హైదరాబాద్: తెలంగాణకు కొత్త హైకోర్టు భవనం ఏర్పాటు కానుందా?.. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అధికారుల్ని ఆదేశించారు. రాజేంద్రనగర్‌లో వంద ఎకరాల్లో ఈ హైకోర్టును నిర్మాణం కాబోతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ నూతన హైకోర్టు భవనం కోసం జనవరిలో శంకుస్థాపన జరపాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. గురువారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, సీఎస్‌లు రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో.. కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని సీజే అలోక్‌రాధే.. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు సమాచారం.
అయితే ఇప్పుడు హైకోర్టు భవనం హెరిటేజ్ భవనంగా పరిరక్షించాలని సీఎం రేవంత్ ఈ భేటీలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న భవనాన్ని సిటీ కోర్టుకు లేదంటే మరేదైనా కోర్టు భవనానికి వాడుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అలాగే జిల్లా కోర్టుల నిర్మాణం వేగవంతం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment