ముంబై: తదుపరి దశ సావరిన్ గోల్డ్ బాండ్ల(ఎస్‌జీబీ)కు రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తాజాగా ధరను ప్రకటించింది. ఒక గ్రాము బాండుకు రూ. 6,199ను నిర్ణయించింది. వీటి సబ్‌్రస్కిప్షన్ ఈ నెల సోమవారం(18న) ప్రారంభమై ఐదు రోజులపాటు కొనసాగనుంది. ఎస్‌జీబీ పథకం 2023–24– సిరీస్–3లో భాగంగా ఆర్‌బీఐ ఈ నెల 18–22 మధ్య పసిడి బాండ్ల సబ్ర్‌స్కిప్షన్‌కు తెరతీస్తోంది.
స్మాల్, పేమెంట్, గ్రామీణ బ్యాంకులు మినహా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు వీటిని విక్రయిస్తాయి. వీటితోపాటు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, క్లియరింగ్ కార్పొరేషన్, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పూర్తి స్వచ్ఛత(999)గల పసిడి సగటు ముగింపు ధర ఆధారంగా గ్రాముకు రూ. 6,199 ధరను నిర్ధారించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.
ఆర్‌బీఐతో చర్చల తదుపరి కేంద్ర ప్రభుత్వం గ్రాముకు రూ. 50 చొ ప్పున ఇన్వెస్టర్లకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేసేందుకు నిర్ణయించింది. అయితే ఇందుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయడంతోపాటు.. డిజిటల్ విధానంలో చెల్లింపులు చేపట్టవలసి ఉంటుంది. వెరసి గోల్డ్ బాండ్ రూ. 6,149కు లభించనున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. కాగా.. ఎస్‌జీబీ సిరీస్–4లో భాగంగా వచ్చే (2024) ఫిబ్రవరి 12–16 మధ్య బాండ్లను ఆఫర్ చేయనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment