![Electoral bonds case: CJI Chandrachud makes strong observations, questions selective anonymity - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/2/CJI.jpg.webp?itok=IfV3nnQ3)
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లతో పలు సమస్యలున్నాయంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విరాళాలు పొందేందుకు పారీ్టలన్నింటికీ అవి సమానావకాశం కలి్పంచకపోతే వివక్షే అవుతుందని అభిప్రాయపడింది. ‘అంతేగాక ఈ పథకంలో అస్పష్టత కూడా దాగుంది. బాండ్లు కొనేవారి వివరాలు ఎవరికీ తెలియకుండా సంపూర్ణ గోప్యత పాటించడమూ వీలు కాదు. వారి వివరాలను సంబంధిత బ్యాంకు (ఎస్‌బీఐ), దర్యాప్తు సంస్థలు తెలుసుకునే వీలుంది’ అని అభిప్రాయపడింది.
అంతేగాక విపక్షాల బాండ్లను కొనేవారిపై అధికార పక్షాలు ప్రతీకారానికి దిగకుండా ఎటువంటి రక్షణా లేదని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘ఏ పార్టీ ఎంత పవిత్రమైనదో తేల్చడం మా ఉద్దేశం కాదు. ఎన్నికల బాండ్ల పథకానికి రాజ్యాంగబద్ధత ఉందా లేదా అన్నదానిపై మాత్రమే విచారణ జరుపుతున్నాం’’ అని స్పష్టం చేశారు.
ఎన్నికల బాండ్ల చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన 4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సీజేఐ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం రోజంతా విచారణ జరిపింది. ‘‘ఎన్నికల ప్రక్రియలో నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలన్న ఈ పథకం ఉద్దేశం అభినందనీయమే. కానీ ఈ పథకంలో అతి పెద్ద సమాచార లోపముంది’’ అని అభిప్రాయపడింది. ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా, జస్టిస్ గవాయ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా సభ్యులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment