విశాఖపై అవ్యాజ ప్రేమ కురిపిస్తున్న చంద్రబాబు
సీఎంగా ఉన్న ప్రతిసారీ విశాఖను ఆర్థిక రాజధాని చేస్తానంటూ ప్రగల్భాలు
1997 నుంచి ప్రతీసారీ అదే పాట..
వైజాగ్‌లో కించిత్తు అభివృద్ధి కూడా చెయ్యని టీడీపీ సర్కారు
మరోసారి విశాఖను ఫిన్‌టెక్ హబ్‌గా, ఆర్థిక రాజధానిగా చేస్తానంటూ గొప్పలు
ఇకపై జాతీయ, అంతర్జాతీయ సదస్సులు అమరావతిలోనే..
విశాఖ బ్రాండ్‌ను క్రమంగా తగ్గించేందుకు టీడీపీ సన్నాహాలు
వైఎస్ జగన్ హయాంలో నిర్వహించిన సదస్సులతో అంతర్జాతీయ ఖ్యాతి
క్యాలెండర్లు మారుతున్నాయి.. దశాబ్దాలు గడుస్తున్నాయి.. కానీ మాట మాత్రం మారడం లేదు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చర్వితచరణంగా ఒకే అబద్ధాన్ని వల్లె వేస్తూ విశాఖ ప్రజలను మొత్తంగా ఉత్తరాంధ్రను మోసం చేస్తూ వస్తున్నారు. విశాఖలో ఏ సదస్సు జరిగినా.. చంద్రబాబు నోటి వెంట వచ్చే మొదటి మాట.. ‘‘వైజాగ్ ను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాను. ప్రపంచపటంలో నిలబెడతాను’’. 30 ఏళ్లుగా నగరాన్ని ఆర్థిక రాజధానిగా మార్చేందుకే ప్రయతి్నస్తున్నారా సీఎం సార్ అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
సాక్షి, విశాఖపట్నం : ఆర్థికాభివృద్ధి అంటే.. భారీభవంతులు నిర్మించడం మాత్రమే కాదు.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం.. ప్రతిప్రాంతంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం.. సగటు వ్యక్తి చెంతకు పరిపాలన వ్యవస్థను తీసుకురావడం.. ఆహ్లాదాన్ని పంచి.. ఉపాధి అవకాశాలు కల్పించి.. ప్రతి ఒక్కరూ సామాజికంగా.. ఆర్థికంగా ఎదగడం. కానీ 1995 నుంచి వివిధ దఫాలుగా సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన చంద్రబాబు.. ఏ సంవత్సరం కూడా.. తాను చెప్పిన ఆర్థిక రాజధాని అబద్ధాన్ని నిజం చెయ్యాలన్న ఆలోచన మాత్రం ఏ కోశానా చెయ్యలేదు. కేవలం మాటలతోనే కోటలు కట్టేస్తున్నారే తప్ప.. వైజాగ్ అభివృద్ధి కోసం ఏనాడూ పాటుపడలేదు.
ఆర్థికంగా ఎప్పుడు అభివృద్ధి చేశారు?
ఎప్పుడూ ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పడమే తప్ప..విశాఖపై చంద్రబాబు చూపించేది కేవలం కపట ప్రేమేనని ఆయన చూపించిన వివక్షే స్పష్టం చేస్తోంది. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటించిన చంద్రబాబు.. తొలుత హైదరాబాద్‌పైనే దృష్టిసారించారు. కానీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రుషికొండలో ఐటీసెజ్‌కు బాటలు వేసి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయన మరణం తర్వాత ఐటీ కంపెనీలకు అందించే ప్రోత్సాహకాలపై తర్వాత ప్రభుత్వాలు క్రమేపీ శీతకన్ను వెయ్యడంతో చంద్రబాబు, లోకేష్ హయాంలో ఒక్కొక్కటిగా నిరీ్వర్యమైపోయాయి. 1999లో రూ.284 కోట్లగా ఉన్న ఐటీ ఎగుమతులు టర్నోవర్ 2009 నాటికి రూ.32,509 కోట్లకు పెరిగింది. 2010–11లో ఐటీ ఉత్పత్తుల విలువ రూ.3,600 కోట్లకు దిగజారిపోయింది. దిగ్గజ కంపెనీలు కూడా రాలేదు. మరి ఆర్థిక రాజధానిగా విశాఖను ఏం అభివృద్ధి చేసినట్లని ఐటీ ప్రతినిధులు ప్రశి్నస్తున్నారు.
విశాఖను విస్మరించారిలా...
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వేల కోట్ల రూపాయల భూ కుంభకోణంతో టీడీపీ ప్రభుత్వం విశాఖ పరువు తీసింది. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు సాగరతీరాన్ని, భీమిలి, మధురవాడ ప్రాంతాలను చెరబట్టారు. తమ పార్టీ నేతలే రూ.వేల కోట్ల భూములు దోచుకున్నారంటూ అప్పటి మంత్రి, ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడే సిట్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో విశాఖలో స్థలం కొనాలంటే భయపడే స్థాయికి తీసుకొచ్చారు.
⇒ మెట్రో రైలు ప్రాజెక్టును తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు.. కేంద్రానికి డీపీఆర్ ఇచ్చేశామంటూ అబద్ధాన్ని ప్రచారం చేశారు. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో డీపీఆర్‌ని కేంద్రానికి పంపించింది.
⇒ విశాఖను ఆర్థికరాజధానిగా చెయ్యాలని నిజంగా టీడీపీకి ఉంటే.. ఎయిమ్స్ విశాఖలోనే ఏర్పాటు చేసేవారు. కానీ అమరావతిలో భూములు కేటాయించి నిర్మించారు.
⇒ చివరికి ఈ దఫాలోనూ అదే పల్లవి అందుకున్న చంద్రబాబు చివరిగా చెప్పిన మాట అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. విశాఖ నగరం అంటే.. ప్రపంచస్థాయి సదస్సులకు కేరాఫ్‌గా మారింది. జీ20, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023తో పాటు విభిన్న అంతర్జాతీయ సదస్సులు జరిగాయి. ఇకపై అమరావతిలో గ్లోబల్ సమ్మిట్స్ నిర్వహిస్తామంటూ రెండు రోజుల క్రితం మెడ్‌టెక్ జోన్‌లో జరిగిన సదస్సులో చంద్రబాబు చెప్పడం చూస్తే.. విశాఖలో ఇకపై అంతర్జాతీయ సదస్సులు జరగబోవని స్పష్టమవుతోంది.
⇒వైఎస్సార్‌సీపీ హయాంలో విశాఖ నగరం అద్భుతంగా రూపుదిద్దుకుంది. అంతర్జాతీయ సంస్థలు ఇన్ఫోసిస్, డబ్ల్యూఎన్‌ఎస్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్ మొదలైన దిగ్గజ ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు విశాఖకు క్యూ కట్టాయి. జీఐఎస్–2023లో 46 దేశాల ప్రతినిధులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరై విశాఖ అభివృద్ధిని ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. ఇలా అన్ని రంగాల్లోనూ విశాఖను ముందుకు తీసుకెళ్తూ.. కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ఐదేళ్లలోనే అడుగులు వేసింది. కానీ మూడు దశాబ్దాలుగా ఆర్థిక రాజధాని చేస్తామంటూ బీరాలు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వైజాగ్ అంటే నిరంతరం ఏదో ఒక రకంగా వివక్ష చూపిస్తూనే ఉంది.
1997 హైదరాబాద్ రాజధానే అయినా.. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తా..
1999 విశాఖపట్నం బ్యూటిఫుల్ సిటీ.. ఈ నగరాన్ని రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెడతా..
2014 వన్ సైడ్ సీ.. త్రీసైడ్స్ హిల్స్.. వైజాగ్ మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ. ఆర్థిక రాజధానిగా, నాలెడ్జ్‌హబ్‌గా చేసి అంతర్జాతీయ సంస్థలను ఇక్కడికి తీసుకొస్తా..
2024 అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసి.. విశాఖను ఆర్థిక రాజధానిగా, ఫిన్‌టెక్ హబ్‌గా మార్చేస్తా..
Comments
Please login to add a commentAdd a comment