి రాజధానిగా ఉంది? పుస్తకం శీర్షికలోనే ప్రశ్నను వదిలాను కదా. కొన్ని ప్రధాన అంశాలను ఆ పుస్తకంలో లేవనెత్తాను. వాటిపై చర్చ జరగాలన్నది నా అభిమతం. ఆ శీర్షికే సమాధానాన్ని సూచిస్తోంది. ఏ అంశంమీదైనా దాని నేపథ్యం తెలిసినవాళ్లు మాట్లాడితే అది మంచి ట్రెండ్‌ని సెట్ చేస్తుంది అనే ఉద్దేశంతో రాశాను. అమరావతిపై మీకున్న ప్రధానమైన అభ్యంతరం ఏమిటి? రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాజకీయ, సాంస్కృతిక, పాలనాపరంగా ఏకీకృత స్వభావంతో ఉంటుంది. అదే ఆంధ్రరాష్ట్రం విభిన్నత్వం ఉండే ప్రదేశం. ఆంధ్రలో ఎవరు రాష్ట్ర పాలన చేసినా ఈ వైవిధ్యతను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే దీర్ఘకాలంలో రాష్ట్రానికి ఇబ్బంది అని నా ఆలోచన. రాజధాని ప్రాంతంతో సహా అన్ని విషయాల్లో దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ప్రక్రియను అనుసరించకుండా 2014లో నిర్ణయం తీసుకున్నారు. ప్రక్రియ అంటే ఇక్కడ విస్తృత స్థాయి చర్చ, దాంట్లో చాలామందిని భాగస్వామ్యులను చేయడం, ఈ వ్యత్యాసాలను చైతన్యవంతంగా పరిష్కరించే క్రమంలో వెళ్లడం. ఆ క్రమం జరగలేదు. రాజధానిగా ఈ ప్రదేశం సరైనదా కాదా అనే సాంకేతిక పరిశీలన అసలు చేయలేదు. అన్నిటికంటే ముఖ్యమైనది. దేశంలో, ప్రపంచంలో వివిధ రాజధానుల నిర్మాణాలను, వారి అనుభవాలను పరిశీలించినప్పుడు వాటితో పోల్చుకుంటే ఏపీ రాజధానికి సంబంధించి ఈరోజు జరుగుతున్న తప్పులు ఎలాంటి పరిణామాలకు దారితీయవచ్చు అనే చట్రాన్ని పెట్టుకుని అధ్యయనం చేశాను. థియరీ ప్రకారం రాజధానికి సంబంధించి కొన్ని పాజిటివ్, కొన్ని నెగటివ్ అంశాలున్నాయి. వెనుకబడిన ప్రాంతాల్లో రాజధాని ఏర్పర్చాలని అంతర్జాతీయ అనుభవం చెబుతోంది. ఆ రకంగా చూస్తే రాయలసీమలో రాజధాని పెట్టడం చాలా సబబుగా ఉండేది. ఇక నెగటివ్ అంశం ఏదంటే మన తెగ ఉన్న చోటే రాజధాని పెట్టుకోవాలనుకోవడం. వాళ్లకే పరిమితమై. మిగిలినవాళ్లతో సంబంధం లేకుండా ఉండే రాజధాని పెట్టుకోవాలనుకోవడం. ఇలాంటి వాటికి దీర్ఘకాలంలో మనుగడ తక్కువ. దీని ప్రకారం అమరావతి తటస్థ రాజధాని కాదు. చర్చ జరిగి ఏకాభిప్రాయం కుదిరి, అన్ని ప్రాంతాల అంగీకారంతో ఏర్పడిన రాజ ధాని కాదు అమరావతి. అందుకే ఇది తటస్థ రాజధాని కాదు. అమరావతి రాజధానిగా ఉండటంలో అభ్యంతరాలేమిటి? సానుకూల అంశాల ప్రాతిపదికన అమరావతిని రాజధానిగా ఎన్నుకున్నట్లు కనపడదు. కాగా.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధానిని పెట్టవద్దని ఎవరూ అనటం లేదు. విశాల దృక్పథంతో చర్చించి పెట్టవచ్చు. కానీ కీలకమైన అంశం ఏదంటే, స్టడీ చేయకుండా దేశంలో ఏర్పాటు చేసిన ఒకే ఒక రాజధాని అమరావతి. ఆఫ్రికా ఖండంలో తమ జాతి, తమ తెగ ఉన్నచోట రాజధానిని పెట్టుకుని వారే లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లే అమరావతి విషయంలో కూడా జరిగిందని ఒక సంశయం. అంటే ఒక సామాజిక వర్గానికి ఎక్కువ లాభం చేకూరేలా పెట్టారనా? అవును. ఒక వర్గానికే ఎక్కువ ప్రయోజనం వచ్చేలా చూసుకున్నారు. అంటే కమ్మ కులానికి అధిక లాభం చేకూరేలా చేశారనేనా మీరంటున్నారు? అంత దూరం పోవలసిన అవసరమేంటి? ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. రాజధాని అంశంలో చాలా కుంభకోణం జరిగిందని వైఎస్సార్సీపీ ఆరోపణ? ఈ ఆరోపణల లోతులోకి నేను వెళ్లను కానీ అప్పటికే రియల్ ఎస్టేట్, వాణిజ్య ప్రయోజనం ఏర్పడి ఉన్న చోటే రాజధానిని పెట్టారని చెప్పగలను. ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడానికి అదే కారణమని చెప్పవచ్చు. రైతులు పూలింగ్ కింద భూమిని ఎలా ఇచ్చారు? వారికి లాభం జరిగిందా? నిర్దిష్టంగా స్టడీ చేసి మిగిలిన ప్రాంతాల్లో దీని ప్రభావాలు ఎలా ఉంటాయన్నది పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలకు వస్తే దీర్ఘకాలంలో దాని పర్యవసానాలు ఎలా ఉంటాయనేదానికి అమరావతి ఒక ఉదాహరణ. దేశంలో ఒక గుజరాత్‌లోనే ల్యాండ్ పూలింగ్ విజయవంతంగా జరిగింది. గుజరాత్లో జరిగిన భూ సేకరణ అంతా చిన్న చిన్న ఏరియాల్లో అంటే వంద ఎకరాల లోపు స్థలాల్లో మాత్రమే చేశారు. అది కూడా పట్టణ ప్రాంతాల్లోనే చేశారు. మౌలిక వసతులు పెంచితే మీ భూములకూ విలువ పెరుగుతుందని చిన్న చిన్న ప్రదేశాల్లో ఉన్నవారికి నచ్చచెప్పడమే కాకుండా వారి వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేశారు. ఈ ప్రయోగాన్ని గుజరాత్లో మరొక చోట పెద్ద ఎత్తున చేయడానికి ప్రయత్నం చేశారు. బొంబాయి–ఢిల్లీ పారిశ్రామిక కారిడార్‌లో ఒకరోడ్డు అభివృద్ధి చేయడానికి 20, 30 వేల ఎకరాల భూమిని పూలింగ్ కింద తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేశారు. 2006 నుంచి 2016 వరకు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. పూర్తిగా విఫలమైంది. మరి ఏపీలో 30 వేల ఎకరాల పూలింగ్ చేసేశామని చెప్పుకున్నారు కదా? రామచంద్రయ్య గారు ఈ అంశంపై ఈపీడబ్ల్యూలో నిర్ధిష్టంగా రెండు వ్యాసాలు కూడా రాశారు. ల్యాండ్ పూలింగ్ ఎలా జరిగిందో ఆయన వివరించారు. పెద్దపెద్ద రైతులు, ఎవరి పిల్లలైతే అమెరికాలోనో మరే దేశంలోనో సెటిలై ఉన్నారో, ఇక మళ్లీ వ్యవసాయానికి తిరిగి రారు అని నిర్ధారించుకున్నారో అలాంటి వారిని అందరినీ కో ఆప్ట్ చేసుకున్నారు. మీరు భూములు గనుక ఇస్తే ఇంత విలువకు పెరిగిపోతాయని, కోటీశ్వరులైపోతారని భ్రమల్లో పెట్టి తీసుకున్నారు. అలా దారికి రానివారిని కాస్త భయపెట్టడం కూడా జరి గింది. ఇబ్బంది పెట్టారు. పంటలు తగులబెట్టారు. ఇవన్నీ రామచంద్రయ్య గారు క్షేత్ర పరిశోధన ద్వారా తెలుసుకుని చెప్పిన అంశాలు. దీనంతటికీ నేపథ్యం ల్యాండ్ ఆక్యుపేషన్. నువ్వు గనుక పూలింగ్‌లో భాగంగా భూమి ఇవ్వకపోతే, నీ భూమిని ఆక్రమించేస్తాం అని బెదిరించడం అన్నమాట. 32 వేల ఎకరాలను ఆ ఏరియాలో భూసేకరణ చేయాలంటే అంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు. కానీ ఆ భూ సేకరణ అనే కత్తిని చూపించి పని జరిపించేశారు. పైగా మీరు భూములు ఇవ్వకపోతే అవి గ్రీన్ బెల్ట్ కింద పోతాయి అని భయపెట్టారు కూడా. అయినా సరే కొంతమంది రైతులు తమ భూములు ఇవ్వలేదు. ఇంకా పోరాడుతూ ఉన్నారు. ఏదేమైనా ఎక్కువ మంది ఇచ్చేశారు. పూలింగ్ వరకు అయింది. ఏపీలో జరిగిన భూ సేకరణ దేనికి? రాజధాని కోసం కాదు. మహానగరం నిర్మాణానికి తీసుకున్నారు. మహానగరం తక్షణం నిర్మించడం సాధ్యమా? సాధ్యం కానప్పుడు, ఇంత భూమిని సేకరించారు కనుక తన భూమికి ఎంత వస్తుందనే అంచనాలు రైతులు కలిగి ఉంటారు. వారి భూములకు విలువ రావాలంటే అంత మేరకు ఆర్థిక కార్యాచరణ జరగాలి. అది కూడా అతితక్కువ కాలంలో రావాలి. కానీ అది 50 ఏళ్లకు వస్తుంది. కానీ తక్కువ సమయంలో 32 వేల ఎకరాల భూమిలో అంత అధికంగా ఆర్థిక కార్యాచరణ తీసుకురావడం సాధ్యపడే విషయం కాదు. దీనివల్ల భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పరిపాలనా రాజధానిని కట్టి దాన్ని మహానగరంగా పరిణతి చెందడానికి వదిలేయడం ఒక ఐచ్ఛికం. రెండు మూడేళ్లలో మహానగరం కావాలని అనుకోవడం సరైన మోడల్ కాదు. కట్టాలి అనే ఆశావాదం మంచిదే కానీ అది వాస్తవికంగా ఉండటం అవసరం. లక్షకోట్లతో రాజధాని అని బాబు చెప్పడం జనాల్ని మోసం చేయడం కాదా? కేంద్ర వార్షిక బడ్డెట్ 22 లక్షల కోట్లు. దీంట్లో లక్ష కోట్లు అంటే దాదాపు 5 శాతం. ఒక రాష్ట్రానికి కాదు ఒక రాజధానికి లక్ష కోట్లు ఇస్తారనుకోవడం రియలిస్టిక్ కాదు. ఎన్నికల మ్యానిఫెస్టోను, వాగ్దానాలను ఆధారంగా చేసుకుని ఫలితాలను అంచనా వేసుకోవడం తప్పు. భారత ప్రభుత్వం ఇవ్వాళ ఏపీ రాజధానిపైన వాస్తవ ప్రాతిపదికనే స్పందిస్తోంది. మోదీ సమాధానం చెప్పాలన్నది కరెక్టే. కానీ ఎంత వస్తుంది, ఎంత ఇస్తుంది అనేది వాస్తవికంగా ఉండాలి. చట్టంలో ఏదయితే ఉందో ఆ మేరకే కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉంది. అంతకు మించి రాదు. లక్షకోట్ల రాజధాని అసలు సాధ్యమే కాదు. కేంద్రం ఇచ్చిన మొత్తాన్ని తాత్కాలిక భవనాలకు ఖర్చుపెట్టేశామంటున్నారే? తెలంగాణలో ఇప్పుడు పెరేడ్ గ్రౌండ్స్‌లో శాశ్వత సచివాలయం కడతామంటున్నారు. దాని ఖర్చు అంచనా రూ. 180 కోట్లు. ఈ స్థాయిలోనే మన ఆలోచనలు కూడా ఉండి ఉంటే విభజన చట్టంలో పొందుపర్చిన అధికారిక భవనాలన్నీ కేంద్రం ఇచ్చిన రూ. 2,500 కోట్లతో ఇప్పటికే కట్టేసి ఉండవచ్చు. అంతే కానీ రాజధానికి లక్షకోట్లు అవసరమే లేదు. మన రాజధాని సఫల రాజధాని అవుతుందా విఫల రాజధాని అవుతుందా? పరిపాలనా రాజధానిగా చేస్తే సక్సెస్ అవుతుంది. రాజధాని గురించి ప్రశ్నిస్తేనే రాష్ట్ర ద్రోహివి అనే అరోపణలకు, ఎదురు దాడులకు దిగితే పరిష్కారం లభించదు. ఒక వర్గం తప్పితే మిగతా వర్గాలేవీ అమరావతిని ఎందుకు తమ సొంతం చేసుకోలేదు అనే అంశంపై ప్రభుత్వం ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అమరావతిని రాష్టంలోని అన్ని ప్రాంతాలూ, ప్రజలూ, ఇతర సామాజిక వర్గాలూ తమ సొంతంగా భావించే పరిస్థితి ఈ రోజుకయితే లేదు. రాజ ధానిపై చర్చను ఎవరు స్వీకరిస్తున్నారు, ఎవరు మొరటుగా దాడి చేసే స్వభావంతో స్పందిస్తున్నారు అని పరిశీలిస్తే చాలు రాజధానిని ఎవరు సపోర్టు చేస్తున్నారో, ఎవరు వ్యతిరేకిస్తున్నారో అర్థం అయిపోతుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చూస్తే చాలు తెలిసిపోతుంది. ఈ రాజధాని కొందరి రాజధానా, ప్రజా రాజధానా? థియరీ ప్రకారం రాజీ ధోరణితో తటస్థ ప్రాంతంలో ఏర్పర్చిన రాజధాని కాదు అమరావతి. వెనుకబడిన ప్రాంతాన్ని మనతోపాటు తీసుకుపోదామని ఎంచుకున్న ప్రాంతం కాదు. సానుకూలం కంటే ప్రతికూల అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చైతన్యవంతంగా ప్రయత్నాలు చేయకపోతే అమరావతి ప్రజా రాజధాని అయ్యే అవకాశాలు లేవు. ఇక తక్షణం మహానగర నిర్మాణం ఆచరణ సాధ్యం కానే కాదని నా స్పష్టమైన అభిప్రాయం. (ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకుల్లో..) https://bit.ly/2GO13S5 / https://bit.ly/2HqbHv4 -
ఎవరి రాజధాని అమరావతి పుస్తకావిష్కరణ
-
వితండవాదమే ఒక విధ్వంసం
విశ్లేషణ విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా నష్టపోయినది– హైదరాబాద్ మహా నగరం. ఆ నగరం ద్వారా వచ్చే ఆదాయ వనరులు. నిజానికి ఈ మహా నగరాన్ని అంతా కలసి నిర్మించుకున్నాం. ఇంతకు మించి రాష్ట్రానికి జరిగిన నష్టం ఏదీ లేదు. ఈ నష్టానికి కూడా పూర్తిగా కాకపోవచ్చు, కానీ ఎంతో కొంత కేంద్రం నుంచి పరిహారం వచ్చింది. విభజనతో నష్టం, కేంద్రం సహాయ నిరాకరణ అంటూ అవే విషయాలను, విమర్శలను పదే పదే ప్రస్తావిస్తూ దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని పాకులాడడం సరికాదు. గుంటూరు జిల్లా కాకానిలో ఈమధ్య జరిగిన ఒక బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి వైదొలగకపోయినా, కేంద్ర మంత్రిమండలి నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులూ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేలూ రాజీనామాలు సమర్పించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశమనే చెప్పాలి. కొందరు వ్యక్తులు, సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని లెక్కలు చూపించమని అడుగుతున్నాయనీ, కానీ అది సాధ్యం కాదనీ, అడగడం సరికాదనీ ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా సార్వభౌమాధికారం కలిగిన వ్యవస్థలేనని ఆయన వాదన. ఒకవేళ దేని గురించి అయినా సమాధానమో, వివరణో ఇవ్వవలసి వస్తే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కూ, రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకూ సమాధానం చెప్పుకోవాలని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. అంతేతప్ప ఇంకెవరికీ జమాఖర్చులు చెప్పవలసిన అవసరం లేదని భాష్యం చెప్పారు. అంతేకాదు, రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదనీ, దీనితో ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం వాటిల్లిందనీ అంటూ, ఇందువల్ల పంజాబ్, అస్సాం రాష్ట్రాల తరహాలో వెళితే ఆంధ్రప్రదేశ్ మరింతగా నష్టపోక తప్పదని కూడా చంద్రబాబు విశ్లేషించారు. అసలు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోకుండా, దానికి బదులు నవ నిర్మాణదీక్షా దినాన్ని జరుపుకోవడం వెనుక ఆర్థిక పరిస్థితులే ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. అంతేకాకుండా, రాష్ట్రానికి న్యాయం జరగని పక్షంలో విభజన శక్తులు విజృంభిస్తాయని పార్లమెంట్ సభ్యుడొకరు హెచ్చరిక వంటి వ్యాఖ్య కూడా చేశారు. పైగా ఆ ఎంపీ ముఖ్యమంత్రికి సన్నిహితునిగా పేర్గాంచారు కూడా. ఆ వ్యాఖ్యలు అవాంఛనీయం దేశంలో ఒక అనుభవజ్ఞుడైన రాజకీయవేత్తగా, ముఖ్యమంత్రి పదవిని చిరకాలం నిర్వహించిన వ్యక్తిగా పేరున్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలలోని ఔచిత్యాన్ని చర్చిద్దాం. వ్యక్తులకు, సంస్థలకు ప్రభుత్వాలు లెక్కలు చూపించవలసిన అవసరం లేదన్నది చంద్రబాబు చేసిన మొదటి వ్యాఖ్య. ఇలా భావించడం సహేతుకమే. సరైనదే కూడా. సమాచార హక్కు చట్టం కిందనే అయినా కూడా, ఇవ్వవలసిన సమాచారం కన్నా ఎక్కువ సమాచారాన్ని ఏ ప్రభుత్వమూ అటు ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు ఇవ్వవలసిన అవసరం లేదు. ఆ చట్టం పరిధి మేరకు ప్రజలు కావలసిన సమాచారాన్ని ప్రభుత్వం నుంచి పొందవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులకు సంబంధించి వినియోగ పత్రాలను (యుటిలైజేషన్ సర్టిఫికెట్) సమర్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద మాత్రం ఉంది. ఈ బాధ్యత నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన వెసులుబాటు, మినహాయింపు లేవు. రాష్ట్రాలలో చేపట్టవలసిన కొన్ని పథకాలు, ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్టంగా కొన్ని నిధులు వస్తాయి. ఆ నిధులు ఎలా ఖర్చు చేసినదీ లెక్క చెప్పవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇది ఆర్థిక క్రమశిక్షణలో కీలకమైన అంశం. రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తి, సార్వభౌమాధికారం కలిగిన వ్యవస్థలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కానీ ఒకటి. రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలంటే ఎవరికీ పేచీ ఉండదు. కానీ అవి సార్వభౌమాధికారం కలిగిన వ్యవస్థలు కావని మాత్రం గుర్తించాలి. ఏ దేశంలో అయినా రక్షణ, విదేశీ వ్యవహారాలను నిర్వహించే కేంద్ర ప్రభుత్వానికే సార్వభౌమాధికారం ఉంటుంది. చంద్రబాబు భావనలోని సార్వభౌమాధికార వ్యవస్థ చాలా కఠినమైన నిబంధనలతో రూపొందించిన అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా లేదు. రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా, అశాస్త్రీయంగా విభజించారని చంద్రబాబు ఆరోపణ. అందుకు రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లిందని ఆయన అంటున్నారు. అసలు జరిగిన పరిణామాలు, గడచిపోయిన కాలం నేపథ్యంలో ఇలాంటి వాదనలోని సహేతుకత ఎంత? పైగా ఈ అంశాన్ని నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి ఎప్పుడు అవకాశం వచ్చినా జార విడుచుకోకూడదన్నట్టు చర్విత చర్వణంగా ప్రస్తావిస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర విభజన అనే ఆ ‘అశాస్త్రీయ’ పరిణామంలో, అందుకు అంకురార్పణ చేసిన అనేక శక్తులలో ముఖ్యమంత్రిగారి పాత్ర కూడా లేదని చెప్పలేం కదా! ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు పలుకుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా అక్టోబర్ 8, 2006లో చంద్రబాబు రాష్ట్రపతికి లేఖ రాశారు. అందువల్ల రాష్ట్ర విభజన నిర్ణయానికి ఆయన కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. రాష్ట్ర విభజనకు ఆయన కట్టుబడి ఉన్న సంగతి తేలిపోయినప్పుడు, ఇక మిగిలేది ఏమిటి? హేతుబద్ధత లేకుండా, అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారన్న అంశం. బిల్లుకు ప్రతిపాదనలు చేస్తే బాగుండేది పార్లమెంట్లో ప్రవేశ పెట్టదలిచిన బిల్లు ఏదైనప్పటికీ దాని ప్రతులను ముందుగానే సభ్యులందరికీ అందచేస్తారు. అలాగే విభజన బిల్లు ప్రతులు కూడా తెలుగుదేశం సభ్యులందరికీ ముందుగానే అంది ఉంటాయి. మరి, విభజన నిర్హేతుకమన్న అభిప్రాయం కలిగి ఉన్నవారు ఆ బిల్లును అధ్యయనం చేసి, శాస్త్రీయమైన, హేతుబద్ధమైన మార్పులను ఆనాడే ఎందుకు ప్రతిపాదించలేదు? తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు కూడా ఆ బిల్లును క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పరిశీలించి తన పార్టీ సభ్యులకు ఎందుకు తగిన విధంగా దిశా నిర్దేశం చేయలేదు? విభజన బిల్లు పార్లమెంట్లో గందరగోళం మధ్య నెగ్గింది. నిజమే. అయినా కూడా ఆ బిల్లుకు లిఖిత పూర్వకంగా మార్పులూ చేర్పులూ సూచించడానికి పార్లమెంట్ సభ్యులకు చాలినంత సమయం ఉందన్న మాట మాత్రం వాస్తవం. కానీ ఆనాడు రాజకీయ ప్రయోజనాల కోసం వారు మౌనం దాల్చారు. ఇప్పుడుమాత్రం విభజన అశా స్త్రీయం, నిర్హేతుకం అంటూ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ధోరణి వల్ల ముఖ్యమంత్రి విశ్వసనీయతపైనే అనుమానం కలుగుతుంది. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని, పంజాబ్, అస్సాం రాష్ట్రాలకు జరిగిన నష్టాలతో పోల్చడం మరొకటి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఈ తరహా పోలికలు తేవడం సుదీర్ఘ రాజకీయ, పాలన కలిగిన నాయకుల స్థాయికి ఎంత మాత్రం తగదు. అసలు ఈ వ్యాఖ్యలు చంద్రబాబు చేయకుండా ఉంటే బాగుండేది. పంజాబ్, అస్సాం రాష్ట్రాల పరిస్థితికీ, విభజనానంతర ఆంధ్రప్రదేశ్ పరిస్థితికీ పోలికే లేదు. అనాలోచితంగా జరిగిన రాష్ట్ర విభజన వలన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బ తిన్నాయని అభిప్రాయపడడం, భావించడం తప్పు కాదు. కానీ, తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా ఆనాడు విభజనను అంగీకరించిన అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు బాధ్యత వహించవలసిందే. మరొక విషయం. విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అందించవలసిన చేయూత గురించి నాలుగేళ్లుగా రాష్ట్రం తరఫున మంతనాలు సాగించారు. చర్చలు ఫలప్రదంగా జరిగాయని చెబుతూ వచ్చారు. పురోగతి కూడా తృప్తికరంగానే ఉందని చెప్పారు. కానీ మళ్లీ ఇప్పుడు హఠాత్తుగా వేరొక ధోరణి ప్రదర్శిస్తూ పంజాబ్, అస్సాంల స్థితిగతులతో రాష్ట్ర పరిణామాలను పోల్చడం చాలా ప్రమాదకరమైన ఎజెండాను తెర మీదకు తీసుకురావడమే అవుతుంది. ముఖ్యమంత్రితో పాటు, పార్టీలో ముఖ్యునిగా భావించే మరొక ఎంపీ చేసిన వ్యాఖ్యలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల వ్యాఖ్యానాలు పరిశీలిస్తే అవన్నీ దేశ ప్రయోజనాలకు, వాటి స్ఫూర్తికి భిన్నమైన ధోరణులని చెప్పక తప్పదు. ఇక, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడానికి బదులు నవ నిర్మాణ దీక్షను జరుపుకోవడం గురించి కొంచెం. ముఖ్యమంత్రికి అపార పాలనానుభవం ఉంది. కొత్త రాష్ట్రం సమస్యలు, ఆర్థిక సమస్యలు తెలుసు. కానీ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా ఆర్థిక క్రమశిక్షణ కనిపించదు. ఎటు చూసినా హద్దులెరుగని ఖర్చు. వీటిని గమనించకుండా ఇప్పుడు బీద అరుపులు శోచనీయం కాదా! ఇలాంటి ధోరణికీ, ఆ బీద అరుపులకు ఇకనైనా స్వస్తి పలకవలసిన అవసరం చాలా ఉంది. నవ నిర్మాణదీక్ష పేరుతో, హేతుబద్ధత లేకుండా విభజన జరిగిందంటూ కాంగ్రెస్ అనే చచ్చిన గుర్రాన్ని మళ్లీ మళ్లీ బాదుతున్నారు. ఇలాంటి ధోరణితో చల్లారిన మనోభావాలను రెచ్చ గొట్టే యత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ సరికాదు. ఆశావాదంతో అడుగేద్దాం! నిజమే, మనకు 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి సంక్రమించిన ఆంధ్ర రాష్ట్రమే ఇప్పుడు దక్కింది. మళ్లీ ఇందులో భద్రాచలం మినహాయింపు. విభజనకు ముందే దూరదృష్టితో భద్రాచలానికి ప్రత్యేక జిల్లా హోదా కల్పిస్తామని హామీ ఇచ్చి ఉంటే ఆ ప్రాంత వాసులు కూడా ఆంధ్రప్రదేశ్‌తో కలిసేవారు. కానీ రాజధాని సమస్య ఒకటి ఉంది. మళ్లీ ఎక్కడ రాజమండ్రి, కాకినాడ పరుగెత్తవలసి వస్తుందోనని వారు తెలంగాణ వైపు మొగ్గు చూపారు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా నష్టపోయినది– హైదరాబాద్ మహా నగరం. ఆ నగరం ద్వారా వచ్చే ఆదాయ వనరులు. నిజానికి ఈ మహా నగరాన్ని అంతా కలసి నిర్మించుకున్నాం. ఇంతకు మించి రాష్ట్రానికి జరిగిన నష్టం ఏదీ లేదు. ఈ నష్టానికి కూడా పూర్తిగా కాకపోవచ్చు, కానీ ఎంతో కొంత కేంద్రం నుంచి పరిహారం వచ్చింది. విభజనతో నష్టం, కేంద్రం సహాయ నిరాకరణ అంటూ అవే విషయాలను, విమర్శలను పదే పదే ప్రస్తావిస్తూ దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని పాకులాడడం సరికాదు. అందుకు బదులు కొత్త రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసుకోవడానికి ఆశావాదులమై ముందడుగు వేయడం అత్యంత అవసరం. అలాంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది కూడా. ముఖ్యమంత్రికి నా విన్నపం ఏమిటంటే– అక్టోబర్ 1వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుందాం. విశాలాంధ్ర విభజనతోనే నవంబర్ 1 తన ఉనికిని కోల్పోయింది. అక్టోబర్ 1, 1953 నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కర్నూలులో నిర్వహించారు. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే స్ఫూర్తితో ఆశావాదంతో అవతరణ దినోత్సవాన్ని జరుపుకుందాం. నిరాశావాదానికి ప్రతిబింబించే నవ నిర్మాణ కార్యక్రమానికి చరమగీతం పాడదాం. ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని అర్పించిన పొట్టి శ్రీరాములుగారికీ, తన సంపదనంతా త్యాగం చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారికి అప్పుడే నిజమైన నివాళి ఘటించినట్టు అవుతుంది. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి -
ఐవైఆర్‌పై ఆనంద్ సూర్య ధ్వజం
సాక్షి, విజయవాడ : సీఎం చంద్రబాబునాయుడుపై అవాకులు చెవాకులు పేలితే మర్యాద దక్కదని ఐవైఆర్ కృష్ణారావును ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ సూర్య హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ సీఎస్ ఐవైఆర్ తీరు గర్హనీయమైందనీ, మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డిలు మిమ్మల్ని పక్కన పెట్టిన సంగతి మర్చిపోయారా అంటూ విమర్శించారు. ఐవైఆర్ సొంత అజెండాతోనే బ్రాహ్మణ కార్పొరేషన్‌ను భ్రష్టు పట్టించారని, రాజధాని నిర్మాణం, హోదా గురించి మొసలికన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. బ్రాహ్మణులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐవైఆర్ లాంటి కుహానా వ్యక్తులు ఏ వేదికల్లో ఉంటే ఆ వేదికలు అధోగతి పాలవుతాయని ధ్వజమెత్తారు. -
చంద్రబాబు ధోరణిపై ఐవైఆర్ ఘాటు వ్యాఖ్యలు
-
నేను చూసిన ముఖ్యమంత్రుల్లో ఆయన బెస్ట్..
సాక్షి, హైదరాబాద్ : ‘నేను చూసిన ముఖ్యమంత్రుల్లో చెన్నారెడ్డి బెస్ట్. ఆయన సమావేశాలకు వెళ్లాలంటే అధికారులకు ప్రిపరేషన్ తప్పనిసరిగా ఉండేది. యారోగెన్స్‌తోపాటు ఇంటెలెక్చువల్ ఉన్న సీఎం ఆయన’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. సాక్షి టీవీ స్పెషల్ లైవ్ షోలో సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుతో ఆయన మాట్లాడారు. స్విస్ చాలెంజ్ విధానంపై తాను దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఉందని, న్యాయపరిధిలో ఉండటంతో దీనిపై తాను మాట్లాడబోనని అన్నారు. ఏపీకి పరిపాలనా రాజధాని సరిపోతోందని పేర్కొన్నారు. విజయవాడతోపాటు ముఖ్య నగరాల్లో సమాంతర అభివృద్ధి జరగాల్సిన అవసరముందని చెప్పారు. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకరణ సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పరిస్థితి, ఏపీలో పరిస్థితి వేరు అని చెప్పారు. కొన్ని ప్రభుత్వ నిర్ణయాలను తాను విభేదించానని, అందుకే తనను పక్కన పెట్టారని వెల్లడించారు. చంద్రబాబు ధోరణిలో సంకుచితత్వం కనిపించిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజధాని ఎంపికలో కొందరి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. రాయలసీమలో హైకోర్టు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంత తేలిగా వస్తుందని అనుకోవడం లేదని అన్నారు. కేంద్రం దృష్టిలో టీడీపీ ఊడిపోయే ముక్కు అని, ఊడిపోయే ముక్కు బెదిరిస్తే ప్రయోజనం ఉంటుందా అని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ను చూస్తే ఆశ్చర్యం కలిగిందని, అంచనాలకు మించి రూ. 7వేల కోట్లు వస్తాయని చూపారని, రెవెన్యూ లోటు నుంచి సడన్‌గా మిగులు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. బడ్జెట్ అంకెల్లో ఏదో వ్యూహం ఉన్నట్టు కనిపిస్తోందని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. -
జేపీ వ్యాఖ్యలు అభ్యంతరకరం
సాక్షి, హైదరాబాద్ : 'జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ' (జేఎఫ్సీ) సమావేశంలో లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ...‘ఓ ప్రత్యేక ప్రాజెక్ట్ లేదా పథకానికి కేంద్రం నిధులు కేటాయిస్తే ఆ నిధులకు సంబంధించిన లెక్కలను కేంద్రం అడగకూడదని జేపీ అన్నారు. జేపీ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. నిధులు కేటాయించినప్పుడు వాటిని దేనికి ఖర్చు చేశారో, అడిగే హక్కు కేంద్రానికి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా జేఎఫ్సీ విధివిధానాల్లో చేర్చితే అర్థవంతంగా ఉంటుంది.’ అని అభిప్రాయపడ్డారు. -
హైకోర్టు సీమ కనీస హక్కు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయడం కేవలం ఆ ప్రాంతపు అంశం కాదు. ఇది వారి న్యాయబద్ధమైన హక్కు. రాజధాని కోసం కర్నూలును ఎంపిక చేసినప్పుడు, సహజంగానే గుంటూరుకు హైకోర్టు వచ్చింది. ఇందుకోసం ఎవరూ ప్రత్యేకంగా గళం విప్పవలసిన అవసరం రాలేదు కూడా. ఈనాడు హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేసుకోవడమనేది ఒక ప్రాంతీయపరమైన అంశంగానో, కోస్తా ఆంధ్ర ప్రయోజనాలకు వ్యతిరేకమన్న ధోరణిలోనో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎట్టకేలకు హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నది. గత నాలుగు సంవత్సరాలుగా తరలించకుండా అపడానికి ప్రధాన కారణం అక్కడ సరైన భవనాలు లేకపోవడమే. కానీ ఈరోజు అకస్మాత్తుగా విజయవాడలో భవనాలు ఉద్భవించాయి. ప్రభుత్వం తాత్కాలికంగా గానీ, శాశ్వత ప్రాతిపదికపైన గానీ హైకోర్టు కోసం కొత్తగా భవనాలు నిర్మించలేదు. ఇందుకోసం నాలుగు సంవత్సరాలుగా వెతుకుతున్నా కనిపించని అనువైన భవనాలు ఒక్కసారిగా లభ్యమైనాయి. జూన్, జులై కల్లా హైకోర్టు బదిలీ పక్రియ పూర్తిచేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందడుగు వేస్తున్నది కూడా. దీనికి ప్రధాన కారణం–హైకోర్టు విభజనాంశం నాలుగేళ్లుగా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అవసరంగా మారింది. 2019 లోపల హైకోర్టు తరలి రాకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయలేం. ఈ తరుణంలోనే రాయలసీమ మేల్కొనవలసి ఉంది. ఇప్పటికైనా అక్కడి నాయకత్వం కదలి హైకోర్టును సీమలో ఏర్పాటు చేయవలసిన సహేతుకమైన కోరికను వినిపించకపోతే భవి ష్యత్తు తరాలవారు క్షమించరు. ఈ అంశాన్ని అవగాహన చేసుకోవడానికి ఒక్కసారి ఇందుకు సంబంధించిన చారిత్రక నేప«థ్యాన్ని పరిశీలించాలి. ‘శ్రీబాగ్’ స్ఫూర్తి ఏమైనట్టు? 1920లో జరిగిన నాగ్‌పూర్ కాంగ్రెస్ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనితోనే మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగువారిలో ప్రత్యేక రాష్ట్ర ఆశలు చిగురించాయి. వెంటనే పరస్పర అపోహలు, అపనమ్మకాలు బయటపడ్డాయి కూడా. అంతవరకు చారిత్రకంగా ఒక ప్రత్యేక గుర్తింపు గలిగిన తాము, కొత్తగా ఏర్పడబోయే ఆంధ్రరాష్ట్రంలో అల్ప సంఖ్యాకులుగా మిగిలిపోతామన్న అపనమ్మకం రాయలసీమ ప్రాంతీయులలో చోటు చేసుకున్నది. ఈ అపనమ్మకాలను రూపుమాపటానికి 16 నవంబర్ 1937న దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు నివాసం ‘శ్రీబాగ్’(మద్రాస్)లో కోస్తా, రాయలసీమ పెద్దలు సమావేశమై ఒక ఒప్పం దానికి వచ్చారు. ఈ ఒప్పందం మీద రాయలసీమ తరఫున కడప కోటిరెడ్డి, కల్లూరి సుబ్బారావు, సుబ్బరామిరెడ్డి, పప్పూరి రామాచార్యులు సంతకాలు చేశారు. భోగరాజు పట్టాభిసీతారామయ్య, కొండా వెంకటప్పయ్య తదితరులు కోస్తా ఆం్ర«ధ తరఫున సంతకాలు చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు రాయలసీమలో రాజధాని, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని అంగీకారానికి వచ్చారు. అంతేకాదు, ప్రాంతీయ సమతౌల్యాన్ని పాటిస్తూ వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను, సంస్థలను ఏర్పాటు చేసుకోవాలని కూడా అంగీకారానికి వచ్చారు. దాదాపు ఎనభై సంవత్సరాల తరువాత 2014లో శివరామకృష్ణన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ కార్యకలాపాలను, సంస్థలను వివిధ ప్రాంతాలకు వికేంద్రీకరించాలనే సూచించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తాము సూచించిన రీతిలో ఏర్పాటుచేయలేదని సీమ వాసులు మద్రాస్ విశ్వవిద్యాలయంలో భాగంగా ఉండటానికి 1926 నాటికే మొగ్గు చూపిన సంగతిని విస్మరించలేం. రాజధాని ఏర్పాటు– కొన్ని సత్యాలు ఈ చారిత్రక నేపథ్యంలో 1953లో పొట్టి శ్రీరాములు బలిదానం తరువాత జవహర్లాల్ నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. రాజధాని విషయంలో ముందుగానే ఒక అంగీకారానికి రావాలని ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రకాశం పంతులుకు సూచించారు కూడా. నెహ్రూ నుంచి ఈ రకమైన సూచన వెలువడడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. భాషాప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయటం నెహ్రూకు ఇష్టంలేదు. ప్రప్రథమంగా ఆయన అంగీకరించిన భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్రరాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఉన్న వైవిధ్యంతో పాటు రాయలసీమ, కోస్తా ప్రాంతాల మధ్య ఉన్న విభేదాల గురించి కూడా ఆయనకు బాగా తెలుసు. రాష్ట్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే అంశాన్ని వీరు అంత సులభంగా పరిష్కరించుకోలేరని ఆయనకు పరిపూర్ణమైన నమ్మకం. ఒకవేళ నాయకులు రాజ ధాని ఏర్పాటు గురించి ఏకాభిప్రాయానికి రాలేకపోతే భాషాప్రయుక్తరాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడడానికి అవరోధం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం మద్రాసులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. టంగుటూరి ప్రకాశం ఆత్మకథ ‘నా జీవనయాత్ర’లో ఆనాటి పరిణామాలను తెన్నేటి విశ్వనాథం కన్నులకు కట్టినట్టు పొందుపరిచారు (ప్రకాశం ఆత్మకథ చివరి భాగాలను తెన్నేటి విశ్వనా«థం పూర్తి చేశారు). మద్రాసులో ప్రకాశం ఏర్పాటు చేసిన సమావేశంలో కృషక్ పార్టీ నుంచి గౌతు లచ్చన్న, కమ్యూనిస్టు పార్టీ నుంచి నాగిరెడ్డి పాల్గొన్నారు. విశాఖపట్నాన్ని రాజధానిని చేయాలన్న తన ప్రతిపాదనను తెన్నేటి విశ్వనాథం ప్రకాశం సూచనతోనే విరమించుకున్నారు. గోదావరి జిల్లాల నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదు. గుంటూరు, విజయవాడ ప్రాంతం కోసం కమ్యూనిస్టులు పట్టుబట్టారు. తిరుపతిలో రాజధానిని ఏర్పాటు చేయాలనీ, లేకపోతే చిత్తూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలో ఉండిపోయే ప్రమాదం ఉందనీ గౌతు లచ్చన్న గట్టిగా అభిప్రాయపడ్డారు. కడపలోని భవనాల ఫోటోలు చూపి, కడప కోటిరెడ్డి కడపను రాజధానిని చేయాలని పట్టుబట్టారు. రాష్ట్ర ఏర్పాటులో ప్ర«ధాన భూమికను పోషిస్తున్నందువల్ల ఏ ప్రాంతాన్ని అందుకు ప్రతిపాదించ వద్దని నీలం సంజీవరెడ్డిని ముందుగానే ప్రకాశం కోరారు. అన్నిటికీ మించి రాయలసీమ ప్రజాప్రతినిధులందరూ ఒక పిటిషన్ రాసి సంతకాలు చేసి తమ దగ్గర పెట్టుకున్నారు. దాని సారాంశం ఏమిటంటే; రాజధాని రాయలసీమలో పెట్టకపోతే తమ ప్రాంతాన్ని మద్రాసు రాష్ట్రంలోనే ఉంచాలని. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఈ నిర్ణయాన్ని ప్రకాశం పంతులు గారికి వదిలేస్తూ అఖిలపక్షం తీర్మానించింది. ఆయన వారందర్నీ మధ్యాహ్నం 03.00 గంటలకు సమావేశమవుదామని చెప్పి, ఆ వేళకు తిరిగి సమావేశం కాగానే గౌతు లచ్చన్నను కాగితం, కలం తీసుకొని కర్నూలు పేరు రాయమని ఆదేశించారు. ఇట్లా ఆనాడు కర్నూలు రాజధానిగా నిర్ణయమైంది. ఆ నిర్ణయం జరుగకపోతే రాయలసీమ ప్రజాప్రతినిధులు మద్రాసు రాష్ట్రంలో ఉండటానికే మొగ్గుతారని ప్రకాశం గారికి తెలుసు. రాజధాని సమస్య చాలా జటిలమని తెలిసే నెహ్రూ మొదట ఆ అంశం తేల్చుకోవాలని ఆంధ్ర నాయకులకు సూచించారు. వాస్తవానికి రాయలసీమ వాసులు మద్రాసు రాష్ట్రంలో ఉండటానికే మొగ్గు చూపినట్టయితే భాషాప్రయుక్త రాష్ట్రాల విభజనకు పునాది లేకుండా పోతుంది. అది తెలిసిన ప్రకాశం దార్శనికతతో నిర్ణయం తీసుకొని స్వతంత్ర భారతంలో ఆంధ్రరాష్ట్రం తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించడానికి అవకాశం కల్పించారు. తరువాత గుంటూరులో హైకోర్టు ఏర్పాటయింది. ఇప్పుడు అమరావతికి వద్దాం. ఆ నగర నిర్మాణం ఏ రకంగా జరిగిందో పరిశీలిద్దాం. నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు చేయడానికి తగిన సూచనలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ఈ కమిటీ సూచనలు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా రాజధాని నిర్మాణ ప్రక్రియ జరిగిపోయింది. ఇంత చరిత్ర కలిగిన అంశాన్ని, చాలా తేలికగా, వ్యూహాత్మక సర్దుబాట్లతో, చర్చ కూడా లేకుండా ప్రస్తుత రాజకీయ నాయకత్వం అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చర్య వల్ల కోస్తా ప్రాంతానికి కూడా పెద్ద ప్రయోజనం లేదు. ఒక వర్గ స్థిరాస్తి, వాణిజ్య ప్రయోజనాలకు కొమ్ముకాసే విధంగా ఈ రాజధాని నిర్మాణం సాగుతున్నది. అదే మంచి సంప్రదాయం మన దేశంలోనే ఇతర రాష్ట్రాలను పరిశీలించండి! అక్కడ కూడా రాజధాని, హైకోర్టు వేర్వేరు ప్రాంతాలలోనే కనిపిస్తాయి. దాదాపు తొమ్మిది రాష్ట్రాల వారు ఇలా రాజధానినీ, హైకోర్టునూ వేర్వేరు ప్రాంతాలలో నిర్మించుకున్న వాస్తవాన్ని గమనిస్తాం. భారతదేశ సెంట్రల్ ప్రావిన్స్ ప్రాంతంలోని కొన్ని సంస్థానాలను విలీనం చేయగా ఏర్పడినదే మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఈ నేపథ్యాన్ని బట్టే ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగానే ప్రాంతాల మధ్య సరైన అవగాహన కోసం రాజధానిని భోపాల్ నగరంలోను, హైకోర్టును జబల్పూర్లోను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్. ఆ రాష్ట్రానికి రాజధాని లక్నో. కాగా హైకోర్టును అలహాబాద్‌లో ఉంచారు. ఉత్తరాంచల్ రాష్ట్రంలో రాజధాని డెహ్రాడూన్‌లో, హైకోర్టు నైనిటాల్లో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రాజధాని నయా రాయ్‌పూర్‌లో, హైకోర్టు బిలాస్పూర్లోను ఉన్నాయి. మద్రాసు ప్రెసిడెన్సీలోని మలయాళ భాష మాట్లాడే ప్రాంతాలు, ట్రావెన్కోర్ సంస్థానం విలీనం చేయగా ఏర్పడినదే కేరళ. ఈ చిన్న రాష్ట్రానికి రాజధాని తిరువనంతపురంలోను, హైకోర్టు కొచ్చిలోను ఉన్నాయి. సంస్థానాల ఏకీకరణ ద్వారా ఏర్పడిన రాజస్తాన్‌లో కూడా రాజధాని జైపూర్‌లో, హైకోర్టు జోధ్పూర్లోను ఉన్నాయి. గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు తమ రాజధానులను ఎక్కడ ఏర్పాటు చేయాలో చాలాకాలం చర్చించాయి. గుజరాత్, ఒడిశాలకు రాజధానులు గాంధీనగర్, భువనేశ్వర్. వాటి హైకోర్టులు అహమ్మదాబాదు, కటక్‌లలో ఉన్నాయి. ఇటువంటి చారిత్రక సత్యాలను విస్మరించి సంకుచిత దృష్టితో తీసుకోనే నిర్ణయాలు రాష్ట్ర ప్రజల మధ్య అగాధాలు సృష్టిస్తాయి. తరతరాలకు సరి పోయే తలనొప్పులను సృష్టించి పెడతాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయడం కేవలం ఆ ప్రాంతపు అంశం కాదు. ఇది వారి న్యాయబద్ధమైన హక్కు. రాజధాని కోసం కర్నూలును ఎంపిక చేసినప్పుడు, సహజంగానే గుంటూరుకు హైకోర్టు వచ్చింది. ఇందుకోసం ఎవరూ ప్రత్యేకంగా గళం విప్పవలసిన అవసరం రాలేదు కూడా. ఈనాడు హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేసుకోవడమనేది ఒక ప్రాంతీయపరమైన అంశంగానో, కోస్తా ఆంధ్ర ప్రయోజనాలకు వ్యతిరేకమన్న ధోరణిలోనో ఆలోచించాల్సిన అవసరం లేదు. సహజమైన, న్యాయబద్ధమైన (ఆ్చట్ఛఛీ ౌn ఉ్ఞuజ్టీy ఊ్చజీటn్ఛటట) నిర్ణయంగానే స్వాగతించాలి. నాయకులలో ఇటువంటి దార్శనికత లోపిస్తే భవిష్యత్తంతా సమస్యలతో నిండిపోతుంది. వ్యాసకర్త మాజీ ఐఏఎస్ అధికారి, ఐవైఆర్ కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి -
ఆదాయ వనరులైనందునే అపచారాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వాలు ఆలయాలను ఆదాయ వనరులుగా భావిస్తున్నాయని, ఆదాయ మార్గాల అన్వేషణలో ఆలయాల్లో అనేక అపచారాలు జరుగుతున్నాయని రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. విజయవాడ తాంత్రిక పూజల నేపథ్యంలో ఆయన సోమవారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆదాయం కోసం వివిధ రకాల పూజల పేరుతో ఎక్కువ ధరలు వసూలు చేస్తుండటంతో సాధారణ భక్తులు అసంతృప్తికి లోనవుతున్నారని పేర్కొన్నారు. ఆలయాల నిర్వహణలో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్ల హిందూ ధార్మిక సంస్థల సంప్రదాయాలు, సంస్కృతి దెబ్బతింటోందని లేఖలో పేర్కొన్నారు. ఇసుక కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి వంటి వారు టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యాడని, అలాంటి వ్యక్తులు పలువురు టీటీడీ చైర్మన్లుగా ఉన్నారని చెప్పారు. ఏపీపీఎస్సీ ద్వారా దేవాదాయ శాఖలో సిబ్బందిని నియమిస్తుడటం వల్ల ఇతర మతస్తులు కూడా ఈ శాఖలో ఉద్యోగం పొందుతున్నారని ఐవైఆర్ పేర్కొన్నారు. దేవాదాయ శాఖ, ఆలయాల్లో పనిచేసే సిబ్బంది నియామకానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగనందుకే..
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనల ప్రకారం నడుచుకోవడంతో రాష్ట్ర ఎన్నికల మాజీ ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఏ.కే.జ్యోతికి బుధవారం ఆయన లేఖ రాశారు. సొంత రాష్ట్రం నుంచి ఎన్నికల అధికారులుగా నియమితులైన వారు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయకుంటే ఎదుర్కొంటున్న సమస్యలను లేఖలో వివరించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అనుగుణంగా పనిచేయలేదన్న కారణంతో భన్వర్‌లాల్‌పై మూసివేసిన కేసులను తిరగతోడి వేధిస్తున్నారన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులపై వేధింపులకు తానే సాక్షినన్నారు. ప్రభుత్వం దమననీతికి నిదర్శనం 2014 ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేయలేదన్న కారణంతో భన్వర్‌లాల్‌కు పదోన్నతి కల్పించకుండా అదే బ్యాచ్‌కు చెందిన ఇతర అధికారులకు మాత్రం ఇచ్చారని తెలిపారు. సాధారణంగా ప్రమోషన్లకు కేసులు అడ్డంకిగా ఉన్నప్పుడు ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు తగు నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. ప్రభుత్వం తనపై కేసును మూసివేయకుండా చాలా ఏళ్లు పక్కన పెట్టినప్పటికీ భన్వర్‌లాల్ ఎప్పుడూ భయపడలేదన్నారు. తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఈ కేసును ఒక కొలిక్కి తేవటానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని తెలిపారు. ఆ తర్వాత కేసును మూసివేసి భన్వర్‌లాల్‌కు ప్రమోషన్ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పదవీ విరమణ రోజున తిరగతోడటం దమననీతికి అద్ధం పడుతోందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే ఈ అంశంలో జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని, లేదంటే సొంత రాష్ట్రానికి చెందిన క్యాడర్ అధికారులు ఎన్నికల అధికారులుగా పనిచేయడానికి ముందుకురారని ఐవైఆర్ నివేదించారు. ఎన్నికల సమయంలో తమకు అనుకూలంగా పనిచేయని పలువురు అధికారులను ప్రభుత్వం ఎలా పక్కన పెట్టిందో తనకు తెలుసన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఇతర రాష్ట్రాలకు చెందిన క్యాడర్ అధికారులను నియమించాలని ఐవైఆర్ సూచించారు. కాగా పదవీ విరమణ చేసిన రోజునే భన్వర్‌లాల్‌పై ఏపీ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కక్ష సాధింపులో భాగమేనని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల జేఏసీ విమర్శించింది. -
భన్వర్‌లాల్ భయపడలేదు
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనల ప్రకారం నడుచుకోవడంతో రాష్ట్ర ఎన్నికల మాజీ ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఏ.కే.జ్యోతికి బుధ వారం ఆయన లేఖ రాశారు. సొంత రాష్ట్రం నుంచి ఎన్నికల అధికారులుగా నియమితులైన వారు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయకుంటే ఎదుర్కొంటున్న సమస్యలను లేఖలో వివరించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అనుగుణంగా పనిచేయలేదన్న కారణంతో భన్వర్‌లాల్‌పై మూసివేసిన కేసులను తిరగదోడి వేధిస్తున్నారన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులపై వేధింపులకు తానే సాక్షినన్నారు. ప్రభుత్వ దమననీతికి నిదర్శనం 2014 ఎన్నికలప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేయలేదన్న కారణంతో భన్వర్‌లాల్‌కు పదోన్నతి కల్పించకుండా అదే బ్యాచ్‌కు చెందిన ఇతరులకు ఇచ్చారని తెలిపారు. సాధారణంగా ప్రమోషన్లకు కేసులు అడ్డంకిగా ఉన్నప్పుడు ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు తగు నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. ప్రభుత్వం తనపై కేసును మూసివేయకుండా చాలా ఏళ్లు పక్కన పెట్టినప్పటికీ భన్వర్‌లాల్ భయపడలేదన్నారు. తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఈ కేసును ఒక కొలిక్కి తేవడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదన్నారు. ఆ తర్వాత కేసును మూసివేసి భన్వర్‌లాల్‌కు ప్రమోషన్ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పదవీ విరమణ రోజున తిరగదోడటం దమననీతికి అద్ధం పడుతోందన్నారు. -
సీఎంవోను సంస్కరించే ఉద్దేశం ఉందా?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) పనితీరుపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు స్పందించింది. కృష్ణారావు చెబుతున్న విధంగా సీఎంవోను సంస్కరించే ఉద్దేశం ఉందో లేదో తెలియచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. సీఎంవో రాజకీయ కార్యాలయంగా మారిపోయిందని.. దీన్ని సంస్కరించాల్సిన అవసరముందని, పారదర్శకంగా పనిచేసేందుకు ఓ నిర్దిష్ట విధానాన్ని రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఐవైఆర్ ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. -
‘చంద్రబాబు చెప్పింది చేయకపోతే ఇలాగే ఉంటుంది’
-
‘చంద్రబాబు చెప్పింది చేయకపోతే ఇలాగే..’
సాక్షి, హైదరాబాద్ : కాపు కార్పొరేషన్ ఎండి బదిలీపై ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు సోషల్ మీడియాలో స్పందించారు. మీడియాకు లీకులు ఇచ్చి అధికారులను బదిలీ చేయడం చంద్రబాబు వ్యూహంలో భాగమని ఆయన సోమవారం తన ఫేస్బుక్లో పేర్కొన్నారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బ తీసేలా బదిలీలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కాపు కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన అమరేందర్ చాలా మంచివ్యక్తి అని, ఆయనను ప్రభుత్వం పదవి నుంచి తొలగించడం సరికాదన్నారు. అయితే అమరేందర్ ఆ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ, ఆయన ఇప్పటికీ ప్రభుత్వంలోనే ఉన్నారని, అందుకే తాజా పరిణామాణలపై అమరేందర్ నోరు తెరవలేరన్నారు. చంద్రబాబు చెప్పింది చేయకపోతే ఇలాగే ప్రవర్తిస్తారంటూ ఐవైఆర్ మరోసారి ధ్వజమెత్తారు. Kapu Corp MD transfer can be routine.To level allegations leak it to press hit at self esteem then remove typical Cbn strategy. — IYR Krishna Rao (@IYRKRao) 16 October 2017 కాగా ఏపీ కాపు కార్పొరేషన్ కార్యాలయంలో హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే. కార్పొరేషన్ ఎండీగా ఉన్న అమరేందర్‌ను ప్రభుత్వం బాధ్యతల నుంచి తొలగించింది. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు అమరేందర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. అయితే అమరేందర్ ప్రెస్‌మీట్ పెట్టడాన్ని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ అడ్డుకున్నారు. తనకు ప్రెస్‌మీట్ పెట్టుకునేందుకు సీఎంవో నుంచి ఆదేశాలున్నాయని అమరేందర్ చెప్పడంతో తాను కూడా ప్రెస్‌మీట్‌లోనే కూర్చుంటానంటూ రామానుజయ పట్టుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే బయటే ప్రెస్‌మీట్ పెట్టుకుంటానని అమరేందర్ వెళ్లిపోయారు. అనంతరం ఆయన కాపు కార్పొరేషన్ కార్యాలయం వెలుపల ప్రెస్‌మీట్ పెట్టారు. వ్యక్తిగత ద్వేషంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే తనపై కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించారని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనకుందన్నారు. -
చంద్రబాబుకు ఐవైఆర్ కృష్ణారావు లేఖ
హైదరాబాద్ : అర్చకుల వేతనాల్లో కోత విధింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు లేఖ రాశారు. పది వేల వేతనాలను ఐదు వేలకు తగ్గించడం సరికాదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. హిందూ మతాన్ని దెబ్బతీయడానికి బయటి శత్రువులు అక్కర్లేదని, గ్రామాల్లో హిందుత్వం కనిపించకుండా పోవడానికి ఇలాంటి ఆలోచనలు చాలని ఐవైఆర్ తన లేఖలో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం 250 కోట్ల రూపాయలతో ఫండ్ ఏర్పాటయిందని, ఇతర ఆలయాల కంట్రిబ్యూషన్ కలిపితే రూ.500 కోట్లు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఆ నిధులతో అర్చకులకు నెలకు రూ.10 వేల వేతనం ఇవ్వవచ్చని సూచించారు. చినజీయర్ లాంటి ట్రస్టులు తమ అర్చకులకు నెలకు రూ.20వేలు ఇస్తున్నాయని, అలాంటిది అర్చకులకు పదివేల నుంచి వేతనాన్ని ఐదువేలకు తగ్గించాలని ఆలోచించడం సరికాదన్నారు. కాగా ఆదాయం లేని ఆలయాల్లో పనిచేసే అర్చకులు, ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలకు 10వేల రూపాయల కనీస వేతనం అందజేసేందుకు గతంలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. గ్రామీణ ప్రాంత ఆలయాల్లో పనిచేసే అర్చకులు, సిబ్బందికి కనీస వేతనాన్ని సగానికి సగం తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. సర్కార్ నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. -
ఐవైఆర్ కృష్ణా రావుపై అసభ్య పోస్టు..
► డీజీపీకి ఫిర్యాదు చేసిన బ్రాహ్మణ సంఘాలు విజయవాడ : తెలుగుదేశం పార్టీకి చెందిన వెబ్సైట్ లో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఫొటోను అసహ్యంగా పోస్టు చేయడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా, బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్‌గా పనిచేసిన వ్యక్తిని ఇటువంటి పోస్టుల ద్వారా అవమానించడంపై తక్షణం పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పలువురు బ్రాహ్మణ ప్రతినిధులు విజయవాడలోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో ఐజీ మీనాకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారని, కార్పోరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించిన ప్రభుత్వం, ఇప్పుడు అదే సోషల్ మీడియాలో కృష్ణారావుపై వచ్చిన పోస్టులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 48 గంటల్లో ఈ అసభ్య పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఐజీ మీనాను కలిసిన వారిలో బ్రాహ్మణ సంఘాల నేతలు యేలేశ్వరపు జగన్మోహన్ రాజు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ద్రోణంరాజు రవికుమార్, జింకా చక్రధర్ తదితరులు వున్నారు. -
గవర్నర్‌ను కలిసిన ఐవైఆర్ కృష్ణారావు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్, బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్ కృష్ణారావు బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలిశారు. సోషల్ మీడియాలో తనపై పెట్టిన అభ్యంతకర పోస్టులపై ఆయన ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్లో ఐవైఆర్ షేర్ చేసిన పోస్ట్‌లు, తదనంతర పరిణామాలపై కూడా ఆయన..గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. కృష్ణారావును బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి చంద్రబాబు ప్రభుత్వం తొలగించడంపై ఇప్పటికే పలు బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. -
ఐవైఆర్‌పై అవమానకర వేటు
- బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగింపు - కొత్త చైర్మన్‌గా వేమూరి ఆనంద సూర్య నియామకం సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావుకు ఘోర అవమానం జరిగింది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, అర్చక సంక్షేమ సంఘం చైర్మన్ పదవుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అర్థంతరంగా తొలగించింది. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పక్కనపెట్టింది. చైర్మన్ పదవీ కాలం మూడేళ్లు కాగా, ఆయనను కేవలం ఏడాదిన్నర పాటే కొనసాగించింది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో టీడీపీ నేత వేమూరి ఆనంద సూర్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అర్చక సంక్షేమ సంఘం చైర్మన్ పదవి గురించి ఉత్తర్వుల్లో పేర్కొనకపోవడం గమనార్హం. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా చిన్న గుళ్లలోపనిచేసే అర్చకులకు వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలిపే తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని అర్చక సంక్షేమ సంఘం చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్న ఐవైఆర్ కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో టీడీపీ నేతల ప్రమేయం లేకుండా చేయడంతోపాటు టీడీపీ మేనిఫెస్టోలోని హామీలను గుర్తుచేసి, వాటిని అమలు చేయాలని గట్టిగా పట్టుబట్టడం వంటివి ఐవైఆర్‌పై సీఎం చంద్రబాబులో అసహనాన్ని పెంచినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్‌కు నిధుల విషయమై ముఖ్యమంత్రిని కలిసేందుకు ఐవైఆర్ ప్రయత్నించినా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ పెద్దలు అనూహ్యంగా ఐవైఆర్ సోషల్ మీడియాలో పేర్కొన్న కొన్ని పాత పోస్టింగులను తెరపైకి తీసుకొచ్చారు. వాటినే సాకుగా చూపి ఆయనను పదవుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త చైర్మన్ హైదరాబాద్ టీడీపీ నేత: ఐవైఆర్ స్థానంలో బ్రాహ్మణ కార్పొరేషన్ కొత్త చైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన వేమూరి ఆనంద సూర్య హైదరాబాద్ టీడీపీ శాఖలో కీలకంగా పనిచేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన ఆనంద సూర్య ప్రస్తుతం పూర్తిగా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. గత ఎన్నికల్లో మల్కాజ్గిరి, ముషీరాబాద్ అసెంబ్లీ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ కోసం ఆయన ప్రయత్నించారు. -
సీఎం కోసం ఆరు నెలలు తిరిగినా దర్శనం దొరకలేదు
రాజధానిపై చాలా అంశాలున్నాయి.. పుస్తకంగా రాస్తా: ఐవైఆర్ కృష్ణారావు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా తప్పుకొమ్మంటే రాజీనామా చేసేవాడిని సాక్షి, అమరావతి: ఆరు నెలలుగా శతవిధాలా ప్రయత్నించినా ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్ మెంట్ దొరకలేదని, ఈ పరిణామం మనసుకు తీవ్ర బాధ కలిగించినా వెనుకబడిన బ్రాహ్మణ సమాజం ప్రయోజనాల కోసం భరిస్తూ.. పనిచేస్తూ వచ్చానని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్, అర్చక సంక్షేమ సంఘం మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. ఆయన మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌లు, షేరింగ్‌లపై ప్రభుత్వం ఎలాంటి వివరణ అడగలేదన్నారు. అడిగి ఉంటే కచ్చితంగా సమాధానం చెప్పి ఉండేవాడినని వెల్లడించా రు. అయితే, విదేశాల నుంచి కొందరు ఫోన్ చేసి తనను పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యం కలిగించింద న్నారు. నీవే తల్లివి.. నీవే తండ్రివి.. అంటూ భజన చేయడం తన వల్ల కాదని స్పష్టం చేశారు. కృష్ణారావు ఇంకా ఏం చెప్పారంటే... ‘‘నన్ను బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించారని ఇంతకు ముందే టీవీలో చూశాను. తప్పుకొమ్మని అడిగితే వెంటనే రాజీనామా చేసేవాడిని. తొలగించాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వానికి నాకంటే మైలేజీ ఇచ్చేవారు ఉంటే వారికే పదవి ఇచ్చుకోవచ్చు. నేను కోరుకునేది ఒక్కటే. బ్రాహ్మణుల అభివృద్ధి లక్ష్యం దెబ్బతినకుండా పనిచేసే వారికే ఈ బాధ్యతలు అప్పగించాలి. సమర్థులు చాలామంది ఉండొచ్చు. ఇది చాలదు, ఇంకా చేయాలన్న తపన ముఖ్యం. జీతం లేకుండా పనిచేస్తున్నా... ముఖ్యమంత్రిని కలవడానికి గత ఆరు నెలల్లో నాలుగుసార్లు సీఎం పేషీకి వెళ్లాను. అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ పరిణామం బాధ కలిగించినా బ్రాహ్మణ సమాజం కోసం భరించాను. జవాబుదారీతనంతో పని చేయడం లేదంటూ నాపై చేసిన విమర్శలు అవాస్తవం. నాకు కేబినెట్ ర్యాంక్ ఇవ్వలేదు. ఇచ్చామని చెబుతున్నారు. రూ.2 లక్షల జీతం అని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇలా నాపై పెద్ద అభాండాలు వేశారు. నేను జీతం లేకుండా పనిచేస్తున్నా. కొన్ని సౌకర్యాలు మాత్రమే ఉపయోగించుకుంటున్నాను. పెద్ద పోస్టు వదులుకున్నా... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా పదవీ విరమణ చేయగానే నాకు సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ పోస్టు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అది పెద్ద పోస్టు అయినా నేను వద్దన్నాను. మా సమాజానికి(బ్రాహ్మణ) వేరే కార్యక్రమాలు చేయాల్సి ఉందని, అందువల్ల బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే లక్ష్య సాధనకు పట్టుదలతో, ఇష్టంతో పనిచేస్తానని చెప్పా. నా విజ్ఞప్తికి ఒప్పుకునే ఆ పదవి ఇచ్చారు. బ్రాహ్మణ కార్పొరేషన్లో చాలామంది తెలుగుదేశం పార్టీ వారే సభ్యులుగా ఉన్నారు. ఏ సమాచారం ఉన్నా నేను వారికి చెప్పేవాడిని. బ్రాహ్మణ కార్పొరేషన్ సమావేశం సమాచారం టీడీపీ ఎమ్మెల్యేలకు చేరడం లేదని, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు చేరుతోందనేది మరో విమర్శ. కార్పొరేషన్ సమావేశం వివరాలను నేను సమన్వయకర్తలకు పంపుతాను. వారు ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వడం లేదంటే టీడీపీలోనే ఏదో పెద్ద లోపం ఉండి ఉండాలి. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి రుణాలు వైఎస్సార్సీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని ఇంకో విమర్శ చేస్తున్నారు. అలాంటి ఆరోపణలపై నాకు అభ్యంతరాలున్నాయి. టీడీపీ, వైఎస్సార్సీపీ అని ఉంటారా? లబ్ధిదారుల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ అని ఉండరు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి, జన్మభూమి కమిటీల ప్రమేయం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేశాం. బీజేపీ ప్రచారానికి విశాఖకు వెళ్లారని కూడా ఆరోపించారు. గుంటూరులో యడవల్లివారి సత్రం, నెల్లూరులో అయ్యలూరివారి సత్రాన్ని బ్రాహ్మణులకు ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని నేను దేవాదాయ శాఖ మంత్రిని కోరాను. ముఖ్యమంత్రికి ఫైల్ పంపితే పనికాదని, మంత్రి స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాలని చెప్పాను. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళితే ఆ ఫైల్ ఆగిపోతుంది. మంత్రి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే నన్ను విశాఖకు ప్రచారానికి రమ్మని కోరారు. టీడీపీకి బీజేపీ మిత్రపక్షం, పైగా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వారు పిలిచినందున నేను వెళ్లాను. చరిత్రను వక్రీకరిస్తే రాయితీనా? గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వడం సరికాదని పోస్ట్ పెట్టా. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నా. చరిత్రను వక్రీకరించిన సినిమాకు పన్ను రాయితీ ఎలా ఇస్తారు? బాహుబలి చిత్రాన్ని ఎక్కువ షోలు ప్రదర్శించేందుకు అనుమతించడాన్ని కూడా తప్పుబట్టా. టీటీడీ ఈవో పదవిని దక్షిణాది వ్యక్తికి ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్తరాది వ్యక్తిని నియమించాల్సిన అవసరం ఏముందని నాకనిపించింది. ఇవన్నీ కేవలం వారం రోజుల్లో పెట్టిన పోస్టింగ్‌లు, షేరింగ్‌లే. పొలిటికల్ మైలేజీ రావడం లేదని నాపై పెద్ద అభాండం వేశారు. అదేమిటో నాకు అర్థం కావడంలేదు. పొలిటికల్ మైలేజీ అంటే... నీవే తల్లివి.. నీవే తండ్రివి.. అంటూ భజన చేయాలా? అది నావల్ల అయ్యే పనికాదు. టీడీపీకి బ్రాహ్మణ సమాజాన్ని తాకట్టు పెట్టానని నాపై మా వారిలో విమర్శ ఉంది. ప్రతి లబ్ధిదారుడికి ముఖ్యమంత్రి సంతకంతో లెటర్ పంపుతున్నాం. ఇంతకంటే మైలేజీ ఇచ్చే వారుంటే మంచిదే.. పదవి ఇచ్చుకోవచ్చు. పదవులు ఆశించలేదు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఉద్దేశం నాకు లేదు. నాకు అంత అంగబలం, అర్ధబలం లేవు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన నేను ఎమ్మెల్యే కావాలని కోరుకుం టానా? ఎమ్మెల్యే పదవో, ఇంకేదో నేను ఆశించలేదు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. చైర్మన్ హోదా లో నేను జీతమేమీ తీసుకోవడం లేదు. ఏం తప్పు చేశానని నాపై అభాండాలు వేస్తున్నారో తెలియదు. జేసీ, కేశినేని నాని ఏం మాట్లాడినా చర్యలు తీసుకోరు. ఈ విషయంలో నేను స్పందించిన దాంట్లో తప్పేమీ లేదు. జాతీయ స్థాయి నాయకులు సర్పంచ్ స్థాయి దాటలేదని నేను స్పందించా. నాపై రియాక్ట్ అయిన వ్యక్తి ఒక టీడీపీ కార్యకర్త. ఇక ‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్ రవికిరణ్ ఇంటూరి అరెస్ట్ విషయంలో నేను చాలా ఫీలయ్యాను. ప్రజలకు వాస్తవాలు చేరడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజాలు చేరడం లేదు. ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబును లగడపాటి రాజగోపాల్ కలిస్తే తప్పులేదు కానీ, నేను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిని కలిస్తే తప్పా? ఇదేనా పాలసీ? బాపట్లలో శిక్షణ కార్యక్రమం పెట్టేటప్పుడు స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతిని ఆహ్వానించారు. అప్పుడే ఆయనను ఎందుకు పిలిచారని నన్ను ప్రశ్నించారు. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేను పిలవాల్సి ఉంటుందని స్పష్టంగా చెప్పాం. వ్యక్తిగత హోదాలో పిలిస్తే నేను ఎమ్మెల్యే కోన రఘుపతిని కలిశా. రాజధానిపై చాలా అంశాలు ఉన్నాయి. అవి ప్రజలకు తెలియాల్సి ఉంది. అన్ని అంశాలను పుస్తకంగా రాస్తా’’ అని ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. తప్పుడు తేదీలతో జీవో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగిస్తూ ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన జీవో తప్పుల తడకగా ఉంది. తేదీలను తప్పుగా పేర్కొన్నారు. 2017 జూన్ 29వ తేదీన కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరే షన్ ౖచైర్మన్‌గా నియమించినట్లు, ఆ పదవి నుంచి ఆయనను మంగళవారం (2017 జూన్ 20) తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజానికి కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా 2016 జనవరి 29న నియమించారు. -
భజన రాదంటే బలిపీఠానికే!
రూల్ ప్రకారం పనిచేస్తాను, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాను అంటే కృష్ణారావును ఎందుకు ఉండనిస్తారు, ఫేస్బుక్ పోస్టింగ్‌ల కారణం చూపి హడావుడిగా ఇంటికి పంపెయ్యక. ఈ కారణాల ఆధారంగానే కృష్ణారావును తొలగించాలనుకుంటే, ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి మర్యాదగా చెప్తే ఆయనే రాజీనామా చేసి వెళ్లేవారు కదా! అట్లా చేస్తే ఆయన చంద్రబాబు నాయుడు ఎందుకవుతారు? చంద్రబాబు ఇప్పుడు ఎందరి చేతుల్లోనో బందీ. వాళ్లను ఏమీ చెయ్యలేకనే కృష్ణారావు లాంటి వాళ్ల మీద తన ప్రతాపం చూపుతుంటారు. ‘మనం ఫాసిజంలో బతుకుతున్నామా?’ఇదేదో మామూలుగా వినిపించే ప్రశ్న కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఒక ఉన్నత ఐఏఎస్ అధికారి మంగళవారం(20–6–17) మధ్యాహ్నం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల గోష్టి నిర్వహించి వెలిబుచ్చిన ఆవేదన ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి వాతావరణం నెలకొని ఉన్నదో ఇదే స్పష్టం చేస్తున్నది. రాష్ట్రం విడిపోయి, ఆంధ్రప్రదేశ్ వేరు రాష్ట్రం అయ్యాక మొదటి రెండు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు తప్పనిసరిగా ఆందోళన కలిగించే విషయాలే. పదవీ విరమణ అనంతరం రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షుడిగా నియమితులయిన కృష్ణారావును మంగళవారం ఉదయం ఆ పదవి నుంచి తొలగించారు. దానికి కారణం– తన అభిప్రాయాలను స్వేచ్ఛగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించడమే. నిజమే, ఆయన ప్రభుత్వ పదవిలో ఉన్నారు కాబట్టి వ్యక్తిగత అభిప్రాయాలూ, భావాలూ ఉన్నా అణచివేసుకోవాలే తప్ప వెల్లడించడానికి వీల్లేదు. ఈ నిబంధన నుంచి అధికార రాజకీయ పక్షానికి చెందిన నాయకులకు మాత్రం మినహాయింపు ఉంటుంది ఆంధ్రప్రదేశ్‌లో. అదీ అందరికీ కాదు, జేసీ దివాకర్‌రెడ్డి, కేశినేని నాని, బొండా ఉమా, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అయ్యన్నపాత్రుడు తరహా నాయకులకు మాత్రమే ఉంటుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ మనిషికి ఊపిరి కంటే ముఖ్యం, అది సంపూర్ణంగా ఉన్న సమాజమే పురోగతిని సాధించగలదు అన్న వాస్తవం ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పెద్దలకూ, ముఖ్యంగా దాని అధినేత చంద్రబాబునాయుడుకూ అస్సలు పట్టదు. అందుకే ఐవైఆర్ కృష్ణారావు మీద వేటు పడింది. తన ఫేస్బుక్ అకౌంట్లో ప్రభుత్వానికీ, తెలుగుదేశం పార్టీకీ నచ్చని, నష్టం చేసే పోస్టింగ్‌లు పెట్టిన లేదా ఇతరులు పెట్టిన పోస్టింగ్‌లను ఫార్వర్డ్ చేసిన పాపానికి కృష్ణారావు చైర్మన్ పదవి ఊడిపోయింది. సామాజిక వర్గాల మనోభావాలు పట్టవా? కృష్ణారావు పెట్టిన పోస్టింగ్‌లు ఏవి? ఆంధ్రప్రదేశ్‌లో నెలకొని ఉన్న పరిస్థితి మీద తన లేదా తన లాంటి కొందరు ఇతరుల అభిప్రాయాలు– అవి వ్యంగ్యచిత్రాలు కావచ్చు, వ్యంగ్యవ్యాఖ్యలూ కావచ్చు, అలాంటివే అన్నీ. ప్రభుత్వంలో భాగమయిన ఒక కార్పొరేషన్‌కు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి సొంత అభిప్రాయాలు కలిగి ఉండకూడదని నిబంధన ఏమీలేదు. మేము జీతం ఇస్తున్నాం కదా అనవచ్చు, కృష్ణారావు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోవడం లేదు. ఒకవేళ తీసుకున్నా అది ముఖ్యమంత్రి జేబులో నుంచి ఇస్తున్నది మాత్రం కాదు, ప్రజల డబ్బు అన్న విషయం మరిచిపోకూడదు. అసలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకూడదు అన్న నిబంధన ఏమయినా ఉంటే దాన్ని తక్షణం రద్దు చేసి పారెయ్యాలి. అందులోనూ ప్రజలకు నష్టం జరిగే విధంగా ప్రభుత్వం పరిపాలన సాగినప్పుడు, ప్రజల ప్రా«థమిక హక్కులకు భంగం కలిగే విధంగా ఏలికలు ప్రవర్తించినప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ఎవరయినా సరే, ఏ స్థాయి వాళ్లయినా సరే నిలబడి మాట్లాడాల్సిందే. సామాజిక మాధ్యమాలలో చంద్రబాబునాయుడు పరిపాలన తీరుతెన్నుల మీద, అధికార పక్ష పెద్దల వ్యవహార శైలి మీదా వ్యంగ్యచిత్రాలు వేసినందుకు ఇంటూరి రవికిరణ్‌ను అరెస్ట్ చెయ్యడం తప్పు అని భావించారు కృష్ణారావు, భావించి ప్రభుత్వ కొలువులో ఉన్నాను కాబట్టి బయటికి మాట్లాడకూడదు అని ఊరుకోకుండా తన భావ ప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించుకున్నందుకు ఆయనను అందరూ అభినందించి తీరాల్సిందే. ఇంతకూ ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఇతర విషయాలు ఏమిటి? చంద్రబాబునాయుడి బావమరిది, వియ్యంకుడు బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పోస్ట్ పెట్టారు. చరిత్రను వక్రీకరించిన ఆ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఎట్లా ఇస్తారన్నది ఆయన వాదన. ఆ సినిమా చరిత్ర వక్రీకరణేనన్న విషయం ఒక్క కృష్ణారావు గారేం ఖర్మ, మొత్తం లోకం కోడయి కూస్తున్నది. అంత మాత్రానికే తెలుగుదేశం కార్యకర్తలకు కోపం రావాలా? ఆయనను హడావుడిగా ఉద్యోగం నుంచి తొలగించే దాకా ముఖ్యమంత్రి వెళ్లాలా? కృష్ణారావును తొలగించి, ఆయన స్థానంలో ఇంకో బ్రాహ్మణ ప్రముఖుడిని అధ్యక్షుడిగా నియమించవచ్చు, తన ఆస్థానంలోనే ఉన్న ఇంకో వందిమాగధ ప్రముఖుడి చేత ఆయన మీద నిందలు మోపవచ్చు. అంతమాత్రం చేత కృష్ణారావును తొలగించిన కారణం, తీరు ఆ సామాజిక వర్గ ప్రజల మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో చూసుకోవద్దా? చంద్రబాబునాయుడు రెండవ విడత అధికారంలోకి వచ్చాక ఇటువంటి విషయాలేవీ పట్టించుకోవడం లేదు. వివిధ సామాజిక వర్గాల మనోభావాలను ఆయన ఎట్లా గాయపరుస్తున్నారో రిజర్వేషన్లు కల్పిస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చండి మహాప్రభో అంటూ ఉద్యమం చేస్తున్న కాపు కులస్తుల పట్లా, ఆ ఉద్యమ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం పట్లా, ఆయన కుటుంబం పట్లా దారుణంగా వ్యవహరించడాన్ని బట్టే అర్థమవుతుంది. పోస్టింగులే కారణమా? నిజానికి కృష్ణారావును తొలగించింది ఆయన ఫేస్బుక్లో పెట్టిన పోస్టింగ్‌ల కారణంగా అనుకుంటే పొరపాటు. అందుకు వేరే కారణాలు ఉన్నాయి. తన ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఒక కార్పొరేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి ఆరుమాసాల పాటు కలవడానికి అపాయింట్మెంట్ ఉండదు. కానీ రోజుకు సగటున ఎనిమిది నుంచి పది గంటల సేపు ముఖ్యమంత్రి ఇస్తున్న ఉపన్యాసాలలో ప్రజోపయోగం ఎంతో అందరికీ తెలుసు. చంద్రబాబునాయుడికి ఏ వ్యవస్థ మీదా గౌరవం ఉండదు, అన్నిటినీ ఆయన ఓటు బ్యాంకులుగానే చూస్తారు. అధికార రాజకీయాలనే ఆయన శ్వాసిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బ్రాహ్మణులు అందరినీ తెలుగుదేశం బ్రాహ్మణులుగా మార్చే ఉద్యోగం ఇచ్చారు చంద్రబాబునాయుడు. అది అర్థం చేసుకోలేని అమాయకపు కృష్ణారావు రాజకీయాలతో సంబంధం లేకుండా బ్రాహ్మణులందరికీ సేవ చెయ్యాలనీ, ఒక వ్యవస్థను నిర్మించాలనీ అనుకున్నారు. తెలుగుదేశం తమ్ముళ్లనే ఆయన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లాల సమన్వయకర్తలుగా నియమించారు. కానీ ఆ కార్పొరేషన్ ద్వారా అందే సహాయం కూడా టీడీపీ బ్రాహ్మణులకే ఇవ్వాలన్న మాట ఆయన మరిచిపోయారు. అందుకే తెలుగు తమ్ముళ్లు కృష్ణారావు వైఎస్ఆర్సీపీ బ్రాహ్మణులకూ, కాంగ్రెస్ బ్రాహ్మణులకూ, కమ్యూనిస్ట్ బ్రాహ్మణులకూ సహాయం చెయ్యడం మీద అధినేతకు ఫిర్యాదు చేశారు. అర్హత, అవసరం కలవారే అయినా, వేరే పార్టీల వాళ్లకు ఎట్లా సహాయం చేస్తారన్నది చంద్రబాబునాయుడూ, ఆయన పార్టీ నాయకులూ, కార్యకర్తల విమర్శ. ఇతర పార్టీల కార్యకర్తలకు హక్కు లేదా? ఆంధ్రప్రదేశ్‌లో అన్ని కోట్ల మంది కూడా ఒక్క తెలుగుదేశం పార్టీలోనే ఉండాలి, ఆ పార్టీకే ఓట్లెయ్యాలి, ఆ అధినేత, ఆయన కుమారుడికే పల్లకీ మోయాలి అన్నది వాళ్ల అభిమతం. కృష్ణారావు ఆ పని చెయ్యక పోగా అదే పనికోసం ఏర్పాటయిన జన్మభూమి కమిటీలను ఖాతరు చెయ్యకపోవడం ఇంకెంత పెద్ద నేరం! అందుకే ఆయనకు ఉద్వాసన పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడికి వెళ్లినా జన్మభూమి కమిటీలలో ఎవరు ఉన్నారో, అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు ఎవరు భోంచేస్తున్నారో జనం కథలు కథలుగా చెప్తారు. అయినా కృష్ణారావుకు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయాలు తెలియవు. అవి తెలిసిన జేసీ దివాకర్‌రెడ్డి, రాయపాటి సాంబశివరావు వగైరా వగైరా నాయకులనయితే చంద్రబాబు నాయుడు పదిలంగా చూసుకుంటారు. తనవారి ఆగడాల మాటో?! విమానాశ్రయ ఉద్యోగితో మాటా మాటా జరిగినందుకే మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి లాంటి ప్రజా ప్రతినిధులు జైలుకు వెళ్లాలి. విమానాశ్రయంలో వీరంగం వేసి భౌతికదాడికి దిగినా కూడా జేసీ దివాకర్‌రెడ్డి మీద ఏ చర్యా ఉండదు. కనీసం కేసు కూడా ఉండదు. ఎందుకంటే మిథున్, భాస్కరరెడ్డి వైఎస్ఆర్సీపీ కాబట్టి కేసులు. దివాకర్‌రెడ్డి తెలుగుదేశం కాబట్టి కేసులు లేవు. కేశినేని నాని, బొండా ఉమా తెలుగుదేశం కాబట్టి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను దుర్భాషలాడినా, ఉద్యోగులు, అధికారుల మీద చెయ్యి చేసుకున్నా చర్యలుండవు. ఒక ప్రమాదంలో మరణించినవారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కలెక్టర్‌ను నిలదీసినందుకు ప్రతిపక్ష నాయకుడు నేరస్తుడవుతాడు. మహిళా ఉద్యోగిని బరబరా ఈడ్చుకుపోయి కొట్టినా తెలుగుదేశం శాసనసభ్యుడు కాబట్టి చింతమనేని ప్రభాకర్‌ను పల్లెత్తు మాట అనరు. ఇవన్నీ తెలిసీ రూల్ ప్రకారం పనిచేస్తాను, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాను అంటే కృష్ణారావును ఎందుకు ఉండనిస్తారు, ఫేస్బుక్ పోస్టింగ్‌ల కారణం చూపి హడావుడిగా ఇంటికి పంపెయ్యక. ఈ కారణాల ఆధారంగానే కృష్ణారావును తొలగించాలనుకుంటే, ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి మర్యాదగా చెప్తే ఆయనే రాజీనామా చేసి వెళ్లేవారు కదా! అట్లా చేస్తే ఆయన చంద్రబాబు నాయుడు ఎందుకవుతారు? చంద్రబాబు ఇప్పుడు ఎందరి చేతుల్లోనో బందీ. కింద కార్యకర్తల నుంచి మీద నాయకుల దాకా అందరి చేతుల్లో బందీ. వాళ్లను ఆయన ఏమీ చెయ్యలేకనే కృష్ణారావు లాంటి వాళ్ల మీద తన ప్రతాపం చూపుతుంటారు. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
బ్రాహ్మణులంటే బాబుకు చులకన
- ఏపీ సీఎంపై ధ్వజమెత్తిన మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ : బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పుడూ చిలకనగానే చూస్తారని, అందుకు ఒకానొక నిదర్శనం ఐవైఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి అకారణంగా తొలగించడమని కాంగ్రెస్ పార్టీ విజయవాడ సిటీ అధ్యక్షుడు మల్లాది విష్ణు అన్నారు. పార్టీ నాయకులతో కలిసి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో మల్లాది విలేకరులతో మాట్లాడారు. నీతి, నిజాయితీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కృష్ణారావును పదవి నుంచి తొలగించడం అనైతికంమని, తద్వారా రాష్ట్రంలో బ్రాహ్మణుల మనోభావాలను బాబు దెబ్బతీశారని మండిపడ్డారు. ‘ఆరునెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే కృష్ణారావు ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేషన్ చైర్మన్ హోదాలో కృష్ణారావు.. స్థానిక వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిని కలిస్తే తప్పేంటి? చంద్రబాబు సంక్షేమ పథకాలకు రాజకీయ రంగు పూస్తున్నారనడానికి ఇది తాజా నిదర్శనం కాదా?’ అని మల్లాది ప్రశ్నించారు. విశాఖ భూకుంభకోణంపై కేంద్రానికి ఫిర్యాదు ఇదేఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక, రవాణా మాఫియాలు పేట్రేగుతున్నాయన్నారు. విశాఖ భూ కుంభకోణంపై పార్టీ పెద్దలతో కల్సి ఈనెల 22న కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆందోళనకు కాంగ్రెస్ పూర్తి మద్ధతు ప్రకటించిందన్నారు. -
‘ఆయన ఏం పోస్టింగ్స్ పెట్టారో తెలియదు’
అమరావతి: ఐవైఆర్ కృష్ణారావు ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ... ఐవైఆర్ ఏం పోస్టింగ్‌లు పెట్టారో తనకు తెలియదన్నారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి వ్యతిరేకంగా మాట్లాడటం సమంజసం కాదని యనమల అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఆరు నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నది తనకు తెలియదన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ఐవైఆర్ ఎక్కువ నిధులు అడిగారని, అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాధ్యం కాదని చెప్పామన్నారు. అంతేకాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్లో ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేయాలని ప్రయత్నించారని, అయితే అందుకు తాము అంగీకరించలేదన్నారు. కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారనే ఆరోపణలతో ఐవైఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఏపీ సర్కార్ తొలగించిన విషయం తెలిసిందే. బ్రాహ్మణ కార్పొరేషన్ నూతన చైర్మన్‌గా వేమూరి ఆనంద సూర్యను నియమిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఐవైఆర్ ఇలా చేస్తారనుకోలేదు: పరకాల
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...ఐవైఆర్ కృష్ణారావుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనడం సరికాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. సీఎంను ఎప్పుడైనా కలిసే స్వేచ్ఛ ఆయనకు ఉందని, ఐవైఆర్ అలా మాట్లాడతారని తాము ఊహించలేదన్నారు. పరకాల ప్రభాకర్ మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ కృష్ణారావు అంటే మాకు చాలా గౌరవం. రాష్ట్రానికి మీ సేవలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆయనను పిలిచి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. మూడేళ్ల పదవీ కాలానికి ఆయనను చైర్మన్‌గా నియమించారు. చంద్రబాబుకు ఐవైఆర్‌పై చాలా నమ్మకం ఉంది. బ్రాహ్మణ కార్పొరేషన్ చాలా పద్ధతిగా నడుస్తోంది. లోటు బడ్జెట్ ఉన్నా బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అధిక నిదులు కేటాయించాం. ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు కొన్ని కట్టుబాట్లకు లోబడి ఉండాలి. వాటిని అనుసరించి మాట్లాడాలి, ప్రవర్తించాలి. ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా విమర్శించడం ఎంతవరకూ సమంజసం. పార్టీకి భజన చేయాలని ఎవరూ అడగలేదు. అడగరు కూడా. ప్రభుత్వ పథకాలను సమర్థంగా చేయాలనే అడుగుతారు. అయితే ప్రభుత్వానికి, శాసనసభ, శాసనమండలికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై అభ్యంతరం తెలిపాం. అంతేతప్ప కృష్ణారావుపై ప్రభుత్వపరంగా ఎలాంటి ఆంక్షలు లేవు. బ్రాహ్మణ కార్పొరేషన్లో ఎలాంటి రాజకీయాలు లేవు. ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వాన్ని విమర్శించారు. అందుకే ఆయనను పదవి నుంచి తొలగించాం. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసినవారిని ఐవైఆర్ సమర్థించడంలో ఔచిత్యం లేదు. గౌతమీపుత్ర శాతకర్ణి, బాహుబలి, సోషల్ మీడియా గురించి ఆయన అంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఐవైఆర్ నిబద్ధత, నిజాయితీ పట్ల మాకు ఎలాంటి 'సందేహాలు లేదు. ఇప్పటికీ ఆయనపై అమితమైన గౌరవం ఉంది.’ అని అన్నారు. -
ఐవైఆర్‌ను తొలగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
అమరావతి: బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఐవైఆర్‌ను తొలగిస్తే ఇచ్చిన జీవో అంతా తప్పుల తడకగా ఉంది. ఆ జీవోలో నియామకం తేదీని ప్రభుత్వం తప్పుగా పేర్కొంది. జూన్ 29, 2016లో ఐవైఆర్ కృష్ణారావు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకం అయితే, జూన్ 19, 2017లో జాయిన్ అయినట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా వేమూరి మరోవైపు ఏపీ బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా వేమూరి ఆనంద సూర్యని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు చైర్మన్‌గా కొనసాగానున్నారు. ఇంతకు ముందు చైర్మన్‌గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్బుక్లో పోస్టింగ్‌లు షేర్ చేయడంతో సీఎం చంద్రబాబు తొలగించిన సంగతి తెల్సిందే. -
నా మీద పెద్ద అభాండం వేశారు: ఐవైఆర్
హైదరాబాద్ : బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించడంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో తన ఫేస్బుక్లో పోస్టులపై వివరణ ఇచ్చారు. ‘నన్ను బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించారని విన్నాను. అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని. తనను ఆ పదవి నుంచి తీసేశారని టీవీలో చూశాను. సీఎం కానీ, ఆయన కార్యాలయం నుంచి కానీ నాకు ఎలాంటి ఫోన్ రాలేదు. వివరణ అడగలేదు, అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని. కానీ నన్ను రాజీనామా చేయమని అడిగేవారిని చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. నాకు ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇంతవరకూ వివరణ అడగలేదు. ముఖ్యమంత్రిని కలవడానికి ఆరు నెలలు నుంచి ప్రయత్నిస్తున్నా. కానీ ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు. నా ఇగో హర్ట్ అయిందని అధికారులకు చెప్పాను. నేను జవాబుదారీతనంతో పని చేయడంలేదన్న విమర్శలు అవాస్తవం. నా మీద పెద్ద అభాండం వేశారు. నాకు కేబినెట్ ర్యాంక్ ఇవ్వలేదు. ఇచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా నాకు రెండు లక్షల జీతం అని కూడా ప్రచారం చేస్తున్నారు. నేను జీతం లేకుండా పనిచేస్తున్నా. అయితే కొన్ని సౌకర్యాలు మాత్రమే ఉపయోగించుకుంటున్నాను. కావాలని నేను అడిగా.. బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి కావాలని నేనే అడిగి తీసుకున్నా. నా విజ్ఞప్తికి ఒప్పుకునే ఆ పదవి ఇచ్చారు. బ్రాహ్మణ కార్పోరేషన్లో చాలామంది టీడీపీ వారే సభ్యులుగా ఉన్నారు. ఏ సమాచారం ఉన్నా నేను వారికి చెప్పేవాడిని. బ్రాహ్మణ కార్పొరేషన్ సమావేశం సమాచారం ఇవ్వడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఆ మెసేజ్‌లు పంపించే వ్యక్తులు టీడీపీ కార్యకర్తలే. వాళ్ల నుంచి మెసేజ్‌లు వెళ్లలేదంటే పార్టీలో ఏదో సమస్య ఉన్నట్లే లెక్క. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి రుణాలు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని చెబుతున్నారు. అలాంటి ఆరోపణలపై నాకు అభ్యంతరాలున్నాయి. లబ్దిదారుల్లో టీడీపీ, వైఎస్ఆర్ సీపీ ఉండరు. లబ్దిదారుడు...లబ్దిదారుడే. జన్మభూమి కమిటీల ప్రమేయం లేకండా లబ్దిదారులను ఎంపిక చేశాం. లబ్దిదారులకు, పార్టీకి ముడిపెట్టడం సరికాదు. బీజేపీ ప్రచారానికి విశాఖ వెళ్లిన మాట వాస్తవం. విశాఖలో రెండు సత్రాలను బ్రాహ్మణులకు ఇస్తూ దేవాదాయశాఖ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ప్రచారానికి రమ్మని బీజేపీ మంత్రి అడిగారు. నేను వెళ్లాను. సత్రం క్రెడిట్ సీఎం చంద్రబాబుకే ఇచ్చా. ఇప్పటివరకూ ప్రచారం గురించి ప్రశ్నించని వ్యక్తలు...ఇప్పుడెందుకు ప్రశ్నిస్తున్నారో అర్థం కావడం లేదు. నాకు ఆ ఉద్దేశ్యం లేదు... ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఉద్దేశం నాకు లేదు. నాకు అంత అంగబలం, అర్థబలం లేదు. సీఎస్‌గా పని చేసి అన్ని అనుభవించిన వ్యక్తిని ఎమ్మెల్యే కావాలని కోరుకుంటానా?. ఎమ్మెల్యే పదవో... ఇంకేదో నేను ఆశించలేదు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. కార్పొరేషన్ చైర్మన్ హోదాలో నేను జీతమేమీ తీసుకోవడం లేదు. ఏం తప్పు చేశానని నాపై అభాండాలు వేస్తున్నారో తెలీదు. జేసీ దివాకర్ రెడ్డి విషయంలో నేను స్పందించిన దాంట్లో తప్పేమీ లేదు. జాతీయ స్థాయి నాయకులు సర్పంచ్ స్థాయి దాటలేదని నేను స్పందించా. నాపై రియాక్ట్ అయిన వ్యక్తి ఒక టీడీపీ కార్యకర్త. ఇక పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ అరెస్ట్ విషయంలో నేను చాలా ఫీలయ్యాను. ఫేస్బుక్ ఉన్నదే అభిప్రాయాలు చెప్పడానికి. డొనాల్డ్ ట్రంప్, మాల్యా నుంచి శ్రీకాకుళం అరటిపండు వరకూ నేను అన్నింటిపై స్పందించా. చరిత్రను వక్రీకరించిన సినిమాకు రాయితీనా? గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇవ్వడం సరికాదని పోస్ట్ పెట్టా. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నా. చరిత్రను వక్రీకరించిన సినిమాకు పన్ను రాయితీ ఎలా ఇస్తారు?. అలాగే టీటీడీ ఈవో దక్షిణాది వ్యక్తికి ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్తరాది వ్యక్తిని నియమించాల్సిన అవసరం ఏముందని నాకనిపించింది. పొలిటికల్ మైలేజ్ రావడం లేదని నాపై పెద్ద అభాండం వేశారు. పొలిటికల్ మైలేజ్ రావాలంటే భజన చేయాలా? నేను అలాంటి వ్యక్తిని కాను. భజన కావాలనుకంటే అలాంటి వ్యక్తిని పెట్టుకోవాల్సింది. ఏపీ ప్రజలకు వాస్తవాలు చేరడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజాలు వెళ్లడం లేదు. న్యూట్రల్ న్యూస్ పేపర్ లేకపోవడంతో చాలా విషయాలు వారికి తెలియడం లేదు. ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. చంద్రబాబును లగడపాటి రాజగోపాల్ కలిస్తే తప్పులేదు కానీ, నేను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిని కలిస్తే తప్పా?. బాపట్లలో స్థానిక ఎమ్మెల్యేను కలవడంలో తప్పేముంది. ఏపీ రాజధాని భూములపై త్వరలో పుస్తకం రాస్తా. అన్ని విషయాలను అందులో వెల్లడిస్తా. మరిన్ని కథనాలు... వేటుకు ఐవైఆర్ ఫేస్బుక్ పోస్టులే కారణమా? ‘ఐవైఆర్ తొలగింపు మంచి నిర్ణయం’ ఐవైఆర్ కృష్ణారావుపై ఏపీ ప్రభుత్వం వేటు -
‘ఐవైఆర్ తొలగింపు మంచి నిర్ణయం’
విజయవాడ: బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగించి సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టిన మనిషి ఐవైఆర్ కృష్ణారావు అని తూర్పారబట్టారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం నీచమైన చర్య అని అన్నారు. కృష్ణారావు అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐవైఆర్ సీఎం చంద్రబాబుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా సోషల్ మీడియాలో కృష్ణారావు చేసిన పోస్టులను సాకుగా చూపిస్తూ ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించింది. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. టీడీపీ నేతల ఫిర్యాదుతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చైర్మన్ కృష్ణారావును ఎలాంటి వివరణ అడగకుండానే ఆయనను పదవి నుంచి తొలగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
వేటుకు ఐవైఆర్ ఫేస్బుక్ పోస్టులే కారణమా?
విజయవాడ: తాము చెప్పినట్లు నడుచుకోకపోతే ఎంత సీనియర్ ఐఏఎస్ అధికారులైనా వేటు తప్పదన్నట్లుగా తయారైంది ఏపీలో ప్రస్తుత పరిస్థితి. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు తన అధికారిక ఫేస్బుక్ ఖాతా నుంచి షేర్ చేసిన కొన్ని పోస్ట్‌లు, ఆయన స్వయంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అలజడి సృష్టించింది. సముచిత స్థానం కల్పిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ఆయనపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉంటూ ఇలా నిత్యం చంద్రబాబుకు సమస్యలు తెచ్చేలా కృష్ణారావు పోస్టులు పెట్టడాన్ని కొందరు టీడీపీ నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పచ్చ తమ్ముళ్ల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు, ఐవైఆర్‌పై వేటు వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలోనూ కొనసాగిన సీనియర్ ఐఏఎస్‌ను ఎలాంటి వివరణ కోరకుండానే ఏక పక్షంగా ఆయనను చైర్మన్ పదవి నుంచి తొలగించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్థికశాఖ కార్యదర్శిగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శిగా పలు కీలక పదవులు చేపట్టి ఎంతో నిజాయతీగా నడుచుకున్న అధికారిపై నేడు విమర్శలు గుప్పించడం హాస్యాస్పదంగా కనిపిస్తోంది. ఏపీ సీఎస్‌గా ఆయన పనితీరును మెచ్చిన ఏపీ సీఎం స్వయంగా కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అరకొర నిధులు ఇస్తున్నారని కొద్దిరోజుల క్రితం తీవ్రంగా విమర్శించిన ఐవైఆర్.. చంద్రబాబుపై కులం కోణంతో ఉన్న పోస్ట్‌ను షేర్ చేయడం సంచలనంగా మారిన నేపథ్యంలో కృష్ణారావు ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిందేమోనన్న అనుమానంతో కొందరు టీడీపీ నేతలు ఆయన్ను సంప్రదించారు. తానే పోస్టులు పెడుతున్నానని సమాధానం ఇవ్వడంతో టీడీపీ నేతల ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది. ఐవైఆర్ షేర్ చేసిన పోస్టుల్లో కొన్ని.. హైటెక్ సిటీ పేరుతో ఓ విద్యార్థిని రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందారు. 'సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు భూములు కట్టబెట్టారని, వారి విలువను పెంచేందుకే చంద్రబాబు హైటెక్ సిటీ కట్టారని' విద్యార్థిని తన థీసిస్‌లో పేర్కొన్న అంశాలను ఉటంకిస్తూ చేసిన పోస్టును కృష్ణారావు షేర్ చేశారు. 'స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి మీద అప్పట్లో ఓ పత్రిక చంద్రబాబు అండతో వేసిన కార్టూన్.. ఇది ఎన్టీఆర్ ని కించపరచటం కాదా, దీనికి మీకు శిక్షలు లేవా..' అన్న పోస్టును కూడా షేర్ చేయడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను బ్రిటీష్ అధికారి రూథర్‌ఫర్డ్‌తో పోలుస్తూ ఉన్న కార్టున్‌ను కూడా కృష్ణారావు షేర్ చేసిన విషయం తెలిసిందే. బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయించడాన్ని, బాహుబలి2 కు అధిక షోలకు ఒకే చెబుతూ.. టికెట్ ధరలు పెంచుకునేందుకు ఛాన్స్ ఇవ్వడంపై విమర్శలు చేశారు. చరిత్రను సర్వనాశనం చేసి తీసిన చిత్రంగా శాతకర్ణిని అభివర్ణిస్తూ.. ఇందుకు కారకులైన మూవీ యనిట్పై కేసులు పెట్టాల్సిందిపోయి పన్ను రాయితీలు ఎలా ఇస్తారంటూ ఐవైఆర్ ప్రశ్నించారు. -
ఐవైఆర్ కృష్ణారావుపై ఏపీ ప్రభుత్వం వేటు
విజయవాడ: ఐవైఆర్ కృష్ణారావుపై చంద్రబాబు నాయుడు సర్కార్ అనూహ్య వేటు వేసింది. సోషల్ మీడియాలో కృష్ణారావు చేసిన పోస్టులను సాకుగా చూపిస్తూ ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించింది. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. టీడీపీ నేతల ఫిర్యాదుతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చైర్మన్ కృష్ణారావును ఎలాంటి వివరణ అడగకుండానే ఆయనను పదవి నుంచి తొలగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐవైఆర్ స్థానంలో వేమూరి ఆనంద సూర్యను చైర్మన్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు సర్కార్ తీరును రాష్ట్ర బ్రాహ్మణ సంఘాలు తప్పుపడుతున్నాయి. ఉన్నత హాదాలో ఉన్న వ్యక్తిని అడిగి వివరణ తెలుసుకోకుండానే కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఎలా తొలగిస్తారని బ్రాహ్మణ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కార్పొరేషన్ నిధులపై ఐవైఆర్ ప్రశ్నించడాన్ని తట్టుకోలేకే సీఎం చంద్రబాబు ఆయనను తప్పించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. నేటి మధ్యాహ్నం మూడు గంటలకు కృష్ణారావు మీడియా సమావేశంలో పాల్గొని తనకు జరిగిన అన్యాయాన్ని వివరించనున్నారు. గతంలో ఎన్నో ఉన్నత హాదాల్లో పనిచేసిన ఆయనకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేసిన విశిష్ట అనుభవం ఉంది. అయినప్పటికీ కేవలం సోషల్ మీడియాలో బ్రాహ్మణ కార్పొరేషన్ పై పోస్టులు చేశారన్న కారణంగా చైర్మన్ బాధ్యతల నుంచి తప్పించడంతో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతల సిఫారసులను ఏ మాత్రం పట్టించుకోకుండా, నిజాయతీగా పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్న కృష్ణారావును ఉద్దేశపూర్వకంగానే తొలగించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీనియర్ ఐఏఎస్‌ల వాక్ స్వాతంత్ర్యపు హక్కులను కాలరాస్తుండటంతో తమ పరిస్థితి ఏంటని ఇతర ఐఏఎస్‌లు ఆందోళన చెందుతున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారన్న పోస్ట్‌లు షేర్ చేశారని, ప్రభుత్వాన్ని ఎప్పుడూ విమర్శించలేదని తెలుస్తోంది. -
నేడు ఐవైఆర్ కృష్ణారావు రాక
అనంతపురం అర్బన్: రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు బుధవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. ఉదయం 5.20 గంటలకు అయన అనంతపురం చేరుకుంటారు. 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు జరుగనున్న బ్రాహ్మణ అవగాహన సదస్సులో పాల్గొంటారు. మూడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇన్చార్జి కలెక్టర్, బ్యాంకర్లు, బ్రాహ్మణ, ఆర్యవైశ్య పెద్దలతో సమావేశం నిర్వహిస్తారు. ఐదు గంటలకు విలేకరులు సమావేశం నిర్వహిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు. -
మరోసారి భేటీ అయిన కమలనాథన్ కమిటీ
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపుకోసం ఏర్పాటుచేసిన సీఆర్ కమలనాథన్ కమిటీ మరోసారి భేటీ అయింది. ఈ భేటీని సోమవారం ఏపీ సెక్రటేరియట్ లో నిర్వహించగా దీనికి కమిటీ చీఫ్ కమలనాథన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఆర్ కృష్ణారావు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ కమిటీ ఏర్పాటయినప్పటి నుంచి ఇలా భేటీ కావడం ఇది 15వసారి. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనపై కమిటీ సంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతోపాటు, ఇరు రాష్ట్రాల అధికారులు ఇచ్చిన నివేదనలు స్వీకరించింది. ఎస్పీఎఫ్, మెడికల్ డిపార్ట్ మెంట్ ఉద్యోగుల విభజన విషయంలో ఉన్న ఫిర్యాదులను ఇరు రాష్ట్రాల కార్యదర్శులు త్వరలోనే పరిష్కరించుకోనున్నట్లు తెలిపారు. -
జూన్ 1 నుంచి బెజవాడ నుంచే పాలన
హైదరాబాద్ : వచ్చే ఏడాది (2016) జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని కార్యకలాపాలు, విధులు నూతన రాజధాని నుంచే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం కార్యదర్శులు, శాఖాధిపతులు అందరూ కొత్త రాజధాని ప్రాంతం నుంచే తమ విధులను నిర్వహిస్తారని ఆయన తెలిపారు. తమ తమ శాఖలలోని అధికారులకు, ఉద్యోగులకు ఈ మేరకు తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. రాజధానిలో పని చేసేందేకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేసుకోవాలంటూ ప్రభుత్వ శాఖ విభాగాల అధిపతులు అందరికీ ఐవైఆర్ కృష్ణారావు సర్క్యులర్ మెమో జారీ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ తప్పనిసరిగా వచ్చే సంవత్సరం జూన్ 2వ తేదీ నాటికి విజయవాడకు తరలిరావాల్సిందేనని ఏపీ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. జూన్ రెండో తేదీ నాటికి రాష్ట్రం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో అప్పటికల్లా పూర్తిస్థాయిలో సెక్రటేరియట్‌ను కూడా తరలించాల్సిందేనని కేబినెట్ నిర్ణయించింది. -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల తరలింపుపై సీఎస్ సమీక్ష
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల తరలింపు, పిల్లల స్థానికత అంశంపై రాష్ట్ర సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల పిల్లల స్థానికతకు సంబంధించి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఏకాభిప్రాయ కుదరనందున కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగుల పిల్లల స్థానికత వివాదంపై అడ్వకేట్ జనరల్ నుంచి అందిన నివేదికపై సీఎస్ సమీక్ష జరుపుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగుల విభజన జనాభా ప్రాతిపదికన జరగాలని, అలా జరగని పక్షంలో పంపిణీ సంస్థలపై ఆర్థిక భారం మూసివేతకు దారి తీయవచ్చని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఆస్తుల, అప్పుల విభజన, ఉద్యోగుల విభజన కలిపి ఒకేసారి చేయాలని, పునర్విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల విభజన పరస్పర చర్చల ద్వారానే జరగాలి తప్ప, ఏకపక్షంగా కాదని.. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఉద్యోగుల విభజన తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని బుధవారం హైకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. -
'ఇరు రాష్ట్రాల వివాదాన్ని కేంద్రం పరిష్కరించాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ ఉద్యోగుల విభజన వివాదంపై ఏకాభిప్రాయం రాలేదు. మంగళవారం ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలు సమావేశమై చర్చించారు. అనంతరం కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తొలగించిన విద్యుత్ ఉద్యోగులకు 2 నెలలుగా జీతాలు లేక బాధపడుతున్నారని అన్నారు. ఉద్యోగుల విభజన వివాదంపై ఏకాభిప్రాయం రాలేదని చెప్పారు. స్థానికత ఆధారంగా తొలగించామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని, తాము జనాభా ప్రతిపదికన విభజించాలని కోరామని తెలిపారు. అన్ని వివాదాల్లోనూ సమస్య ఇలానే ఉందని, ఉద్యోగుల విభజన కొలిక్కిరాలేదని కృష్ణారావు చెప్పారు. ఇరు రాష్ట్రాల వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. -
'అసెంబ్లీ అయ్యేదాకా సిటీ వీడద్దు'
⇒ వెళ్లాలంటే మంత్రులు, సీఎస్ అనుమతి తీసుకోవాలి ⇒ అన్ని శాఖల అధికారులకు సీఎస్ ఆదేశాలు హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో సమావేశాలు ముగిసే వరకు అధికారులు ఎవరూ హైదరాబాద్ వదిలి వెళ్లరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదేశించారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎవరైనా హైదరాబాద్ వీడి వెళ్లాలంటే సంబంధిత మంతులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగే అంశాలపై సంబంధిత మంత్రులకు ఎప్పటికప్పుడు వివరాలు అందజేయాలని ఆయా శాఖల అధికారులకు సీఎస్ సూచించారు. ఇప్పటికే సభ్యులు అడిగిన పెండింగ్ ప్రశ్నలన్నింటికీ తక్షణం సమాధానాలను అసెంబ్లీకి సమర్పించాలని ఆదేశించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు ప్రస్తావించిన అన్ని అంశాల పైనా తగిన సమాధానాలను అసెంబ్లీకి పంపించేందుకు ప్రతి శాఖలో జవాబుదారీ గల అధికారిని నియమించాలని సూచించారు. అలాగే గత అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు ఇచ్చిన హామీలకు సంబంధించి లిఖిత పూర్వక సమాధానాలను అసెంబ్లీకి పంపించాలని సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సూచించారు. -
ఉద్యోగులను సంప్రదించాకే తరలింపు
హైదరాబాద్: రాజధానికి ఉద్యోగులు, అధికారుల తరలింపు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఉద్యోగులను ఒకే సారి తరలించాలా లేదా అనే విషయంపై కూడా ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ఉద్యోగులను సంప్రదించాకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొత్త రాజధాని ప్రాంతానికి ఒకే సారి ఉద్యోగులను అధికారులను తరలించాలని ఏపీ ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఏపీ ఉద్యోగ సంఘాలు సీఎస్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. తమను తరలించే విషయంలో వారు ఇప్పటికే పలు భిన్నాభిప్రాయాలు తెలిపినందున పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరపనున్నట్లు సీఎస్ పరోక్షంగా తెలిపారు. -
'తెలంగాణ ఒత్తిడికి కమల్ నాథన్ కమిటీ తలొగ్గింది'
హైదరాబాద్: ఉద్యోగుల విభజనపై కమల్‌నాథన్ కమిటీ సమర్పించిన జాబితాలో అవకతవకలున్నాయని ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. శుక్రవారం నాడు ఏపీ సచివాలయ ఉద్యోగులు కమిటీ జాబితాపై చర్చించడానికి సీఎస్ ను కలిశారు. తెలంగాణ ఉద్యోగుల ఒత్తిడికి కమల్‌నాథన్ కమిటీ తలొగ్గినట్టుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి చెందిన పలువురు సీనియర్ అధికారులను తెలంగాణకు కెటాయించారని మురళీకృష్ణ ఆరోపించారు. ఆ కమిటీ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలన్నారు. ఇద్దరు డిప్యూటీ సెక్రటరీలు, ఇద్దరు అదనపు సెక్రటరీలు, ఓ అసిస్టెంట్ సెక్రటరీని తెలంగాణకు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని విమర్శించారు. దీనిపై కోర్టుకు వెళతామని మురళీకృష్ణ పేర్కొన్నారు. -
రాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
- కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లలో పోలీసులు - ఐబీ జాయింట్ డెరైక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణ - తిరుమల, తిరుచానూరులో దర్శన ఏర్పాట్లను సమీక్షించిన టీటీడీ అధికారులు - అధికారులతో పలుమార్లు కలెక్టర్ సమావేశం సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం జూలై 1న తిరుమలకు రానున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తిరుమలలో టీటీడీ ఈవో సాంబశివరావుతో పాటు అన్ని శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన సూచనల మేరకు రెవెన్యూ, టీటీడీ అధికారులు పలుమార్లు సమావేశమై దాదాపు ఏర్పాట్లు పూర్తిచేశారు. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ పలుమార్లు అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా వస్తున్నందున భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. ముఖ్యంగా తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మయ్య ఇతర అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి ఉదయం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి తొలుత తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1 గంటలోపే తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటున్నారు. శ్రీవారిని దర్శించుకుని తిరుమల నుంచి సాయంత్రం 4 గంటలకు బయలు దేరుతారు. 5.50 గంటలకు రేణిగుంటకు చేరుకుని ప్రత్యేక విమానంలో తిరుగుపయనమవుతారు. సీఎం నారా చంద్రబాబునాయు డు జూలై 1వ తేదీన ఉదయం 10గంటలకు రేణిగుం ట విమానాశ్రయానికి చేరుకుని రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. అనంతరం సాయంత్రం 5 గంటలకే ముఖ్యమంత్రి ముందుగా గోదావరి పుష్కరాల్లో హారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా రాజ మండ్రికి బయలుదేరి వెళతారు. రాష్ట్రపతి పయనిం చే రోడ్డు మార్గాలతో పాటు, ఆయన బసచేసే పద్మావతి అతిథి గృహాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లలో పోలీసులు నిమగ్నం రాష్ట్రపతి పర్యటనను దృష్టిలో ఉంచుకుని పోలీసు ఉన్నతాధికారులు తిరుపతిలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డెరైక్టర్ చంద్రశేఖర్ అజాద్, ఇంటెలిజెన్స్ డీఐజీ పి.వి.యస్ రామకృష్ణ, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, సీఎం ముఖ్య భద్రతాధికారి జె.సత్యనారాయణ, గ్రెహౌండ్స్ ఎస్పీ శ్రీనివాసులు తిరుపతి అర్బన్ జిల్లాల పరిధిలోని ముగ్గురు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు సమావేశమై భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. తిరుచానూరులో దర్శన ఏర్పాట్ల పరిశీలన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న నేపథ్యంలో ఆలయంలో ఏర్పాట్లను సోమవారం టీటీడీ ఈవో సాంబశివరావు నేతృత్వంలో పర్యవేక్షించారు. -
ట్యాపింగ్‌పై కేంద్రానికి ఏపీ ఫిర్యాదు?
హోం శాఖ కార్యదర్శితో సీఎస్ భేటీ సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గురువారం సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో భేటీ అయ్యారు. టీ సర్కార్ ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. సెక్షన్ -8 ను అమలు చేయాలని, గవర్నర్‌కు అధికారాలివ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఉమ్మడి రాజధానిలో ఏపీ ప్రజాప్రతినిధుల స్వేచ్ఛకు భంగం కలిగేలా టీ సర్కా ర్ వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీనికి గోయల్ హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్య ఉన్నట్టు ఫిర్యాదులు, నివేదికలేవీ? సెక్షన్-8ను ఎందుకు అమలు చేయాలి? అని ప్రశ్నించినట్టు సమాచారం. గవర్నర్‌కు వ్యతిరేకంగా ఏపీ మంత్రులు చేస్తున్న విమర్శలపైనా సీఎస్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంతకు ముందు టెలికం కమిషన్ చైర్మన్, కార్యదర్శి రాకేష్ గర్గ్‌లతో భేటీ అయిన సీఎస్.. ట్యాపింగ్‌పై ఆధారాల్ని అందజేసినట్టు సమాచారం. విలేకరులపై సుజనా అసహనం ‘వాట్ ఏసీబీ..? తెలంగాణ, ఆంధ్రాలో ఏం సమస్య ఉంది? నాకు తెలియదు’ అంటూ కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి విలేకరులపై అసహనం వ్యక్తం చేశారు. నగరంలో గురువారం ఉదయం ‘వాతావరణ మార్పు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సు సందర్భంగా ఓటుకు కోట్లు కేసు, ఏసీబీ దర్యాప్తుకు సంబంధించి సుజనా చౌదరిపై విలేకరులు ప్రశ్నించగా జవాబు చెప్పకపోగా ఎదురు ప్రశ్నలు వేశారు. -
ఏపీ మంత్రుల కామెంట్లపై కేంద్రం సీరియస్!
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను టార్గెట్ చేస్తూ ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావుని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. కేంద్రం స్పందించిన తీరును చీఫ్ సెక్రటరీ ఏపీ సర్కారుకు చేరవేశాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో నా వ్యాఖ్యలతో గవర్నర్ ను గాయపరిస్తే..వాటిని ఉపసంహరించుకుంటానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అయితే, ఆ వ్యాఖ్యలు ద్వేషంతో చేసినవి కావని కూడా ఆయన వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే. -
సిద్దిపేట మున్సిపాలిటీకి అరుదైన గౌరవం
సిద్దిపేట జోన్(మెదక్): తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్న మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీకి మరో అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన ఆయా మునిసిపాలిటీల నుంచి క్లీన్ ఛాంపియన్షిప్ అవార్డు కోసం క్లీన్ ఇండియా సంస్థ మూడు మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి సిద్దిపేట మున్సిపాలిటీకి స్థానం దక్కింది. స్వచ్ఛ భారత్ ప్రక్రియలో భాగంగా స్వచ్ఛమైన పట్టణంగా తీర్చి దిద్దినందుకుగాను సిద్దిపేట మున్సిపాలిటీకి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, ప్రముఖ సినీ నటి అమల చేతుల మీదుగా హైదరాబాద్‌లో అవార్డును అందజేశారు. ఈ అవార్డును ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిధుల చేతుల మీదుగా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమాణాచారి అవార్డును స్వీకరించారు. సిద్దిపేట పట్టణంలో రాష్ట్రంలోనే తొలి ప్రక్రియగా తడి, పొడి చెత్త సేకరణ, ప్లాస్టిక్ కవర్ల నిషేధం, హరిత హారంలో భాగంగా ఇంటింటికి మొక్కల పంపిణీ, ‘వావ్’ ప్రక్రియలో భాగంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టిన నేపథ్యంలో మున్సిపాలిటీలకు అవార్డును అందజేశారు. -
ఏపీ సచివాలయంలో సీఎస్ తనిఖీలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మంగళవారం ఏపీ సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సచివాలయంలోని వివిధ బ్లాకులను ఆయన పరిశీలించారు. ఉద్యోగులు రాకపోకలు, సౌకర్యాలపై కృష్ణారావు ఆరా తీశారు. పారిశుధ్యానికి పెద్ద పీట వేయాలని.. అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గతంలోనూ ఐవైఆర్ సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. -
ఆ ఉద్యోగులకు మాత్రమే ఆప్షన్లు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర క్యాడర్ ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలపై ఎట్టకేలకు సందిగ్ధం తొలగింది. ఉద్యోగుల పంపిణీపై కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఒకటి, రెండు రోజుల్లో విధివిధానాలను వెబ్సైట్లో పొందుపరచనున్నారు. వీటిపై తమ అభ్యంతరాలు తెలిపేందుకు ఉద్యోగులకు కమిటీ పది రోజుల గడువు ఇచ్చింది. ఇక భార్యాభర్తలకు, వివాహం కానివారికి, వితంతువులకు మాత్రమే ఆప్షన్లు ఉంటాయి. స్థానికత ఆధారంగా ఉద్యోగుల పంపిణీ చేయనున్నారు. ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న వారికి ఆప్షన్ అవకాశం ఇవ్వలేదు. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత పంపకాలు చేయనున్నారు. ఉద్యోగుల పంపీణిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు శుక్రవారం కమలనాథన్ కమిటీతో భేటీ అయ్యారు. -
నార్త్ బ్లాక్‌లో కమలనాథన్ కమిటీ భేటీ
న్యూఢిల్లీ : ఉద్యోగుల విభజనకు కేంద్రం ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీ శుక్రవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో సమావేశమైంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్‌శర్మ, వైవీఆర్ కృష్ణారావు హాజరు అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలపై ఈ భేటీలో చర్చ జరుపుతున్నారు. ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసిన తరువాత వాటిని అభిప్రాయాల కోసం బహిరంగపరుస్తారు. ఉద్యోగుల నుంచి సలహాలు, సూచనలకు అనుగుణంగా తుది మార్గదర్శకాలను ప్రధానమంత్రి ఆమోదంతో ప్రకటించనున్నారు. అనంతరం ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను చేపడతారు.