
సాక్షి,ముంబై: ఆంధప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సేకరిస్తున్న నిధుల కోసం అమరావతి బాండ్ల నమోదును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉదయం ప్రారంభించారు. రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌డీఏ జారీ చేసిన అమరావతి బాండ్లను బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)లో నమోదు చేశారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఏపీసీఎం 9.15 గంటలకు గంట కొట్టి నమోదును లాంఛనంగా ప్రారంభించారు. బీఎస్ఈ ఎండీ, సీఈవో ఆశీష్‌కుమార్‌తో కలిసి చంద్రబాబు బాండ్ల లిస్టింగ్‌ను ప్రారంభించారు. బీఎస్‌ఈలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలోమంత్రులు యనమల, నారాయణతోపాటు ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఇంకా ఏపీ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు సీఆర్‌డీఏ ఇటీవల ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌పై బాండ్లను జారీ చేయగా , మదుపరుల నుంచి రూ.2 వేల కోట్లు సమకూరిన సంగతి తెలిసిందే.