
న్యూఢిల్లీ: నాలుగు సిరీస్‌ల బాండ్లను పునర్‌వ్యవస్థీకరించేందుకు బాండ్‌హోల్డర్లు సమ్మతించినట్లు వేదాంత గ్రూప్ మాతృ సంస్థ వేదాంత రిసోర్సెస్ తెలిపింది. ఈ బాండ్ల సిరీస్‌లో చెరి 1 బిలియన్ డాలర్ల విలువ చేసే రెండు ఇష్యూలు, 1.2 బిలియన్ డాలర్లది ఒకటి, 600 మిలియన్ డాలర్లది మరొకటి ఉన్నాయి.
ఇవి 2024 నుంచి 2026 మధ్య మెచ్యూర్ అవుతాయి. తాజా పరిణామం నేపథ్యంలో తదుపరి ప్రణాళిక గురించి చర్చించేందుకు జనవరి 4న వేదాంత ఇన్వెస్టర్ల సమావేశం నిర్వహించనుంది. భారీ రుణభారాన్ని తగ్గించుకునే దిశగా వేదాంత రిసోర్సెస్ నాలుగు సిరీస్‌ల బాండ్ల పునర్‌వ్యవస్థీకరణను తలపెట్టింది.