సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాల నిమిత్తం సెక్యూరిటీ బాండ్ల వేలం కొనసాగుతోంది. కరోనా కష్టకాలంలో ప్రభుత్వాన్ని ఆదుకున్న బాండ్ల వేలంలో భాగంగా మంగళవారం రూ. 1,500 కోట్లు ఆర్‌బీఐ వేలం ద్వారా సమకూరనున్నాయి. ఈ మేరకు ఆర్‌బీఐ తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 11,407 కోట్ల విలువైన బాండ్లను వేలానికి పెట్టింది. ఇందులో సాధారణ వేలం కింద రూ. 1,500 కోట్లు, గ్రీన్ షూ ఆప్షన్ కింద మరో రూ. 500 కోట్లు సమీకరించుకొనే అవకాశం కల్పిస్తూ షెడ్యూల్ ఇచ్చింది.
దీంతో బహిరంగ మార్కెట్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరపతి కారణంగా ఈ మేరకు బాండ్ల వేలం ద్వారా నిధులు సమకూరనున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. కరోనా మిగిల్చిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది రూ. 9,000 కోట్లను బాండ్ల వేలం ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటికే పలు దఫాలుగా ఆ మేరకు నిధులు ప్రభుత్వానికి సమకూరాయి. తాజా అవసరాల నేపథ్యంలో ఈ నెల ఖర్చుల కోసం నిధుల సమీకరణ కోసం ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. చదవండి: (సంక్షేమానికి ఆధార్ అడగొచ్చు)
Comments
Please login to add a commentAdd a comment