ముంబై: రానున్న కాలంలో కార్పొరేట్ బాండ్ల మార్కెట్ భారీగా విస్తరించనున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ తాజాగా పేర్కొంది. దీంతో 2030 మార్చికల్లా కార్పొరేట్ బాండ్ మార్కెట్ పరిమాణం రెట్టింపుకానున్నట్లు అభిప్రాయపడింది. వెరసి రూ.110 లక్షల కోట్ల మార్క్‌ను దాటే వీలున్నట్లు అంచనా వేసింది. పెట్టుబడి వ్యయాలకు దన్ను, ఆకట్టుకుంటున్న మౌలిక సదుపాయాల రంగం, పొదుపును ఫైనాన్షియలైజ్ చేయడం వంటి అంశాలు ఇందుకు దోహదం చేయనున్నట్లు వివరింంది.
2023 మార్చివరకూ గత ఐదేళ్లలో కార్పొరేట్ బాండ్ మార్కెట్ వార్షికంగా 9 శాతం వృద్ధి చెంది ర. 43 లక్షల కోట్లకు చేరినట్లు నివేదికలో క్రిసిల్ పేర్కొంది. ఈ బాటలో 2030 మార్చికల్లా రెట్టింపునకుపైగా ఎగసి రూ. 100–120 లక్షల కోట్లను తాకనున్నట్లు అంచనా వేసింది. నియంత్రణ సంస్థల మధ్యవర్తిత్వం కూడా ఇందుకు సహకరించనున్నట్లు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ సోమశేఖర్ వేమూరి పేర్కొన్నారు.
గరిష్టస్థాయిలోని సామర్థ్య వినియోగం, కార్పొరేట్ రంగ పటిష్టత, బలమైన బ్యాలన్స్‌షీట్లు, ఆర్థిక పురోభివృద్ధి అంచనాలు పెట్టుబడి వ్యయాల్లో వృద్ధికి కారణంకానున్నట్లు క్రిసిల్ వివరింంది. దీంతో 2027కల్లా రూ. 110 లక్షల కోట్ల పెట్టుబడులు నవెదుకావచ్చని అభిప్రాయపడింది. అంచనా పెట్టుబడి వ్యయాలలో ఆరో వంతు కార్పొరేట్ బాండ్ మార్కెట్ సమకూర్చవచ్చని పేర్కొంది.
మౌలిక రంగానికి
మౌలిక రంగ ఆస్తుల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్ బలపడుతుండటం, వేగవంత రికవరీ వంటి అంశాల నేపథ్యంలో దీర్ఘకాలిక రుణాలకు అవకాశాలు మెరుగుపడనున్నట్లు క్రిసిల్ తెలియజేసింది. ప్రస్తుతం కార్పొరేట్ బాండ్ల జారీ నిధుల్లో 15 శాతం మౌలిక రంగానికి చేరుతున్నట్లు తెలియజేసింది.
ఏఏ రేటింగ్ కార్పొరేట్ బాండ్ల జారీపై పెట్టుబడి నియంత్రణలను సరళతరం చేయడంతో పెన్షన్ ఫండ్స్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్‌ను వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామిక వృద్ధికి సహకరించే వీలున్నట్లు క్రిసిల్ డైరెక్టర్ రమేష్ కరుణాకరన్ వివరించారు.
రిటైల్ విభాగంలో పెరుగుతున్న రుణ అవసరాలను తీర్చేందుకు నాన్‌బ్యాంక్ రుణదాతల నుంచి సైతం కార్పొరేట్ బాండ్లకు డిమాండ్ కనిపించనున్నట్లు క్రిసిల్ నివేదిక పేర్కొంది. నాన్‌బ్యాంక్ రుణదాతలు అధిక స్థాయిలో రుణాలను రిటైలర్లకు అందిస్తుండటంతో దేశ జీడీపీలో రిటైల్ క్రెడిట్ 30 శాతానికి చేరింది. యూఎస్‌లో ఇది 54 శాతంకాగా.. ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్ ప్రొడక్టులలో గరిష్టంగా పెట్టుబడులు మళ్లుతున్నట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment