Rajkot
-
తల్లీ.. నీకు సెల్యూట్!
నాడు ఝాన్సీ లక్ష్మీబాయి తన దత్త పుత్రుడిని వీపుకు కట్టుకుని జవనాశ్వాన్ని దౌడు తీయిస్తూ బ్రిటిష్ వారిపై కత్తి ఝళిపిస్తే, నేడు ఈ రాజ్‌కోట్ యువతి తన బిడ్డను మోటార్ బైక్ పైన కూర్చోబెట్టుకుని, వీపుకు బ్యాగు తగిలించుకుని, డెలివరీ ఏజెంట్‌గా జీవన పోరాటం సాగిస్తోంది! ఈ దృశ్యాన్ని చూసిన ‘విష్విద్’ అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఆమెను వీడియో తీసి, బ్యాక్‌గ్రౌండ్‌లో కత్తి పట్టిన ఝాన్సీరాణిని ఆమెకు జత కలిపి పెట్టిన పోస్ట్‌కు ఇప్పటివరకు 9 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. నెటిజెన్ లు తమ కామెంట్లలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.‘‘బైక్ నడుపుతున్నావ్.. బద్రం సిస్టర్’’ అని జాగ్రత్తలు చెబుతున్నారు. హెల్మెట్ పెట్టుకోవాలని కొందరు సూచిస్తున్నారు. కాళ్లకు చెప్పులు తొడుక్కోవాలని మరికొందరు కోరుతున్నారు. ఈ యువతి గత నెల రోజులుగా డెలివరీ ఏజెంటుగా పని చేస్తోంది. ఇన్ స్టాలో వెల్లడైన వివరాలను బట్టి.. ఈమె హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసింది. పెళ్లయ్యాక, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదు. ఇక ఇప్పుడైతే.. ‘‘బిడ్డ తల్లివి కదా.. ఉద్యోగం ఎలా చేస్తావ్?’’ అని అడుగుతున్న వారే ఎక్కువమంది! చివరికి డెలివరీ ఏజెంట్ ఉద్యోగాన్ని ఎంచుకుని, తనతోపాటు కొడుకునూ వెంట బెట్టుకుని ధైర్యంగా జీవనయానం సాగిస్తోంది. -
టీ20 మ్యాచ్‌లో హైదరాబాద్‌ను గెలిపించిన ధృతి
బీసీసీఐ ఆధ్వర్యంలోని మహిళల అండర్–19 టీ20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు ‘హ్యాట్రిక్’ విజయం అందుకుంది. రాజ్‌కోట్‌లో కేరళ జట్టుతో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘సి’ మూడో లీగ్ మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో గెలుపొందింది. కేరళతో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు సాధించింది. కావ్య (35; 6 ఫోర్లు), నిధి (25; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం.. 149 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ జట్టు 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా 23 రన్స్ తేడాతో ఓటమిని చవిచూసింది.హైదరాబాద్ బౌలర్ కేసరి ధృతి 3.4 ఓవర్లు వేసి 22 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. మరో బౌలర్ వైష్ణవి యాదవ్ 2 వికెట్లు తీసుకుంది. ఇక ఆరు జట్లున్న గ్రూప్ ‘సి’లో హైదరాబాద్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. తదుపరి ఆదివారం జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌తో హైదరాబాద్ తలపడనుంది.చదవండి: WT20 WC Ind vs NZ: కివీస్ ముందు తలవంచారు -
వర్షాలకు కూలిన రాజ్‌కోట్ ఎయిర్పోర్ట్ పైకప్పు
రాజ్‌కోట్: ఢిల్లీ, జబల్పూర్లను అతలాకుతలం చేసిన వర్షాలు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోనూ బీభత్సం సృష్టించాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ టరి్మనల్ కూలిన మరుసటి రోజే మరో ఎయిర్పోర్ట్ వర్షాల బారిన పడింది. రాజ్‌కోట్‌లో అక్కడి భారీ వర్షాలకు సోమవారం ఉదయం రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల పికప్, డ్రాప్ ఏరియాపై నిర్మించిన భారీ టెంట్ కూలింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే టెంట్ కూలిన ఘటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ‘‘ ప్రధాని మోదీ స్వయంగా వచ్చి ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించారు. 11 నెలలకే పైకప్పు కూలింది. అవినీతి ఏ స్థాయిలో ఉందో కూలిన ఘటన చాటిచెప్తోంది. ఢిల్లీ మాదిరి ఘటన వేళ అక్కడ ఎవరైనా ఉంటే జరిగే ప్రాణనష్టానికి ఎవరు బాధ్యులు?. తరచూ అవినీతిపై ప్రసంగాలు దంచే ప్రధాని అవినీతిరహిత పాలనపైనా దృష్టిసారించాలి’ అని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షులు శక్తిసిన్హ్ గోహిల్ అన్నారు. నెహ్రూను నిందించొద్దు: వ్యంగ్యంగా స్పందించిన బీజేపీ రాజ్‌కోట్ ఘటనపై బీజేపీ వెటకారంగా స్పందించింది. ‘‘ నిన్నటి ఢిల్లీ ఎయిర్పోర్ట్ టర్మినల్ కూటిన ఘటనతో రాజ్‌కోట్ ఘటనను పోల్చొద్దు. రాజ్‌కోట్‌లో పెనుగాలులకు టెంట్ వస్త్రం చిరిగి అది పీలికలై పడిపోయింది. తక్కువ ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించారని మీరు జవహర్లాల్ నెహ్రూను నిందిస్తారేమో. అలా చేయకండి. ఎందుకంటే ఆయన ఇన్ని విమానాశ్రయాలు నిర్మించలేరు. ఆయనకే మనం అవకాశం ఇచ్చి ఉంటే ఇప్పటికీ మనం రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) అనుమతితో ఎడ్లబళ్లపై ప్రయాణాలు చేస్తూ ఉండేవాళ్లం’ అని బీజేపీ ఐటీ విభాగ సారథి అమిత్ మాలవీయ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. -
రాజ్‌కోట్ గేమ్‌జోన్: మిస్సింగ్ అనుకున్నారు.. ప్రకాశ్ కూడా మృతి
గాంధీనగర్: రాజ్‌కోట్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో టీఆర్పీ గేమ్‌జోన్‌కు చెందిన ఒక సహ యజమాని మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. శనివారం టీఆర్పీ గేమ్‌జోన్‌లో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 28 మంది మృతి చెందారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి టీఆర్పీ గేమ్‌జోన్ ఓనర్లపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యజమానుల్లో ఒకరైన ప్రకాశ్ హిరాన్ అదే అగ్ని ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుంచి తన సోదరుడు కనిపించడం లేదని ప్రకాశ్ హిరాన్ సోదరుడు జితేంద్ర హిరాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ నంబర్లు కూడా స్వీచ్ ఆఫ్ వస్తున్నాయిని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలంలోనే ప్రకాశ్ కారు ఉన్నట్లు జితేంద్ర పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో ప్రకాశ్ ఉన్న దృశ్యాలు కనిపించాయి. దీంతో డీఎన్ఏ టెస్ట్ చేసిన అగ్ని ప్రమాదంలో మృతి చెందినవారిలో తన సోదరుడిని కనిపెట్టాలని జీతేంద్ర పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ప్రకాశ్ తల్లి డీఎన్ఏను తీసుకుని మృతదేహాలతో పోల్చి ప్రకాశ్ హిరాన్ మృతి చెందినట్లు ప్రకటించారు. టీఆర్పీ గేమ్‌జోన్‌లో ప్రకాశ్ హిరాన్ ప్రధానమైన షేర్ హోల్డర్‌గా ఉన్నారు. టీఆర్పీ గేమ్‌జోన్‌ను నిర్వహిస్తున్న ధావల్ ఠాకూర్‌తోపాటు మరో ఐదుగురిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో రేస్‌వే ఎంటర్ప్రైజెస్ పార్ట్నర్లు యువరాజసింగ్, రాహుల్ రాథోడ్, టీఆర్పీ గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్ ఉన్నారు. -
ఈ పాపం ఎవరిది?
గత వారం జరిగిన అగ్ని ప్రమాదాలు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఇరవై నాలుగు గంటల్లో వేర్వేరు చోట్ల సంభవించిన ఈ ప్రమాదాల్లో అభం శుభం తెలియని పలువురు చిన్నారులతో సహా 40 మంది ప్రాణాలు కోల్పోవడం పెను విషాదం. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ గేమింగ్ జోన్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 33 మంది, అదే రాత్రి తూర్పు ఢిల్లీలోని పిల్లల ఆసుపత్రిలోని ఘోర ప్రమాదంలో నవజాత శిశువులు ఏడుగురు దుర్మరణం పాలైన ఘటనలు సున్నిత మనస్కుల్ని చాలాకాలం వెంటాడనున్నాయి. ఆక్సిజన్ సిలిండర్ల పేలుడు సంభవించిన ఆ ఆసుప్రతి లైసెన్స్ గడువు రెండు నెలల క్రితమే తీరిపోతే, రాజ్‌కోట్ గేమింగ్ జోన్ నిరభ్యంతర పత్రమే (ఎన్ఓసీ) లేకుండానే యథేచ్ఛగా నడుస్తుండడం మన వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. నిబంధనల అమలులో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. అగ్నిప్రమాద నివారణ నిబంధనలు, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరంపై మరోసారి చర్చ మొదలైంది. తాజా ఘటనల నేపథ్యంలో – పాతికేళ్ళ పైచిలుకు క్రితం 1997లో ఢిల్లీలో జరిగిన ఉపహార్ సినిమా హాలు ప్రమాదం మొదలు 2004లో 90 మంది పాఠశాల విద్యార్థులను బలి తీసుకున్న కుంభకోణం అగ్నిప్రమాదం దాకా పాత పీడకలలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. గతం నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకున్నామని నిలదీస్తున్నాయి. వాణిజ్య సంస్థల నుంచి నివాస ప్రాంగణాల దాకా అన్నిచోట్లా ఇవాళ ప్రాథమిక భద్రతా ఏర్పాట్లు మృగ్యమైపోతున్నాయి. అనుకోనిది ఏం జరిగినా పదుల కొద్దీ ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్నాయి. మే 26 నాటి ప్రమాదంలో శిక్షణ పొందిన వైద్య సిబ్బంది కానీ, ప్రమాద భద్రతా సర్టిఫికెట్ కానీ, చివరకు అగ్ని ప్రమాద నివారణ సామగ్రి కానీ, సరైన నిష్క్రమణ మార్గాలు కానీ లేకుండానే ఢిల్లీ లాంటి చోట ఒక ఆసుపత్రి నడుస్తోందంటే ఏమనాలి? రాజ్‌కోట్ గేమింగ్ జోన్లో ఎలాంటి కనీస అగ్నిప్రమాద భద్రతా లేకుండా దాదాపు రెండంతస్తుల భవనం ఎత్తున రేకులతో పెద్ద నిర్మాణం చేపడితే అధికారులు ఏం చేస్తున్నట్టు? ఆ ప్రాంగణంలో 2 వేల లీటర్ల పెట్రోల్, లెక్కకు మిక్కిలి టైర్లు నిల్వ చేస్తుంటే అడ్డుచెప్పే నాథుడు లేడా?ఒక్క ఢిల్లీలోనే గత రెండేళ్ళ పైచిలుకు కాలంలో 66 ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి, అగ్నిప్రమాద నివారణ నిబంధనలు ఎంతగా ఉల్లంఘనకు గురవుతున్నాయో స్పష్టమవుతోంది. సాక్షాత్తూ మన దేశ రాజధానిలోనే ఇలా ఉంటే, దేశంలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితిని ఇట్టే ఊహించుకోవచ్చు. మన దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు ఇప్పటికీ అంతంత మాత్రమే. మూడేళ్ళ క్రితం దేశంలో కరోనా మహమ్మారి విజృంభించి, డెల్టా వేరియంట్ విలయ తాండవం చేసినప్పుడు ఆ నిష్ఠురసత్యం మన కళ్ళ ముందు కనిపించింది. ప్రభుత్వ రంగంలో ఆరోగ్య రంగం అలా కునారిల్లుతుండడం వల్లే, ఆ లోటును పూడ్చడానికి ప్రైవేట్ రంగం అవసరం ఉంటోంది. జనం ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, తదితరాలపై ఆధారపడడం ఎక్కువవుతోంది. సరిగ్గా ఈ కారణాల రీత్యానే ప్రైవేట్ ఆరోగ్యరక్షణ రంగంలో భవనాల మొదలు నాణ్యమైన మందులు, సేవల వరకు అన్నింటిలో కనీసపాటి భద్రతా ప్రమాణాలు తప్పనిసరి. కానీ, చాలాచోట్ల అవి హుళక్కి. తాజా ఘటనలే అందుకు తార్కాణం.నిజానికి, మన దేశంలో అగ్నిప్రమాదాల నుంచి భద్రతకు కీలకమైన ప్రమాణంగా జాతీయ నిర్మాణ నిబంధనావళి (ఎన్బీసీ) ఉంది. 1970లోనే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దీన్ని ప్రచురించింది. 2016లో సైతం దాన్ని నవీకరించారు. అగ్నిప్రమాద నివారణ అనేది రాష్ట్ర జాబితాలోని అంశమైనా, అన్ని రాష్ట్రాలూ దీన్ని పాటించడం తప్పనిసరి. ఇవి కాక స్థానిక భవననిర్మాణ చట్టాల్లోనూ కావాల్సినన్ని కఠిన నియమ నిబంధనలున్నాయి. అయితే, అవి తరచూ ఉల్లంఘనకు గురవుతున్నాయి. తాజా ప్రమాదాల్లోనూ అదే జరిగింది. ఆ మాటకొస్తే, గడచిన 2022లోనే మన దేశంలో 7500 పైగా అగ్నిప్రమాదాలు జరిగాయని తాజా నివేదిక. వాటిలో కనీసం 7435 మంది మరణించినట్టు ప్రమాద మరణాలు, ఆత్మహత్యలపై తాజా నివేదిక మాట. నిన్నటి ఢిల్లీ ప్రమాదంలో సైతం అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి, పక్కనున్న భవనం నుంచి నిచ్చెన ఎక్కి, ఆసుపత్రి వెనకవైపు నుంచి వెళ్ళబట్టి కనీసం అయిదుగురు శిశువుల్ని ఆఖరు క్షణంలో కాపాడగలిగారు. లేదంటే ఏమిటి పరిస్థితి? అందుకే, ఇది ప్రభుత్వ యంత్రాంగం అంతటికీ మరోసారి మేలుకొలుపు. గుజరాత్ లాంటి చోట్ల నిబంధనల్లోని లోపాలను అడ్డం పెట్టుకొని, అహ్మదాబాద్, గాంధీనగర్ సహా అనేకచోట్ల చట్టవిరుద్ధంగా వినోద కార్యకలాపాల వసతులు పుట్టగొడుగుల్లా మొలుస్తున్నాయి. తాత్కాలిక నిర్మాణాలతో భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కి, ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి. దీన్ని అరికట్టాలి. తప్పులు జరిగినప్పుడు సంబంధిత శాఖల అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం పరిష్కారం కాదు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మనుషుల ప్రాణాలను తృణప్రాయంగా తీసుకొని కొందరు సాగిస్తున్న దుర్మార్గ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాలి. ఎవరినీ ఉపేక్షించేది లేదనే సంకేతాలు మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపాలి. ప్రమాదాల నివారణకు సమర్థ, ప్రామాణిక చర్యల ప్రణాళికను అమలుచేయాలి. దీనికి ముందు రాజకీయ నేతల చిత్తశుద్ధి అవసరం. ఆపైన అలాంటి వసతులనే ఎంచుకోవడంలో సామాన్యుల అప్రమత్తత కీలకం. దేశవ్యాప్తంగా అధికారులు రంగంలోకి దిగి, చర్యలు చేపట్టేందుకు ప్రమాద భద్రతపై సత్వరమే జాతీయ స్థాయి ఆడిట్ జరిపితే మేలు. నేతల సంతాపాలు, నష్టపరిహారాలు మనుషుల ప్రాణాల్ని వెనక్కి తీసుకురాలేవు. -
రాజ్‌కోట్ అగ్నిప్రమాదం.. గుజరాత్ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుజరాత్‌లోని రాజ్‌కోట్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఆ రాష్ట్ర అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక మునిసిపల్ అధికారుల తీరుపై కోర్టు మండిపడింది. అమాయకుల ప్రాణాలు కోల్పోయిన తర్వాత చర్యలు చేపడతామని చెబుతోన్న రాష్ట్ర అధికారులపై తమకు నమ్మకం లేదని పేర్కొంది. అగ్నిప్రమాదం కేసును గుజరాత్ హైకోర్టు సోమవారం(మే27) విచారించింది. ఈసందర్భంగా రాజ్‌కోట్ మునిసిపల్ కార్పొరేషన్ (ఆర్ఎంసీ) అధికారులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. రెండున్నరేళ్లుగా మీ పరిధిలో ఇంత పెద్ద భవనం ఉందని.. అది కూడా ఫైర్‌సేఫ్టీ లేకుండా ఉందన్న విషయం కూడా తెలియదని ఎలా చెబుతారని జస్టిస్ బైరెన్ వైష్ణవ్, జస్టిస్ దేవాన్‌దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఆ భవనం ప్రారంభ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ కూడా పాల్గొన్నట్లు మీడియా కథనాలను బెంచ్ చూపించింది. ఈ అధికారులు ఎవరు.. వాళ్లంతా ఆడుకోవడానికి అక్కడికి వెళ్లారా అని మండిపడింది. ఏడుగురు అధికారుల సస్పెన్షన్ ..కాగా, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత గుజరాత్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇద్దరు పోలీసులు సహా మొత్తం ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసింది. వీరిలో రాజ్‌కోట్ మునిసిపల్ అధికారులు కూడా ఉన్నారు. -
ప్రభుత్వం నిద్ర పోతుందా? రాజ్‌కోట్ ఘటనపై హైకోర్టు సీరియస్
గాంధీనగర్: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందారు. మరో 15 మందిపైగా జనం జాడ తెలీడంలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనను సూమోటోగా స్వీకరించిన గుజరాత్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.‘‘అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ నిద్ర పోతున్నారు? మాకు గుజరాత్ ప్రభుత్వంపై మీద ఏ కోశానా కూడా నమ్మకం లేదు’’ అని హైకోర్టు ఆసహనం వ్యక్తం చేసింది. ‘‘ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న రెండు గేమింగ్ జోన్లను గత రెండు దశాబ్దాలుగా రాజ్‌కోట్‌లో నిర్వహింస్తున్నారు. వాటి నిర్వహణకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. ఫైర్ సేఫ్టీ అనుమతి పత్రాలు కూడా లేవు. అందుకే గుజరాత్ ప్రభుత్వం పట్ల కొంచం కూడా నమ్మకం లేదు’’ అని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రెండున్నరేళ్ల నుంచి రాజ్‌కోట్ గేమింగ్ జోన్ నడుస్తోంది. ప్రభుత్వం కళ్లు ముసుకుందని మేము అనుకోవాలా? అసలు అధికారులు ఏం చేస్తున్నారు?’’ అని హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. గేమింగ్ జోన్‌కు సంబంధించిన ఫొటోలను చూపించిన రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కూడా హైకోర్టు మండిపడింది. ‘‘ఈ అధికారులంతా ఎవరూ? అక్కడికి వారంతా ఆడుకోవడానికి వెళ్లారా?’’ అని కోర్టు విమర్శించింది. ‘‘అంతపెద్ద ప్రమాదం జరిగినప్పుడు మీకు కంటి చూపు పోయిందా? లేదా నిద్రపోతున్నారా? ఇంత జరిగాక మాకు స్థానిక వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోయింది’’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.రాజ్‌కోట్‌లోని మనా-మవా ప్రాంతంలో ఉన్న టీఆర్పీ గేమింగ్ జోన్లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఈ ఘటనలో 33 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. గేమింగ్ జోన్లో వెల్డింగ్ పనులు జరగుతున్నాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిపారు. -
వారం క్రితమే వివాహం.. గేమింగ్ జోన్లో అగ్నికి ఆహుతై..
గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్ ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. వినోదం కోసం వచ్చిన జనం ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో కొత్తగా పెళ్లయిన జంట అక్షయ్ ధోలారియా, ఖ్యాతి ఉన్నారు. ఈ జంటకు వారం క్రితమే వివాహం జరిగింది. ఈ నేపధ్యంలో వారు ఆనందంగా గేమింగ్ జోన్‌కు వచ్చారు. అయితే ఊహించని విధంగా సంభవించిన అగ్నిప్రమాదానికి వారిద్దరూ బలయ్యారు. 24 ఏళ్ల అక్షయ్ తన తల్లిదండ్రులతో కలిసి కెనడాలో ఉంటున్నాడు. ఖ్యాతి(20)ని వివాహం చేసుకునేందుకు కొద్దిరోజుల క్రితమే రాజ్‌కోట్‌కు వచ్చాడు. గత శనివారం వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లయిన ఏడు రోజులకే ఈ జంట లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. వారి శరీరాలు గుర్తించలేని విధంగా అగ్నికి మాడిపోయాయి. వేలికి ధరించిన ఉంగరం ఆధారంగా అక్షయ్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ దంపతుల మృతదేహాలను డీఎన్ఏ పరీక్షలకు తరలించారు.ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నామని, విచారణ తర్వాతే ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసు అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండానే ఈ వినోద కేంద్రం నడుస్తున్నదని విచారణ అధికారులు చెబుతున్నారు. మరోవైపు టీఆర్పీ గేమింగ్ జోన్ యజమానిని పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదంపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని కోరినట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ మీడియాకు తెలిపారు. -
Gujarat High Court: మానవ తప్పిద మహావిషాదం
అహ్మదాబాద్: రాజ్‌కోట్‌లో గేమ్‌జోన్‌లో అగి్నప్రమాద ఘటనపై గుజరాత్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మానవ తప్పిద మహా విషాదంగా అభివరి్ణంచింది. ఘటనను సూమోటోగా స్వీకరించిన జస్టిస్ బీరెన్ వైష్ణవ్, జస్టిస్ దేవాన్ దేశాయ్‌ల హైకోర్టు ధర్మాసనం ఈ కేసును ఆదివారం విచారించింది. ‘‘ ప్రాథమిక ఆధారాలను చూస్తే ఇది మానవతప్పిదమే స్పష్టంగా తెలుస్తోంది. ఏ చట్టనిబంధనల కింద ఇలాంటి గేమింగ్ జోన్లు, రీక్రియేషనల్ కేంద్రాలను ఏర్పాటుచేశారు?’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ గుజరాత్ కాంప్రిహేన్సివ్ జనరల్ డెవలప్మెంట్ కంట్రోల్ రెగ్యులేషన్స్(జీడీసీఆర్) నిబంధనల్లో ఉన్న లొసుగులను తెలివిగా వాడుకున్నట్లు తెలుస్తోంది. గేమింగ్ జోన్లు రాజ్కోట్తోపాటు అహ్మదాబాద్, వడోదర, సూరత్‌లలో ఉండటంతో ఆయా నగర మున్సిపల్ కార్పొరేషన్ల తరఫు అడ్వకేట్లు అందర్నీ సోమవారం తమ ఎదుట హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ‘‘ నిరభ్యంతర సరి్టఫికెట్, నిర్మాణ అనుమతులు వంటి వాటి నుంచి తప్పించుకునేందుకు టీఆర్పీ గేమ్‌జోన్ నిర్వాహకులు ఏదో తాత్కాలిక ఏర్పాట్లుచేసి చేతులు దులుపుకుని చిన్నారులు రక్షణను గాలికొదిలేశారు. గేమ్‌జోన్‌లో అనుమతి లేని, మండే స్వభావమున్న పెట్రోల్, ఫైబర్, ఫైబర్ గ్లాస్ïÙట్లను భద్రపరిచిన చోటులోనే అగి్నప్రమాదం జరిగింది’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. 15మంది జాడ గల్లంతు ఆదివారం నాటికి మృతుల సంఖ్య 33కు పెరిగింది. మరో 15 మందికిపైగా జనం జాడ తెలీడం లేదని అధికారులు వెల్లడించారు. నానామావా రోడ్‌లోని ఘటనాస్థలిని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆదివారం సందర్శించారు. తర్వాత క్షతగాత్రు లను ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. చనిపోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. ‘ ఘటన కారకులందరినీ ఉరితీయాలి. ఏ ఒక్కరికీ బెయిల్ కూడా దొరకొద్దు. బెయిల్ ఇస్తే వారిని నేనే చంపేస్తా’ అని ఏకైక కుమారుడు, నలుగురు బంధువులను పోగొట్టుకున్న ప్రదీప్‌సిన్హ్ చౌహాన్ ఆవేశంగా చెప్పారు. ఇటీవల నిశి్చతార్థమైన ఒక జంట సైతం ప్రమాదంలో అగి్నకి ఆహుతైంది. గేమ్‌జోన్ ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్‌కు ఎలాంటి ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికెట్ లేదని ఎఫ్ఐఆర్లో రాసి ఉంది. -
రాజ్‌కోట్ ప్రమాదంలో 33కు చేరిన మృతుల సంఖ్య.. ప్రభుత్వం కీలక నిర్ణయం
రాజ్‌కోట్: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌లోని గేమ్‌జోన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తాజాగా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. కాగా, శనివారం సాయంత్రం రాజ్‌కోట్‌లోని టీఆర్పీ గేమ్ జోన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వీకెండ్ కావడంతో భారీ సంఖ్యలో పర్యాటకులు అక్కడికి వచ్చారు. వారంతా ఆటల్లో నిమగ్నమైన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వారని చుట్టుముట్టడంతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో గేమ్ జోన్ పైకప్పు కూలిపోవడంతో లోపల ఉన్న వారంతా బయటకు రాలేకపోయారు. ఈ క్రమంలో వారంతో మంటల్లో సజీవదహనమయ్యారు. తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టం మారిందని అధికారులు వెల్లడించారు. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందతూ కొందరు బాధితులు మృతిచెందారు. దీంతో, మృతిచెందిన వారి సంఖ్య 33కి చేరుకుంది. #WATCH | Gujarat CM Bhupendra Patel and Home Minister Harsh Sanghavi took stock of the situation at TRP game zone in Rajkot where a massive fire broke out yesterday claiming the lives of 27 people. pic.twitter.com/ks1YhRszH2— ANI (@ANI) May 26, 2024మరోవైపు.. ఈ ఘటన నేపథ్యంలో గేమ్ జోన్ వద్దకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వచ్చి పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. ఈ సందర్భంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా.. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిలో టీఆర్పీ గేమ్‌జోన్ యజమాని యువ్‌రాజ్ సింగ్ సోలంకితోపాటు దాని మేనేజర్ నితిన్ జైన్ కూడా ఉన్నారు. ఇక, ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం సిట్‌ను నియమించింది. సీనియర్ పోలీస్ ఆఫీసర్ నేతృత్వంలో సిట్‌ను నియమించగా.. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.🚨 SHOCKING! At least 26 people, including at least 12 children, were killed in a massive fire that broke out at a game zone in Rajkot, Gujarat. pic.twitter.com/nN21BAP1WF— Indian Tech & Infra (@IndianTechGuide) May 26, 2024 -
TRP గేమింగ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం..
-
రాజ్‌కోట్‌లో పెను విషాదం
రాజ్‌కోట్: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవులు, వారాంతం కూడా కావడంతో సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన నలుగురు చిన్నారులు సహా మొత్తం 27 మంది అగ్ని ప్రమాదానికి బలయ్యారు. నానా–మవా రోడ్డులోని టీఆర్పీ గేమ్ జోన్లో సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. అందరూ ఆటల్లో మునిగి ఉన్న వేళ ఆ ప్రాంతాన్ని ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. దీంతో, అందులో చిక్కుకుపోయిన వారంతా హాహాకారాలు చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని దాదాపు ఐదుగంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంతోపాటు బలమైన గాలులు వీస్తున్న కారణంగా ఫైబర్ డోమ్ పూర్తిగా కుప్పకూలింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. శిథిలాలను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నట్లు రాజ్‌కోట్ కలెక్టర్ ప్రభావ్ జోషి చెప్పారు. ఇప్పటి వరకు 27 మృతదేహాలను వెలికితీశామన్నారు. పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయన్నారు. మృతదేహాలను, క్షతగా త్రులను వెంటనే ఆస్పత్రులకు తరలించామ ని చెప్పారు. ఘటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఉన్న గేమింగ్ జోన్లు అన్నిటినీ వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రమాదం సంభవించిన గేమ్ జోన్లో తక్షణమే సహాయ కార్యక్రమాలను చేపట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సీఎం భపేంద్ర పటేల్ తెలిపారు. ఘటనకు దారి తీసిన కారణాలపై సిట్‌తో ప్రత్యేక విచారణ చేయిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారంగా ప్రకటించారు. కాగా, రాజ్‌కోట్‌లో విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యజమాని అరెస్ట్టీఆర్పీ గేమ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ సోలంకీ, మేనేజర్‌తోపాటు మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
బీజేపీకి రాజ్‌పుత్‌ల హెచ్చరిక
గాంధీనగర్: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీకి గుజరాత్ రాజ్‌కోట్ సెగ్మెంట్లో పురుషోత్తం రూపాలా అభ్యర్థిత్వం తలనొప్పిగా మారింది. రాజ్‌కోట్‌లో బీజేపీ అభ్యర్థి పురుషోత్తం రూపాలాను.. అక్కడి నుంచి ఉపసంహరించుకోపోతే రాజ్‌పుత్ సామాజిక వర్గం సంఘాలు పెద్దఎత్తున నిరసన తెలుపుతామనిహెచ్చరిస్తున్నాయి. గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాల్లో తమ నిరసనలు తీవ్రతరం చేస్తామంటున్నాయి. ఏప్రిల్ 19 వరకు రాజ్‌కోట్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి పురుషోత్తం రూపాలాను ఉపసంహరించకోపోతే తమ నిరసన దేశంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని రాజ్‌పుత్ సంకల్ఫ్ సమితి చైర్మన్ కరన్సిన్హ చద్వా హెచ్చరించారు. ఈ సమతి రాజ్‌కోట్‌లో ‘రాజ్‌పుత్ ఆత్మగౌరవ సభ’ను ఆదివారం నిర్వహించింది. ఏప్రిల్ 16న రూపాల నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంతో ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇక.. నామినేషన్‌కు చివరి తేదీ 19, అదే విధంగా నామినేషన్ల ఉపసంహరణ తేదీ 22 వరకు ఉంది. పటీదార్ సామాజిక వర్గానికి చెందిన రుపాలా మర్చి 22న వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్వపు మహారాజులు.. బ్రిటిష్ వారితో సహా విదేశి పాలకుల అణచివేతకు లొంగిపోయారు. అదీకాక.. వారితో కలిసి భోజనం చేసి మహారాజులు తమ కుమర్తెలను విదేశీయులకు ఇచ్చి వివాహం జరిపించారని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై రాజ్‌పుత్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలిపారు. రూపాలా అభ్యర్థిత్వాన్ని రాజ్‌కోట్ పార్లమెంట్ స్థానం నుంచి ఉపసంహరించుకోవాలని బీజేపీని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికే రూపాలా రెండు సార్లు క్షమాపణలు చెప్పినా రాజ్‌పుత్ వర్గాలు నిరాకరించాయి. ఈ నేపథ్యంలో రూపాలాకు వ్యతిరేకంగా గుజరాత్ మొత్తం పోస్టర్లు వెలిశాయి. గుజరాత్లో మొత్తం 26 స్థానాలక మే 7 పోలింగ్ జరగనుంది. బీజేపీ రూపాలా అభ్యర్థిత్వాన్ని మార్చకపోతే.. వందల సంఖ్యలో నామినేషన్ల దాఖలు చేసి మరీ బీజేపీ అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరించారు. ‘బీజేపీలో విభేదాలు తలెత్తితే... రాత్రికిరాత్తే మంత్రులు, సీఎంను తొలగిస్తారు. కానీ, బీజేపీ నేత రాజ్‌పుత్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎందుకు నిశ్శబ్దంగా ఉంటుంది? మేము పెద్ద ఎత్తున పోరాడుతాం. సమస్యలపై మేము ధ్యైరం చూపిస్తాం’ అని రాత్పుత్ల నేత తృప్తి బా తెలిపారు. కాగా.. కొంతమందిస్వార్థ ప్రయోజనాల కోసమే నిరసనలకు ఆజ్యం పోస్తున్నారని బీజేపీ పేర్కొంది. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ దోషి మాట్లాడుతూ.. ‘మేము చాలా విశ్వాసంతో ఉన్నాం. పాటీదార్, రాజ్‌పుత్‌లు అంతా కలిసి రూపాలాను ఓడిస్తారు’అని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పరేష్ ధమాని పోటీ చేస్తున్నారు. -
అప్పుడు పుజారాకు ఫోన్ చేశా.. రోహిత్‌కు థాంక్స్: అశూ భార్య
‘‘రాజ్‌కోట్ టెస్టు జరుగుతున్న సమయంలో పిల్లలు స్కూలు నుంచి వచ్చిన ఐదు నిమిషాల తర్వాత.. తను 500 వికెట్ల మార్కు అందుకున్నాడు. వెనువెంటనే మమ్మల్ని అభినందిస్తూ ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. ఇంతలో మా అత్తయ్య పెద్దగా కేక పెట్టి కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించాం. అశ్విన్‌కు ఈ విషయం గురించి చెప్పకూడదని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే.. చెన్నై- రాజ్‌కోట్ మధ్య విమాన రాకపోకలు అంత ఎక్కువగా లేవని తెలుసు. అందుకే నేను ఛతేశ్వర్ పుజారాకు ఫోన్ చేసి అతడి కుటుంబ సభ్యుల సహాయం కోరాను. ఆ తర్వాత అశ్విన్‌కు ఫోన్ చేశాను. ఎందుకంటే ఆంటీని పరీక్షించిన తర్వాత.. ‘ఇలాంటి పరిస్థితుల్లో కొడుకు దగ్గరగా ఉంటే బాగుంటుంది’ అని డాక్టర్ చెప్పారు. అదే విషయం అశ్విన్‌తో చెప్పగానే తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వెంటనే కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత 20 -25 నిమిషాలకు గానీ మళ్లీ మాట్లాడలేకపోయాడు. రోహిత్ శర్మ, రాహుల్(ద్రవిడ్) భాయ్, బీసీసీఐలోని ఇతర సభ్యులకు ధన్యవాదాలు. అశ్విన్ చెన్నైకి చేరేంతవరకు క్షేమసమాచారాలు అడుగుతూ మాకు అండగా నిలబడ్డారు. ఆరోజు అశ్విన్ వచ్చేసరికి అర్ధరాత్రి అయింది’’ అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సతీమణి ప్రీతి నారాయణన్ ఉద్వేగానికి లోనైంది. అశ్విన్ ఐదు వందల టెస్టు వికెట్ల క్లబ్లో చేరాడన్న సంతోష సమయంలోనే అత్తగారు అనారోగ్యం పాలవడం తమను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని పేర్కొంది. కష్టకాలంలో ఛతేశ్వర్ పుజారా కుటుంబం, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ తమకు అండగా నిలిచారని ప్రీతి కృతజ్ఞతాభావం చాటుకుంది. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్ సందర్భంగా మూడో టెస్టు మధ్యలోనే అశ్విన్ జట్టును వీడిన విషయం తెలిసిందే. 500 వికెట్ల క్లబ్లో చేరిన తర్వాత తల్లి అనారోగ్యం పాలైన నేపథ్యంలో సెలవు తీసుకుని చెన్నైకి వెళ్లాడు. అయితే, ఆమె ఆరోగ్యం కుదుటపడగానే మళ్లీ జట్టుతో చేరాడు. ఇక ప్రస్తుతం ధర్మశాలలో జరిగే ఐదో టెస్టుతో అశ్విన్ మళ్లీ బిజీ కానున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో అశూకు ఇది వందో టెస్టు కావడం విశేషం. ఈ నేపథ్యంలో అశ్విన్ భార్య ప్రీతి.. ఈ సిరీస్ సమయంలో తమ కుటుంబం మానసిక వేదనకు గురైన తీరును వివరిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కాలమ్‌లో తన మనసులోని భావాలు పంచుకుంది. చదవండి: Rohit Sharma: సాకులు చెప్పి తప్పించుకోవచ్చు.. కానీ ఉదయం 5.30 గంటలకే ఇలా.. -
నేటి గుజరాత్ పర్యటలో ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే..
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.52,250 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 25న ఉదయం 7:45 గంటలకు ప్రధాని ద్వారకా ఆలయాన్ని సందర్శించి పూజలు చేయనున్నారు. అనంతరం సుదర్శన్ వంతెనను సందర్శిస్తారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ద్వారకలో రూ.4,150 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. దీని తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని మోదీ రాజ్‌కోట్‌కు వెళ్లనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు రాజ్‌కోట్‌లోని రేస్ కోర్స్ గ్రౌండ్లో రూ. 48,100 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ద్వారకలో జరిగే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఓఖా ప్రధాన భూభాగంతో బేట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతూ సుమారు రూ. 980 కోట్లతో నిర్మించిన సుదర్శన్ సేతును జాతికి అంకితం చేయనున్నారు. ఇది దాదాపు 2.32 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే అతి పొడవైన కేబుల్ సపోర్ట్ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. వదినార్, రాజ్‌కోట్-ఓఖా, రాజ్‌కోట్-జెతల్సర్-సోమ్‌నాథ్ మరియు జెతల్సర్-వాన్సజలియా రైలు విద్యుదీకరణ ప్రాజెక్టుల వద్ద పైప్‌లైన్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఫిబ్రవరి 26న దేశంలోని 550 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బండేల్లో రూ.307 కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచ స్థాయి స్టేషన్‌ను నిర్మించనున్నారు.టెలికాన్ఫరెన్సింగ్ ద్వారా బెంగాల్, జార్ఖండ్, బీహార్‌లోని 28 స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. -
Ind vs Eng: అతడి ఇన్నింగ్స్ అద్భుతం.. సిరీస్ గెలిచి తీరతాం!
India vs England, 3rd Test: ఇంగ్లండ్ ‘బజ్‌బాల్’ను టీమిండియా చితక్కొట్టింది. ఏకంగా 434 పరుగుల తేడాతో స్టోక్స్ బృందాన్ని ఓడించి రాజ్‌కోట్‌లో రాజసం చిందించింది. ఫలితంగా కనీవినీ ఎరుగని రీతిలో ఇంగ్లిష్ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. తద్వారా.. తమ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా రెండో అతిపెద్ద పరాజయం మూటగట్టుకుంది స్టోక్స్ బృందం. అదే విధంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో వెనుకబడింది. ఈ విషయంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. అతడి ఇన్నింగ్స్ అద్భుతం మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘బెన్ డకెట్ అద్భుత, అద్వితీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ ఆసాంతం ఇలాంటి జోరే కొనసాగించాలని మేము భావించాం. టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నాం. భారత రెండో ఇన్నింగ్స్‌లో మేము ఎక్కువ సేపు బౌలింగ్ చేయాలని భావించాం. కానీ అలా జరుగలేదు. అనుకున్న దాని కంటే ముందుగానే బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు ప్రణాళికలను పక్కాగా అమలు చేయడం సాధ్యం కాదు. ఏదేమైనా మా ఆటగాళ్లకు అండగా నిలవడం ముఖ్యం. ప్రస్తుతం మేము 1-2తో వెనుకబడి ఉన్నాం. అయితే, ఈ మ్యాచ్ నుంచి నేర్చుకున్న పాఠాలతో తిరిగి పుంజుకుంటాం. సిరీస్ గెలుస్తాం ఈ ఓటమి నుంచి తేరుకుని తదుపరి రెండు మ్యాచ్‌లపై దృష్టి సారిస్తాం. కచ్చితంగా సిరీస్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం’’ అని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. కాగా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ధనాధన్ సెంచరీ(153)తో అలరించాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 4 పరుగులకే రనౌట్ అయ్యాడు. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రాజ్‌కోట్ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసిపోగా.. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు ఆరంభం కానుంది. పరుగుల పరంగా ఇంగ్లండ్‌కు అతిపెద్ద టెస్టు ఓటములు ►562- వర్సెస్ ఆసీస్- ది ఓవల్ 1934 ►434- వర్సెస్ భారత్- రాజ్ కోట్- 2024 ►425- వర్సెస్ వెస్టిండీస్- మాంచెస్టర్ 1976 ►409- వర్సెస్ ఆసీస్- లార్డ్స్ 1948 ►405- వర్సెస్ ఆసీస్- లార్డ్స్ 2015 చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. టీమిండియాలో ఊహించని మార్పు! స్టార్ ప్లేయర్ దూరం -
రెప్పపాటులో జరిగిన అద్భుతం.. జురెల్ స్కిల్ చూడాల్సిందే!
India Wicket-Keeper Dhruv Jurel Inflicts Stunning Run-Out: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓటమి గాయాలను చెరిపేసేలా టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. హైదరాబాద్‌లో ఎదురైన పరాభవానికి విశాఖపట్నంలో బదులు తీర్చుకున్న రోహిత్ సేన.. రాజ్‌కోట్‌లో చారిత్రాత్మక గెలుపుతో అభిమానులను ఖుషీ చేసింది. ఇంగ్లండ్‌ను ఏకంగా 434 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత టెస్టు చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ(214)కు తోడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(5 వికెట్లు) బంతితో మాయాజాలం చేయడంతో ఈ గెలుపు సాధ్యమైంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా భారత్ తరఫున ఇద్దరు యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ వరుస అర్ధ శతకాలతో(62, 68) సత్తా చాటితే.. ఉత్తరప్రదేశ్ క్రికెటర్ ధ్రువ్ జురెల్ బ్యాటింగ్(తొలి ఇన్నింగ్స్‌లో- 46), వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రమాదకర బ్యాటర్, ఓపెనర్ బెన్ డకెట్(4)ను రనౌట్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను గట్టెక్కించాలని కంకణం కట్టుకున్న డకెట్.. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (6.1వ ఓవర్లో) బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా బంతిని తరలించగా.. మహ్మద్ సిరాజ్ బాల్‌ను ఆపాడు. Super Jurel 🦸♂️ with some 🔝glove-work 🔥👌#IDFCFirstBankTestSeries #INDvENG #BazBowled #JioCinemaSports pic.twitter.com/dTlzQZXKAn — JioCinema (@JioCinema) February 18, 2024 ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న జాక్ క్రాలే పరుగుకు నిరాకరించగా.. డకెట్ వెంటనే వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే సిరాజ్ వేసిన బంతిని అందుకున్న వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మెరుపు వేగంతో స్టంప్‌ను ఎగురగొట్టాడు. రెప్పపాటులో జరిగిన ఈ అద్భుతం కారణంగా డకెట్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. జురెల్ స్కిల్స్‌కు అద్దం పట్టే వీడియోను అభిమానులు నెట్టింట షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. డకెట్ తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసకర శతకం(153)తో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. చదవండి: సర్ఫరాజ్ ఒక్కడేనా.. ఈ ‘వజ్రాన్ని’ చూడండి! (ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి) -
అయ్యో బెయిర్ స్టో.. ! టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
టీమిండియాతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ జానీ బెయిర్ స్టో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన బెయిర్ స్టో.. తాజాగా రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో సైతం అదే తీరును కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో బెయిర్ స్టో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో జానీ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో బెయిర్ స్టో డకౌట్‌గా వెనుదిరిగాడు. తద్వారా అత్యంత చెత్త రికార్డును బెయిర్ స్టో తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో భారత్‌పై అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా బెయిర్ స్టో నిలిచాడు. ఈ ఇంగ్లీష్ బ్యాటర్ ఇప్పటివరకు టెస్టుల్లో భారత్‌పై 8 సార్లు డకౌటయ్యాడు. కాగా అంతకుముందు ఈ చెత్త రికార్డు పాకిస్తాన్ మాజీ ఆటగాడు డనేష్ కనేరియా పేరిట ఉండేది. కనేరియా 7 సార్లు భారత్‌పై డకౌటయ్యాడు. ఇక తాజా మ్యాచ్‌తో కనేరియాను బెయిర్ స్టో అధిగమించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది. 207/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. అదనంగా 112 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(153) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో సిరాజ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్ నష్టానికి 30 ఓవర్లలో 116 పరుగులు చేసింది. Jonny Bairstow has a habit of getting out early vs India in Tests ☹️#INDvENG pic.twitter.com/G0QkGteI5q — ESPNcricinfo (@ESPNcricinfo) February 17, 2024 -
రాజ్‌కోట్ టెస్ట్: టీమిండియాకు షాక్.. అశ్విన్ ఔట్
ఢిల్లీ: టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ నుంచి భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వైదొలిగాడు. వ్యక్తిగత కారణాలతో అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. అతని తల్లికి ఆరోగ్యం బాగోలోద ఇటువంటి పరిస్థితుల్లో అతడికి జట్టుతో పాటు బోర్డు అండగా నిలుస్తుందని తెలిపింది. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతోనే అశ్విన్ మ్యాచ్ నుంచి దూరమైనట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు తమకు ఎంతో ముఖ్యమని తెలిపింది. ఈ కష్టకాలంలో అశ్విన్‌కు అవసరమైన సహాయాన్ని బోర్డు, టీమ్ఇండియా జట్టు అందిస్తుందని పేర్కొంది. R Ashwin withdraws from the 3rd India-England Test due to family emergency. In these challenging times, the Board of Control for Cricket in India (BCCI) and the team fully supports Ashwin.https://t.co/U2E19OfkGR — BCCI (@BCCI) February 16, 2024 ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఎక్స్(ట్విటర్) వేదికగా ఒక పోస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో తన తల్లికి దగ్గర ఉండడం కోసం అశ్విన్ రాజ్‌కోట్ నుంచి చెన్నై వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆమె తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. రెండోరోజు బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. మ్యాచ్‌లో అశ్విన్ శుక్రవారం ఒక వికెట్ తీసి 500 వికెట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. భారత్ టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా ఘనతకెక్కాడు. మూడో టెస్టులో అశ్విన్ 37 పరుగులు చేసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇటువంటి తరుణంలో జట్టుకు అశ్విన్ దూరం కావడం పెద్దదెబ్బే. -
Ind vs Eng: సర్ఫరాజ్ ఖాన్ అరుదైన రికార్డు.. గిల్‌ను దాటేసి!
India vs England, 3rd Test: రాజ్‌కోట్ టెస్టు సందర్భంగా టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. క్రికెట్ పుటల్లో అరుదైన జాబితాలో తన పేరును నమోదు చేసుకున్నాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా- ఇంగ్లండ్ తొలి రెండో మ్యాచ్‌లలో చెరొకటి గెలిచి ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య గురువారం(ఫిబ్రవరి 15) మూడో టెస్టు మొదలైంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. రంజీల్లో పరుగుల వరద పారించి తొలి టెస్టు తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ ఇంకా కోలుకోకపోవడంతో సర్ఫరాజ్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. తద్వారా.. రంజీల్లో పరుగుల వరద పారించిన ఈ 26 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్ టెస్టు క్యాప్ అందుకున్నాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేనాటికి సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సగటు 69.85తో 3,912 పరుగులు రాబట్టాడు. సెంచరీల వీరుడు తద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసే నాటికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక సగటు కలిగి ఉన్న బ్యాటర్లలో ఆరో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను అధిగమించి.. క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు 45 మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ ఖాతాలో 14 సెంచరీలు, 11 అర్ధ శతకాలు ఉన్నాయి. భారత్ తరఫున అరంగేట్రం నాటికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగి ఉన్న బ్యాటర్లు 88.37 - వినోద్ కాంబ్లీ (27 మ్యాచ్‌లు) 81.23 - ప్రవీణ్ ఆమ్రే (23) 80.21 - యశస్వి జైస్వాల్ (15) 71.28 - రుషి మోదీ (38) 70.18 - సచిన్ టెండుల్కర్ (9) 69.85 - సర్ఫరాజ్ ఖాన్ (45) 68.78 - శుబ్‌మన్ గిల్ (23) . చదవండి: Rohit Sharma: అతి వద్దు రోహిత్! From The Huddle! 🔊 A Test cap is special! 🫡 Words of wisdom from Anil Kumble & Dinesh Karthik that Sarfaraz Khan & Dhruv Jurel will remember for a long time 🗣️ 🗣️ You Can Not Miss This! Follow the match ▶️ https://t.co/FM0hVG5X8M#TeamIndia | #INDvENG | @dhruvjurel21 |… pic.twitter.com/mVptzhW1v7 — BCCI (@BCCI) February 15, 2024 -
#Sarfaraz Khan: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తండ్రి, భార్య కన్నీటి పర్యంతం
Ind vs Eng 3rd Test- Sarfaraz Khan Debut- Beautiful moment: టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలన్న యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలని ఆశగా ఎదురుచూస్తున్న అతడి నిరీక్షణకు గురువారం(ఫిబ్రవరి 15) తెరపడింది. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ భారత తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదుగా ఈ ముంబై బ్యాటర్ టీమిండియా క్యాప్ అందుకున్నాడు. ఆ సమయంలో తండ్రి నౌషధ్ ఖాన్, సర్ఫరాజ్ భార్య రొమానా జహూర్ అతడి పక్కనే ఉన్నారు. ఈ క్రమంలో తన క్యాప్‌ను తండ్రికి చూపించగా.. అతడు దానిని ఆప్యాయంగా ముద్దాడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. వెంటనే సర్ఫరాజ్ వెళ్లి తండ్రిని ఆలింగనం చేసుకుని పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. ఇక రొమానా సైతం కంటతడి పెట్టగా.. సర్ఫరాజ్ ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఈ భావోద్వేగపూరిత సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అన్నాదమ్ముళిద్దరూ క్రికెటర్లే మహారాష్ట్రలో 1997లో జన్మించిన సర్ఫరాజ్ ఖాన్ క్రికెటర్‌గా ఎదగడంలో అతడి తండ్రి నౌషద్ ఖాన్‌ది కీలక పాత్ర. సర్ఫరాజ్‌తో పాటు అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా క్రికెటరే. ఇటీవలే అతడు అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆడాడు. యువ భారత్ ఫైనల్ చేరుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అందుకే ఆలస్యం! ఇక సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో ముఖ్యంగా రంజీల్లో అద్భుతంగా రాణించినప్పటికీ టీమిండియా ఎంట్రీ ఆలస్యమైంది. అతడి దూకుడు, ఆటిట్యూడ్ కారణంగానే టీమిండియా సెలక్టర్లు సర్ఫరాజ్ ఖాన్‌ను పక్కనపెట్టారనే వార్తలు వినిపించాయి. అయితే, అభిమానులు మాత్రం ప్రతిభావంతుడైన ఆటగాడికి అన్యాయం జరుగుతోందంటూ అనేక సందర్భాల్లో బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కేఎల్ రాహుల్ మూడో టెస్టుకు అందుబాటులో లేకుండా పోవడంతో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రానికి మార్గం సుగమమైంది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ద్వారా ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. చదవండి: Dhruv Jurel: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. తల్లి బంగారు గొలుసు అమ్మి మరీ! From The Huddle! 🔊 A Test cap is special! 🫡 Words of wisdom from Anil Kumble & Dinesh Karthik that Sarfaraz Khan & Dhruv Jurel will remember for a long time 🗣️ 🗣️ You Can Not Miss This! Follow the match ▶️ https://t.co/FM0hVG5X8M#TeamIndia | #INDvENG | @dhruvjurel21 |… pic.twitter.com/mVptzhW1v7 — BCCI (@BCCI) February 15, 2024 -
Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్.. ఇద్దరు ప్లేయర్ల అరంగ్రేటం
India vs England, 3rd Test: రాజ్‌కోట్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక, ఈ టెస్టులో టీమిండియా తరఫున సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ ధృవ్ జూరెల్‌కు అవకాశం కల్పించడంతో వీరిద్దరూ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరగ్రేటం చేశారు. ఇక ఇంగ్లండ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో వెటరన్ పేసర్ మార్క్ వుడ్ తుదిజట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇద్దరు పేసర్లు జేమ్స్ ఆండర్సన్, మార్క్ వుడ్‌లను ఆడించనుంది. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ హైదరాబాద్ టెస్టులో.. టీమిండియా విశాఖపట్నం టెస్టులో గెలిచాయి. ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తుది జట్ల వివరాలు.. టీమిండియా: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ -
IND VS ENG 3rd Test: ఆ ముగ్గురు సహా మరో ఇద్దరికి చాలా ప్రత్యేకం..!
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకాబోయే మూడో టెస్ట్ మ్యాచ్ ముగ్గురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారింది. రేపటి మ్యాచ్‌లో భారత వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ మరో వికెట్ తీస్తే టెస్ట్‌ల్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని చేరుకోనుండగా.. ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ మరో ఐదు వికెట్లు తీస్తే టెస్ట్‌ల్లో 700 వికెట్ల అత్యంత అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. రేపటి మ్యాచ్ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు 100వ టెస్ట్ కావడంతో ఈ మ్యాచ్ అతనికి చిరకాలం గుర్తిండిపోతుంది. ఈ మూడు ప్రత్యేకతలే కాకుండా రేపటి మ్యాచ్ ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు చిరస్మరణీయంగా మారే అవకాశం ఉంది. రాజ్‌కోట్ టెస్ట్‌తో యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ అహ్మద్, దృవ్ జురెల్ టెస్ట్ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖరారైపోయింది. ఆఖరి నిమిషంలో ఏదైనా జరిగితే తప్ప ఈ ఇద్దరి టెస్ట్ అరంగేట్రాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇలా రేపటి నుంచి ప్రారంభంకాబోయే రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ ఐదుగురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారనుంది. ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలువగా.. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు సమంగా ఉండటంతో రాజ్‌కోట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యతను పెంచుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. టీమిండియాను సీనియర్ల గైర్హాజరీ సమస్య కలవరపెడుతున్నప్పటికీ యువ ఆటగాళ్లు ఉత్సాహంగా కనిపిస్తూ గెలుపుపై ఆశలు సజీవంగా ఉంచారు. మరోపక్క ఇంగ్లండ్ టీమ్.. భారత్‌ను దెబ్బకొట్టేందుకు ఇదే సరైన సమయమని భావిస్తూ ప్రణాళికలు రచిస్తుంది. మరి రేపటి నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి. -
రాహుల్ అవుట్
రాజ్‌కోట్: భారత సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మూడో టెస్టుకూ దూరమయ్యాడు. గాయంతో అతన్ని రెండో టెస్టు నుంచి తప్పించి... ఇటీవలే మూడో టెస్టుకు ఎంపిక చేశారు. ఫిట్నెస్ సంతరించుకుంటేనే తుది జట్టుకు ఆడతాడని సెలక్షన్ సమయంలోనే స్పష్టం చేశారు. తాజాగా అతను పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టనుండటంతో మూడో టెస్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో కర్ణాటక ఎడంచేతి వాటం బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను ఎంపిక చేశారు. ‘రాహుల్ వందశాతం ఫిట్నెస్తో ఉంటేనే తుది జట్టుకు పరిగణిస్తామని ఇదివరకే చెప్పాం. అతను 90 శాతం కోలుకున్నట్లు తెలియడంతో రాజ్‌కోట్ టెస్టుకూ పక్కన బెట్టాం. అతని పరిస్థితిని బోర్డు మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస శిబిరంలో ఉన్న రాహుల్ నాలుగో టెస్టుకల్లా కోలుకుంటాడని ఆశాభావంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు 15 నుంచి రాజ్‌కోట్‌లో జరుగుతుంది. రాజ్‌కోట్‌కు ఇంగ్లండ్ స్వల్ప విరామం కోసం అబుదాబి వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సోమవారం తిరిగి భారత్ చేరుకుంది. వారంపాటు అక్కడ సేదతీరిన పర్యాటక జట్టు మూడో టెస్టు కోసం రాజ్‌కోట్ వేదికకు వచి్చంది. మంగళవారం సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్సీఏ) గ్రౌండ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేస్తారని స్థానిక వర్గాలు తెలిపాయి. స్పిన్నర్ జాక్ లీచ్ మోకాలి గాయంతో మిగతా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతను అబుదాబి నుంచే స్వదేశానికి పయనమయ్యాడు. స్పిన్ త్రయం హార్ట్లీ, రేహాన్ అహ్మద్, బషీర్‌లతో పాటు పార్ట్‌టైమ్ స్పిన్ పాత్ర పోషించే జో రూట్ అందుబాటులో ఉండటంతో లీచ్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇంకెవరినీ ఎంపిక చేయలేదు. నిజానికి అతను తొలిటెస్టు మాత్రమే ఆడాడు. లీచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 2 వికెట్లే తీశాడు. తర్వాతి రెండో టెస్టుకు దూరమయ్యాడు. -
Ind Vs Eng: టీమిండియా రాజభోగాలు.. రోహిత్ కోసం ప్రత్యేకంగా!
టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు గుజరాత్లో జరుగనుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. ఇక ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరొకటి గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మొదలుకానున్న మూడో టెస్టు ఇరుజట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. సిరీస్‌లో మరో ముందడుగు వేయాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలని రోహిత్ సేన- స్టోక్స్ బృందం పట్టుదలగా ఉన్నాయి. మెనూలోని వంటకాలు ఇవే ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఆటగాళ్లు రాజ్‌కోట్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో క్రికెటర్లు బసచేసే సయాజీ హోటల్లో.. వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయిస్తున్న వంటకాలకు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆజ్‌తక్ కథనం ప్రకారం.. క్రికెటర్ల మెనూలో సంప్రదాయ వంటకాలు ఫఫ్దా- జిలేబి, ఖాఖ్రా, గతియా, తెప్లా, ఖమన్(బ్రేక్‌ఫాస్ట్)లతో పాటు కతియావాడి భోజనంలో భాగంగా.. దహీ తికరి, వఘేరెలా రోట్లో(పెరుగు, వెల్లుల్లి కలిపి బజ్రా రోటీని ఫ్రై చేస్తారు) వంటివి చేర్చారు. రాజభోగాలు ఇక డిన్నర్ కోసం కిచిడి కఢీ ప్రత్యేకంగా తయరు చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. సయాజీ హోటల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బస కోసం ప్రత్యేకంగా రాయల్ సూట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. కాగా ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ ఇటీవలే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి సెలక్షన్‌కు అందుబాటులో ఉండకపోవడంతో అతడిని పక్కనపెట్టిన సెలక్టర్లు.. బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్‌నకు తొలిసారి పిలుపునిచ్చారు. అతడిపై వేటు.. అదే విధంగా.. ఫిట్నెస్ సమస్యల కారణంగా శ్రేయస్ అయ్యర్‌ను తప్పించిన మేనేజ్మెంట్.. తొలి టెస్టు తర్వాత గాయపడిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, బ్యాటర్ కేఎల్ రాహుల్ కోలుకుంటున్నట్లు తెలిపింది. వారిద్దరిని మూడో టెస్టుకు ఎంపిక చేసినా.. మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకున్న తర్వాతే తుదిజట్టులో చోటు దక్కించుకుంటారని తెలిపింది. వాళ్లిద్దరికి సన్మానం ఇదిలా ఉంటే.. రవీంద్ర జడేజా, ఛతేశ్వర్ పుజారాలకు సౌరాష్ట్ర క్రికెట్ గ్రౌండ్ సొంతమైదానం. ఈ నేపథ్యంలో మూడో టెస్టు ఆరంభానికి ముందే ఈ ఇద్దరు టీమిండియా స్టార్లను సన్మానించాలని స్థానిక క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా!