financial capital
-
ఇంకా ఎన్నాళ్లీ.. ఆర్థిక అబద్ధాలు
క్యాలెండర్లు మారుతున్నాయి.. దశాబ్దాలు గడుస్తున్నాయి.. కానీ మాట మాత్రం మారడం లేదు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చర్వితచరణంగా ఒకే అబద్ధాన్ని వల్లె వేస్తూ విశాఖ ప్రజలను మొత్తంగా ఉత్తరాంధ్రను మోసం చేస్తూ వస్తున్నారు. విశాఖలో ఏ సదస్సు జరిగినా.. చంద్రబాబు నోటి వెంట వచ్చే మొదటి మాట.. ‘‘వైజాగ్ ను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాను. ప్రపంచపటంలో నిలబెడతాను’’. 30 ఏళ్లుగా నగరాన్ని ఆర్థిక రాజధానిగా మార్చేందుకే ప్రయతి్నస్తున్నారా సీఎం సార్ అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.సాక్షి, విశాఖపట్నం : ఆర్థికాభివృద్ధి అంటే.. భారీభవంతులు నిర్మించడం మాత్రమే కాదు.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం.. ప్రతిప్రాంతంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం.. సగటు వ్యక్తి చెంతకు పరిపాలన వ్యవస్థను తీసుకురావడం.. ఆహ్లాదాన్ని పంచి.. ఉపాధి అవకాశాలు కల్పించి.. ప్రతి ఒక్కరూ సామాజికంగా.. ఆర్థికంగా ఎదగడం. కానీ 1995 నుంచి వివిధ దఫాలుగా సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన చంద్రబాబు.. ఏ సంవత్సరం కూడా.. తాను చెప్పిన ఆర్థిక రాజధాని అబద్ధాన్ని నిజం చెయ్యాలన్న ఆలోచన మాత్రం ఏ కోశానా చెయ్యలేదు. కేవలం మాటలతోనే కోటలు కట్టేస్తున్నారే తప్ప.. వైజాగ్ అభివృద్ధి కోసం ఏనాడూ పాటుపడలేదు. ఆర్థికంగా ఎప్పుడు అభివృద్ధి చేశారు? ఎప్పుడూ ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పడమే తప్ప..విశాఖపై చంద్రబాబు చూపించేది కేవలం కపట ప్రేమేనని ఆయన చూపించిన వివక్షే స్పష్టం చేస్తోంది. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటించిన చంద్రబాబు.. తొలుత హైదరాబాద్‌పైనే దృష్టిసారించారు. కానీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రుషికొండలో ఐటీసెజ్కు బాటలు వేసి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయన మరణం తర్వాత ఐటీ కంపెనీలకు అందించే ప్రోత్సాహకాలపై తర్వాత ప్రభుత్వాలు క్రమేపీ శీతకన్ను వెయ్యడంతో చంద్రబాబు, లోకేష్ హయాంలో ఒక్కొక్కటిగా నిరీ్వర్యమైపోయాయి. 1999లో రూ.284 కోట్లగా ఉన్న ఐటీ ఎగుమతులు టర్నోవర్ 2009 నాటికి రూ.32,509 కోట్లకు పెరిగింది. 2010–11లో ఐటీ ఉత్పత్తుల విలువ రూ.3,600 కోట్లకు దిగజారిపోయింది. దిగ్గజ కంపెనీలు కూడా రాలేదు. మరి ఆర్థిక రాజధానిగా విశాఖను ఏం అభివృద్ధి చేసినట్లని ఐటీ ప్రతినిధులు ప్రశి్నస్తున్నారు.విశాఖను విస్మరించారిలా... ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వేల కోట్ల రూపాయల భూ కుంభకోణంతో టీడీపీ ప్రభుత్వం విశాఖ పరువు తీసింది. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు సాగరతీరాన్ని, భీమిలి, మధురవాడ ప్రాంతాలను చెరబట్టారు. తమ పార్టీ నేతలే రూ.వేల కోట్ల భూములు దోచుకున్నారంటూ అప్పటి మంత్రి, ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడే సిట్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో విశాఖలో స్థలం కొనాలంటే భయపడే స్థాయికి తీసుకొచ్చారు. ⇒ మెట్రో రైలు ప్రాజెక్టును తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు.. కేంద్రానికి డీపీఆర్ ఇచ్చేశామంటూ అబద్ధాన్ని ప్రచారం చేశారు. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో డీపీఆర్‌ని కేంద్రానికి పంపించింది. ⇒ విశాఖను ఆర్థికరాజధానిగా చెయ్యాలని నిజంగా టీడీపీకి ఉంటే.. ఎయిమ్స్ విశాఖలోనే ఏర్పాటు చేసేవారు. కానీ అమరావతిలో భూములు కేటాయించి నిర్మించారు. ⇒ చివరికి ఈ దఫాలోనూ అదే పల్లవి అందుకున్న చంద్రబాబు చివరిగా చెప్పిన మాట అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. విశాఖ నగరం అంటే.. ప్రపంచస్థాయి సదస్సులకు కేరాఫ్‌గా మారింది. జీ20, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023తో పాటు విభిన్న అంతర్జాతీయ సదస్సులు జరిగాయి. ఇకపై అమరావతిలో గ్లోబల్ సమ్మిట్స్ నిర్వహిస్తామంటూ రెండు రోజుల క్రితం మెడ్‌టెక్ జోన్లో జరిగిన సదస్సులో చంద్రబాబు చెప్పడం చూస్తే.. విశాఖలో ఇకపై అంతర్జాతీయ సదస్సులు జరగబోవని స్పష్టమవుతోంది. ⇒వైఎస్సార్సీపీ హయాంలో విశాఖ నగరం అద్భుతంగా రూపుదిద్దుకుంది. అంతర్జాతీయ సంస్థలు ఇన్ఫోసిస్, డబ్ల్యూఎన్ఎస్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్ మొదలైన దిగ్గజ ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు విశాఖకు క్యూ కట్టాయి. జీఐఎస్–2023లో 46 దేశాల ప్రతినిధులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరై విశాఖ అభివృద్ధిని ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. ఇలా అన్ని రంగాల్లోనూ విశాఖను ముందుకు తీసుకెళ్తూ.. కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ఐదేళ్లలోనే అడుగులు వేసింది. కానీ మూడు దశాబ్దాలుగా ఆర్థిక రాజధాని చేస్తామంటూ బీరాలు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వైజాగ్ అంటే నిరంతరం ఏదో ఒక రకంగా వివక్ష చూపిస్తూనే ఉంది. 1997 హైదరాబాద్ రాజధానే అయినా.. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తా..1999 విశాఖపట్నం బ్యూటిఫుల్ సిటీ.. ఈ నగరాన్ని రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెడతా..2014 వన్ సైడ్ సీ.. త్రీసైడ్స్ హిల్స్.. వైజాగ్ మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ. ఆర్థిక రాజధానిగా, నాలెడ్జ్‌హబ్‌గా చేసి అంతర్జాతీయ సంస్థలను ఇక్కడికి తీసుకొస్తా..2024 అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసి.. విశాఖను ఆర్థిక రాజధానిగా, ఫిన్‌టెక్ హబ్‌గా మార్చేస్తా.. -
న్యూయార్క్ వరద విలయం
న్యూయార్క్: నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ అతలాకుతలమైంది. నగరంలోని ప్రధాన కూడళ్లు, ఎయిర్‌పోర్టులు, సబ్‌వేలతో పాటు వీధులన్నీ నీటమునిగాయి. అక్కడి డ్రైనేజి వ్యవస్థ అధ్వానం ఉండటంతో నీరు మొత్తం రోడ్లపైకి చేరడంతో వాహనాలు, పాదచారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటి పైగా ఆర్ధిక రాజధాని.. కానీ అక్కడ ఓ మోస్తరు వర్షం కురిసినా మహానగరం కాస్తా మురికివాడను తలపిస్తుంది. శుక్రవారం రాత్రి కురిసిన వానకు న్యూయార్క్ పరిస్థితి దాదాపుగా ఇలాగే మారింది. ఒకపక్క ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు మరోపక్క ముంచుకొస్తున్న వరదలు మరోపక్క అక్కడి ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేశాయి. Amidst heavy rainfall and deep floodwaters in New York, a brave #NewJersey police officer rescued a stranded motorist by carrying him on his back to safety on Friday after heavy rainfall lashed out New York City #flooding #NewYork #NewYorkCity #Brooklyn #brooklynflooding pic.twitter.com/TSQJjZy6I9 — Journou (@Journo0) September 30, 2023 ఇక అక్కడి రహదారుల్లో దృశ్యాలను చూస్తే ఇది న్యూయార్క్ నగరమేనా అనిపించక మానదు. వరదనీటి మధ్యలోనే నిలిచిపోయిన వాహదారుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. ఇక్కడ చూడండి ఓ పోలీసాయన నిలిచిపోయిన కారు నుంచి ప్రయాణికుడిని భుజాన మోసుకుంటూ బయటకు తీసుకొచ్చారు. వరద ప్రభావానికి నగర వీధులు నీటికొలనులను తలపిస్తున్నాయి. వరదనీటిలో ముందుకెళ్తున్న బస్సులోకి నీళ్లు ప్రవాహంలా వస్తున్నాయి. Can’t imagine this happening in NYC Please share and follow for more updates. #flashflood #flashflooding #flooding #flood #newyork #newyorkcity #nyc #brooklyn #rain #rainstorm #storm #downpour #streetflooding #brooklynflooding pic.twitter.com/N7BzQwUbvV — Shadab Javed (@JShadab1) September 29, 2023 విరామం లేకుండా కురుస్తున్న వానలకు నగరవాసులంతా ఇంటికే పరిమితమయ్యారు. ఎవరైనా బయటకు వెళ్లాలంటే నడుము లోతు వరకు చేరిన నీటిలో ఎదురీదుకుంటూ వెళ్లాల్సిన పారిస్తాయి ఏర్పడింది. పైన వాన.. కింద వరద.. మధ్యలో న్యూయార్క్ నగర పరిస్థితిని అద్దంపడుతూ సోషల్ మీడియాలో వీడియోలు తెగ హల్చల్ చేస్తున్నాయి. స్థానిక వాతావరణ శాఖ కూడా అత్యవసరమైతమే తప్ప ఎవ్వరినీ బయటకు రావొద్దని హెచ్చరించింది. People are swimming in the subway in New York City. just think of all the trash and rodent feces and diseases. NYC MTA is in a state of emergency due to heavy rain and flooding. pic.twitter.com/H0KeCw6M6n — Bitcoin New York City (@BSV_NYC) September 29, 2023 ఎయిర్‌పోర్టులు, సబ్‌వేలు, రైల్వే స్టేషన్ల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. అడుగు వేయడనికి కూడా లేకుండా ఎక్కడికక్కడ నీరు చేరింది. అక్కడి మెట్లపై నీరు ప్రవాహం చూస్తే అవేవో జలపాతాలను చూసిన భావన కలుగుతోందని.. ఇంతగా అభివృద్ధి చెందిన దేశంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని ఈ వీడియోలను చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. New York ! This is insane 🤦🏾♀️ #flooding pic.twitter.com/x69kUuVNow — Lil Wyn ✩ (@wynterdreammtv) September 29, 2023 🚨#BREAKING: State of Emergency has been declared for New York City along with a Shelter-in-Place due from Widespread Flooding 📌#Manhattan | #Newyork New York Governor Kathy Hochul and Mayor Eric Adams have declared a state of emergency for New York City, Long Island, and the… pic.twitter.com/JyQX98NVP6 — R A W S A L E R T S (@rawsalerts) September 29, 2023 ఇది కూడా చదవండి: భారత హైకమిషనర్‌ను అడ్డుకున్న ఖలిస్థాన్ మద్దతుదారులు -
Maharashtra Governor: ‘గుజరాతీలతోనే ముంబైకి ఆర్థిక రాజధాని పేరు’
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. గుజరాతీలు, రాజస్థానీలను మహారాష్ట్ర నుంచి.. ముఖ్యంగా ముంబై, థానేల నుంచి పంపించేస్తే రాష్ట్రంలో డబ్బే ఉండదన్నారు. దీంతో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై తన పేరును కోల్పోతుందన్నారు. వారి వల్లే ముంబైకి ఆర్థిక రాజధానిగా పేరు వచ్చిందని పేర్కొన్నారు. ముంబైలోని అంధేరీలో ఓ చౌక్‌కు శాంతిదేవి చంపలాల్జీ కొఠారీ పేరును పెట్టే కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు గవర్నర్. రాజీనామాకు శివసేన డిమాండ్.. గవర్నర్ వ్యాఖ్యలను ఖండించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. గవర్నర్ చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కోరారు. ‘బీజేపీ ప్రతిపాదిత ముఖ్యమంత్రి అధికారం చేపట్టగానే మరాఠీలకు అవమానం ఎదురైంది. గవర్నర్ వ్యాఖ్యలను కనీసం సీఎం ఖండించాలి. ఇది కష్టపడి పనిచేసే మరాఠీ ప్రజలకు అవమానం. సీఎం షిండే మీరు వింటున్నారా? నీపై నీకు ఆత్మగౌరవం ఉంటే.. గవర్నర్ రాజీనామా చేయాలని కోరాలి.’ అంటూ ట్వీట్ చేశారు రౌత్. మరోవైపు.. కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘రాష్ట్ర ప్రజలను గవర్నర్ అవమానించటం చాలా బాధాకరం. ఆయన పదవీ కాలంలో గవర్నర్ అధికారాలు, మహారాష్ట్ర రాజకీయ సంప్రదాయాలు దెబ్బతినటమే కాదు.. రాష్ట్రాన్ని తరుచుగా అగౌరవపరుస్తున్నారు.’ అని పేర్కొన్నారు సచిన్ సావంత్. గవర్నర్ వెంటనే మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు శివసేన ఎంపీ ప్రియాంక ఛతుర్వేది. లేదంటే ఆయనను తొలగించాలని కేంద్రాన్ని కోరతామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులకు ఇది సరైనదేనా? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? హో.. వారి కెబినెట్ మంత్రులకు ఆమోదం లభించనందుకేమో.. అంటూ ఎద్దేవ చేశారు ప్రియాంక. ఇదీ చదవండి: Delhi Liquor Policy: ఎల్జీ దెబ్బకు వెనక్కి తగ్గిన కేజ్రీవాల్.. మరో 6 నెలలు..! -
ఖజానాకు మరో రూ. 1,500 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాల నిమిత్తం సెక్యూరిటీ బాండ్ల వేలం కొనసాగుతోంది. కరోనా కష్టకాలంలో ప్రభుత్వాన్ని ఆదుకున్న బాండ్ల వేలంలో భాగంగా మంగళవారం రూ. 1,500 కోట్లు ఆర్బీఐ వేలం ద్వారా సమకూరనున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 11,407 కోట్ల విలువైన బాండ్లను వేలానికి పెట్టింది. ఇందులో సాధారణ వేలం కింద రూ. 1,500 కోట్లు, గ్రీన్ షూ ఆప్షన్ కింద మరో రూ. 500 కోట్లు సమీకరించుకొనే అవకాశం కల్పిస్తూ షెడ్యూల్ ఇచ్చింది. దీంతో బహిరంగ మార్కెట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరపతి కారణంగా ఈ మేరకు బాండ్ల వేలం ద్వారా నిధులు సమకూరనున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. కరోనా మిగిల్చిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది రూ. 9,000 కోట్లను బాండ్ల వేలం ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటికే పలు దఫాలుగా ఆ మేరకు నిధులు ప్రభుత్వానికి సమకూరాయి. తాజా అవసరాల నేపథ్యంలో ఈ నెల ఖర్చుల కోసం నిధుల సమీకరణ కోసం ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. చదవండి: (సంక్షేమానికి ఆధార్ అడగొచ్చు) -
‘ఫ్లాట్ రెంట్ రూ 64..అయినా పదేళ్లుగా ఖాళీ’
ముంబై : దక్షిణ ముంబైలోని అత్యంత ఖరీదైన తార్ధే ప్రాంతంలో ఓ చిన్న గది దొరకడమే గగనం కాగా, నెలకు కేవలం రూ 64కే 800 చదరపు అడుగుల అపార్ట్మెంట్ అందుబాటులో ఉంది. చదరుపు అడుగు రూ 60,000 పలికే ఈ ప్రాంతంలో ఇంత తక్కువ అద్దెకే లభిస్తున్నా 11 ఏళ్లుగా ఈ ఫ్లాట్‌లో రెంట్‌కు దిగే వారే కరువయ్యారు. ఈ భవనాన్ని నిర్మించిన ఆర్డీ మహలక్ష్మీవాలా ఛారిటీ బిల్డింగ్ ట్రస్ట్ విధించిన ప్రత్యేక నిబంధనతో ఈ ఫ్లాట్ పదేళ్లకు పైగా ఖాళీగా పడిఉంది. పార్శీ కమ్యూనిటీకి చెందిన ఈ ట్రస్ట్ సదరు ఫ్లాట్‌ను కేవలం పార్శి పోలీస్ అధికారికే కేటాయించాలని ముంబై పోలీసులతో 1940లో ఒప్పందం చేసుకోవడంతో ఈ చిక్కు వచ్చి పడింది. కాగా ప్రస్తుతం ముంబై పోలీస్ విభాగంలో ఇద్దరు పార్శి కమ్యూనిటీ పోలీస్ అధికారులున్నా వారిలో ఒకరు ముంబై వెలుపల పోస్టింగ్‌లో ఉండగా, మరో అధికారికి ఇప్పటికే ముంబైలో ఫ్లాట్ ఉంది. ముంబై అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పార్శీలు ఒకప్పుడు స్ధానిక యంత్రాగంలో, పోలీస్ విభాగంలో పెద్దసంఖ్యలో పనిచేసేవారు. రానురాను పార్శీల జనాభా తగ్గుతూ వస్తోంది. దీంతో ఫ్లాట్‌ను కేవలం పార్శీ పోలీస్ అధికారికే అద్దెకు ఇవ్వాలన్న నిబంధనను తొలగించాలని ముంబై పోలీసులు ట్రస్టుతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఫ్లాట్ కోసం పెద్దసంఖ్యలో పార్శీయేతర పోలీసు అధికారులు దరఖాస్తు చేసుకున్నా ట్రస్ట్ నిబంధనతో వారికి ఫ్లాట్ అందుబాటులోకి రావడం లేదు. -
రియల్ దొరలెందరో?!
జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నవ్యాంధ్రప్రదేశ్‌కు ఆర్ధిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నగరంలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చేశాయి. రియల్ బూమ్ ఆకాశాన్నంటిన నేపథ్యంలో సందుకొకరు, వీధికొకరుగా బ్రోకర్లు, రియల్టర్లు పుట్టుకొచ్చారు. వీరికి అండగా రౌడీషీటర్లు రంగంలోకొచ్చారు. ప్రతి ఏరియాలోనూ భూదందాలు మొదలుపెట్టారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. పాగా వేయడం, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఒక్క స్థలాన్నే పదిమందికి అమ్మేయడం, ఐదారుగురికి రిజిస్ట్రేషన్ చేయించడం.. చివరికి సెటిల్మెంట్ చేసి బలవంతులకు అప్పగించడం.. ఈ తరహా సెటిల్మెంట్లు నగరంతోపాటు, శివారు ప్రాంతాల్లో కొన్నేళ్లుగా నిత్యకృత్యమయ్యాయి. అసలు బ్రోకర్లు, రియల్టర్లు, రౌడీషీటర్లు.. వీళ్లంతా ఎందుకు?.. మనమే రియల్ వ్యవహారాలన్నీ సెటిల్ చేస్తే కోట్లకు కోట్లు కొట్టేయొచ్చని కొందరు పోలీసులు భావించారు. అంతే.. విశాఖ నగరం, జిల్లాలోని చాలామంది పోలీసులు రియల్ బాట పట్టారు. ఎస్సైలు, సీఐలు మొదలు ఎక్కడి నుంచో నగరానికి బదలీపై వచ్చిన ఉన్నతాధికారుల వరకు బినామీల పేరిట రియల్ వ్యాపారం మొదలెట్టేస్తున్నారు. భీమిలిలో ఓ పోలీసాయన అసలు ఉద్యోగాన్ని తూతూ మంత్రంగా చేస్తూ నిత్యం రియల్ ఎస్టేట్ లావాదేవీల్లోనే మునిగితేలుతుంటాడు. సంగివలస, నమ్మివానిపేట, ఆదర్శనగర్, కాపులుప్పాడ ప్రాంతాల్లో ఇటీవల కబ్జాల వివాదాలు పెరిగాయి. దీన్నే ఆసరా చేసుకున్న సదరు ఖాకీ స్వయంగా పంచాయితీలు చేసి ‘నాకింత... మీకింత’ పద్ధతిలో సుమారు రూ.40 కోట్లు వెనకేసుకున్నారని అంటున్నారు. మధురవాడ పరిసర ప్రాంతాల్లోనే ఆయనకు రూ.15 కోట్ల స్థిరచరాస్తులు ఉన్నాయని చెబుతున్నారు. ఆయన గారు చేసే పంచాయితీలకు భీమిలి స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జి వేదికవుతోంది. ఆ లాడ్జి కూడా ఆయనదేనని, బావమరిది పేరిట తీసుకున్నారన్న ప్రచారం ఉంది. ఆనందపురంలో మరో పోలీసాయన ల్యాండ్ సెటిల్మెంట్ల ద్వారా రూ.కోట్లకు పడగలెత్తాడు. ఇసుక లారీలపై తప్పుడు కేసులు బనాయించి డ్రైవర్లు, ఓనర్ల నుంచి పెద్దమొత్తంలో వసూలు చేస్తారన్న ఆరోపణలపై ఈయన్ను పై అధికారులు తలంటినా మార్పు రాలేదని అంటున్నారు. 1991 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఓ డీఎస్పీ కూడా రియల్ సెటిల్మెంట్ల ద్వారానే కోట్లకు పడగలెత్తాడని అంటున్నారు. ఒక్క విశాఖ నగరంలోనే యాభై కోట్ల విలువైన స్థిరచరాస్తులు కొనుగోలు చేశారనేది పోలీసువర్గాలే వేస్తున్న లెక్క. ఆ మధ్య మధురవాడలో ఏకండిగా 18ఎకరాల భూమిని బినామీల పేరిట కొనుగోలు చేశారు. భూములు కొనుగోలు చేయడం, మంచి ధర వస్తే అమ్మేయడం.. ఇలా భూక్రయవిక్రయాల్లోనే సదరు పోలీసు అధికారి మునిగి తేలుతుంటాడని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ఈ మధ్యనే నగరం నుంచి బదలీ అయిన ఓ ఉన్నతాధికారి రియల్ పంచాయితీల ద్వారా రూ.20 కోట్లు వెనకేసుకున్నారన్న వాదనలు ఉన్నాయి. ఉత్తరాదికి చెందిన అధికారే అయినప్పటికీ విశాఖలో బినామీల పేరిట భూములు కొనుగోలు చేశారనేది పోలీసువర్గాలే చెబుతున్న మాట. ఓ డివిజన్ స్థాయి అధికారి నగరంలో తన సోదరుడి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం అడ్డూ అదుపూ లేకుండా చేసేస్తున్నారు. నగరంలో లెక్కలేనన్ని భూదందాలతో కబ్జాదారుడిగా లోకాయుక్త విచారణ కూడా ఎదుర్కొన్నసోదరుడికి ఆ అధికారి వెన్నుదన్నుగా నిలుస్తుంటారు. సోదరుడు వేసిన సుమారు 20 రియల్ వెంచర్లకు పెట్టుబడితో పాటు అండదండలన్నీ సదరు అధికారే అందిస్తుంటారు. గాజువాకలో ఖల్నాయక్ కూర్మన్నపాలెంలో ఆ మధ్య ఓ భూమి విషయంలో కొనుగోలుదారులు, కబ్జారాయుళ్ల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. లే అవుట్లు చెల్లవంటూ కబ్జారాయుళ్లు ఆ భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించడానికి రంగం సిద్ధం చేశారు. దీంతో కొనుగోలుదారులు దువ్వాడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లు చూపించారు. విచారణ చేపట్టిన పోలీసులు కొనుగోలుదారులకు మద్దతుగా నిలిచారు. దీంతో కబ్జారాయుళ్లు ఓ పోలీసు అధికారిని ఆశ్రయించి డీల్ కుదుర్చుకున్నారు. సుమారు రూ.3 కోట్లకు బేరం కుదరడంతో ఆ అధికారి అక్రమార్కుల వైపు నిలబడ్డారు. కొనుగోలుదారులపై రౌడీషీట్లు తెరవాలని ఆదేశించారు. మొత్తంగా ఆ భూమిని కబ్జారాయుళ్ల పరం చేసేశారు. గాజువాక పరిధిలో ఇప్పుడు పనిచేస్తున్న 1991 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఓ పోలీసు అధికారి రియల్ దందాలే పెట్టుబడిగా కోట్లకు పడగలెత్తాడు. గతంలో ఏసీబీ అధికారులకు అడ్డంగా చిక్కినా ఆర్నెల్లలోపే తిరిగి పోస్టింగ్ సాధించుకున్న ఘనుడిగా పోలీసువర్గాల్లో పేరు సంపాదించాడు. విజయవనగరం జిల్లా కొత్తవలస, జీడివలస, రాజాం, గరివిడి ప్రాంతాల్లో విలువైన భూములు కొనుగోలు చేశారన్న ప్రచారం ఉంది. ఆరిలోవ ప్రాంతంలో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారే ఇప్పుడు ఆ ఏరియాలో పెద్ద రియల్ బ్రోకర్. అక్కడ స్థలాలు అమ్మాలన్నా, కొన్నాలన్న ఆ అధికారిని సంప్రదిస్తే చాలు. అన్నీ సెటిల్ చేసేస్తారు. భూకబ్జారాయుళ్లకు, దందాలు చేసే వాళ్లకు ఈయనే అండ. 1996 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఆ అధికారి గతంలో నర్సీపట్నంలో పనిచేసినప్పుడు రంగురాళ్ల వ్యాపారం చేసి రూ.కోట్లకు పడగలెత్తారు. ఆయనకు వాల్వో బస్సులు కూడా ఉన్నాయంటే మనోడి సంపాదన ఏ రేంజ్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నగర కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 1996 ఎస్సై బ్యాచ్‌కే చెందిన మరో అధికారి పూర్తిగా రియల్ వ్యాపారం మీదే దృష్టి పెట్టారు. విజయనగరం జిల్లా పార్వతీపురం, బొబ్బిలి ప్రాంతాల్లో గతంలో పనిచేసినప్పుడు రైస్ పుల్లింగ్ గ్యాంగులతో మిలాఖత్ అయ్యారు. అప్పుడు అడ్డంగా సంపాదించిన సొమ్మును ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులుగా పెడుతున్నారు. పద్యాలు, కవితలతో పై అధికారులను బుట్టలో వేసుకునే పోలీస్‌గా పేరున్న సదరు ఖాకీ సొంత జిల్లా అయిన శ్రీకాకుళంలో విలువైన భూములు కొన్నాడని అంటున్నారు. ఏసీబీకి దొరికినోడు దొంగ.. దొరక్కపోతే దొర చందంగా నడిచిపోతున్న నేపథ్యంలో ఈ రియల్ పోలీసుల పని పట్టేదెవరో? -
స్వైన్‌విహారం
వేగంగా విస్తరిస్తున్న వైరస్ కాలు బయటపెట్టాలంటేనే భయం ముందస్తు మందుల కోసం వెదుకులాట అరకొర చర్యలతో సరిపెడుతున్న అధికారులు విశాఖపట్నం: ఆర్ధిక రాజధాని.. సిటీ ఆఫ్ డెస్టినీ..ఇలా విశాఖ జిల్లాను, మహా నగరాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు మన పాలకులు. కానీ అంతటి ప్రాశస్త్యాన్ని నిలబెట్టేందుకు మా త్రం ప్రయత్నించడం లేదు. కొన్ని నెలల క్రి తం హుద్‌హుద్ తుపాను విశాఖను కకావిక లం చేసింది. పచ్చదనాన్ని తుడిసిపెట్టేసింది. భారీ ఆస్థి నష్టాన్ని కలిగించింది. ఆ భయానక విలయం నుంచి తేరుకుంటున్న ప్రజలను ఇప్పుడు స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. హైదారాబాద్‌లో విశాఖలో అత్యంత వేగంగా స్వైన్‌ఫ్లూ వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పటికే ముగ్గురికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. మరో ఇద్దరి రిపోర్టులు రావాల్సి ఉంది. స్వైన్‌ఫ్లూ నిర్ధారణతో జిల్లా వాసుల్లో మళ్లీ కలవర ం మొదలైంది. జనం ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అరకొర ఏర్పాట్లు, సమీక్షలు మినహా ప్రభుత్వం, అధికారులు చేస్తున్న చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. హుద్ హుద్ తుపాను తర్వాత విశాఖ వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు అప్పుడే హెచ్చరించారు. దానికి తగ్గట్టుగానే ముందుగా తీరం కోతకు గురయ్యింది. మునుపెన్నడూ లేనంత భారీగా సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. ఆర్ కే బీచ్ నుంచి, సాగర్‌నగర్ వరకూ తీరం భయపెడుతోంది. కట్టడాలు సైతం సముద్రంలో కలిసిపోతున్నాయి. తీరం కోతను అడ్డుకోవడానికి జిల్లా అధికార యంత్రాంగం తాత్కాలిక చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంది. అధ్యయనాలంటూ కాలయాపన చేస్తోంది. దీని వల్ల భవిష్యత్‌లో ప్రాణాలకు ముప్పు వాటిల్లనుందని తీర ప్రాంత వాసులు ఆందోళన పడుతున్నారు. ఈ సమస్య తీరకుండానే స్వైన్‌ఫ్లూ వచ్చిపడింది. హైదరాబాద్ వంటి మైదాన నగరాలతో పోల్చితే, సముద్ర తీర ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ విజృంభణ అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు ఇప్పటికే తేల్చారు. అయినా యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యింది. నెల రోజుల క్రితమే హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న స్వైన్‌ఫ్లూని పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే విమానాశ్రయాలు, బస్, రైల్వే స్టేషన్లలో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే వైరస్‌ను జిల్లాలో అడుగుపెట్టకుండా అడ్డుకునే అవకాశం ఉండేది. అది ఎలాగూ చేయలేదు. వైరస్ వచ్చాకైనా పట్టించుకున్నారా అంటే అదీ లేదు. నాలుగేళ్ల బాలుడుకి స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నాయని గుర్తించినా మేల్కోలేదు. చివరికి ఆ బాలుడికి వైద్యం చేసిన వైద్యురాలు కూడా అస్వస్థకు గురయ్యారంటే నిర్లక్ష్యం స్థాయి ఏ మేరకు ఉందో అర్ధమవుతోంది. బాలుడికి స్వైన్‌ప్లూ నిర్ధారణయ్యాక మంత్రులు కేజీహెచ్‌లో కాసేపు తిరిగి వచ్చేశారు. తర్వాత మరో ఇద్దరికి ప్లూ సోకింది. శనివారం సమీక్ష జరుపానని చెప్పిన మంత్రి గం టా శ్రీనివాసరావు ఆస్పత్రికి మొఖం చాటేశారు. శనివారం జాయింట్ కలెక్టర్ జనార్ధన్ నివాస్ సమీక్ష మినహా స్వైన్‌ప్లూపై యుద్దప్రాతిపధికన అధికారులు స్పందిస్తున్న దాఖలాలు లేవు. మరోవైపు జనం స్వైన్‌ప్లూ భారిన పడకుండా ముందస్తు మందులేమైనా ఉన్నాయా అని మెడికల్ దుకాణాలకు పరుగులుదీస్తున్నారు. కానీ ఎక్కడా నివారణ మందులు లేవు. హోమియో గుళికలతో ప్రయోజనం ఉంటుందని భావించి వాటిని కొందరు వాడుతున్నారు. అవీ అందరికీ దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో ముఖానికి మాస్క్‌లు వేసుకుని తిరగడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఏం చేయాలో చెప్పే వారు లేరు. స్వ్వైన్ఫ్లూ అనుమానిత మహిళ మృతి విశాఖ మెడికల్: విశాఖ ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో చికి త్స పొందుతున్న విజయనగరం మహిళ(45) శనివారం మృతి చెందింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆమెను గత నెల 29(జనవరి)న రాత్రి ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో చేర్చగా, పరీక్షించిన ఆస్పత్రి వైద్యులు ఆమెలో స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వ్యాధి నిర్థారణ కోసం ఆమె గొంతు నుంచి సేకరించిన లాలాజల న మూనాలను హైదరాబాద్ పంపిన విషయం విదితమే. వెంటిలేటర్‌పై స్వైన్‌ఫ్లూ చికిత్స కొనసాగిస్తుండగా ఆమె మృతి చెందడం, వ్యాధి నిర్థారణ నివేదిక ఇంకా అందకపోవడం ఆమె మృతి స్వైన్‌ఫ్లూ మృతా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల బాలుడి పరిస్థితి మెరుగుపడడంతో శనివారం ఆ బాలుడికి డిశ్చార్జ్ చేసినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూధనబాబు తెలిపారు. బులిటెన్ స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయిన వారు.. 1. అక్కయ్యపాలెం అబీద్ నగర్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి-సీతమ్మధారలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వైన్‌ప్లూతో పాటు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల పరిస్థితి విషమంగా ఉంది. 2. విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన 32ఏళ్ల మహిళ-రాంనగర్‌లోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉంది. అనుమానిత లక్షణాలున్నవారు.. 1. కొత్తరోడ్డుకు చెందిన 56ఏళ్ల మహిళ- ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉంది. 2. గాజువాకకు చెందిన 38ఏళ్ల వ్యక్తి-ైప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉంది. డిశ్చార్జ్ అయిన వారు.. 1. ఇసుకతోటకు చెందిన నాలుగేళ్ల బాలుడు స్వైన్‌ప్లూ భారి నుంచి కోలుకున్నాడు. శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. -
నవ్యాంధ్రలో నంబర్ వన్
త్వరలో ఆర్థిక రాజధానిగా విశాఖ అభివృద్ధివైపు శరవేగంగా అడుగులు స్మార్ట్ సిటీతో విశాఖకు ఉజ్వల భవిష్యత్ ఐఐఎం, బిట్స్ పిలానీలతో అంతర్జాతీయ హోదా విశాఖకు రానున్న వేల కోట్ల పెట్టుబడులు త్వరలో పట్టాలెక్కనున్న మెట్రో రైలు ప్రాజెక్టు గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ యువరాజ్ వెల్లడి ‘నవ్యాంధ్రలో విశాఖ జిల్లాకు విశిష్ట స్థానం ఉంది. అమెరికా సౌజన్యంతో నగరం స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకోనుంది. మెట్రో రైలు ప్రాజెక్టు, ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థ ఐఐఎం, బిట్స్‌పిలానీ, సరళ-బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్స్ కార్యరూపం దాల్చనున్నాయి. విశ్వనగరంగా విశాఖకు ప్రపంచపటంలో గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.’ - డాక్టర్ ఎన్.యువరాజ్, కలెక్టర్ విశాఖపట్నం: పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన విశాఖ జిల్లా నవ్యాంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధానిగా త్వరలో ఆవిర్భవించనుందని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. భారతదేశానికే ఆర్థిక రాజధాని కాగల సత్తా ఉన్న ఏకైక జిల్లా విశాఖ అని తెలిపారు. అభివృద్ధిలో శరవేగంగా పరుగులు తీయనున్న జిల్లాకు ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. 66వ గణతంత్ర వేడుకలు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. స్థానిక పోలీస్ బేరెక్స్ గ్రౌండ్స్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసిన కలెక్టర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్రలో విశాఖ జిల్లాకు విశిష్ట స్థానం ఉందన్నారు. అమెరికా సౌజన్యంతో నగరం స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకోనుందన్నారు. జిల్లాలో సగం జనాభా జీవీఎంసీ పరిధిలోనే నివసిస్తున్నందున, నగరంలో ట్రాఫిక్, కాలుష్య సమస్యలను అధిగమించేందుకు మెట్రో రైల్వే ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన డీపీఆర్‌ను రూపొందించే బాధ్యతను ఢిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్టుకు అప్పగించారని, ఇప్పటికే ఆ సంస్థ ప్రతినిధులు నగరంలో పర్యటిస్తూ డీపీఆర్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారన్నారు. త్వరలో ఈ ప్రక్రియ పూర్తి చేసి ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయన్నారు. ఇప్పటికే ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థకు పునాది రాయి పడిందని, త్వరలో బిట్స్‌పిలానీ, సరళ-బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా కార్యరూపం దాల్చనున్నాయన్నారు. ఏయూ కేంద్రంగా ఐఐఎం తరగతులు రానున్న విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. వేల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు విశాఖవైపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలు చూస్తున్నాయన్నారు. ప్రకృతి అందాలతో అలరారే విశాఖ జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని ప్రగతిపథాన నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. విద్య, పారిశ్రామిక, పర్యాటక, ఐటీ రంగాలను మరింత అభివృద్ధి చేయడం ద్వారా విశ్వనగరంగా విశాఖకు ప్రపంచపటంలో గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా అరకు మండలం పెదలబుడు గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకోగా, కేంద్ర, రాష్ర్ట మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, పారిశ్రామిక వేత్తలు సైతం గ్రామాలను దత్తత తీసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారని చెప్పారు. అక్టోబర్-నవంబర్ నెలల్లో నిర్వహించిన జన్మభూమి మావూరు కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 3లక్షలకు పైగా వినతులొచ్చాయని, వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జన్‌ధన్‌యోజనలో జిల్లాలో 5లక్షల బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించామన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా 2.52 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు చెప్పారు. మార్చి చివరి నాటికి ఆధార్ సీడింగ్ నూరు శాతం పూర్తి చేసి అన్ని పథకాలకు వర్తింప చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. 50వేల లోపు రుణాలున్న రైతులకు ఒకేసారి మాఫీ చేయడం ద్వారా జిల్లా వ్యాప్తంగా 1.25లక్షల రైతులకు తొలి విడతలో 157.18కోట్ల రుణమాఫీ సొమ్ము జమ చేశామన్నారు. జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి తద్వారా 1833 అవాసాలకు మంచినీరు అందించే లక్ష్యంతో రూ.47.27కోట్లతో ప్రతిపాదనలు రూపొందిం చామన్నారు. గతేడాది అక్టోబర్ 12వ తేదీన హుద్‌హుద్ రూపంలో విరుచుకుపడిన పెనుతుపాను జిల్లా ప్రజలంతా మొక్కవోని ధైర్యంతో సమర్థవంతంగా ఎదుర్కోగలిగారన్నారు. ఈ తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన సుమారు నాలుగున్నర లక్షల మంది బాధితులకు రూ.381.75 కోట్ల మేర పరిహారం అందజేశామన్నారు. జిల్లాలో 11 ఇసుక రీచ్‌లను మహిళా సంఘాలకు అప్పగించగా, ఇప్పటి వరకు 42,893 క్యూబిక్ మీటర్ల ఇసుకను అమ్మడం ద్వారా రూ.2.14 కోట్లఆదాయం వచ్చిందన్నారు. 4,619 డ్వాక్రా సంఘాలకు రూ.136.64కోట్ల బ్యాంక్ లింకేజ్ అందజేశామన్నారు. లబ్ధిదారులకు సంక్షేమ పథకాల పంపిణీ ఈ వేడుకల్లో భాగంగా వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ పథకాల ద్వారా పలువురు లబ్ధిదారులకు రూ.100.96కోట్ల మేర ఆస్తులను 43,876 మందికి కలెక్టర్ యువరాజ్ పంపిణీ చేశారు. డీఆర్డీఏ ద్వారా 3975 డ్వాక్రా సంఘాల పరిధిలోని 43,725 మందికి రూ.100కోట్ల బ్యాంక్ లింకేజ్ చెక్‌ను అందజేశారు. ఉమెన్అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్, డిజిబుల్డ్ వెల్ఫేర్ శాఖల పరిధిలో 151మంది లబ్ధిదారులకు రూ. 96.42లక్షల విలువైన ఎసెట్స్‌ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నగర పోలీస్‌కమిషనర్ అమిత్‌గార్గ్, జేసీ జనార్ధన్ నివాస్, డీఆర్వో కె.నాగేశ్వరరావు, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య రాజధానిగా విశాఖ
మంత్రి కామినేని శ్రీనివాసరావు మణిపాల్‌లో ఫీటల్ మెడిసిన్ ప్రారంభం విశాఖ మెడికల్: విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగానే కాకుండా ఆరోగ్య రాజధానిగా తీర్చిదిద్దనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు తెలిపారు. జగదాంబ జంక్షన్‌లోని మణిపాల్ తల్లి, పిల్లల ఆస్పత్రిలో బుధవారం ఫీటల్ మెడిసిన్, నవజాత నిశిత శిశు చికిత్సా(ఎన్ఐసీయూ) విభాగాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల వైద్య కేంద్రంగా విరాజిల్లుతోందని, భవిష్యత్‌లో మరిన్ని అధునాతన వైద్య సదుపాయాలను తీసుకురావడం ద్వారా దీనిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఒడిశా, చత్తీస్ఘడ్, ఉత్తరాఖండ్ రాష్టాల సరిహద్దు జిల్లాల నుంచి నిత్యం వందలాది మంది రోగులు విశాఖ నగరానికి వైద్యం కోసం వస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ వైద్య రంగంలో ప్రత్యేక వైద్య సదుపాయాలు నగరంలో అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. విశాఖలో తొలిసారిగా మణిపాల్ తల్లి,పిల్ల ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య విభాగమైన ఫీటల్ మెడిసిన్ ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. మణిపాల్ ఆస్పత్రి సీఈవో, మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ అజయ్‌భక్షి మాట్లాడుతూ నగరంలో తొలిసారిగా మణిపాల్ ఆస్పత్రి అధునాతన నవజాత శిశు ైవె ద్య సేవలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. 2007లోనే నవజాత శిశు వైద్యంలో లెవల్-3 చికిత్స సదుపాయాలను మణిపాల్ ఆస్పత్రి నగరానికి పరిచయం చేసిందన్నారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఫీటల్ మెడిసిన్ చికిత్స పుస్తకాన్ని మంత్రితో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఆస్పత్రి ఫీటల్ మెడిసిన్ అధిపతి డాక్టర్ ఎం.మాధురి, నవజాత శిశు వైద్య నిపుణుడు డాక్టర్ సునీల్‌కిషోర్, పిల్లల వైద్యురాలు డాక్టర్ అమితా త్రిపాఠి, జి.రాము, మణిపాల్ గ్రూప్ దక్షిణ భారత సీఓఓ గౌరవ్ రేఖి తదితరులు పాల్గొన్నారు. -
అగ్రపథాన విశాఖ
పర్యాటక, ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం ఐటీకి పర్యాటకాన్ని జోడించాలని అధికారులకు సూచన ఐటీకి ప్రతిష్టాత్మకంగా సిగ్నేచర్ టవర్ నిర్మిస్తాం ముగిసిన సీఎం సుడిగాలి పర్యటన సాక్షి, విశాఖపట్నం : ‘విశాఖ అంటే నాకెంతో ఇష్టం. కొత్త వాళ్లెవరైనా ఇక్కడికి వస్తే కచ్చితంగా సిటీతో ప్రేమలో పడతారు. ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు ఈ నగరం. అందుకే ముంబయి తరహాలో విశాఖను తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉన్నా. ఆర్థిక, పర్యాటక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతా. భవిష్యత్తులో సిటీని అగ్రపథంలో నడిపిస్తా’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నగరంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక్కడ ప్రకృతి అందాలను ఐటీ కంపెనీల సీఈవోలకు వివరించారు. తూర్పుతీరంలోనే విశాఖలాంటి సుందర నగరం లేదని అభివర్ణించారు. అభివృద్ధిలో ఎదగడానికి అన్ని అర్హతలు ఉన్న విశాఖను రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. విభజన తర్వాత విశాఖ ఆర్థిక,పారిశ్రామిక రంగాలకు అత్యంత కీలకంగా మారిందన్నారు. అటు పర్యాటక రంగానికి విశాఖ కీలకమని, అందుకే ఈ రంగాలను మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. విశాఖలో ఉన్న అందాలు ఏప్రాంతానికి లేవని, అందువల్ల ఐటీని పర్యాటకానికి జోడించి రెండు విధాలుగా ఈప్రాంతం పురోగమించేలా చర్యలు చేపడతానని వెల్లడించారు. ఐబీఎం స్థల పరిశీలనకు వెళ్లి అక్కడ రెండో భారీ ఇంక్యుబేషన్ కేంద్రం (సిగ్నేచర్ టవర్) నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఈ ప్రాంతం నుంచి సముద్రం అత్యంత సుందరంగా ఉండడంతో తక్షణమే టెండర్లు పిలిచి దీన్ని నిర్మిస్తామని ఐటీ నిపుణుల సదస్సులో ప్రకటించారు. అన్ని రంగాల్లో ముంబయి తరహాల్లో నగరాన్ని రూపురేఖలు మార్చి చూపిస్తానని స్పష్టం చేశారు. పర్యటన ఇలా... : చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం 10.15 గంటలకు విశాఖ విమానాశ్రయంలో దిగారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి మధురవాడలోని ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్‌కు బయల్దేరారు. మార్గమధ్యంలో గీతం వర్సిటీ విద్యార్థులు ఆయనకు పూలతో స్వాగతం పలికారు. ఇంక్యుబేషన్ కేంద్రానికి చేరుకున్న సీఎం అక్కడ ట్రిప్‌నకు సంబంధించి పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం దాన్ని ప్రారంభించి ఏపీఐఐసీ అధికారులు, ఐటీ నిపుణులతో చర్చించారు. విశాఖలో ఐటీ రంగాన్ని పర్యాటకంతో జోడించి మరింత అభివృద్ధిసాధించాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. దీన్ని ఏ విధంగా సాధించాలనే దానిపై అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఉదయం ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎంను పలకరించడానికి ఎయిర్‌పోర్టు లోపలకు వెళ్లగా, మాజీ మంత్రి మణికుమారిని మాత్రం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె చేసేదిలేక ఎయిర్‌పోర్టు బయట కార్యకర్తలను సీఎం పలకరించడం కోసం ఏర్పాటుచేసిన టెంట్ల కింద ఆమె కూర్చున్నారు. విద్యార్థులూ కొత్తగా ఆలోచించండి విద్యార్థులతో ముఖాముఖీలో పాల్గొన్న సీఎం వాళ్లడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రతి పనికి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్నారు. మోహనరావు అనే ఐటీ వ్యాపారవేత్త గురించి విద్యార్థులకు వివరించారు. చిన్నస్థాయినుంచి సీనెట్ కంపెనీని స్థాపించి ఇప్పుడు వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నారని కొనియాడారు. విద్యార్థులు నిరంతరం కొత్త ఆలోచనలతో ముందుకువచ్చి అందు బాటులోని టెక్నాలజీని ఉపయోగించి అభివద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త పుట్టుకురావాలని, కొత్తకొత్త ఆవిష్కరణలతో సమాజానికి సేవ చేసేదిశగా ప్రయత్నించాలని సూచించారు. చదువుతోపాటు ప్రత్యేకంగా ఆలోచించే విద్యార్థులే ఎప్పుడూ విజయాలు అందుకోగలరని వెల్లడించారు. స్టార్ట్అప్ విలేజ్‌ను వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. -
'విశాఖను ఆర్థిక రాజధాని చేస్తాం'
విశాఖపట్నం నగరాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం గంటా శ్రీనివాసరావు హైదరాబాద్‌లో మాట్లాడుతూ... విశాఖపట్నంలో కొత్తగా ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. అందుకోసం స్థలసేకరణ చేపట్టాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. విశాఖపట్నంలో మెట్రో రైలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకు టెండర్లు కూడా పిలిచామని చెప్పారు. అలాగే విశాఖపట్నంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని.... సినీ నిర్మాతలతో సంప్రదిస్తున్నామని చెప్పారు. అలాగే జిల్లాలోని అరకు, భీమిలీ ప్రాంతాలలో షూటింగ్ స్పాట్లు ఏర్పాటు చేస్తున్నట్లు గంటా శ్రీనివాసరావు వివరించారు. గంగవరం పోర్టును నిర్మిస్తామని...దుగ్గరాజుపట్నంలో పోర్టు ప్రతిపాదనపై పునరాలోచిస్తామని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. -
ఆర్థిక రాజధానిగా విశాఖ
మంత్రి అయ్యన్నపాత్రుడు సింహాచలం: విశాఖ ఆర్థిక రాజధాని గా అభివృద్ధి చెందుతుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి చింతకాయ ల అయ్యన్నపాత్రుడు అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బుధవారం నగరానికి వచ్చిన ఆయ న తొలుత సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ర్ట మంత్రిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉందన్నారు. సింహాచ ల దేవస్థానం భూసమస్యతో పాటు రైల్వేజోన్, విమ్స్, ఫ్లైఓవర్ నిర్మాణం, కేజీహెచ్ అభివృద్ధి తదితర వాటి పై గురువారం జరిగే కేబినెట్ తొలి భేటీలో చర్చిస్తామన్నారు. ఏ రాష్ట్రంలో లేని రాజధాని నిర్మాణం సిరిపురం: దేశంలో ఏ రాష్ట్రంలో లేని రాజధానిని మన రాష్ట్రంలో నిర్మించనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్.అయ్యన్నపాత్రుడు తెలిపారు. టీడీపీ నగర కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడుతో కలిసి మంత్రి అయ్య న్న విలేకరులతో మాట్లాడారు. విమ్స్ ఆస్పత్రికి రూ.60 కోట్లు కేటారుుంచేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఒప్పిస్తా మన్నారు. దాడి వీరభద్రరావు టీడీపీలో చేరతారా అని విలేకరులు అడగ్గా తమ పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు. -
రాజధాని కాకుంటే, ఆర్థిక రాజధాని!
విశాఖపట్నం: విశాఖపట్నం రాజధాని కాకపోతే, ఆర్థిక రాజధాని అవుతుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. నగరం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మంత్రి అయ్యన్నపాత్రునితో విభేదాలు కోరుకోవడం లేదన్నారు. ఇద్దరూ కలిసి జిల్లాను అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అన్నారు. ఎవరైనా వ్యక్తిగత ద్వేషాలకు దిగితే చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించినట్లు తెలిపారు.