![IYR Krishna Rao Slams AP Government Regarding Sale Of Bonds Issue - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/15/kl.jpg.webp?itok=lH6Xxk4r)
ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణా రావు(పాత చిత్రం)
అమరావతి: రాజధాని బాండ్ల విక్రయంతో ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణా రావు పేర్కొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..బ్యాంకు వడ్డీ కంటే అధికంగా చెల్లిస్తామని విక్రయాలు చేపడుతున్నారని...దీని వల్ల ప్రజలపై భారీగా భారం పడే అవకాశముందన్నారు. షేర్ మార్కెట్‌లో ఓవర్ సబ్‌స్రైబ్ మంచిదే కానీ బాండ్ల విక్రయంలో మంచిది కాదన్నారు. రూ.60 వేల కోట్లతో ఎలక్షన్ ఇయర్లో టెండర్లు పిలవడం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై భారీగా భారం పడుతుందన్నారు. బాండ్ల ద్వారా వచ్చేదంతా అప్పే అవుతుందని, మళ్లీ రీయింబర్స్‌మెంట్ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రజలపై భవిష్యత్‌లో పెద్దభారం పడుతుందని అంచనా వేశారు.
ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి, అధిక వడ్డీ చెల్లించినపుడు స్పందన బాగా ఉంటుంది.. ప్రస్తుతం రాష్ట్ర స్థూల వార్షిక ఆదాయం 29 శాతం ఉంది..బాండ్ల ద్వారా వచ్చే రూ.60 వేల కోట్ల అప్పుతో ఆదాయంలో అప్పు శాతం 29 నుంచి 35 శాతానికి పెరుగుతుందని వెల్లడించారు. దీని వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోతుందని, ప్రజలపై మరింత భారం పడే అవకాశముందన్నారు. మహానగర వ్యామోహం అనేది రాష్ట్రానికి గుదిబండగా మారనుందని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం వరకు అయితే రూ.5 వేల కోట్లు సరిపోతాయని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment