కోర్టు భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా జడ్జి | District Judge perform a review of the court building | Sakshi
Sakshi News home page

కోర్టు భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా జడ్జి

Published Sat, Oct 8 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

కోర్టు భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా జడ్జి

కోర్టు భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా జడ్జి

రైల్వేకోడూరు రూరల్‌:  పట్టణంలోని పాత తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిర్మాణంలో ఉన్న నూతన కోర్టు భవనాన్ని జిల్లా జడ్జి జీ.సునీత, రైల్వేకోడూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు జడ్జి హరితతో కలిసి పరిశీలించారు. ఆ భవనంకు సంబంధించిన మ్యాపును పరిశీలించారు. పనులు ఎలా జరుగుతున్నాయని ఆర్‌ అండ్‌ బీ డీఈ ప్రభాకర్‌ రెడ్డిను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కోర్టు భవనానికి గతంలో రూ. 4.48 కోట్లు మంజూరు అయ్యాయని, ధరలు పెరిగిన దృష్ట్యా, బేస్‌ మట్టంకు కూడా అధికంగా ఖర్చు కావడంతో అదనంగా మరో రూ. 2 కోట్లుకు ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రహరీ   నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపుతామన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు వెంకట్రామరాజు, రెడ్డెయ్య, ఆర్‌సీ.సురేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement