ద్వారకాధీశ్ ఆలయంలో పూజలు చేస్తున్న జస్టిస్ డీవై చంద్రచూడ్ దంపతులు
రాజ్‌కోట్: ఆధునిక సాంకేతికత సాయంతో న్యాయాన్ని అందరికీ ప్రజాస్వామ్యయుతంగా చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. శనివారం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నూతన జిల్లా కోర్టు భవనాన్ని ఆయన ప్రారంభించారు. కృత్రిమ మేధతో పని చేసే టెక్స్ట్ టు స్పీచ్ ‘కాల్–ఔట్’ సిస్టమ్‌ను, ఈ–ఫైలింగ్ 3.0 ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. జిల్లా కోర్టుల ఆవశ్యకతను ఈ సందర్భంగా నొక్కిచెప్పారు.
న్యాయం కోసం ముందుగా అక్కడికే వస్తారని గుర్తు చేశారు. పౌరుల హక్కుల సాధనకు జిల్లా కోర్టులే పునాదిరాళ్లన్నారు. ‘‘ద్వారకలోని సోమ్‌నాథ్ ఆలయం, పూరీలోని జగన్నాథాలయంపై ఉండే ధ్వజం న్యాయవాదులు, న్యాయమూర్తులు, పౌరులందరినీ కలిపి ఉంచే మానవత్వానికి ప్రతీక. అలాంటి మానవత్వానికి రాజ్యాంగమే రక్ష’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment