bonds
-
కంపెనీకి బాండ్ రాశారా? రాజీనామా చేస్తే ఆ బాండ్లు చెల్లుతాయా?
నేను ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీలోని ఇబ్బంది వల్ల వేరే ఉద్యోగం చూసుకున్నాను. ప్రస్తుతం ఉన్న కంపెనీలో కనీసం మూడు సంవత్సరాలు పనిచేస్తాను అని అగ్రిమెంట్ మీద సంతకం చేశాను. కానీ, రాజీనామా ఇస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇస్తాము అని చెప్పారు. తీరా రాజీనామా చేసే సమయానికి ‘మేము రిలీవింగ్ ఇవ్వము. నీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వము. అగ్రిమెంట్ ప్రకారం మూడేళ్లు పనిచేయాల్సిందే – అంటే ఇంకో 14 నెలలపాటు ఇక్కడే ఉండాలి అంటున్నారు.’ ఇదే కంపెనీలో పని చేస్తే నేను జీవితాన్ని కోల్పోతాను. ఎంతో హెరాస్మెంట్గా ఉంది. తగిన సలహా ఇవ్వగలరు. – ఒక ఐ.టీ. ఉద్యోగి, హైదరాబాద్అసలు మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కంపెనీ వారికి ఎందుకు ఇచ్చారు? అలా తీసుకునే హక్కు కానీ, తీసుకుని వారి వద్దనే ఉంచుకునే హక్కు కానీ ఎవరికీ లేదు. పరిశీలించిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లు మీకు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అలా కాదని ఎవరైనా చేస్తే అది చట్టరీత్యా తప్పు. ఐటీ కంపెనీలలో సాధారణంగా ఫ్రెషర్స్ గా వచ్చిన వారితో బాండు రాయించుకోవడం చూస్తుంటాము. కానీ, బాండు రాయించుకున్నంత మాత్రాన మీరు వారి వద్ద బానిసత్వం చేయాలి అని అర్థం కాదు. అలాంటి బాండ్లు అన్నివేళలా చెల్లవు కూడా. కంపెనీవారు మీకు ఏదైనా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి, (స్పెషల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ వంటివి) ఆ శిక్షణ ద్వారా మీరు లబ్ధి పొంది ఉంటే, సదరు శిక్షణ నుంచి మీరు నేర్చుకున్న పని ఆ కంపెనీకి ఉపయోగకరం అయినప్పుడు మాత్రమే వారు ఇచ్చిన శిక్షణకు ప్రతిఫలంగా కొంతకాలం వారి వద్ద పనిచేయాలి అనే నిబంధన చెల్లుతుంది. అంతేకానీ ప్రతి ఒక్క ఉద్యోగి దగ్గర ఇలాంటి బాండ్లు రాయించుకుంటే అవి చెల్లవు. వాటికి భయపడాల్సిన అవసరం లేదు.కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, ఇండియన్ కాంట్రాక్టు యాక్ట్, సెక్షన్ 27 ఒక వ్యక్తిని తన వాణిజ్య/వ్యాపారాలు చేయడం వీలు లేదు అని రాసుకున్న ఏ అగ్రిమెంట్ అయినా కాంట్రాక్టు అయినా చెల్లవు. మీరు రాసుకున్న అగ్రిమెంట్/ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ లోని పదజాలాన్ని ఒకసారి పరిశీలించండి. మీరు లిఖితపూర్వక నోటీసు ఇచ్చి, నోటీసు సమయాన్ని పూర్తి చేసి ఆ కంపెనీని వదిలి వెళ్లవచ్చు. వీలుంటే ఒక లాయర్ని సంప్రదించి ఆ కాంట్రాక్టు చెల్లుతుందో లేదో చూసుకోండి. ఇదీ చదవండి: ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!ఐటీ ఉద్యోగి అయినప్పటికీ, మీరు చేసే పని గనుక లేబర్ యాక్ట్ పరిధిలోకి వస్తే, మీరు లేబర్ కోర్టును కూడా సంప్రదించవచ్చు. అలాగని అందరు ఐటీ ఉద్యోగులకూ లేబర్ చట్టాలు వర్తించవు. కొందరికి మాత్రమే వర్తిస్తాయి. ప్రత్యామ్నాయంగా మీరు సివిల్ కోర్టును మీరు ఆశ్రయించవచ్చు. కొంత సమయం పట్టినప్పటికీ మీకు సరైన న్యాయం దొరుకుతుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసంsakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
ఎస్బీఐ రూ.10 వేలకోట్లు సమీకరణ.. ఏం చేస్తారంటే..
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తాజాగా రూ.10,000 కోట్లు సమీకరించింది. ఏడోసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీ ద్వారా పెట్టుబడులు సమకూర్చుకుంది. 15 ఏళ్ల కాలపరిమితిగల వీటికి కూపన్ రేటు 7.23 శాతంకాగా.. రూ.11,500 కోట్లకుపైగా విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. నిజానికి బ్యాంక్ రూ.5,000 కోట్ల విలువైన బాండ్ల జారీకి తెరతీసింది. అధిక బిడ్డింగ్ నమోదైతే మరో రూ.5,000 కోట్ల విలువైన బాండ్లను విక్రయించేందుకు గ్రీన్‌షూ ఆప్షన్(ఓవర్ అలాట్మెంట్)ను ఎంచుకుంది. వెరసి బాండ్ ఇష్యూకి రెండు రెట్లు అధికంగా స్పందన లభించింది.ఇదీ చదవండి: లక్ష్యాన్ని మించేలా పన్ను వసూళ్లుబిడ్ చేసిన సంస్థలలో ప్రావిడెంట్ ఫండ్స్, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ తదితరాలున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరల హౌసింగ్ విభాగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులుగా తాజా నిధులను వినియోగించనున్నట్లు వివరించింది. ఎస్బీఐ జారీ చేసిన బాండ్లకు స్థిరత్వ ఔట్లుక్సహా ఏఏఏ రేటింగ్‌ను పొందింది. వీటి జారీతో దీర్ఘకాలిక బాండ్లపై ఇతర బ్యాంకులు సైతం దృష్టి సారించేందుకు వీలు చిక్కినట్లు ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. -
Freedom: స్వేచ్ఛ
సృష్టి లోని జీవులన్నీ కోరుకునేది స్వేచ్ఛ. కాని, అది ఎంత వరకు సాధ్యం? మనమే తల్లి తండ్రులని ఎంచుకుని, పుట్టటం మన చేతుల్లో లేదు అనుకుంటాం. పుట్టిన తరువాత ఇక చేయగలిగినది ఏమీ లేదు. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఆ బంధంలో నుండి బయట పడాలని తాపత్రయం. బొడ్డు కోసి మాయనుండి వేరైన తరువాత అసలైన బంధనాల్లో ఇరుక్కుపోవటం జరిగింది. అప్పటి వరకు ఉన్న జ్ఞానం కూడా పోతుంది. పూర్తిగా తల్లితండ్రుల మీద ఆధారపడతారు. అక్కడి నుండి ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధార పడక తప్పదు. జ్ఞానసముపార్జన కోసం గురువుల మీద ఆధారపడ వలసి వస్తుంది. ఆహారం కోసం అయితే వడ్డించినవారి మీద, వండినవారి మీద, సంబారాలని ఇంటికి తెచ్చినవారి మీద, పంటలు పండించినవారి మీద – ఇట్లా ఎందరి మీదనో ఆధార పడకుండా నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళవు కదా! ముందుగా అవన్నీ తెచ్చుకోవటానికి కావలసిన డబ్బులు ఉండాలి. అవి ఆకాశంలో నుండి ఊడి పడవు. మనం స్వంతంగా తయారు చేయలేము. మఱి, నేను స్వేచ్ఛాజీవిని. ఎవరి మీదా ఆధారపడను అనటం ఎంత సమంజసం? ఆలోచించాల్సిన విషయమే కదా! ఇది ఇరుకుగా ఉన్న గర్భంలో నుండి బయట పడి స్వేచ్ఛాజీవిని అనుకున్న మానవుడికి తాను ఇరుక్కున్న చుట్టరికపు బంధనాల నుండి విడివడాలని అంతర్గతంగా అంతరంగపు అట్టడుగు పొరల్లో మాటుపడి ఉన్న కోరిక. ఈ బంధనాలనే పురాణాలు ప్రతీకాత్మకంగా వృత్రాసురుడు అని చెప్పాయి. చుట్టుకున్నవే చుట్టరికాలు, బంధించేవే బంధనాలు. నిజమైన స్వేచ్ఛ అంటే దేనినీ పట్టుకొని ఉండక పోవటం. దేనినీ పట్టించుకోక పోవటం అనుకుంటారు. నిజమైన స్వేచ్ఛాజీవి అందరికీ సమంగా అందుబాటులో ఉంటాడు. వీరు నాకు ఇష్టులు, మేలు చేసినవారు, బంధువులు, భవిష్యత్తులో నాకు సహాయ పడతారు, నాకు కీడు చేశారు, ఎందుకూ పనికిరారు మొదలైన భావనలతో ప్రవర్తించటం అభిప్రాయాల ఊబిలో కూరుకుపోవటమే. అది వ్యక్తుల విషయం మాత్రమే కాదు, వస్తువులు, సిద్ధాంతాలు మొదలైనవి కూడా. ఎదుటివారి పట్ల ఎటువంటి అభిప్రాయమూ లేకుండా వారికి మేలు కలిగేట్టు తనకు చేతనైనంత వరకు ప్రవర్తించటం, తరువాత ఎటువంటి ప్రతిఫలం కాని, గుర్తింపు కాని ఆశించకుండా ఉండటం స్వేచ్ఛాజీవి లక్షణం. ఏ మాత్రం ఆశించినా అది బంధమే. ఒకవేళ ఏదైనా ప్రతిఫలం లభిస్తే, దానిని ఎటువంటి వ్యామోహం లేకుండా స్వీకరించాలి. ‘‘వద్దు, అది నన్ను బంధిస్తుంది.’’ అని నిరాకరిస్తే, అదే పెద్ద బంధనం అవుతుంది. ‘‘మానవుడు పుట్టుకతో స్వేచ్ఛాజీవి. తరువాత బంధనాలలో ఇరుక్కుంటాడు’’ అన్న ఆంగ్ల సామెత వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నదో చూడండి. నిజంగానే మనం స్వేచ్ఛని అనుభవిస్తున్నామా? స్వేచ్ఛ ఎవరు ఇచ్చేది కాదు. తనంతట తాను అనుభవించ వలసినది. ఆ విధంగా ఉండటానికి చేసే ప్రయత్నమే సాధన అంతా. స్వ+ ఇచ్ఛ అంటే తన అసలైన ఇచ్ఛ, అంటే కోరిక ఏదైతే ఉన్నదో, బంధనాల నుండి విడివడాలని – అది నెరవేరటానికి తగినట్టుగా ఉండగలగటమే స్వేచ్ఛ. దానిని గుర్తించక పోవటం వల్ల స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు ఉండగలగటం, స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం, ఎవరినీ దేనినీ లెక్కచేయకపోవటం అనే అపోహ వ్యాపించి ఉంది లోకంలో. సర్వసంగపరిత్యాగులని చూస్తే ఈ విషయం బాగా తెలుస్తుంది. వారికి ఇల్లు, బంధువులు మొదలైన బంధాలు ఉండవు. పేరు ప్రఖ్యాతులు వంటి చుట్టలలో (వలయాల్లో) ఇరుక్కోరు. ఈ క్షణాన మోక్షం ఇస్తానంటే ఏవో సద్దుకొని వస్తాను అనకుండా ఉన్నవాళ్ళు ఉన్నట్టే బయలుదేరే వారు ఎంత మంది ఉంటారు? అదీ నిజమైన స్వేచ్ఛ అంటే. – డా. ఎన్. అనంత లక్ష్మి -
క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చా?
ప్రాపర్టీ విక్రయించినప్పుడు వచ్చిన లాభం నుంచి పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదా? లేక దీర్ఘకాల మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు కోసం ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ జారీ చేసే సెక్షన్ 54ఈసీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవాలా..? – అనిల్ మిశ్రా ప్రాపర్టీని రెండేళ్లకు పైగా కలిగి ఉన్న తర్వాత విక్రయించినప్పుడు వచ్చిన లాభం నుంచి ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించడం) చేసిన తర్వాత మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రాపర్టీని విక్రయించిన ఆరు నెలల్లోపు క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఈసీ కింద రూ.50 లక్షల వరకు లాభాన్ని మూలధన లాభాల నుంచి మినహాయింపునకు అవకాశం ఉంటుంది. రూ.50 లక్షలపై 20 శాతం పన్ను అంటే రూ.10 లక్షల మేర ఆదా చేసుకున్నట్టు అవుతుంది. ప్రభుత్వ మద్దతు గల ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ తదితర ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ కంపెనీలు జారీ చేసే స్థిరాదాయ సాధనాలనే క్యాపిటల్ గెయిన్ బాండ్లుగా చెబుతారు. క్యాపిటల్ గెయిన్ బాండ్లు ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌తో ఉంటాయి. వీటిపై 5.25 శాతం వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. వడ్డీ ఆదాయాన్ని ఏటా రిటర్నుల్లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి నికరంగా లభించే రేటు 3.68 శాతం. ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చి చూసినప్పుడు క్యాపిటల్ గెయిన్ బాండ్లపై లభించే 5.25 శాతం రేటు చాలా తక్కువ. ఫ్లెక్సీక్యాప్ ఫండ్ గత ఐదేళ్ల కాల సగటు రాబడి 20 శాతంగా ఉంది. ఇప్పుడు పన్ను ఆదా కోసం క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఐదేళ్ల కాలానికి రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, 5.25 శాతం రేటు ప్రకారం గడువు తీరిన తర్వాత రూ.63 లక్షలు సమకూరుతుంది. అదే 20 శాతం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (రూ.10లక్షలు) చెల్లించి, మిగిలిన రూ.40 లక్షలను ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లలో రూ.70 లక్షలు సమకూరుతుంది. ఈ గణాంకాలను పరిశీలించి చూసినప్పుడు మూలధన లాభాల పన్ను చెల్లించి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడమే మేలని అనిపిస్తుంది. కానీ, ఈక్విటీల్లో మెరుగైన రాబడి వస్తుందని చెప్పి మొత్తం తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయడం సంక్లిష్టం కావచ్చు. ఐదేళ్లు, అంతకుమించిన కాలాలకు ఈక్విటీల్లో మెరుగైన రాబడులు వస్తాయి. కానీ ఇదేమీ గ్యారంటీడ్ కాదు. ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, క్యాపిటల్ గెయిన్ బాండ్లు హామీతో కూడిన రాబడిని ఇస్తాయి. రిస్క్ లేని రాబడి కోరుకునేట్టు అయితే, ఐదేళ్ల తర్వాత కచ్చితంగా పెట్టుబడి మొత్తం కావాల్సిన వారు క్యాపిటల్ గెయిన్ బాండ్లకు వెళ్లొచ్చు. కొంత రిస్క్ తీసుకుని, అవసరమైతే ఐదేళ్లకు అదనంగా మరికొంత కాలం పాటు ఇన్వెస్ట్ చేసేట్టు అయితే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ పథకాలకు కేటాయించుకోవచ్చు. ఎస్సీఎస్ఎస్ ఖాతాను ఎనిమిదేళ్ల తర్వాత కూడా పొడిగించుకోవచ్చా..? – గురునాథ్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) నిబంధనల్లో సవరణ చోటు చేసుకుంది. ఈ పథకం కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత కోరుకుంటే మరో మూడేళ్ల కాలానికి దీన్ని పొడిగించుకోవచ్చు. ఇలా ఒక్కసారి మాత్రమే పొడిగింపునకు అవకాశం ఉండేది. ఆ తర్వాత కూడా అందులోనే ఇన్వెస్ట్మెంట్ కొనసాగించాలంటే, ఉపసంహరించుకుని మళ్లీ తాజాగా ఖాతా తెరవాల్సి వచ్చేది. ఈ నిబంధనను మార్చారు. ఇకపై ఐదేళ్ల ప్రాథమిక కాల వ్యవధి ముగిసిన తర్వాత నుంచి.. మూడేళ్లకు ఒకసారి చొప్పున ఖాతాను పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. అంతేకానీ, ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ కొత్త ఖాతా తెరవాల్సిన అవసరం ఉండదు. గడువు పొడిగించే సమయంలో ఉన్న రేటు తదుపరి కాలానికి వర్తిస్తుంది. ఇందులో ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. ఇప్పటికే పెట్టుబడి పెట్టి ఐదేళ్లు పూర్తయి ఉంటే, కొనసాగించుకోవడం వల్ల తదుపరి మూడేళ్ల కాలానికే 8.2 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. దీనికి బదులు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుని, తిరిగి తాజాగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఐదేళ్ల కాలానికి 8.2 శాతం గరిష్ట రేటును పొందొచ్చు. -
బాండ్ల పునర్వ్యవస్థీకరణకు వేదాంత బాండ్‌హోల్డర్ల ఓకే
న్యూఢిల్లీ: నాలుగు సిరీస్‌ల బాండ్లను పునర్వ్యవస్థీకరించేందుకు బాండ్హోల్డర్లు సమ్మతించినట్లు వేదాంత గ్రూప్ మాతృ సంస్థ వేదాంత రిసోర్సెస్ తెలిపింది. ఈ బాండ్ల సిరీస్‌లో చెరి 1 బిలియన్ డాలర్ల విలువ చేసే రెండు ఇష్యూలు, 1.2 బిలియన్ డాలర్లది ఒకటి, 600 మిలియన్ డాలర్లది మరొకటి ఉన్నాయి. ఇవి 2024 నుంచి 2026 మధ్య మెచ్యూర్ అవుతాయి. తాజా పరిణామం నేపథ్యంలో తదుపరి ప్రణాళిక గురించి చర్చించేందుకు జనవరి 4న వేదాంత ఇన్వెస్టర్ల సమావేశం నిర్వహించనుంది. భారీ రుణభారాన్ని తగ్గించుకునే దిశగా వేదాంత రిసోర్సెస్ నాలుగు సిరీస్‌ల బాండ్ల పునర్వ్యవస్థీకరణను తలపెట్టింది. -
గోల్డ్ బాండ్ @ రూ. 6,199
ముంబై: తదుపరి దశ సావరిన్ గోల్డ్ బాండ్ల(ఎస్జీబీ)కు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజాగా ధరను ప్రకటించింది. ఒక గ్రాము బాండుకు రూ. 6,199ను నిర్ణయించింది. వీటి సబ్‌్రస్కిప్షన్ ఈ నెల సోమవారం(18న) ప్రారంభమై ఐదు రోజులపాటు కొనసాగనుంది. ఎస్జీబీ పథకం 2023–24– సిరీస్–3లో భాగంగా ఆర్బీఐ ఈ నెల 18–22 మధ్య పసిడి బాండ్ల సబ్ర్స్కిప్షన్కు తెరతీస్తోంది. స్మాల్, పేమెంట్, గ్రామీణ బ్యాంకులు మినహా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు వీటిని విక్రయిస్తాయి. వీటితోపాటు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, క్లియరింగ్ కార్పొరేషన్, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పూర్తి స్వచ్ఛత(999)గల పసిడి సగటు ముగింపు ధర ఆధారంగా గ్రాముకు రూ. 6,199 ధరను నిర్ధారించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఆర్బీఐతో చర్చల తదుపరి కేంద్ర ప్రభుత్వం గ్రాముకు రూ. 50 చొ ప్పున ఇన్వెస్టర్లకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేసేందుకు నిర్ణయించింది. అయితే ఇందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడంతోపాటు.. డిజిటల్ విధానంలో చెల్లింపులు చేపట్టవలసి ఉంటుంది. వెరసి గోల్డ్ బాండ్ రూ. 6,149కు లభించనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. కాగా.. ఎస్జీబీ సిరీస్–4లో భాగంగా వచ్చే (2024) ఫిబ్రవరి 12–16 మధ్య బాండ్లను ఆఫర్ చేయనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. -
కార్పొరేట్ బాండ్ల భారీ వృద్ధి.. 2030 కల్లా రూ.110 లక్షల కోట్లకు
ముంబై: రానున్న కాలంలో కార్పొరేట్ బాండ్ల మార్కెట్ భారీగా విస్తరించనున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ తాజాగా పేర్కొంది. దీంతో 2030 మార్చికల్లా కార్పొరేట్ బాండ్ మార్కెట్ పరిమాణం రెట్టింపుకానున్నట్లు అభిప్రాయపడింది. వెరసి రూ.110 లక్షల కోట్ల మార్క్‌ను దాటే వీలున్నట్లు అంచనా వేసింది. పెట్టుబడి వ్యయాలకు దన్ను, ఆకట్టుకుంటున్న మౌలిక సదుపాయాల రంగం, పొదుపును ఫైనాన్షియలైజ్ చేయడం వంటి అంశాలు ఇందుకు దోహదం చేయనున్నట్లు వివరింంది. 2023 మార్చివరకూ గత ఐదేళ్లలో కార్పొరేట్ బాండ్ మార్కెట్ వార్షికంగా 9 శాతం వృద్ధి చెంది ర. 43 లక్షల కోట్లకు చేరినట్లు నివేదికలో క్రిసిల్ పేర్కొంది. ఈ బాటలో 2030 మార్చికల్లా రెట్టింపునకుపైగా ఎగసి రూ. 100–120 లక్షల కోట్లను తాకనున్నట్లు అంచనా వేసింది. నియంత్రణ సంస్థల మధ్యవర్తిత్వం కూడా ఇందుకు సహకరించనున్నట్లు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ సోమశేఖర్ వేమూరి పేర్కొన్నారు. గరిష్టస్థాయిలోని సామర్థ్య వినియోగం, కార్పొరేట్ రంగ పటిష్టత, బలమైన బ్యాలన్స్‌షీట్లు, ఆర్థిక పురోభివృద్ధి అంచనాలు పెట్టుబడి వ్యయాల్లో వృద్ధికి కారణంకానున్నట్లు క్రిసిల్ వివరింంది. దీంతో 2027కల్లా రూ. 110 లక్షల కోట్ల పెట్టుబడులు నవెదుకావచ్చని అభిప్రాయపడింది. అంచనా పెట్టుబడి వ్యయాలలో ఆరో వంతు కార్పొరేట్ బాండ్ మార్కెట్ సమకూర్చవచ్చని పేర్కొంది. మౌలిక రంగానికి మౌలిక రంగ ఆస్తుల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్ బలపడుతుండటం, వేగవంత రికవరీ వంటి అంశాల నేపథ్యంలో దీర్ఘకాలిక రుణాలకు అవకాశాలు మెరుగుపడనున్నట్లు క్రిసిల్ తెలియజేసింది. ప్రస్తుతం కార్పొరేట్ బాండ్ల జారీ నిధుల్లో 15 శాతం మౌలిక రంగానికి చేరుతున్నట్లు తెలియజేసింది. ఏఏ రేటింగ్ కార్పొరేట్ బాండ్ల జారీపై పెట్టుబడి నియంత్రణలను సరళతరం చేయడంతో పెన్షన్ ఫండ్స్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్‌ను వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామిక వృద్ధికి సహకరించే వీలున్నట్లు క్రిసిల్ డైరెక్టర్ రమేష్ కరుణాకరన్ వివరించారు. రిటైల్ విభాగంలో పెరుగుతున్న రుణ అవసరాలను తీర్చేందుకు నాన్‌బ్యాంక్ రుణదాతల నుంచి సైతం కార్పొరేట్ బాండ్లకు డిమాండ్ కనిపించనున్నట్లు క్రిసిల్ నివేదిక పేర్కొంది. నాన్‌బ్యాంక్ రుణదాతలు అధిక స్థాయిలో రుణాలను రిటైలర్లకు అందిస్తుండటంతో దేశ జీడీపీలో రిటైల్ క్రెడిట్ 30 శాతానికి చేరింది. యూఎస్‌లో ఇది 54 శాతంకాగా.. ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్ ప్రొడక్టులలో గరిష్టంగా పెట్టుబడులు మళ్లుతున్నట్లు తెలియజేసింది. -
Electoral bonds case: పలు సమస్యలున్నాయి!
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లతో పలు సమస్యలున్నాయంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విరాళాలు పొందేందుకు పారీ్టలన్నింటికీ అవి సమానావకాశం కలి్పంచకపోతే వివక్షే అవుతుందని అభిప్రాయపడింది. ‘అంతేగాక ఈ పథకంలో అస్పష్టత కూడా దాగుంది. బాండ్లు కొనేవారి వివరాలు ఎవరికీ తెలియకుండా సంపూర్ణ గోప్యత పాటించడమూ వీలు కాదు. వారి వివరాలను సంబంధిత బ్యాంకు (ఎస్బీఐ), దర్యాప్తు సంస్థలు తెలుసుకునే వీలుంది’ అని అభిప్రాయపడింది. అంతేగాక విపక్షాల బాండ్లను కొనేవారిపై అధికార పక్షాలు ప్రతీకారానికి దిగకుండా ఎటువంటి రక్షణా లేదని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘ఏ పార్టీ ఎంత పవిత్రమైనదో తేల్చడం మా ఉద్దేశం కాదు. ఎన్నికల బాండ్ల పథకానికి రాజ్యాంగబద్ధత ఉందా లేదా అన్నదానిపై మాత్రమే విచారణ జరుపుతున్నాం’’ అని స్పష్టం చేశారు. ఎన్నికల బాండ్ల చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన 4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సీజేఐ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం రోజంతా విచారణ జరిపింది. ‘‘ఎన్నికల ప్రక్రియలో నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలన్న ఈ పథకం ఉద్దేశం అభినందనీయమే. కానీ ఈ పథకంలో అతి పెద్ద సమాచార లోపముంది’’ అని అభిప్రాయపడింది. ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా, జస్టిస్ గవాయ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా సభ్యులుగా ఉన్నారు. -
ఎస్బీఐ నిధుల సమీకరణ - బాండ్ల జారీతో రూ. 10,000 కోట్లు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ బాండ్ల జారీ ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకుంది. 7.49 శాతం కూపన్ రేటుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను జారీ చేసినట్లు వెల్లడించింది. వెరసి ఎస్బీఐ నాలుగోసారి ఇన్ఫ్రా బాండ్ల జారీని చేపట్టగా.. నిధులను మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరల గృహ నిర్మాణ ప్రాజెక్టులకు కేటాయించనుంది. నిజానికి ఎస్బీఐ రూ. 4,000 కోట్లు సమీకరించేందుకు బాండ్ల ఇష్యూకి తెరతీసింది. అయితే ఐదు రెట్లు అధికంగా అంటే రూ. 21,045 కోట్ల విలువైన 134 బిడ్స్ దాఖలయ్యాయి. ప్రావిడెండ్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ తదితరాల నుంచి సబ్స్క్రిప్షన్ లభించినట్లు ఎస్బీఐ పేర్కొంది. ఇక ఇదే మార్గంలో ఆగస్ట్‌లోనూ బ్యాంక్ రూ. 10,000 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఇష్యూతో కలిపి మొత్తం రూ. 39,718 కోట్ల విలువైన దీర్ఘకాలిక బాండ్లను జారీ చేసినట్లయ్యింది. -
నామినీ నమోదు చేశారా?
ప్రతి ఒక్కరి జీవితంలో పెట్టుబడులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. తమ సంపదను వృద్ధి చేసుకునేందుకు ఎన్నో రూపాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సొంతిల్లు సమకూర్చుకోవాలని, వారసులకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని.. ఇలాంటి ముఖ్యమైన ఎన్నో జీవిత లక్ష్యాల కోసం పలు రకాల సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిపాజిట్లు, బాండ్లు, జీవిత బీమా ప్లాన్లు, పీపీఎఫ్ ఇలా ఎన్నో ఆర్థిక సాధనాలు వ్యక్తుల ఆర్థిక ప్రణాళికల్లో భాగంగా ఉంటాయి. అయితే, జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చెప్పలేం. దురదృష్టం కొద్దీ ఈ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? ఆ పెట్టుబడులనేవి జీవిత భాగస్వామి లేదా వారసులకు సాఫీగా, సులభంగా, వేగంగా బదిలీ అవ్వాలి. అందుకు ఓ చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదే నామినేషన్ నమోదు చేయడం. తమకు అత్యంత ఆప్తులైన వారిలో ఒకరి పేరును నామినీగా ప్రతి పెట్టుబడి సాధనంలోనూ నమోదు చేయాలి. నామినేషన్ లేని సందర్భాల్లో క్లెయిమ్ కోసం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కనుక నామినేషన్ ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. నామినీ అంటే ఎవరు..? పెట్టుబడిదారు మరణించిన సందర్భాల్లో వారి పేరిట ఉన్న పెట్టుబడులను క్లెయిమ్ చేసుకుని, వాటిని పొందే హక్కును కలిగిన వ్యక్తి నామినీ అవుతారు. ఎక్కువ మంది నామినీగా కుటుంబ సభ్యులనే ముందుగా నియమించుకుంటారు. జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా తల్లిదండ్రులు నామినేషన్ విషయంలో ప్రథమ ఎంపికగా ఉంటారు. అవివాహితులై, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు కూడా లేని సందర్భాల్లో అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులైన వారిని, స్నేహితులను నామినీగా నియమించుకోవచ్చు. నామినీకి ఎవరు అయినా అర్హులే. కాకపోతే అంతిమంగా దీని ప్రయోజనం నెరవేరేలా నామినేషన్ ఉండాలన్న అంశాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ నామినీగా మైనర్‌ను పేర్కొంటే, సంబంధిత నామినీ సంరక్షకుడి పేరు, చిరునామా, కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలి. ఎంతో ప్రాధాన్యం.. 3నామినేషన్ నమోదు చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో.. అతని పేరిట ఉన్న పెట్టుబడులు నామినీకి చాలా సులభంగా బదిలీ అవుతాయి. నామినీని నమోదు చేయకపోతే.. అప్పుడు ఆ పెట్టుబడులను వారసులే క్లెయిమ్ చేయగలరు. చట్ట ప్రకారం తామే వారసులమని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. వీటిని స్థానిక తహసీల్దార్ లేదా కోర్టు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సమయంతోపాటు, శ్రమ కూడా పడాలి. ముఖ్యంగా కోర్టు నుంచి లీగల్ హేర్ సర్టిఫికెట్ తీసుకుని సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ రిజిస్టర్ చేస్తే ఇలాంటి ఇబ్బందులేమీ ఉండవు. పెట్టుబడిదారు డెత్ సర్టిఫికెట్ ఒక్కటి సరిపోతుంది. ఒక అప్లికేషన్, దానికితోడు కేవైసీ వివరాలు సమర్పిస్తే చాలు. ప్రక్రియ సులభంగా ముగుస్తుంది. వేటికి?..: బీమా పాలసీ తీసుకోవడం వెనుక ఉద్దేశం తమకు ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే. అంత ముఖ్యమైన బీమా ప్లాన్ దరఖాస్తులో నామినేషన్ నమోదు చేయకపోతే? అర్థమే ఉండదు. అలాంటప్పుడు పరిహారం దక్కించుకునేందుకు కుటుంబ సభ్యులు శ్రమ పడాల్సి వస్తుంది. అలాగే బ్యాంకు ఖాతాకు సైతం నామినేషన్ ఉండాలి. అప్పుడు ఖాతాలో బ్యాలన్స్ మొత్తాన్ని నామినీ సులభంగా పొందడానికి వీలవుతుంది. అకౌంట్ హోల్డర్ మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు, నామినీ కేవైసీ వివరాలను బ్యాంకు శాఖలో సమర్పించడం ద్వారా వాటిని సొంతం చేసుకోవచ్చు. అలాగే, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ నామినేషన్ ఉండాలి. ఇంకా పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్, అన్ని పోస్టాఫీసు పథకాలకు నామినేషన్ నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే నామినేషన్ నమోదు చేయడం తప్పనిసరి కాదు. అయినా కానీ, నమోదు చేయడం బాధ్యతగా భావించాలి. ప్రతి పెట్టుబడి దరఖాస్తులో నామినేషన్ కాలమ్‌ను తప్పకుండా పూరించాలి. ఎంత మంది? నామినీలు ఎంత మంది అనే విషయం ఆయా పెట్టుబడి సాధనాల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జీవిత బీమా పాలసీ అయితే ఎంత మందిని అయినా నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. ఒకరికి మించి నామినీగా పేర్లు ఇచ్చినప్పుడు, విడిగా ఒక్కొక్కరికీ ఎంత శాతం చొప్పున క్లెయిమ్‌కు అర్హత అనేది కూడా పేర్కొనాలి. ఉదాహరణకు ముగ్గురిని నామినీలుగా నమోదు చేశారనుకుందాం. అప్పుడు ఏకి 50 శాతం, బీకి 30 శాతం, సీకి 20 శాతం లేదా తమకు నచ్చిన విధంగా ఈ శాతాన్ని నిర్ణయించుకోవచ్చు. బ్యాంకు ఖాతాలకు అయితే సాధారణంగా ఒక్కటే నామినేషన్ ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాకు కూడా ఒకటికి మించి నామినేషన్లు ఇవ్వొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు నామినేషన్ కింద ముగ్గురి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కొందరు తమపై ఆధారపడిన ఒంటరి తల్లి లేదా తండ్రికీ కొంత పెట్టుబడుల మొత్తం వెళ్లాలని కోరుకుంటారు. అలాంటప్పుడు విల్లు రాసి అందులో ఎవరికి ఏమి చెందాలో పేర్కొనాలి. లేదంటే నామినేషన్లో తల్లిదండ్రులకూ ఇంత శాతం చొప్పున వాటా ఇవ్వాలి. సవరణ..: నామినేషన్ ఇవ్వడంతో పని ముగిసిపోయిందని అనుకోవద్దు. ఏడాదికోసారి సంబంధిత నామినేషన్‌ను సమీక్షించుకోవాలి. అప్పటికే నామినీగా పేర్కొన్న వ్యక్తులతో తమకున్న అనుబంధాన్ని విశ్లేషించుకోవాలి. తమకు ఏదైనా జరిగితే వారు ఆస్తులను క్లెయిమ్ చేసుకునేందుకు సరైన వారేనా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కొందరు వైవాహిక బంధం నుంచి వేరు పడుతుంటారు. మరొకరిని వివాహం చేసుకుంటారు. అవివాహితులు వైవాహిక జీవితంలోకి ప్రవేశించొచ్చు. లేదా నామినీగా పేర్కొన్న వ్యక్తి మరణించి ఉండొచ్చు. మరేదైనా కారణం ఉండొచ్చు. నామినీగా నమోదు చేసిన వ్యక్తి ఆచూకీ లేకుండా పోతే, అప్పుడు అసలు ఉద్దేశమే నెరవేరదు. అందుకే నామినేషన్‌ను ఏడాదికోసారి సమీక్షించి, సవరించుకోవాలి. ఊహించని అనుభవం 2021లో మద్రాస్ హైకోర్టు ఓ సంచలనాత్మక తీర్పునిచ్చింది. తన భర్త మరణంతో జీవిత బీమా పాలసీ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకునే విషయమై ఒక మహిళకు తన మామతో విభేదాలు ఏర్పడ్డాయి. కోర్టును ఆశ్రయించగా, ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కారణం ఆమె భర్త తీసుకున్న జీవిత బీమా పాలసీ ప్రీమియంలను తండ్రి (బాధితురాలి మామ) చెల్లించడమే. పైగా మరణించిన వ్యక్తి తన జీవిత బీమా పాలసీలో నామినీని నమోదు చేయలేదు. విల్లు కూడా రాయలేదు. ప్రీమియంలను పాలసీదారు సొంతంగా చెల్లించనప్పుడు, ఆ పాలసీ ప్రయోజనాలకు జీవిత భాగస్వామి వారసురాలని తేల్చడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. నామినీని నమోదు చేయకపోవడంతో, ప్రీమియం చెల్లించిన తండ్రికి ఆ పాలసీ ప్రయోజనాలపై అధికారాలు ఉంటాయని ఈ ఘటన స్పష్టం చేసింది. సరైన నిర్ణయం మనలో కొందరు తమ పిల్లల పేరిట జీవిత బీమా పాలసీలను తీసుకుని తొలుత వారే ప్రీమియం చెల్లిస్తుంటారు. కనుక పెళ్లయిన వ్యక్తులు వెంటనే జీవిత బీమా పాలసీల్లో తమ జీవిత భాగస్వామిని నామినీగా నమోదు చేయాలి. లేదంటే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. అందుకే సరైన వ్యక్తిని నామినీగా నమోదు చేసుకోవాలి. లేదంటే విల్లు రాసి రిజిస్టర్ చేసుకోవాలి. ముఖ్యంగా జీవిత బీమా పాలసీల ఉద్దేశం నెరవేరాలంటే అందుకు నామినేషన్ మెరుగైన మార్గం. చాలా కేసుల్లో వ్యక్తి మరణంతో జీవిత భాగస్వామిపైనే ఆర్థిక బాధ్యతల భారం పడుతుంది. కనుక జీవిత భాగస్వామినే నామినీగా నమోదు చేసుకోవాలి. కుటుంబం కోసం ఒక పాలసీ, ఒంటరి తల్లి లేదా తండ్రి లేదా తనపై ఆధారపడిన తల్లిదండ్రుల కోసం విడిగా మరో పాలసీ తీసుకునే వారు.. ఆయా పాలసీల్లో తప్పనిసరిగా నామినీని పేర్కొనాలి. నామినేషన్ గడువు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు కలిగిన వారు, ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా కలిగిన వారు తప్పనిసరిగా నామినీ విషయంలో ఆప్షన్ ఇవ్వాలని సెబీ ఆదేశాలు తీసుకొచ్చింది. 2023 మార్చి 31 వరకే ఉన్న గడువును, సెస్టెంబర్ 30 వరకు పొడిగించింది. కనుక ఇన్వెస్టర్లు వచ్చే సెప్టెంబర్ 30 నాటికి నామినేషన్ ఇవ్వాలి. నామినేషన్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ‘ఆప్ట్ అవుట్ ఆఫ్ నామినేషన్’ను ఎంపిక చేసుకోవాలన్నది నిబంధన. అంటే నామినేషన్ నుంచి వైదొలగడం. కానీ, సెబీ ఆదేశాల ఉద్దేశం అది కాదు. నామినేషన్ విలువ తెలియజేసి, ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా చేయడమే. ఇక జీవిత బీమా ప్లాన్లు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి నామినేషన్ నమోదు తప్పనిసరి కాదు. అయినా కానీ, నామినేషన్ ఇవ్వడం తన బాధ్యతగా ఇన్వెస్టర్ గుర్తించాలి. -
సావరిన్ గోల్డ్ బాండ్స్‌ను ఎలా కొనుగోలు చేయాలి?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)కి సంబంధించి మొదటి విడత సావరిన్ గోల్డ్ బాండ్ల (Sovereign Gold Bond) ఇష్యూ సోమవారం(6న) ప్రారంభమైంది. ఈ నెల 10న ముగియనున్న ఇష్యూలో భాగంగా గ్రాముకి ముందస్తు(నామినల్) ధర రూ. 5,611ను ఆర్బీఐ నిర్ణయించింది. వీటి కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఈ బాండ్లను చివరి సారిగా గత ఏడాది డిసెంబర్ నెలలో ఆర్బీఐ జారీ చేసింది. అప్పుడు గ్రాముకు రూ. 5,409గా ఉంది. ప్రస్తుతం రూ.200 పెరిగింది. ఈ సందర్భంగా సావరిన్ గోల్డ్ బాండ్స్ గురించి ముఖ్య విషయాలు.. ►అధిక ద్రవ్యోల్బణం, రాబోయే గ్లోబల్ మార్కెట్ల అస్థిరత, ఈక్విటీ మార్కెట్ల పనితీరును పరిగణలోకి తీసుకుంటే సావరిన్ గోల్డ్ బాండ్(sgb)లో 10-15 శాతం పెట్టుబడులు పెట్టడం మంచిదని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ►ఎస్జీబీ బాండ్స్ ఇతర డిజిటల్ ఆస్తుల కంటే భిన్నం. ఎందుకంటే గోల్డ్ బాండ్ సాయంతో సంవత్సరానికి 2.50 శాతం వడ్డీ రేటును కూడా పొందవచ్చు. ►ఇష్యూ ధరకు జీఎస్టీతో పాటు ఇతర ఛార్జీలు లేనందున బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే అనువైన సమయం ►సబ్స్క్రిప్షన్ వ్యవధికి ముందు వారంలోని చివరి మూడు పని దినాల సగటు ముగింపు ధర ఆధారంగా ఇష్యూ ధర నిర్ణయించబడుతుంది. ఈ రేట్లను ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించింది. రేట్లను నిర్ణయించడానికి 999 స్వచ్ఛత బంగారం ధరను పరిగణలోకి తీసుకుంటుంది ఆర్బీఐ. ►డిజిటల్ మోడ్‌లో చెల్లింపులు చేసే వారికి గ్రాముకు రూ. 50 ధర తగ్గుతుంది. ►ఈ బాండ్లలో ఏడాదికి గరిష్టంగా 4 కిలోల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. కనీస పరిమితి 1 గ్రాము బంగారం ► బాండ్లు ఎనిమిదేళ్ల కాలపరిమితితో వస్తాయి. ఆకస్మికంగా వైదొలగాల్సి వస్తే పెట్టుబడిదారుడు కూపన్ చెల్లింపు తేదీకి కనీసం ఒక రోజు ముందు సంబంధిత బ్యాంక్/పోస్టాఫీసును సంప్రదించాలి. ►ఎస్‌జీబీలో పెట్టుబడి పెట్టినప్పుడు, హోల్డింగ్ సర్టిఫికేట్‌ను పొందవచ్చు. మీరు దీన్ని డీమ్యాట్ రూపంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే తక్కువ లిక్విడిటీ కారణంగా కొన్నిసార్లు ఎక్స్ఛేంజీలలో విక్రయించడం కష్టం. ►ముఖ్యంగా, మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత ఎస్జీబీ ఎలాంటి పన్ను విధించదు. అయితే, మీరు దానిని 36 నెలల ముందు విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభాలుగా పన్ను విధించబడుతుంది. మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను ఆర్బీఐ పన్ను విధిస్తుంది. 36 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచిన బంగారం కోసం, ఇది దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణించబడుతుంది. ఇండెక్సేషన్ తర్వాత 20 శాతం పన్ను విధిస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్లను దొంగిలించినా నష్టం ఉండదు గోల్డ్ ఓ సెంటిమెంట్, గోల్డ్ ఒక ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ ఒక జ్వువెలరీ, ఒక కమోడిటీ. ఇలాంటి బంగారానికి డిమాండ్ తగ్గించేందుకు 2015లో ప్రధాని మోదీ చేతుల మీదిగా కేంద్రం 3 కొత్త స్కీమ్‌లను ప్రారంభించింది. బాండ్ల రూపంలో బంగారం అమ్మకాలు, గోల్డ్ కాయిన్స్ అమ్మకం,గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లను అందుబాటులోకి తెచ్చారు. పథకం ప్రారంభించే సమయంలో మోదీ మాట్లాడుతూ.. దేశంలో నిరుపయోగంగా ఉన్న బంగారు నిల్వలను ఉపయోగంలోకి తీసుకొని వచ్చేందుకు ఈ కొత్త పథకాల్ని స్టార్ట్ చేసినట్లు చెప్పారు. బంగారాన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మానిటైజ్ చేసుకునేలా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, బాండ్ల రూపంలో బంగారం అమ్మకాలు, అశోక్ చక్రం ముద్రతో గోల్డ్ కాయిన్స్ అమ్మకాలు జరుపుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు 20వేల టన్నులున్న బంగారం పేద దేశం ఎలా అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసిన మోదీ.. ‘‘బాండ్ల ద్వారా బంగారానికి భద్రత ఉంటుంది. ఇంట్లో బంగారాన్ని దాచుకోవాలంటే భయంగా ఉంటుంది. బాండ్లను ఎవరైనా దొంగిలించినా నష్టం ఉండదని ’’ ప్రధాని మోదీ స్పష్టం చేశారు. -
మున్సిపల్ బాండ్ ఇండెక్స్‌ను ప్రారంభించిన ఎన్ఎస్ఈ
న్యూఢిల్లీ: ఎన్ఎస్ఈ అనుబంధ విభాగమైన ఎన్ఎస్ఈ ఇండిసెస్ మొదటిసారిగా మున్సిపల్ బాండ్ ఇండెక్స్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు నిధులు సమీకరణ కోసం జారీ చేసే మున్సిపల్ బాండ్లను ‘నిఫ్టీ ఇండియా మున్సిపల్ బాండ్ ఇండెక్స్’ ట్రాక్ చేస్తుంటుంది. అన్ని రకాల మెచ్యూరిటీలు, ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ క్రెడిట్ రేటింగ్‌ల వివరాలు ఇందులో ఉంటాయి. శుక్రవారం బెంగళూరులో మున్సిపల్ డెట్ సెక్యూరిటీలపై సెబీ నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఈ సూచీని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సూచీలో 28 మున్సిపల్ బాండ్లు ఉన్నాయి. 10 మున్సిపల్ కార్పొరేషన్లు వీటిని జారీ చేశాయి. ఏఏ క్రెడిట్ రేటింగ్ విభాగంలో ఉన్నాయి. ఎంత మేర నిధులు చెల్లించాల్సి ఉందనే ఆధారంగా ఒక్కో బాండ్‌కు వెయిటేజీ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్లు అభివృద్ధి ప్రాజెక్టులకు కావాల్సిన నిధులను ఇలా సెక్యూరిటీల జారీ ద్వారా సమీకరించుకోవచ్చు. -
దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలోని అధిక ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? చాలా మందికి దీన్ని తెలుసుకోవాలని ఉంటుంది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ సర్వే పరిశీలిస్తే.. అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తులకు (యూహెచ్ఎన్డబ్ల్యూఐ/అధిక ధనవంతులు) అత్యంత ఇష్టమైన పెట్టుబడి సాధనం ఈక్విటీలే అని తెలుస్తోంది. 34% పెట్టుబడులను ఈక్విటీలకే కేటాయిస్తున్నారు. ఆ తర్వాత వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో 25 శాతం, బాండ్లలో 16 శాతం, ప్రైవేటు ఈక్విటీ/వెంచర్ క్యాపిటల్ రూపంలో 10 శాతం, బంగారంలో 6 శాతం, ఇతర ఇష్టమైన వస్తువులపై (కళాకృతులు, కారు) 4% చొప్పున పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిసింది. నైట్ ఫ్రాంక్ సంస్థ అంతర్జాతీయంగా సర్వే నిర్వహించి ‘ద వెల్త్ రిపోర్ట్ అవుట్‌లుక్ 2023’పేరుతో విడుదల చేసింది. సర్వే ఫలితాలు.. ► దీర్ఘకాలంలో ఎంతో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 88 శాతం మంది భారతీయ అధిక ధనవంతుల సంపద 2022లో వృద్ధి చెందింది. ► గతేడాది 10 శాతానికి పైగా తమ సంపద పెరిగినట్టు 35 శాతం మంది చెప్పారు. ► ఈ ఏడాది కూడా తమ సంపద కనీసం 10 శాతం వృద్ధి చెందుతుందని 53 శాతం మంది అధిక ధనవంతులు అభిప్రాయపడుతున్నారు ► 47 శాతం మంది 10 శాతానికి పైనే పెరగొచ్చన్న అంచనాతో ఉన్నారు. ► అంతర్జాతీయంగా.. సంపన్నుల కంటే ధనవంతులే ఈక్విటీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ► మన దేశంలో అధిక ధనవంతులు కనీసం ఒక్కొక్కరు 5 నివాస ఆస్తులను కలిగి ఉన్నారు. అంతర్జాతీయంగా ఇది 4.2గానే ఉంది. ► 2022లో 14 శాతం మంది అధిక ధనవంతులు ఇంటిని కొనుగోలు చేయగా, 2023లో 10 శాతం మంది ఇంటిని కొనుగోలు చేస్తారని అంచనా. ► యూకే, యూఏఈ, యూఎస్ఏ ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్య ప్రాంతాలుగా ఉన్నాయి. చదవండి: సేల్స్ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నంబర్ వన్! -
ఇక కార్పొరేట్ బాండ్ సూచీల్లో ఫ్యూచర్ కాంట్రాక్టులు
న్యూఢిల్లీ: బాండ్ మార్కెట్లో లిక్విడిటీని పెంచే దిశగా కార్పొరేట్ బాండ్ సూచీల్లో ఫ్యూచర్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టడానికి స్టాక్ ఎక్సే్చంజీలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించింది. ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను హెడ్జ్ చేసుకునేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. సెబీ సర్క్యు లర్ ప్రకారం సూచీలోని బాండ్లకు సముచిత స్థాయి లో లిక్విడిటీ ఉండాలి. సూచీలో కనీసం 8 ఇష్యూయర్లు ఉండాలి. ఏ ఒక్క ఇష్యూయర్ వెయిటేజీ 15 శాతానికి మించకూడదు. నిర్దిష్ట గ్రూప్ ఇష్యూయర్లకు (ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు మొదలైనవి మినహా) వెయిటేజీ మొత్తం మీద 25 శాతం మించకూడదు. కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ (సీబీఐఎఫ్) కాంట్రాక్టు విలువ రూ. 2 లక్షలకు తగ్గకూడదు. మూడేళ్ల వ్యవధికి ఈ కాంట్రాక్టులను ప్రవేశపెట్టొచ్చు. సోమ వారం నుంచి శుక్రవారం వరకు ట్రేడింగ్ వేళలు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5 గం.ల దాకా ఉంటాయి. చదవండి: ఇంత కథ నడిచిందా!, చోక్సీ భారత్ రాకుండా లంచాలు ఎరచూపుతున్నారా? -
బాండ్ల జారీ ద్వారా రూ.105 కోట్లు: అపోలో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో ఐసీఐసీఐ బ్యాంక్‌నకు నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేయడం ద్వారా రూ.105 కోట్లు సమీకరించనున్నట్టు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైసెస్ బుధవారం తెలిపింది. ఒక్కొక్కటి రూ.10 లక్షల విలువైన 1,050 ఎన్సీడీలను జారీ చేసేందుకు డైరెక్టర్ల కమిటీ ఆమోదం తెలిపిందని కంపెనీ వెల్లడించింది. ఎన్ఎస్ఈ హోల్‌సేల్ డెట్ మార్కెట్లో వీటిని లిస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
తొలిసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీ, రూ.10వేల కోట్లు సమకూర్చుకున్న ఎస్బీఐ
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) తొలిసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను జారీ చేసింది. తద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకుంది. దీంతో ఒకేసారి ఇన్ఫ్రా బాండ్ల జారీ ద్వారా భారీస్థాయిలో నిధులను సమీకరించిన దేశీ ఫైనాన్షియల్ దిగ్గజంగా నిలిచింది. మౌలికసదుపాయాలు, అందుబాటు ధరల హౌసింగ్ విభాగానికి రుణాలను అందించనుంది. వార్షికంగా 7.51 శాతం కూపన్ రేటుతో పదేళ్ల కాలపరిమితికి ఈ బాండ్లను జారీ చేసింది. వీటి కొనుగోలుకి 3.27 రెట్లు అధికంగా రూ. 16,366 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. ప్రభుత్వ సెక్యూరిటీలతో పోలిస్తే 0.17 శాతం ఈల్డ్ వ్యత్యాసం(స్ప్రెడ్)తో బాండ్ల జారీని చేపట్టింది. మౌలిక అభివృద్ధి అత్యంత కీలకమని బాండ్ల విజయవంత విక్రయంపై ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా స్పందించారు. అతిపెద్ద రుణదాత సంస్థగా సామాజిక, పర్యావరణహిత, తదితర ఇన్ఫ్రా ప్రాజెక్టులు ముందుకుసాగేందుకు సహకరించనున్నట్లు తెలియజేశారు. ఈ దీర్ఘకాలిక బాండ్ల ద్వారా మౌలికాభివృద్ధికి బ్యాంకు తనవంతు పాత్ర పోషించగలదని వ్యాఖ్యానించారు. బాండ్లకు దేశీ రేటింగ్ సంస్థల నుంచి ఏఏఏ రేటింగ్ లభించింది. బాండ్ల విక్రయం నేపథ్యంలో ఎస్బీఐ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 608 వద్దే ముగిసింది. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు: భారీ లాభాల్లో రూపాయి
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి చాలా రోజుల తరువాత లాభాల్లోకి మళ్లింది. ఆరంభంలోనే అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 67 పైసలు జంప్ చేసి 82.14 స్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం 50 పైసలు లాభంతో ట్రేడ్ అవుతోంది. మంగళవారం నాటి ముగింపు 82.72 పోలిస్తే డాలర్‌తో రూపాయి 82.20 స్థాయిని తాకింది. అటు డాలర్ ఇండెక్స్ సుమారు 109.75 వద్ద ఒక నెలలో దాని కనిష్ట స్థాయికి చేరింది. ఫలితంగా దేశీయ సావరిన్ బాండ్లు కూడా పెరిగాయి. ఈ పరిణామం రూపాయికి సానుకూలంగా మారింది. కాగా బలహీనపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఫెడ్ వడ్డీరేటు పెంపు అంచనాల మధ్య డాలర్ బలహీనత కొనసాగుతోంది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 17750 పాయింట్లకు ఎగువన ట్రేడ్ అవుతోంది. -
భారత్ బాండ్ ఈటీఎఫ్ హవా: రెండేళ్లలో అనూహ్య వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ బాండ్ ఈటీఎఫ్‌ల పరిధిలోని నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) రెండున్నరేళ్లలోనే రికార్డు స్థాయికి చేరాయి. రూ.50,000 కోట్ల మార్క్‌ను అధిగమించాయి. వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ ఈ వివరాలను ప్రకటించింది. 2019 డిసెంబర్లో భారత్ బాండ్ ఈటీఎఫ్ మొదటి విడత ఇష్యూ రావడం గమనార్హం. అప్పటి నుంచి ఐదు ఇష్యూలు పూర్తయ్యాయి. వీటి మెచ్యూరిటీ 2023, 2025, 2030, 2031, 2031లో తీరనుంది. ‘‘ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక బలం, ఇన్వెస్టర్లలో వాటి పట్ల ఉన్న విశ్వాసానికి భారత్ బాండ్ ఈటీఎఫ్‌ల విజయం నిదర్శనం. మన తొలి డెట్ ఈటీఎఫ్ అద్భుత విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉంది’’అని కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే దీపమ్ కార్యదర్శి తుహిన్‌కాంత పాండే తెలిపారు. ఏఏఏ రెటెడ్ కలిగిన ప్రభుత్వరంగ కంపెనీలతో కూడిన నిఫ్టీ భారత్ బాండ్ సూచీల్లో భారత్ బాండ్ ఈటీఎఫ్‌లు ఇన్వెస్ట్ చేస్తాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్‌ల ఘన విజయంతో ఇతర అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు 2019 తర్వాత సుమారు 30 వరకు టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్‌ను తీసుకు రావడం గమనార్హం. ప్యాసివ్ డెట్ విభాగంలో రూ.60వేల కోట్ల ఏయూఎంతో ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ అగ్రగామిగా చేరుకోవడానికి భారత్ బాండ్ ఈటీఎఫ్‌లు దోహదపడ్డాయి. -
రాణా కపూర్‌కు సెబీ జరిమానా
న్యూఢిల్లీ: అదనపు టైర్(ఏటీ)–1 బాండ్ల విక్రయంలో అక్రమాలపై యస్ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో రాణా కపూర్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 2 కోట్ల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా జరిమానా చెల్లించవలసిందిగా ఆదేశించింది. యస్ బ్యాంకు అధికారులు రిటైల్ ఇన్వెస్టర్లకు తప్పుడు పద్ధతిలో అదనపు టైర్–1 బాండ్లను విక్రయించడంపై సెబీ తాజా జరిమానాకు తెరతీసింది. సెకండరీ మార్కెట్లో ఏటీ–1 బాండ్లను విక్రయించేటప్పుడు బ్యాంకు, కొంతమంది అధికారులు రిస్కులను ఇన్వెస్టర్లకు వెల్లడించకపోవడాన్ని సెబీ తప్పుపట్టింది. 2016లో ప్రారంభమైన ఏటీ–1 బాండ్ల అమ్మకం 2019వరకూ కొనసాగింది. వీటి విక్రయ వ్యవహారాన్ని మొత్తంగా కపూర్ పర్యవేక్షించినట్లు సెబీ పేర్కొంది. బాండ్ల విక్రయంపై సభ్యుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందడంతోపాటు అమ్మకాలను పెంచేందుకు అధికారులపై ఒత్తిడిని సైతం తీసుకువచ్చినట్లు తెలియజేసింది. -
బాండ్లలోకి.. సేఫ్ రూట్
పెట్టుబడులు సురక్షితంగా ఉండాలి. దీర్ఘకాలం పాటు ఆ పెట్టుబడిని కొనసాగించుకోవాలి. రాబడులు కూడా స్థిరంగా ఉండాలి. ఇలా కోరుకునే రిటైల్ ఇన్వెస్టర్లకు.. ప్రభుత్వ బాండ్లలో నేరుగా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం తాజాగా అందుబాటులోకి వచ్చింది. స్టాక్ బ్రోకర్ ద్వారా ‘ఎన్ఎస్ఈ గోబిడ్’ ఖాతా తెరిచి ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆర్బీఐ తీసుకొచ్చిన రిటైల్ డైరెక్ట్ డైరెక్ట్ గిల్ట్ (ఆర్డీజీ) అకౌంట్ రూపంలో అయినా ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు ఏం చేయవచ్చన్నది చూద్దాం.. స్టాక్ మార్కెట్ మాదిరే ప్రభుత్వ బాండ్లకు సంబంధించి కూడా ప్రైమరీ, సెకండరీ మార్కెట్లు ఉన్నాయి. ఈక్విటీ ప్రైమరీ మార్కెట్లో వివిధ కంపెనీల ప్రమోటర్లు ఐపీవో రూపంలో (ప్రైమరీ మార్కెట్) షేర్లను ఆఫర్ చేస్తారు. ప్రభుత్వ బాండ్ల ప్రైమరీ మార్కెట్లో సర్కారు తరఫున ఆర్బీఐ బాండ్లను ఆఫర్ చేస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను కాలానుగుణంగా ఆర్బీఐ వేలం నిర్వహిస్తుంటుంది. బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్రావిడెంట్ ఫండ్స్ తదితర ఇనిస్టిట్యూషన్స్ ఇందులో పాల్గొని కొనుగోలు చేస్తుంటాయి. ఈ రూపంలో ప్రభుత్వానికి నిధులు సమకూరుతుంటాయి. ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు సైతం సంస్థాగత ఇన్వెస్టర్ల మాదిరే ప్రభుత్వ సెక్యూరిటీలను (జీసెక్‌లు) వేలంలో పాల్గొని కొనుగోలు చేసుకోవచ్చు. నాన్ కాంపిటీటివ్ బిడ్ల రూపంలో ప్రత్యేక కోటా (5 శాతం) కింద పాల్గొని కనీసం రూ.10,000 నుంచి గరిష్టంగా రూ.2 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. భారత ప్రభుత్వ ట్రెజరీ బిల్లులు (టీ బిల్స్), డేటెడ్ సెక్యూరిటీలు (జీసెక్‌లు), ప్రభుత్వ బంగారం బాండ్లు (ఎస్‌జీబీలు), రాష్ట్రాభివృద్ధి రుణాలు (ఎస్డీఎల్) తదితర సెక్యూరిటీలు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 91 రోజులు, 182 రోజులు లేదా 364 రోజుల కోసం రుణాలు తీసుకోవాలని భావించినప్పుడు టీ బిల్లులను జారీ చేస్తుంది. డేటెడ్ జీసెక్‌లు, ఎస్డీఎల్ను ఏడాది నుంచి 40 ఏళ్ల కాల వ్యవధుల కోసం ఆర్బీఐ ఇష్యూ చేస్తుంటుంది. ఐపీవోలు ఎప్పుడైనా రావచ్చు. కానీ, ప్రభుత్వ సెక్యూరిటీల వేలం అలా ఉండదు. ఆర్బీఐ దీన్ని కేలండర్ షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తుంటుంది. కనుక కొనుగోళ్లకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. డేటెడ్ సెక్యూరిటీల విషయంలో ఆరు నెలల ముందుగా ఆర్బీఐ వేలం కేలండర్(షెడ్యూల్)ను ప్రకటిస్తుంది. ఆర్బీఐ పోర్టల్ నుంచి ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ► ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయిన తర్వాత ప్రస్తుతానికి వేలంలో ఉన్న సెక్యూరిటీల వివరాలు కనిపిస్తాయి. టీ బిల్లులను ముఖ విలువ (ఫేస్‌వ్యాల్యూ) కంటే తక్కువకే ఆఫర్ చేస్తారు. ఉదాహరణకు 182 రోజుల టీబిల్లు (రూ.100 ముఖ విలువ)ను రూ.98కి వేలం వేస్తారనుకుంటే.. అప్పుడు మీకు లభించే రాబడి రేటు 1.09 శాతం అవుతుంది. జీసెక్ల వేలం ఈల్డ్ ఆధారితంగానూ ఉండొచ్చు. లేదా ధరల ఆధారితంగానూ ఉండొచ్చు. నూతన జీసెక్‌లు సాధారణంగా ఈల్డ్ ఆధారితంగానే ఉంటాయి. కూపన్ రేటు ఆధారంగా బిడ్ వేసుకోవచ్చు. వేలం పూర్తిగా సబ్స్క్రయిబ్ అయిన తక్కువ కూపన్రేటును కటాఫ్ ఈల్డ్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. దాంతో ఆ రేటే బాండ్‌పై లభించే వడ్డీ రేటు అవుతుంది. ధరల ఆధారిత వేలాన్ని కూడా ఆర్బీఐ నిర్వహిస్తుంటుంది. పాత తేదీలతో కూడిన జీసెక్‌లను తిరిగి జారీ చేసే సందర్భాల్లో ఇలా చేస్తుంది. పోటీతో కూడిన బిడ్డింగ్‌లో కటాఫ్ ఈల్డ్ కంటే తక్కువకు కోట్ చేసిన లేదా కటాఫ్ ప్రైస్ కంటే ఎక్కువకు కోట్ చేసిన ఇనిస్టిట్యూషన్లకు కేటాయింపులు చేస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు.. ఇనిస్టిట్యూషన్లు నిర్ణయించిన కటాఫ్ ఈల్డ్/ధరల వద్ద కోట్ బిడ్ చేయాల్సి ఉంటుంది. కాంపిటీటివ్ బిడ్డింగ్‌లో సగటు రేటు ఆధారంగా బాండ్ల కేటాయింపు ఉంటుంది. సగటు రేటు కటాఫ్ రేటు కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు ముఖ విలువ కంటే కొంచెం ఎక్కువకు జీసెక్‌లను కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. సెకండరీ మార్కెట్ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐఎల్) నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్ ఆర్డర్ మ్యాచింగ్ (ఎన్డీఎస్–వోఎం) ప్లాట్‌ఫామ్‌పై ప్రభుత్వ బాండ్లలో సెకండరీ ట్రేడింగ్ కొనసాగుతుంటుంది. టెలిఫోన్ ఆర్డర్లు కూడా ఇక్కడే నమోదవుతాయి. కనుక తాజా మార్కెట్ ఆక్షన్ కోసం, ధరలు, లిక్విడిటీ సమాచారం కోసం ఇందులో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆర్డీజీ ఖాతా సాయంతో సెకండరీ మార్కెట్లోనూ పాల్గొనవచ్చు. ఎన్డీఎస్–వోఎం రెండు విభాగాలను.. ‘రెగ్యులర్ మార్కెట్’, ‘ఆడ్ లాట్స్ విభాగం’ను ఆఫర్ చేస్తుంది. రెగ్యులర్ మార్కెట్లో ఒక లాట్ సైజ్ రూ.5కోట్లు. రూ.5కోట్లకంటే తక్కువ విలువ ట్రేడ్స్ కోసం ఆడ్లాట్స్ విభాగం పనిచేస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు జీసెక్‌లను ఇక్కడే కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు చేసుకోవాల్సిన ప్రభుత్వ సెక్యూరిటీల ప్రత్యక్ష ధరలను మార్కెట్ వేళల్లో https:// www. ccilindia. com/ OMHome. aspx పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు వాటి కూపన్ రేటు, సంవత్సరం వారీగా ట్రేడవుతుంటాయి. ఉదాహరణకు పదేళ్ల ప్రభుత్వ బాండ్ 0610 ఎ 2031 ఈ పేరుతో ట్రేడవుతుంది. ఇందులో 6.10 అన్నది కూపన్ రేటు. జీసెక్ 2031 అన్నది మెచ్యూరిటీ సంవత్సరాన్ని తెలియజేస్తుంది. ఫిక్స్డ్ రేటు బాండ్లు కూడా వాటి కూపన్రేటుతోనే ట్రేడవుతాయి. ఫ్లోటింగ్ రేటు బాండ్లు ఎఫ్ఆర్బీ పేరుతో ఉంటాయి. టీబిల్లులు మెచ్యూరిటీ సంవత్సరంతో ఉంటాయి. ఉదాహరణకు 091 ఈఖీఆ17022022 అన్నది.. 91 రోజుల ట్రెజరీ బిల్లు.. 2022 ఫిబ్రవరి 17న మెచ్యూరిటీ అవుతుందని అర్థం చేసుకోవాలి. ఎన్డీఎస్–వోఎం హోమ్‌పేజీలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న అన్ని సెక్యూరిటీలు కనిపిస్తాయి. ఏ ధర వద్ద ప్రారంభమైంది, కనిష్ట, గరిష్ట ధరలు కూడా ఉంటాయి. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్.. ఆర్బీఐ వద్ద ప్రారంభించే ఆన్లైన్ రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ (ఆర్డీజీ ఖాతా) ఇన్వెస్టర్ల పొదుపు ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. సెక్యూరిటీల కొనుగోళ్లకు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) తదితర మార్గాల్లో సులభతరంగా చెల్లింపులు చేయవచ్చు. ఇతరత్రా ఏవైనా సహాయం కావాలంటే పోర్టల్‌లో అన్ని వివరాలు ఉంటాయి. టోల్ ఫ్రీ టెలిఫోన్ నంబరు 1800–267–7955 (ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 7 గం. దాకా) కాల్ చేయడం లేదా, ఈమెయిల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ స్కీము కింద అందించే సదుపాయాలకు ఎటువంటి చార్జీలు ఉండవు. దేశీయంగా సేవింగ్స్ ఖాతా, పాన్, కేవైసీ కోసం అధికారికంగా చెల్లుబాటయ్యే పత్రం, ఈమెయిల్ ఐడీ, రిజిస్టర్ మొబైల్ నంబరుతో రిటైల్ ఇన్వెస్టర్లు నమోదు చేసుకోవచ్చు. కొనుగోలు చేసిన సెక్యూరిటీలు .. సెటిల్మెంట్ రోజున ఆర్డీజీ ఖాతాలోకి జమవుతాయి. కాలవ్యవధి బాండ్ నుంచి పొందే రాబడులపై కాలవ్యవధి ఎంతో ప్రభావం చూపిస్తుంది. 91 రోజుల టీబిల్లు లేదా 20ఏళ్ల జీసెక్‌లలో దేనిని కొనుగోలు చేయాలనే నిర్ణయానికి ఎలా వస్తారు? ఈ విషయంలో మీ ఆర్థిక లక్ష్యానికి ఎంత కాలం ఉందన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. మూడు నెలల్లో ఖర్చుల కోసం అయితే 91 రోజుల టీబిల్లు తీసుకోవాలి. రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే అప్పుడు 20ఏళ్ల జీసెక్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు మరో ప్రాధాన్య అంశం అవుతుంది. వడ్డీ రేట్లు పెరుగుతుంటే, అప్పటికే మార్కెట్లో ఉన్న పాత బాండ్ల రేట్లు తగ్గిపోతాయి. ఎందుకంటే కొనుగోలుదారులు అధిక కూపన్ రేటును ఆఫర్ చేస్తున్న తాజా బాండ్ల వైపు మొగ్గు చూపిస్తారు. ఎంపిక చేసుకునే బాండ్ కాల వ్యవధి దీర్ఘకాలంతో ఉంటే కనుక రేట్ల పెరుగుదల సమయంలో ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. స్టాక్ సూచీల మాదిరే బాండ్ల రేట్లు కూడా మారుతుండడం సహజం. గడిచిన 20ఏళ్లలో ఆర్బీఐ రెపోరేటు 4–8 శాతం మధ్య కదలాడింది. పదేళ్ల జీసెక్ 5.8–9.1 శాతం మధ్య ట్రేడ్ అయింది. మనం ఇప్పుడు కనిష్ట రేట్ల వద్ద ఉన్నాం. కనుక దీర్ఘకాలంతో కూడిన వాటితో పోలిస్తే స్వల్పకాల బాండ్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇక కాలవ్యవధిని పెంచుకుంటున్నామంటే రేట్ల పరంగా కొంచెం రిస్క్ తీసుకుంటున్నట్టు అర్థం చేసుకోవాలి. కనుక కొంచెం అదనపు రేటు కోసం దీర్ఘకాలం సెక్యూరిటీని ఎంపిక చేసుకోవడం కాకుండా.. మీ లక్ష్యానికి సరిపడే కాలవ్యవధిపై ఉన్న బాండ్‌కే పరిమితం కావడం మంచిది. సెక్యూరిటీ టీబిల్లు, జీసెక్‌లను కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంటుంది. వీటి మధ్య పెద్ద వ్యత్యాసం ఉండదు. స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ (ఎస్డీఎల్)పై రేటు సాధారణంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. కనుక వీటి ఎంపిక విషయమై తగిన అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ మార్గం అనుకూలం. లిక్విడిటీ ప్రభుత్వ బాండ్లకు సంబంధించి సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ అన్నది.. షేర్లలో మాదిరి భారీగా ఉండదు. ముఖ్యంగా ఆడ్లాట్ విభాగంలో ఈ పరిస్థితి ఉంటుంది. కనుక ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసుకునే వారు కాలవ్యవధి వరకు వేచి ఉండేందుకు ముందుగానే సన్నద్ధం కావాలి. ఒకవేళ గడువుకు ముందే వాటిని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడితే.. ఎన్డీఎస్–వోఎంలో ఆయా బాండ్‌కు సంబంధించి మొత్తం ఎన్ని ట్రేడయ్యాయి అన్నది చూసుకోవాలి. ఇటీవలే ఇష్యూ అయిన 10ఏళ్లు, 5ఏళ్లు, 3ఏళ్ల జీసెక్‌లలో ట్రేడ్ వ్యాల్యూమ్ 70–80 శాతంగా ఉంది. దీర్ఘకాల జీసెక్లతో పోలిస్తే టీబిల్లులు, ఎస్డీఎల్లలో వ్యాల్యూమ్ తక్కువగా ఉంటుంది. ఈ లిక్విడిటీ అన్నది పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటుంది. ఈ అంశాలకు ప్రాధాన్యం.. ప్రభుత్వ సెక్యూరిటీలను పెట్టుబడులకు ఎంపిక చేసుకునే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు.. -
రుణానికి బ్యాంకు గ్యారంటీగా బీమా బాండ్లు!
ముంబై: బ్యాంకు గ్యారంటీలకు ప్రత్యామ్నాయంగా ఇన్సూరెన్స్ బాండ్లను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ తెలిపారు. ముంబైలో పారిశ్రామికవేత్తలతో ఆర్థిక మంత్రి భేటీ సందర్భంగా సోమనాథన్ ఈ ప్రకటన చేశారు. బ్యాంకుల వద్ద రుణ సాయాన్ని పొం దేందుకు పలు సందర్భాల్లో బ్యాంకు గ్యారంటీలు నమర్పించాల్సి వస్తుంది. ఈ గ్యారంటీ కింద బీమా బాండ్లను అనుమతిస్తే.. రుణాలు పొందడం మరింత సులభం కానుంది. చదవండి : 'నిధి' కంపెనీల పట్ల జాగ్రత్త, హెచ్చరించిన ప్రభుత్వం -
బుల్ మళ్లీ రంకెలేసింది..
ముంబై: భారత్ స్టాక్ మార్కెట్లో మళ్లీ బుల్ రంకెలేసింది. అంతర్జాతీయ మార్కెట్ల అండతో దేశీయ మార్కెట్... విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచే రీతిలో దూసుకెళ్లింది. పెరుగుతున్న కరోనా కేసులు, ద్రవ్యోల్బణ ఆందోళనలు పరుగును ఆపలేకపోయాయి. అమెరికాలోని హెడ్జ్ ఫండ్ డిఫాల్ట్‌తో తడబడలేదు. ప్రపంచవ్యాప్తంగా పుంజుకుంటున్న బాండ్ ఈల్డ్స్ భయాలను బేఖాతరు చేసింది. కరిగిపోయిన రూపాయితోనూ కలవరపడలేదు. వెరసి రెండు వారాల గరిష్టస్థాయి వద్ద స్థిరపడింది. ఆర్థిక, ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 1,128 పాయింట్లు లాభపడి 50,137 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 338 పాయింట్లు పెరిగి 14,845 వద్ద నిలిచింది. గడిచిన రెండు నెలల్లో ఇరు సూచీలకూ అత్యధిక లాభాలు ఇవే కావడం విశేషం. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రెండు నెలల కనిష్టానికి పతనం కావడంతో ఐటీ, ఫార్మా షేర్లకు కలిసొచ్చింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ ఏడాది స్థాయికి చేరుకోవడంతో మెటల్ షేర్లు మెరిశాయి. కిందటి వారంలో నష్టాలను చవిచూసిన బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. అయితే రియల్టీ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక దశలో సెన్సెక్స్ 1260 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 369 పాయింట్లను ఆర్జించగలిగింది. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో మూడు షేర్లు, నిఫ్టీ ఇండెక్స్‌లోని 50 షేర్లలో కేవలం నాలుగు షేర్లు మాత్రమే నష్టపోయాయి. ‘‘రేపటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2021–22) ప్రారంభంతో పాటు కార్పొరేట్ కంపెనీ క్యూ4 ఫలితాల విడుదల నేపథ్యంలో రిటైల్ కొత్త ఇన్వెస్టర్లు, అధిక సంఖ్యలో కొనుగోళ్లను చేపట్టి ఉండొచ్చు. నిఫ్టీ చివరి ట్రేడింగ్ సెషన్లో కీలకమైన 14,500 మద్దతు స్థాయిని ఛేదించగలగడం కూడా సాంకేతికంగా కలిసొచ్చింది. ఇప్పటికీ మార్కెట్ అంతర్గతంగా బలహీనంగా ఉంది. ట్రేడర్లు అప్రమత్తత వహించాలి’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ వినోద్ మోదీ అభిప్రాయపడ్డారు. ఆరంభం నుంచి దూకుడుగానే ... మూడురోజుల విరామం తర్వాత దేశీయ మార్కెట్ లాభాలతో మొదలైంది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు సూచీల గ్యాపప్ ప్రారంభానికి కారణమయ్యాయి. సెన్సెక్స్ 323 పాయింట్ల లాభంతో 49,331 వద్ద, నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 14,628 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి కొనసాగిన పర్వంతో సూచీలు దూసుకెళ్లాయి. మిడ్ సెషన్లో కాస్త వెనక్కి తగ్గినా.., యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో తిరిగి పుంజుకున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 1,260 పాయింట్లు లాభపడి 50,268 వద్ద, నిఫ్టీ 369 పాయింట్లను ఆర్జించి 14,876 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అధిక వెయిటేజీ కలిగిన ఆర్థిక, బ్యాంకింగ్, ఇంధన షేర్లు జోరుతో సూచీలు ఈ స్థాయిలో లాభాలను మూటగట్టుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ►ఎన్హెచ్ఏఐ నుంచి భారీ కాంట్రాక్టు దక్కించుకోవడంతో దిలీప్ బిల్డ్‌కాన్ 5% లాభంతో రూ.586 వద్ద ముగిసింది. ►బోనస్ ఇష్యూను పరిగణనలోకి తీసుకోవడంతో ఇక్రాన్ ఇంటర్నేషనల్ షేరు ఎనిమిది శాతం లాభంతో రూ.87 వద్ద స్థిరపడింది. ►అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడైన యస్ బ్యాంక్ షేరు చివరికి 17% లాభంతో రూ.16 వద్ద స్థిరపడింది. -
ఖజానాకు మరో రూ. 1,500 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాల నిమిత్తం సెక్యూరిటీ బాండ్ల వేలం కొనసాగుతోంది. కరోనా కష్టకాలంలో ప్రభుత్వాన్ని ఆదుకున్న బాండ్ల వేలంలో భాగంగా మంగళవారం రూ. 1,500 కోట్లు ఆర్బీఐ వేలం ద్వారా సమకూరనున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 11,407 కోట్ల విలువైన బాండ్లను వేలానికి పెట్టింది. ఇందులో సాధారణ వేలం కింద రూ. 1,500 కోట్లు, గ్రీన్ షూ ఆప్షన్ కింద మరో రూ. 500 కోట్లు సమీకరించుకొనే అవకాశం కల్పిస్తూ షెడ్యూల్ ఇచ్చింది. దీంతో బహిరంగ మార్కెట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరపతి కారణంగా ఈ మేరకు బాండ్ల వేలం ద్వారా నిధులు సమకూరనున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. కరోనా మిగిల్చిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది రూ. 9,000 కోట్లను బాండ్ల వేలం ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటికే పలు దఫాలుగా ఆ మేరకు నిధులు ప్రభుత్వానికి సమకూరాయి. తాజా అవసరాల నేపథ్యంలో ఈ నెల ఖర్చుల కోసం నిధుల సమీకరణ కోసం ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. చదవండి: (సంక్షేమానికి ఆధార్ అడగొచ్చు) -
అంత్యక్రియలకు అంతిమ పోరు..
ప్రొద్దుటూరు క్రైం: ‘కరోనాతో దేశం మొత్తం యుద్ధం చేస్తోంది.. మనం పోరాటం చేయాల్సింది రోగితో కాదు వ్యాధితో.. వారిని వివక్షతతో చూడకండి’. ఎవ్వరికి ఫోన్ చేసినా ప్రస్తుతం మనకు వినిపించే మాటలు ఇవి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవే సూచనలు చేస్తున్నాయి. అయితే కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తుల విషయంలో, వైరస్‌తో మృతి చెందిన వారి పట్ల ఎక్కడ చూసినా వివక్షత కనిపిస్తోంది. మనిషికి వైరస్ సోకిందని తెలియగానే అతను ఏదో చేయకూడని నేరం చేసినట్లు, సమాజానికి పనికి రాడన్నట్లుగా చూస్తున్నారు. కరోనా వైరస్ సోకి చనిపోయినవారి మృతదేహాలు అనాథ శవాలుగా మిగులుతున్నాయి. పుట్టి, పెరిగిన చోటే మట్టిలో కలసిపోవాలని ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆశ ఉంటుంది. బంధువులు, అయిన వారి చేతుల మీదుగా తమ చివరి మజిలీ జరగాలని చాలా మంది కోరుకుంటారు. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ సోకి మృతి చెందితే అయ్యో పాపం అంటున్నారే గానీ మృతదేహాన్ని తమ ప్రాంతానికి తీసుకొచ్చేందుకు కొందరు ససేమిరా అంటున్నారు. ఇలాంటి అమానవీయ సంఘటనలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నాయి. కరోనా వల్ల అనేక కుటుంబాలు సతమతం అవుతున్నాయి.. మన అనుకున్న బంధాలు కూడా దూరమవుతున్నాయి... అవగాహన లేక అపోహలు ఆవహించడమే ఇందుకు కారణం. ఏ కార్యం వెళ్లకపోయినా చివరి మజిలీలో మాత్రం కాటికి చేరిన వారికి కాస్త మట్టి ఇవ్వాలని అంటారు.. మరి ఈ కరోనాతో ఆ సంప్రదాయాలన్నీ మసిబారుతున్నాయి. చాపాడు మండలానికి చెందిన ఓ గర్భిణి అనారోగ్యంతో బాధపడుతూ కవలలకు జన్మనిచ్చి కడప రిమ్స్‌లో కన్నుమూసింది. ఈమెకు కూడా తర్వాత పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ పేద మహిళ మృతదేహం స్వగ్రామానికి తీసుకు రావడానికి అక్కడి వారు ఒప్పుకోలేదు. దీంతో అనాథ శవంగా కడప శివార్లలో గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు. ఐసీఎంఆర్ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ►కరోనా సోకిన వ్యక్తులను అంత్యక్రియలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్ కొన్ని నిబంధనలను సూచించింది. ►కోవిడ్‌తో మృతి చెందాడా లేదా అనేది ముందుగా నిర్ధారించుకోవాలి. ►ఆస్పత్రి వైద్య సిబ్బంది పర్యవేక్షణలోనే మృతదేహాన్ని ప్యాక్ చేయాలి. ముందుగా మృతదేహంపై సోడియం హైపోక్లోరైట్ ద్రావణం స్ప్రే చేసి, పాలిథిన్ కవర్‌తో భద్రంగా ప్యాక్ చేయాలి. ►అంత్యక్రియలకు వెళ్లే ముందు బట్ట, లేదా తాడు సాయంతో మృతదేహాన్ని పాడె పైకి తరలించారు. ►పాడెను మోసుకొని వెళ్లేవారు మృతదేహాన్ని తాకకుండా చూసుకోవాలి ►20 మందికి మించి అంత్యక్రియల్లో పాల్గొనరాదు. వీళ్లు కూడా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలి. రెవెన్యూ, పారిశుధ్య సిబ్బంది సహకారంతో.. కడపలోని ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న మహిళా ఉద్యోగి దేవుని కడపలో నివాసం ఉంటోంది. కొన్ని రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో తోటి ఉద్యోగుల సూచన మేరకు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకోగా మలేరియా అని తేలింది. వ్యాధి తీవ్రం కావడంతో మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం రిమ్స్‌కు తీసుకెళ్లారు. వైద్యులు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న ఆమెకు గుండె పోటు రాగా, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారి కొన్ని క్షణాల్లో మృతి చెందింది. ఈ క్రమంలో ఆమె స్వస్థలమైన పాత కడపలోని శివారు ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించాలని భావించగా స్థానికులు అందుకు నిరాకరించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఇక్కడ దహన సంస్కారాలు చేయనివ్వమని చెప్పడంతో అంత్యక్రియలకు ఆటంకం ఏర్పడింది. తర్వాత రెవెన్యూ, పోలీసు అధికారులు జోక్యంతో చివరకు ఆమె దహన సంస్కారాలు పూర్తి చేయగలిగారు. గ్రామస్తులు వద్దన్నారని.. ఆమె స్వగ్రామం చాపాడు మండలంలోని ఖాదర్‌పల్లె. భర్త, సోదరుడు కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. లాక్డౌన్ నిబంధనల కారణంగా వారు సకాలంలో ఇండియాకు రాలేకపోయారు. గర్భిణిగా ఉన్న ఆమెను కాన్పు కోసం కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి రక్తస్రావం ఎక్కువగా జరగడంతో ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని చెప్పారు. దీంతో ఆమెను గత నెల 4న కడపలోని రిమ్స్‌కు తీసుకెళ్లారు. రెండు రోజుల తర్వాత సిజేరియన్ చేయగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆస్పత్రిలో చేరేముందే ఆమెకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా తర్వాత వచ్చిన రిపోర్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామం నడి»ొడ్డున శ్మశానం ఉండటంతో అక్కడ అంత్యక్రియలు చేసేందుకు కొందరు గ్రామస్తులు అంగీకరించలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులను కడపకు పిలిపించి చివరి చూపుగా కుమార్తె మృతదేహాన్ని చూపించారు. తర్వాత రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో కడపలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఊరంతా బంధువులున్నా ఆమె చివరి చూపునకు నోచుకోలేదు. బంధువులు వద్దని చెప్పడంతో... ప్రొద్దుటూరులోని దస్తగిరిపేటకు చెందిన 67 ఏళ్ల వృద్ధుడు అతను. వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ముందుగా అతని ఇద్దరు కుమారులకు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స కోసం కడపలోని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. ప్రైమరీ కాంటాక్ట్ కింద వారి తండ్రికి పరీక్షలు చేయగా రెండు రోజుల తర్వాత ఆయనకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ఉన్న అతన్ని కోవిడ్ ఆస్పత్రికి తరలించగా రెండు రోజుల తర్వాత మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రొద్దుటూరుకు తీసుకెళ్లాలని భావించగా బంధువులు వద్దని చెప్పారు. దీంతో అతనికి కడపలోనే అంత్యక్రియలు నిర్వహించారు. వైరస్ సోకుతుందని శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు.. కరోనా వైరస్ గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. అయితే చనిపోయిన వారి నుంచి వైరస్ సోకుతుందనే దానికి శాస్త్రీయ ఆధారాలు ఇప్పటి వరకు ఏమీ లేవు. అలా సోకే అవకాశం కూడా తక్కువే. మృతదేహం నుంచి ఏమైనా స్రావాలు బయటికి వచ్చి, వాటిని ఇతరులు తాకితే మాత్రం వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాజుపాళెం మండలంలో ఇటీవల ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. స్థానికంగానూ, చుట్టు పక్కల గ్రామాల్లో బంధువులు ఉన్నా వైరస్ భయంతో చూడటానికి ఎవరూ రాలేదు. దీంతో ఉన్న నలుగురే అతని మృతదేహాన్ని శ్మశానికి మోసుకొని వెళ్లారు. లాక్డౌన్ ప్రారంభంలో పరిస్థితులు వేరుగా ఉండేవి. స్థానికంగా కేసులు ఎక్కువగా లేకున్నా చైనా, ఇటలీ దేశాల్లో వచ్చిన కరోనా కేసులను చూసి ఎక్కువగా భయాందోళనకు గురయ్యేవారు. ప్రొద్దుటూరు, కడపలో అనేక చోట్ల సాధారణ మరణాలు సంభవించాయి. అయితే చాలా ప్రాంతాల్లో అయిన వాళ్లు రాకుండానే అంత్యక్రియలు చేశారు. అడ్డుకోవడం సరికాదు కరోనా అనుమానాలతో చనిపోయిన వారి భౌతికకాయాలను ఆయా గ్రామాల శ్మశాన వాటికలలో పూడ్చడం లేదా కాల్చడాన్ని అడ్డుకోకూడదు. అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవు. డబ్లు్యహెచ్‌ఓ ప్రోటోకాల్ ప్రకారం కోవిడ్ మృతులను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి దానిని కాల్చడం లేదా పూడ్చడం చేయాలి. ఈ రెండింటికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పూడ్చేటట్లయితే లోతుగా గుంత తీసి పూడ్చాలి. పాజిటివ్ కేసుల మృతదేహాలపై పడి ఏడ్వడం, తాకడం చేయకూడదు. తగిన దూరంలో ఉంటే వైరస్ స్ప్రెడ్ అవ్వదు. అపోహలు, అవగాహన రాహిత్యంతో అడ్డుకోవడంలాంటి చర్యలకు పాల్పడరాదు. – సి.హరికిరణ్, కలెక్టర్ మానవతా దృక్పథంతో ఆలోచించాలి కరోనా వైరస్‌తో లేదా ఇతర కారణాలతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు అడ్డుపడటం మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఏవైనా అపోహలు పోలీసులు, రెవెన్యూ అధికారులను సంప్రదించి తెలుసుకోవాలి. ఇష్టానుసారం మృతదేహాలను అడ్డుకుంటామంటే కుదరదు. శ్మశాన వాటికల్లోకి రాకుండా అడ్డు కోవాలనిచూస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలి. – కేకేఎన్ అన్బురాజన్, జిల్లా ఎస్పీ, కడప -
షేర్లు.. బంగారం.. బాండ్లు.. ఏది బెటర్??
కరోనా కారణంగా ఎకానమీలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఈక్విటీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకొని నగదు దగ్గరపెట్టుకొనేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కొందరేమో బంగారంలో, కొందరు బాండ్లలో పెట్టుబడులకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్ క్రెడిట్ సూసీ ఈ మూడు పెట్టుబడి సాధనాలపై తన అభిప్రాయాలను ఇలా వెల్లడించింది. 1. ఈక్విటీలు: రాబోయే నెలల్లో ఆటుపోట్లు సహజంగానే ఉంటాయి. అయితే ఇందులో భిన్న రంగాల తీరు భిన్నంగా ఉండొచ్చు. ఉదాహరణకు ఫార్మా రంగం మంచి పురోగతి చూపవచ్చు. ఇదే తరహాలో ఐటీ, టెలికం షేర్లు కూడా పాజిటివ్‌గానే ఉండే ఛాన్సులున్నాయి. స్వల్పకాలానికి ఫైనాన్షియల్స్ బలహీనంగా ఉండొచ్చు. కానీ దీర్ఘకాలానికి మంచి రాబడినిస్తాయి. 2. బాండ్స్: ఆర్బీఐ మరింత వేగంగా లిక్విడిటీ పెంచే చర్యలు ప్రకటించవచ్చు. అందువల్ల బాండ్స్‌లో ‘‘ ఏఏ ’’ అంతకుమించిన రేటింగ్ ఉన్న బాండ్స్‌ను 3-5 ఏళ్ల కాలపరిమితితో పరిశీలించవచ్చు. రూపీ విలువ పెద్ద మార్పులు లేకుండా 74-76 మధ్యనే కదలాడవచ్చు. 3. బంగారం: వరుసగా ఐదో నెల కూడా ఈటీఎఫ్ హోల్డింగ్స్ పెరిగాయి. సమీప భవిష్యత్‌లో రేటు తగ్గే ఛాన్సులు లేవు. అందువల్ల రాబోయే ఏడాదిలో అంతర్జాతీయంగా బంగారం 1800 డాలర్లను చేరవచ్చు.