నార్త్ బ్లాక్‌లో కమలనాథన్ కమిటీ భేటీ | Kamalanathan committee meeting on employee allotment | Sakshi
Sakshi News home page

నార్త్ బ్లాక్‌లో కమలనాథన్ కమిటీ భేటీ

Published Fri, Jul 25 2014 11:29 AM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM

Kamalanathan committee meeting on employee allotment

న్యూఢిల్లీ : ఉద్యోగుల విభజనకు కేంద్రం ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీ శుక్రవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో  సమావేశమైంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్‌శర్మ, వైవీఆర్ కృష్ణారావు హాజరు అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలపై ఈ భేటీలో చర్చ జరుపుతున్నారు.

ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసిన తరువాత వాటిని అభిప్రాయాల కోసం బహిరంగపరుస్తారు. ఉద్యోగుల నుంచి సలహాలు, సూచనలకు అనుగుణంగా తుది మార్గదర్శకాలను ప్రధానమంత్రి ఆమోదంతో ప్రకటించనున్నారు. అనంతరం ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను చేపడతారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement