New court Bilding
-
టెక్నాలజీతో న్యాయం మరింత చేరువ: సీజేఐ
రాజ్‌కోట్: ఆధునిక సాంకేతికత సాయంతో న్యాయాన్ని అందరికీ ప్రజాస్వామ్యయుతంగా చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. శనివారం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నూతన జిల్లా కోర్టు భవనాన్ని ఆయన ప్రారంభించారు. కృత్రిమ మేధతో పని చేసే టెక్స్ట్ టు స్పీచ్ ‘కాల్–ఔట్’ సిస్టమ్‌ను, ఈ–ఫైలింగ్ 3.0 ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. జిల్లా కోర్టుల ఆవశ్యకతను ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. న్యాయం కోసం ముందుగా అక్కడికే వస్తారని గుర్తు చేశారు. పౌరుల హక్కుల సాధనకు జిల్లా కోర్టులే పునాదిరాళ్లన్నారు. ‘‘ద్వారకలోని సోమ్‌నాథ్ ఆలయం, పూరీలోని జగన్నాథాలయంపై ఉండే ధ్వజం న్యాయవాదులు, న్యాయమూర్తులు, పౌరులందరినీ కలిపి ఉంచే మానవత్వానికి ప్రతీక. అలాంటి మానవత్వానికి రాజ్యాంగమే రక్ష’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. -
తెలంగాణకు కొత్త హైకోర్టు.. జనవరిలో శంకుస్థాపన!
హైదరాబాద్: తెలంగాణకు కొత్త హైకోర్టు భవనం ఏర్పాటు కానుందా?.. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అధికారుల్ని ఆదేశించారు. రాజేంద్రనగర్‌లో వంద ఎకరాల్లో ఈ హైకోర్టును నిర్మాణం కాబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నూతన హైకోర్టు భవనం కోసం జనవరిలో శంకుస్థాపన జరపాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. గురువారం ఎంసీహెచ్ఆర్డీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, సీఎస్‌లు రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో.. కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని సీజే అలోక్‌రాధే.. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు సమాచారం. అయితే ఇప్పుడు హైకోర్టు భవనం హెరిటేజ్ భవనంగా పరిరక్షించాలని సీఎం రేవంత్ ఈ భేటీలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న భవనాన్ని సిటీ కోర్టుకు లేదంటే మరేదైనా కోర్టు భవనానికి వాడుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అలాగే జిల్లా కోర్టుల నిర్మాణం వేగవంతం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. -
కోర్టు భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా జడ్జి
రైల్వేకోడూరు రూరల్: పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్మాణంలో ఉన్న నూతన కోర్టు భవనాన్ని జిల్లా జడ్జి జీ.సునీత, రైల్వేకోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి హరితతో కలిసి పరిశీలించారు. ఆ భవనంకు సంబంధించిన మ్యాపును పరిశీలించారు. పనులు ఎలా జరుగుతున్నాయని ఆర్ అండ్ బీ డీఈ ప్రభాకర్ రెడ్డిను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కోర్టు భవనానికి గతంలో రూ. 4.48 కోట్లు మంజూరు అయ్యాయని, ధరలు పెరిగిన దృష్ట్యా, బేస్ మట్టంకు కూడా అధికంగా ఖర్చు కావడంతో అదనంగా మరో రూ. 2 కోట్లుకు ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రహరీ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపుతామన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు వెంకట్రామరాజు, రెడ్డెయ్య, ఆర్సీ.సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.