
మోడీ ఇలాకాలో రాహుల్ పర్యటన
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఇలాకాలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేటి నుంచి రెండు రోజులపాటు పర్యటించనున్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మాదాబాద్లోని శబర్మతి ఆశ్రమాన్ని ఆయన సందర్శిస్తారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఆఫీస్ బేరర్లు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ నేతలతో రాహుల్ భేటీ కానున్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొని రాహుల్ ప్రసంగిస్తారు. అందులోభాగంగా విద్యార్థి నాయకులు, స్థానిక సంస్థలకు ఎన్నికైన సభ్యులతో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ గతంలో పోటీ చేసిన రాజ్కోట్ శాసనసభ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటు కార్యకర్తలతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు.