వీటిపై ఇన్వెస్ట్‌ చేస్తే లాభాలపై ఎలాంటి పన్ను ఉండదు..! | Sovereign Gold Bond Scheme Opens For Subscription On Monday | Sakshi
Sakshi News home page

Sovereign Gold Bond Scheme: వీటిపై ఇన్వెస్ట్‌ చేస్తే లాభాలపై ఎలాంటి పన్ను ఉండదు..!

Published Mon, Jul 12 2021 6:13 PM | Last Updated on Mon, Jul 12 2021 9:42 PM

Sovereign Gold Bond Scheme Opens For Subscription On Monday - Sakshi

బంగారం ధరల్లో కాస్త ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్‌ చేయడానికి వెనకాడడం లేదు.ఎందుకంటే బంగారం ఎప్పుడు బంగారమే. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్ల కోసం 2015లో సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. సావరిన్‌ బంగారు బాండ్‌ నాలుగో దశ సబ్‌స్రిప్షన్‌ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ పథకంలో భాగంగా గోల్డ్‌ బాండ్‌ ఇష్యూ ధరను ఒక గ్రాముకు రూ. 4,807గా నిర్ణయించింది.

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే గ్రాముకి రూ. 50 రూపాయల తగ్గింపు రానుంది. సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ -2021-22 నాలుగో దశ సబ్‌స్క్రిప్షన్‌ జూలై 16తో ముగియనుంది. గోల్డ్‌ బాండ్లపై ఇన్వెస్టర్లకు 2.5 శాతం వార్షిక వడ్డీరేటును అందించనుంది. బాండ్లపై వచ్చే మెచ్చూరిటీ తరువాత వచ్చే లాభాలపై ఏలాంటి పన్ను ఉండదు. కాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2015 నుంచి సుమారు రూ. 25 వేల కోట్లను రాబట్టింది. 

సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ పథకం ముఖ్యమైన విషయాలు..

  • ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేస్తే డిజిటల్‌ రూపంలో లేదా పేపర్‌ రూపంలో బ్యాంకులు బాండ్లను ఇస్తాయి. 
  • కరోనా వైరస్‌ కారణంగా యూఎస్‌ ట్రెజరీ దిగుబడి 4 నెలల కనిష్టానికి పడిపోవడంతో బంగారం ధర గత మూడు నెలల నుంచి పెరుగుతూ వస్తోంది. 
  • ఈ బాండ్లను దగ్గరలో ఉన్న స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), సెలక్టెడ్‌ పోస్టాఫీసుల్లో, బాంబే స్టాక్‌ ఎక్స్చేంజీ, నేషనల్‌ స్టాక్స్‌ ఎక్స్చేంజ్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ నుంచి కొనుగోలు చేయవచ్చును.
  • గోల్డ్‌ బాండ్లకు 8 సంవత్సరాల టైం పీరియడ్‌ ఉంటుంది. బాండ్లను తీసుకొని ఐదు సంవత్సరాలు గడిస్తే వీటిని వెనక్కి తీసుకోవచ్చును. అయితే ఆ సమయంలో ఉన్న బంగారానికి ఉన్న రేట్లను పొం‍దుతారు. 
  • ఈ బాండ్లపై ఒక వ్యక్తి చేసే  కనిష్ట పెట్టుబడి విలువ ఒక గ్రాము, గరిష్ట పెట్టుబడి విలువ 4 కిలోలుగా ఉంటుంది. కాగా హెచ్‌యూఎఫ్‌కు 4 కిలోలు, ట్రస్ట్‌లకు 20 కిలోల వరకు కొనుగోలు చేయవచ్చును.
  • మీరు కొనుగోలు చేసే గోల్డ్‌బాండ్లపై ప్రభుత్వ షురిటీ ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement