Sabarmati Ashram
-
అహ్మదాబాద్‌లో పర్యాటకుల రద్దీ
ప్రపంచ కప్- 2023 ఫైనల్ మ్యాచ్ ఈరోజు (నవంబర్ 19, ఆదివారం) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోగల నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. భారత్ - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం దేశ, విదేశాల నుంచి క్రికెట్ ప్రేమికులు అహ్మదాబాద్‌కు తరలివచ్చారు. వీరంతా అహ్మదాబాద్‌లోని పలు పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. దీంతో ఇక్కడి సబర్మతి ఆశ్రమం, భద్ర కోట, అక్షరధామ్ ఆలయం, గుజరాత్ సైన్స్ సిటీ, నైట్ మార్కెట్ ఆఫ్ లా గార్డెన్, కైట్ మ్యూజియం, అదాలజ్ స్టెప్‌వెల్ మొదలైనవన్నీ పర్యాటకులతో రద్దీగా మారాయి. ఈ పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సబర్మతి ఆశ్రమం అహ్మదాబాద్‌లో పేరుగాంచిన ప్రముఖ ప్రదేశాలలో సబర్మతి ఆశ్రమం ఒకటి. సబర్మతీ నది ఒడ్డున ఉన్న ఈ ఆశ్రమంలో మహాత్మా గాంధీకి చెందిన, స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన అనేక స్ఫూర్తిదాయక, ప్రేరణాత్మక వస్తువులను చూడవచ్చు. కంకారియా సరస్సు అహ్మదాబాద్‌లో కంకారియా సరస్సు అందమైన పర్యావరణానికి ప్రతీకగా నిలిచింది. కంకారియాలో అరుదైన జంతువుల అభయారణ్యం ఉంది. ఇది పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడి కిడ్స్ సిటీలో థియేటర్, హిస్టారికల్ సెంటర్, రీసెర్చ్ లాబొరేటరీ, ఐస్ క్రీం ఫ్యాక్టరీ మొదలైనవి ఉన్నాయి. భద్ర కోట అహ్మదాబాద్‌లోని జామా మసీదు సమీపంలో భద్ర కోట ఉంది. దీనిని 1411లో నిర్మించారు. కోట నుండి అహ్మదాబాద్ నగరం ఎంతో అందంగా కనిపిస్తుంది. సాయంత్రం వేళ ఇక్కడికి పర్యాటకులు తరలివస్తుంటారు. లా గార్డెన్ నైట్ మార్కెట్ లా గార్డెన్‌కు చెందిన నైట్ మార్కెట్‌ను సందర్శించకపోతే అహ్మదాబాద్ పర్యటన అసంపూర్ణం అవుతుందని అంటారు. ఈ మార్కెట్లో చేతితో తయారు చేసిన గుజరాతీ దుస్తులు, వివిధ వస్తువులు లభ్యమవుతాయి. ఇది కూడా చదవండి: భారత్ విజయం కోరుతూ ట్రాన్స్జెండర్ల ప్రత్యేక పూజలు -
మెరుగైన స్నేహబంధం కోసం ఎదురుచూస్తున్నాం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: భారత్– ఆస్ట్రేలియా బలీయ స్నేహబంధం కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా బుధవారం అహ్మదాబాద్ చేరుకున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్నుద్దేశిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం అహ్మదాబాద్ చేరుకున్న అల్బనీస్ నేరుగా సబర్మతీ ఆశ్రమానికి వెళ్లి మహాత్మునికి నివాళులర్పించారు. ‘వాణిజ్యం, భద్రత వంటి అంశాల్లో క్రియాశీలకంగా ఉన్న భారత్‌తో బహుముఖ బంధాలను బలపరుచుకునేందుకు ఆస్ట్రేలియాకు లభించిన అద్భుత అవకాశం ఇది. నూతన సాంకేతికత, ఆవిష్కరణలకు చోదక శక్తి భారత్. మా దేశంలో పెద్దసంఖ్యలో వైవిధ్య భారత్, ఆస్ట్రేలియా ప్రజల వల్లే మా దేశం ఇంతగా అభివృద్ధి చెందింది ’ అని భారత్‌కు విచ్చేసిన సందర్భంగా అల్బనీస్ వ్యాఖ్యానించారు. భారతీయ డిగ్రీలకు ఆస్ట్రేలియాలో గుర్తింపు ‘ఆస్ట్రేలియా–భారత్ విద్యార్హత గుర్తింపు వ్యవస్థ’ను అందుబాటులోకి తెస్తున్నట్లు అల్బనీస్ ప్రకటించారు. అంటే ఆస్ట్రేలియా చదువుకుంటున్న, చదివిన భారతీయ విద్యార్థుల డిగ్రీలను ఇండియాలో అనుమతిస్తారు. అలాగే భారత్‌లో చదివిన డిగ్రీనీ ఆస్ట్రేలియాలో గుర్తింపునకు అనుమతిస్తారు. మరోవైపు గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియాకు చెందిన డీకెన్ యూనివర్సిటీ తన అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్‌ను నెలకొల్పనుంది. ఆస్ట్రేలియా నాలుగేళ్లపాటు చదవనున్న భారతీయ వి ద్యార్థులకు ‘మైత్రి’ పేరిట ఉపకారవేతనం సైతం అందిస్తామని అల్బనీస్ చెప్పారు. నేడు మోదీతో కలిసి టెస్ట్ మ్యాచ్ వీక్షణ బుధవారం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గురువారం అహ్మదాబాద్‌లోని మోతెరా నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటను ప్రధాని మోదీతో కలిసి వీక్షిస్తారు. అల్బనీస్‌తో కలిసి మ్యాచ్ చూసేందుకు మోదీ సైతం బుధవారమే అహ్మదాబాద్ చేరుకున్నారు. తర్వాత అల్బనీస్ ముంబై చేరుకుంటారు. శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారు. తర్వాత మోదీతోపాటు ఇరుదేశాల వార్షిక సదస్సులో పాల్గొంటారు. సమగ్ర వ్యూహాత్మక ఒప్పందం తదితరాలపై చర్చించనున్నారు. ప్రధానిగా అల్బనీస్‌కు ఇదే తొలి భారత పర్యటన. -
మహోజ్వల భారతి: సబర్మతి ఆశ్రమానికి మారిన గాంధీజీ
గాంధీజీ సబర్మతి ఆశ్రమంలోకి మారిన రోజు ఇది. సబర్మతీ ఆశ్రమాన్నే.. గాంధీ ఆశ్రమం, హరిజన ఆశ్రమం, సత్యాగ్రహ ఆశ్రమం అని కూడా అంటారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదుకి 5 కిలోమీటర్ల దూరంలో సబర్మతీ నది ఒడ్డున స్వాతంత్య్రోద్యమ సమయంలో గాంధీజీ ఈ ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. గాంధీజీ తన భార్య కస్తూర్బాతో పాటు ఇక్కడ పన్నెండేళ్లు నివాసమున్నారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఈ ఆశ్రమం కీలక పాత్ర పోషించింది. ఉద్యమంలో కీలక ఘట్టాలైన ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్ర మొదలైనవి ఇక్కడి నుండే ప్రారంభమయ్యాయి. అంతకుక్రితం గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి రాగానే జీవన్ లాల్ దేశాయ్ అనే స్నేహితుడి బంగళాలో 1915 మే 25 న ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో ఆ ఆశ్రమాన్ని సత్యాగ్రహ ఆశ్రమంగా పిలిచేవారు. ఐతే గాంధీజీ తన ఆశ్రమంలో వ్యవసాయం, పశుపోషణ చేపట్టాలనుకోవడంతో ఎక్కువ స్థలం అవసరమైంది. అందుకోసం రెండు సంవత్సరాల తర్వాత 1917 జూన్ 17న సబర్మతీ నది ఒడ్డున 36 ఎకరాల సువిశాల స్థలానికి ఆశ్రమాన్ని తరలించారు. ఈ ఆశ్రమం జైలుకు, శ్మశానానికి మధ్యలో ఉండేది. ఒక సత్యాగ్రాహి ఇలా అనేవారట : ఈ రెండింటిలో ఏదో ఒక చోటుకు వెళ్లవలసి వస్తుంది కాబట్టి దీన్ని అనువైన ప్రదేశంగా గాంధీజీ భావించారు’’అని. గాంధీజీ ఈ ఆశ్రమంలో ఉండగానే వ్యవసాయం, అక్షరాస్యత మొదలైన అంశాల మీద శిక్షణ ఇచ్చేందుకు ఒక పాఠశాలను కూడా నెలకొల్పారు. గాంధీజీ ఈ ఆశ్రమం నుంచే 1930 మార్చి 12 న అక్కడికి 241 మైళ్ల దూరంలో ఉన్న దండికి 78 మంది అనుచరులతో పాదయాత్ర ప్రారంభించాడు. బ్రిటిష్ వారు ఉత్పత్తి చేసే ఉప్పును భారతీయులకు అమ్మేందుకు పన్నిన కుట్రకు; స్వదేశీ ఉప్పు మీద పాలకులు విధించిన పన్నుకు నిరసనగానూ ఈ ఉద్యమం సాగింది. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో ప్రభుత్వం గాంధీజీ స్మారక కేంద్రాన్ని నడుపుతోంది. మొదట్లో ఈ మ్యూజియంని ఆశ్రమంలో గాంధీజీ నివసించిన హృదయకుంజ్ అనే కుటీరంలో ఏర్పాటు చేశారు. తరువాత 1963లో ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ చార్లెస్ కొరియా ఒక మ్యూజియాన్ని రూపకల్పన చేశారు. ఆ మ్యూజియాన్ని 1963 మే 10 న అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఇక్కడ గాంధీజీ జీవితానికి సంబంధించిన ఛాయాచిత్రాలు, ఆయన రాసిన ఉత్తరాలు, సందేశాలు, ఆయన జీవితంపై వచ్చిన సాహిత్యం, చిత్రాలు పొందుపరిచారు. ఆశ్రమ ప్రాంగణంలోనే వినోబా–మీరా నివసించిన వినోబా–మీరా కుటీరం, ప్రార్థనా భూమి, కుటీర పరిశ్రమలకు శిక్షణనిచ్చే కేంద్రం మొదలైనవి ఉన్నాయి. సంవత్సరం పొడవునా ఉదయం 8:30 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శకుల కోసం తెరిచి ఉంచుతారు. -
కేజ్రీవాల్ పొలిటికల్ ప్లాన్ షురూ.. టెన్షన్లో మోదీ!
గాంధీనగర్: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన మార్క్ చూపించింది. పంజాబ్‌లో భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అనంతరం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం మాన్.. రెండు పర్యటనలో భాగంగా గుజరాత్‌లోని శనివారం అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమం సందర్శించారు. ఈ క్రమంలో ఆశ్రమంలో ఉన్న మహాత్మా గాంధీ చరఖా తిప్పారు. అనంతరం అక్కడే ఉన్న మ్యూజియాన్ని సందర్శించారు. కాగా, స్వాతంత్ర్య ఉద్యమంలో సబర్శతి ఆశ్రమం నుంచే మహాత్మా గాంధీ.. ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్ర వంటి ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్.. ఈ ఆశ్రమం ఆథ్యాత్మిక ప్రదేశమని, గాంధీజీ స్ఫూర్తి తమలో ఆధ్యాత్మిక భావనలు రేకెత్తిస్తోందని గాంధీ పుట్టిన దేశంలో తాను జన్మించడం గర్వకారణమని కేజ్రీవాల్ తెలిపారు. ఈ క్రమంలో భగవంత్ మాన్ స్పందిస్తూ.. గాంధీ ఆశ్రమాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని భిన్నమైన అనుభూతి కలుగుతోందని పేర్కొన్నారు. మరోవైపు.. వీరి పర్యటనలో రాజకీయ విషయాలపై మీడియా కేజ్రీవాల్‌ను ప్రశ్నించగా.. ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడవద్దని సున్నితంగా తిరస్కరించారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివరిలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆప్ నేతలు ఇక్కడ పర్యటిస్తున్నారని రాజకీయంగా చర్చ నడుస్తోంది. కాగా, గుజరాత్‌లోని మొత్తం 182 స్ధానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కేజ్రీవాల్ ఇప్పటికే వెల్లడించారు. దీంతో ఇప్పటి నుంచే గుజరాత్‌పై కేజ్రీవాల్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. आज गुजरात के साबरमती आश्रम जाने का सौभाग्य मिला। यह आश्रम एक आध्यात्मिक स्थान है, ऐसा प्रतीत होता है कि जैसे यहाँ गांधी जी की पूज्य आत्मा बसती है। यहाँ आकर आध्यात्मिक अनुभूति होती है। मैं स्वयं को धन्य मानता हूँ कि मैं भी उस देश में पैदा हुआ जिस देश में गाँधी जी पैदा हुए। pic.twitter.com/oUg2yOGMlq — Arvind Kejriwal (@ArvindKejriwal) April 2, 2022 -
బాపూజీ బాటలో...
మనసు పవిత్రం అయితే మాట కూడా పవిత్రమవుతుంది. దానికి మంత్రబలం లాంటిది వస్తుంది. బాపూజీ మాట ఎందరినో తమను తాము తెలుసుకునేలా చేసింది. తమ జీవితాన్ని కాంతి మంతమైన కొత్త బాటలోకి నడిపించుకు వెళ్లేలా చేసింది. దీనికి బలమైన ఉదాహరణ ఈ ముగ్గురు మహిళలు... మెడెలిన్ స్లెడ్ మీరాబెన్‌గా ఎలా మారింది? ‘మెడె లిన్ స్లెడ్ ఎవరు?’ అంటే టక్కున గుర్తుకురాకపోవచ్చు. అయితే ‘మీరాబెన్’ అంటే మాత్రం గాం«ధీజీ గుర్తుకు వస్తారు. బ్రిటిష్ సైనిక అధికారి సర్ ఎడ్మండ్ కుమార్తె అయిన మెడె లిన్‌కు సంగీతం వినడం, పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఒకానొక సందర్భంలో ఫ్రెంచ్ రచయిత రోమైన్ రోలెండ్ గాంధీజీ జీవితంపై రాసిన పుస్తకం చదివింది. ఈ పుస్తకం తనను ఎంత ప్రభావితం చేసిందంటే ‘సబర్మతీ ఆశ్రమానికి రావాలనుకుంటున్నాను’ అని గాంధీజీకి లేఖ రాసింది. ‘తప్పకుండా రావచ్చు’ అని ఆహ్వానిస్తూనే ఆశ్రమ క్రమశిక్షణ వాతావరణాన్ని గుర్తు చేశారు గాంధీ. 1925లో అహ్మదాబాద్‌కు వచ్చింది మెడెలిన్. గాంధీజీలో ఒక దివ్యకాంతిని దర్శించింది. ఆ కాంతి తనను పూర్తిగా మార్చేసింది. మద్యపానం, మాంసాహారం మానేసేలా చేసింది. ‘భగవద్గీత’ అధ్యయనం ఆమె జీవితాన్ని వెలుగుమయం చేసింది. తన పేరు ‘మీరాబెన్’గా మారింది. ఉద్యమాల్లో భాగంగా గాంధీజీతో పాటు జైలుకు కూడా వెళ్లింది. ‘సేవాగ్రామ్’ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది. రిషికేష్‌కు సమీపంలో ‘పశులోక్ ఆశ్రమం’ ఏర్పాటు చేసింది. బాపు తనకు రాసిన ఉత్తరాలను పుస్తకంగా ప్రచురించింది. కోట దాటి పేదల పేటకు వచ్చిన రాజకుమారి అమృత్‌కౌర్ పెరిగిన వాతావరణానికి, ఆ తరువాత ఉద్యమకారిణి గా ఆమె జీవితానికి ఎక్కడా పొంతన కనిపించదు. కోటలో రాజకుమారి పేట పేటకు తిరిగి స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడానికి స్ఫూర్తి గాంధీజీ. కపూర్థలా రాజు హరినామ్సింగ్ కుమార్తె అయిన అమృత్‌కౌర్ ఇంగ్లండ్‌లో చదువుకుంది. గాంధీజీకి ఆమె ఎన్నో ఉత్తరాలు రాసేది. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఆమె దిశను మార్చేసాయి. 1934లో గాంధీని కలుసుకుంది. ఆ తరువాత ఆశ్రమంలో చేరింది. తన ఖరీదైన రాచరిక జీవనశైలికి, ఆశ్రమ వాతావరణానికి బొత్తిగా సంబంధం లేదు. చాలా కష్టం కూడా అనిపించవచ్చు. కాని ఎండకన్నెరుగని రాజకుమారి సామాన్యురాలిగా మారి ఆ ఆశ్రమంలో సేవ చేసింది. గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శిగా 16 సంవత్సరాలు పనిచేసింది. ఉప్పుసత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జైలుకు కూడా వెళ్లింది. గాంధీజీ తనకు రాసిన ఉత్తరాలు ‘లెటర్స్ టు రాజకుమారి’ పేరుతో పుస్తకంగా వచ్చింది. వైద్యం నుంచి ఉద్యమం వరకు... కుంజా (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) అనే చిన్న నగరం లో జన్మించింది సుశీల నయ్యర్. ఆమెకు ప్యారేలాల్ అనే అన్న ఉండేవాడు. అన్నాచెల్లెళ్లకు గాంధీజీ తత్వం అంటే బాగా ఇష్టం. ఎప్పుడూ దాని గురించి చర్చించుకునేవారు. దిల్లీలో వైద్యవిద్యను అభ్యసించింది సుశీల. 1939లో తన సోదరుడిని ‘సేవాగ్రామ్’లో చేర్పించడానికి వచ్చింది. అలా గాంధీజీతో పరిచయం పెరిగింది. పేదలకు ఆమె చేసే వైద్యసహాయం గాంధీజీ ప్రశంసలు అందుకునేలా చేసింది. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జైలుకు కూడా వెళ్లింది. ఇదంతా వారి తల్లిదండ్రులకు మొదట్లో నచ్చలేదు. అయితే ఆ తరువాత కాలంలో వారి ఆలోచన విధానంలోనూ మార్పు వచ్చింది. మహత్మాగాంధీ: ఫైనల్ ఫైట్ ఫర్ ఫ్రీడమ్, మహాత్మాగాంధీ: సాల్ట్ సత్యాగ్రహ... మొదలైన పుస్తకాలు రాసింది డా.సుశీల నయ్యర్. -
స్వాతంత్య్ర దినం.. అమృత మహోత్సవం
అహ్మదాబాద్: 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమంలో శుక్రవారం ప్రారంభించారు. జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన చరిత్రాత్మక దండియాత్రను స్మరించుకుంటూ సబర్మతీ ఆశ్రమం నుంచి పాదయాత్రకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. ఈ యాత్రలో 81 మంది పాల్గొంటున్నారు. వీరంతా 386 కిలోమీటర్లు నడిచి ఏప్రిల్ 5వ తేదీ నాటికి నవసరీ జిల్లాలోని దండికి చేరుకుంటారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా మహాత్మాగాంధీ 78 మంది అనుచరులతో కలిసి 1930 మార్చి 12న దండియాత్రలో మొదటి అడుగు వేసిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యానికి తల్లి.. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు 2022 ఆగస్టు 15 వరకూ కొనసాగుతాయని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. దేశంలో ఎంతోమంది మహనీయులు తగిన గుర్తింపునకు నోచుకోలేకపోయారని, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో గత ఆరేళ్లుగా వారి చరిత్రను పదిలపర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంప్రదాయాలు మనకు గర్వకారణమని చెప్పారు. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది భారత్ అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని వ్యాఖ్యానించారు. మనం సాధించిన ఘనతలు, విజయాలు మనకు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా వెలుగులు పంచుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. మనం ప్రారంభించిన ‘ఆత్మనిర్భర్ భారత్’తో ప్రపంచ అభివృద్ధి ప్రయాణం వేగం పుంజుకుంటుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అవి మన చోదక శక్తులు ‘‘ఐదు స్తంభాలు.. స్వాతంత్య్ర పోరాటం, ఆలోచనలు, విజయాలు, చర్యలు, తీర్మానాలు అనేవి మనం ముందుకు సాగడానికి తోడ్పడే చోదకశక్తులు. మహనీయుల చరిత్రను వెలికి తీసి, పదిలపరుస్తున్నాం. దండియాత్రతో ముడిపడి ఉన్న ప్రాంతానికి, అండమాన్‌లో నేతాజీ సుభాష్‌చంద్రబోస్ త్రివర్ణ పతాకం ఎగురవేసిన ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చాం. అలాగే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు సంబంధించిన స్థలాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేశాం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు. నా అంకితభావం బలోపేతం అంతకుముందు ఢిల్లీ నుంచి విమానంలో అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన నరేంద్ర మోదీ నేరుగా సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. ఆశ్రమంలో 1918 నుంచి 1930 వరకు గాంధీజీ తన భార్య కస్తూర్బాతో కలిసి నివసించిన హృదయ్‌కుంజ్ అనే ఇంటిని మోదీ సందర్శించారు. ‘ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్’ మన స్వాతంత్య్ర సమర యోధులకు, స్వాతంత్య్ర పోరాటానికి ఒక నివాళి అని సందర్శకుల పుస్తకంలో రాశారు. జాతి నిర్మాణం పట్ల తన అంకితభావం సబర్మతీ ఆశ్రమానికి రావడంతో, బాపూజీ స్ఫూర్తితో మరింత బలోపేతమయ్యిందని అందులో పేర్కొన్నారు. స్వావలంబన(ఆత్మ నిర్భరత), ఆత్మ విశ్వాసం అనే సందేశాన్ని బాపూజీ ఇక్కడి నుంచే ఇచ్చారని గుర్తుచేశారు. సబర్మతీ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను నరేంద్ర మోదీ తిలకించారు. వోకల్ ఫర్ లోకల్.. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభం కంటే ముందు ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ఏదైనా స్థానిక ఉత్పత్తిని కొనుగోలు చేసి, ఆ ఫొటోను ‘వోకల్‌ఫర్‌లోకల్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్టు చేయాలని సూచించారు. సబర్మతీ ఆశ్రమంలో ఒక చరఖాను ఏర్పాటు చేస్తామని, ఆత్మనిర్భరతకు సంబంధించిన ప్రతి ట్వీట్‌కు ఇది ఒక పూర్తివృత్తం తిరుగుతుందని చెప్పారు. స్థానిక ఉత్పత్తుల కొనుగోలును ప్రోత్సహించే దిశగా ఇదొక ఉత్ప్రేరకంగా పని చేస్తుందని ట్వీట్లో పేర్కొన్నారు. ‘వోకల్‌ఫర్‌లోకల్’ గాంధీజీకి, మన స్వాతంత్య్ర సమరయోధులకు గొప్ప నివాళి అవుతుందని వెల్లడించారు. -
'అమృత్ మహోత్సవ్'కు ప్రధాని మోదీ శ్రీకారం
-
'అమృత్ మహోత్సవ్'కు ప్రధాని మోదీ శ్రీకారం
గుజరాత్: 'అమృత్ మహోత్సవ్' కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలకు గుర్తుగా గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి 'అమృత్ మహోత్సవ్' కార్యక్రమాన్ని ప్రధాని.. శుక్రవారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో 75 వారాల పాటు 'అమృత్ మహోత్సవ్' నిర్వహించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట స్వాతంత్ర్య సంబరాలు జరపనున్నారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్: ఈ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఎగురవేయగా, వరంగల్‌లో గవర్నర్ తమిళిసై జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, గాంధీ ఉద్యమం తర్వాత అద్భుత ఘట్టాలు ఆవిష్కరించబడ్డాయన్నారు. అహింసాయుతమైన పద్ధతిలో గాంధీ పయనించారని తెలిపారు. అహింసా పద్ధతిలోనే స్వాతంత్ర్యం సాధించి, మహాత్మా గాంధీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ‘‘మార్టిన్ లూథర్ కింగ్‌కు కూడా గాంధీనే ఆదర్శం. గాంధీ సిద్ధాంతాలు నేటి యువతకు ఆదర్శం. 384 కి.మీ. 24 రోజులపాటు గాంధీతోపాటు సత్యాగ్రహులు పాదయాత్ర చేశారు.గాంధీ వెంట సుమారు 70వేల మంది పాల్గొన్నారు. దండి యాత్ర ఒక ప్రవాహంలా నడిచింది. దండి యాత్ర స్ఫూర్తితో అమృత్ మహోత్సవ్ కొనసాగుతుంది. దండి యాత్రలో హైదరాబాద్ ముద్దుబిడ్డ సరోజిని నాయుడు కూడా పాల్గొన్నారు. ఎందరో మహానీయులు ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా గాంధీ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్నాం. అదే స్ఫూర్తితో తెలంగాణను సాధించుకున్నామని’’ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రమణా చారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తామని.. ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రూ.25 కోట్లు కేటాయిస్తున్నామని సీఎం ప్రకటించారు. -
అమృత్ మహోత్సవ్‌లో భాగస్వాములు కండి
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తికానున్న సందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు విరివిగా పాల్గొ నాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలు ఈ నెల 12వ తేదీ నుంచి గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి ప్రారంభం కానున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు. దాదాపు ఏడాది తర్వాత బుధవారం నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 75 ప్రాంతాల్లో 75 వారాలపాటు జరిగే ఈ పండగలో పార్లమెంట్ సభ్యులంతా పాల్గొని, ప్రభుత్వం చేపట్టిన కోవిడ్–19 వ్యాక్సినేషన్లో పాల్గొనేలా ప్రజలకు చేయూత అందించాలని కూడా సూచించారని ప్రహ్లాద్ జోషి తెలిపారు. వ్యాక్సినేషన్‌కు వెళ్లే పౌరులకు వాహనాలు సమ కూర్చడం వంటి ఏర్పాట్లు చేయాలని కోరార న్నారు. కోవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో ప్రధాని మోదీ సమర్థంగా వ్యవహరించారని ప్రశంసిస్తూ పార్లమెంటరీ పార్టీ ఒక తీర్మానాన్ని ఆమోదించిందన్నారు. ఈ భేటీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రసంగించారని చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌పై మోదీ బుధవారం లోక్‌సభలో ప్రకటన చేయాలనుకున్నారని, అయితే, సభలో అంతరాయాల వల్ల ఆయన మాట్లాడ లేకపోయారని మంత్రి జోషి తెలిపారు. అంతకు ముందు, సభలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే విషయంలో ఏకాభి ప్రాయం సాధించేందుకు స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం విఫలమైంది. మిగతా పార్టీలన్నీ అంగీకరించినా ఆందోళనలను విరమించేందుకు కాంగ్రెస ససేమిరా అంది. -
మహాత్ముడికి ఘన నివాళి
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మంగళవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ స్మారక స్థలాన్ని సందర్శించారు. మహాత్ముడి సమాధి దగ్గర పుష్పగుచ్ఛాలను ఉంచి, పూలతో అర్చించి నివాళులర్పించారు. అనంతరం ట్రంప్ సందర్శకుల పుస్తకంలో గాంధీజీని కొనియాడుతూ సందేశాన్ని రాశారు. ‘‘మహాత్ముడి ఆలోచనల నుంచి రూపు దిద్దుకున్న అత్యంత అద్భుతమైన సార్వభౌమ భారత్‌కు అమెరికా ప్రజలు బలమైన మద్దతు ఇస్తారు. ఇది నాకు దక్కిన అపూర్వమైన గౌరవం’’అని ఆ పుస్తకంలో రాశారు. ట్రంప్ సబర్మతి ఆశ్రమం సందర్శించినప్పుడు మహాత్ముడి ప్రస్తావన లేకుండా సందేశం రాయడంతో ట్విట్టర్లో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ అసలు గాంధీ పేరు విన్నారా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజ్‌ఘాట్‌లో ట్రంప్ రాసే సందేశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సందేశం దగ్గర ట్రంప్‌తో పాటు మెలానియా కూడా సంతకాలు చేశారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్రంప్‌ను రాజ్‌ఘాట్‌కు తోడ్కొని వెళ్లారు. రాజ్‌ఘాట్ వద్ద మొక్కను నాటుతున్న ట్రంప్, మెలానియా -
రాట్నం తిప్పి.. నూలు వడికి
అహ్మదాబాద్ : భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ సోమవారం అహ్మదాబాద్‌లో సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అంతకు కొద్ది నిముషాల ముందే ఆశ్రమానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ట్రంప్ దంపతులకు ఆశ్రమం అంతా తిప్పి చూపించి దాని విశిష్టతను తెలియజేశారు. భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో ఈ ఆశ్రమంలో గాంధీజీ, ఆయన భార్య కస్తూర్బా 1917–1930 మధ్య కాలంలో నివసించారు. వారిద్దరూ నివసించిన గది హృదయ్ కుంజ్ లోపలికి ట్రంప్ దంపతుల్ని తీసుకువెళ్లి చూపించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామం గురించి, గాంధీజీ పోరాట స్ఫూర్తి గురించి వివరించారు. ఆశ్రమంలో ఉన్న చరఖాను ట్రంప్, మెలానియా కూడా తిప్పుతూ, నూలు వడకడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఆశ్రమ నిర్వాహకులు రాట్నాన్ని ఎలా తిప్పుతూ నూలు వడకాలో వారికి వివరించి చెప్పారు. ట్రంప్ చరఖా తిప్పుతున్నప్పుడు మెలానియా ఆయనకు సహకరించారు. మహాత్ముడిని ప్రస్తావించని ట్రంప్ దాదాపు 15 నిముషాల సేపు ఆశ్రమంలో గడిపి తిరిగి వెనక్కి వెళుతున్నప్పుడు సందర్శకుల పుస్తకంలో ట్రంప్ ‘‘నా గొప్ప స్నేహితుడైన ప్రధానమంత్రి మోదీ – అద్భుతమైన ఈ పర్యటనకు ధన్యవాదాలు’’అని తన సందేశాన్ని రాశారు. ట్రంప్, మెలానియాలు ఇద్దరూ సంతకాలు చేశారు. గాంధీజీ బోధనల గురించి కానీ, ఆయన ప్రపంచానికి అందించిన స్ఫూర్తి గురించి నామ మాత్రంగా కూడా ట్రంప్ ప్రస్తావించలేదు. దీనిపై ట్విటర్లో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. సబర్మతి ఆశ్రమానికి వెళ్లి కూడా గాంధీ గురించి రెండు ముక్కలు రాయకపోవడమేంటని నెటిజన్లు కామెంట్లు చేశారు. 2015లో బరాక్ ఒబామా ఢిల్లీ రాజ్‌ఘాట్‌ను సందర్శించినప్పుడు ‘‘డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పిన మాటలు ఇప్పటికీ వాస్తవం. గాంధీ స్ఫూర్తి భారత్‌లో అణువణువు జీర్ణించుకొని ఉంది. అది ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప బ హుమతి’’అని రాయడంతో పోలుస్తూ కామెంట్లు ఉంచారు. సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ అసలు రూపం తెలిసిందని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పోస్టు పెడితే, త్రిపుర మాజీ ఎమ్మెల్యే తపస్ దే మోదీపై తన ప్రేమను ట్రంప్ ఒలకపోశారని విమర్శించారు. అల్పాహారం తీసుకోని ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్ దంపతులకు గుజరాతీ రుచులతో కూడిన పూర్తిగా శాకాహారంతో హై టీ ఏర్పాటు చేశారు. కానీ వారిద్దరూ వాటిని తీసుకోలేదని ఆశ్రమ ట్రస్టీ వెల్లడించారు. ట్రంప్ కోసం ప్రత్యేకంగా హోటల్ ఫార్చూన్ ల్యాండ్‌మార్క్‌కు చెందిన చెఫ్ సురేష్ ఖన్నా ఆధ్వర్యంలో తయారు చేసిన గుజరాతీ స్పెషల్ ఖమాన్, బ్రాకొలిన్–కార్న్ బటన్ సమోసా, మల్టీ గ్రెయిన్ కుకీస్, కాజూ కత్లీ యాపిల్ పేస్ట్రీ, తాజా పండ్లు, గుజరాతీ అల్లం టీ ఉంచారు. అయినా వాటినేమీ వాళ్లు రుచి చూడలేదు. ట్రంప్ మాంసాహార ప్రియుడు. కానీ సబర్మతి ఆశ్రమంలో మాంసం నిషిద్ధం కావడంతో శాకాహారంతో తయారు చేసిన స్నాక్స్ ఉంచారు. గాంధీజీ మూడు కోతుల బహుమానం చెడు వినకు , చెడు కనకు, చెడు మాట్లాడకు అన్న గాంధీజీ బోధనని చాటి చెప్పే మూడు కోతుల బొమ్మల్ని ట్రంప్, మెలానియాలకు మోదీ కానుకగా ఇచ్చారు. ఇక ఆశ్రమం తరఫున ట్రస్టీ కార్తికేయ సారాభాయ్ ట్రంప్ దంపతులకు మహాత్మాగాంధీ ఆటోబయోగ్రఫీ పుస్తకం, గాంధీజీ, చరఖా పెన్సిల్ డ్రాయింగ్లను బహూకరించారు. అంతకు ముందు ఆశ్రమం ట్రస్టీ కార్తికేయ సారాభాయ్ ట్రంప్, మెలానియాలకు ఖద్దరు శాలువా కప్పి స్వాగతం పలికారు. ట్రంప్ సందర్శన పూర్తయిన తర్వాత కార్తికేయ విలేకరులతో మాట్లాడుతూ సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ చాలా ఎంజాయ్ చేశారని చెప్పారు. ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే ఎనలేని మనశ్శాంతి తనకు కలిగిందని, ఆ ఆశ్రమం ప్రాధాన్యత అర్థమైందని ట్రంప్ తనతో చెప్పారని కార్తికేయ వెల్లడించారు. మూడు కోతుల ప్రతిమతో బహూకరిస్తున్న మోదీ -
ఆ పుస్తకంలో ట్రంప్ ఏం రాశారంటే..!
అహ్మదాబాద్: భారత్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సందర్శించారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ మహాత్ముడి చిత్రపటానికి నూలుమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రత్యేకత, గాంధీ అనుసరించిన జీవన విధానాలను ట్రంప్ దంపతులకు మోదీ వివరించారు. అనంతరం సబర్మతీ ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో ట్రంప్ సందేశం రాసి సంతకం చేశారు. చదవండి: మొతెరాలో ఇదొక కొత్త చరిత్ర : మోదీ అద్భుతమైన ప్రియమిత్రుడు ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలంటూ ట్రంప్ సందర్శకుల పుస్తకంలో పేర్కొన్నారు. గొప్ప స్స్నేహితుడైన ప్రధానికి మోదీకి ధన్యవాదాలు. ఇదో అద్భుతమైన సందర్శన అంటూ అక్కడి సందర్శకుల పుస్తకంలో ట్రంప్ రాసుకొచ్చారు. ఆ తర్వాత సబర్మతి ఆశ్రమం నుంచి మొతెరా స్టేడియంలో జరగనున్న 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్లారు. చదవండి: ‘నమస్తే ట్రంప్’ ప్రారంభం -
సబర్మతీ ఆశ్రమంలో ట్రంప్ దంపతులు
-
నూలు వడికిన అమెరికా ప్రెసిడెంట్
అహ్మదాబాద్ : భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన ఇరు దేశాధినేతలు మోతేరాలో నూతనంగా నిర్మించిన క్రికెట్ స్టేడియం వరకు 22 కి.మీ రోడ్ షోలో పాల్గొన్నారు. మార్గమధ్యంలో వారు సబర్మతీ ఆశ్రమాన్ని సదర్శించారు. ఆశ్రమ నిర్వాహకులు ట్రంప్ దంపతులకు స్వాగతం పలికారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి ప్రధాని మోదీ, ట్రంప్ దంపతులు నివాళులర్పించారు. గాంధీజీ గురించిన విశేషాలను ప్రధాని మోదీ వారికి వివరించారు. చరఖాపై నూలు వడకడం ఎలానో చెప్తుండగా వారు ఆసక్తిగా గమనించారు. ట్రంప్ చరఖాపై కాసేపు నూలు వడికారు. అనంతరం సందర్శకుల పట్టికలో ట్రంప్ దంపతులు సంతకం చేశారు. ‘అద్భుతమైన సందర్శనకు అవకాశం కల్పించిన నా ఆత్మీయ మిత్రుడు నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు’అని విజిటర్స్ బుక్‌లో ట్రంప్ పేర్కొన్నారు. ‘త్రీ మంకీస్’ ప్రతిమ ద్వారా గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని వారికి ప్రధాని మోదీ వివరించారు. అనంతరం వారు మోతేరాకు బయల్దేరారు. -
ట్రంప్ పర్యటన.. ఎక్కడికక్కడ వైమానిక నిఘా
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బారత్‌కు రానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. ట్రంప్ బస చేయనున్న ఐటీసీ మౌర్య హోటల్, రోడ్‌షో నిర్వహించనున్న మార్గాల్లో ఇప్పటికే పలుమార్లు తనిఖీలు నిర్వహించారు. సర్దార్ పటేల్ మార్గ్, మౌర్య హోటల్ సమీపంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వందల సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని మౌర్య హోటల్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. హోటల్లోని ప్రతి ఫ్లోర్లో ఢిల్లీ పోలీసులు సివిల్ దుస్తుల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. అమెరికాకు చెందిన సీక్రెట్ సర్వీస్ అధికారులు, భారత్‌కు చెందిన జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్ఎస్జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు సైతం వీరికి జతకలిశారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది పోలీసులు గుజరాత్‌లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. 25 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు, స్టేట్ రిజర్వ్ పోలీసులు, చేతక్ కమాండోలు, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్లు సైతం వీరికి జతకలిశాయి. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొటెరా స్టేడియం వరకు దాదాపు 22 కి.మీ. మేర ట్రంప్, మోదీల రోడ్‌షో జరగనున్న నేపథ్యంలో పరిసరాలను గమనించేందుకు పోలీసులు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. బాంబు పేలుళ్లు వంటివి సంభవించకుండా అధునాతన పరికరాల సాయంతో రోడ్డు మార్గాన్ని పలుమార్లు జల్లెడ పట్టారు. రోడ్‌షో జరిగే మార్గంలో 100 వాహనాలతో రిహార్సల్ నిర్వహించారు. మెలానియాకు సైతం.. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ట్రంప్ పర్యటించనున్న అన్ని మార్గాల్లో డబుల్ బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. ఈ మార్గాలపై వైమానిక నిఘా ఉంచారు. సబర్మతి ఆశ్రమానికి తొలిసారిగా భారత్ పర్యటనకు వస్తున్న ట్రంప్ సోమవారం గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నట్లు సిటీ పోలీసు కమిషనర్ ఆశిష్ భాటియా వెల్లడించారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ రోడ్‌షోలో పాల్గొననున్న ట్రంప్.. మార్గమధ్యంలో సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారని చెప్పారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆయన ఆశ్రమంలో గడపనున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత తిరిగి రోడ్‌షోను కొనసాగిస్తారని వెల్లడించారు. ట్రంప్ ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా సందర్శించనున్నట్లు తెలిపారు. ట్రంప్‌తో పాటు ప్రధాని మోదీ సైతం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ట్రంప్ హృదయ్ కుంజ్‌ను సందర్శించనున్నారని సబర్మతీ ఆశ్రమం సెక్రటరీ అమృత్ మోదీ వెల్లడించారు. ట్రంప్ రాక సందర్భంగా ఆశ్రమంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీక్రెట్ ఏజెన్సీ ఏం చేస్తుంది? అమెరికా అధ్యక్షుడితోపాటు ఆయన కుటుంబం రక్షణ బాధ్యతలను చూసుకునే బాధ్యత అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీదే. ప్రథమ పౌరుడి రక్షణకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఈ విభాగమే పర్యవేక్షిస్తుంటుంది. అధ్యక్షుడు ప్రయాణించే మార్గాన్ని శుభ్రంగా ఉంచటంతోపాటు అనుకోని ఆపద ఎదురైతే తప్పించుకునే మార్గాలు, ప్రణాళికలు సిద్ధంగా ఉంచుతుంది. ప్రమాదం సంభవిస్తే అవసరమైన రక్తాన్ని కూడా సిద్ధంగా ఉంచుతుంది. అధ్యక్షుడిని ఎల్లప్పుడూ అనుసరించి ఉండే వారికీ ఈ విభాగం రక్షణ కల్పిస్తుంది. అధ్యక్షునితో పాటు ఎల్లప్పుడు ఉండేవాటిలో 20 కిలోల బరువుండే జీరో హాలిబర్టన్ నల్లటి బ్రీఫ్‌కేస్ కూడా ఒకటి. ఇందులో అమెరికా అణు క్షిపణుల రహస్య కోడ్ భద్రపరిచి ఉంటుంది. అధ్యక్షుడు విశ్రాంతి తీసుకునే గది వరకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అనుసరిస్తూనే ఉంటాడు. చట్టం ప్రకారం.. తనను ఒంటరిగా వదిలి వేయాలని అధ్యక్షుడు సైతం ఆ అధికారిని ఆదేశించలేడు. 1865లో ఏర్పాటైన ఈ విభాగం 1901 నుంచి అధ్యక్షుడికి రక్షణగా నిలుస్తోంది. సుమారు 7 వేల మందితో కూడిన ఈ విభాగంలో 25% మహిళ లుం టారు. ప్రపంచంలోని ఏ దేశ సైన్యం కంటే కూడా అత్యంత కఠినమైన శిక్షణ వీరికి ఇస్తారు. సీక్రెట్ సర్వీస్ కోసం అందిన ప్రతి 100 దరఖాస్తుల్లో ఒకటి కంటే తక్కువగానే ఎంపిక వుతుంటాయి. వర్జీనియాలో ఉండే ఈ విభాగం లో శిక్షణ పొందిన వారు.. అధ్యక్షుడి కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ హాలీవుడ్ సినిమా ల్లో చూపిస్తున్న విధంగా ప్రమాణ చేయరట! గంటకు 1.02 కోట్లు రష్యా అధ్యక్షుడి మెర్సిడెంజ్ బెంజ్ కారు, చైనా అధ్యక్షుడి హాంగ్‌కి ఎల్5 కారుతో పోల్చుకుంటే అమెరికా అధ్యక్షుడి కారు బీస్ట్ చాలా ఖరీదైంది. అధునాతనమైంది కూడా. అలాగే, అమెరికా అధ్యక్షుడి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం గంట ప్రయాణానికి రూ.1.02 కోట్లు ఖర్చవుతుందట. ఈ విమానంలో పెద్ద ఆఫీసు, కాన్ఫరెన్స్ హాల్, వంద మందికి సరిపడా ఆహారం వండేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. అధ్యక్షుడికి విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన సూట్ ఉంటుంది. మొత్తంగా ఇది ఒక విమానం మాదిరిగా కాకుండా హోటల్‌గా ఉంటుంది. అణ్వస్త్రం, క్షిపణి దాడిని సైతం తట్టుకునేలా ఇందులో ఏర్పాట్లుంటాయి. అమెరికాపై దాడి జరిగినప్పుడు ప్రతిస్పందించేలా ఎయిర్ ఫోర్స్ వన్ సంచార కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది. వీటితోపాటు అధ్యక్షుడి భారీ కారు లిమోజిన్, వెయ్యి మంది సిబ్బంది, ప్రత్యేక రక్షణ పరికరాలు.. వీటన్నిటికీ సీ5 రకం కార్గో విమానం ఉంటుంది. 2017లో ట్రంప్ జెరుసలేం పర్యటనకు వెళ్లినప్పుడు కింగ్ డేవిడ్ హోటల్లో బస చేశారు. ఆ హోటల్లో ఒక్క రాత్రికి రూ.3.95 లక్షలుండే సూట్లతోపాటు సిబ్బంది కోసం 1,100 రూంలను బుక్ చేయాల్సి వచ్చిందట. -
22 కి.మీ... లక్ష మంది
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ గాంధీనగర్‌లో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 24న ట్రంప్, ప్రధాని మోదీ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి 22 కిలోమీటర్ల మేర నిర్వహించే రోడ్‌షోలో పాల్గొంటారు. ప్రస్తుతం ఉన్న ప్రణాళిక ప్రకారం స్వాతంత్య్రోద్యమ కాలంలో జాతిపిత మహాత్మాగాంధీ నడయాడిన సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్, మోదీలు సందర్శిస్తారు. తర్వాత ఆశ్రమం నుంచి ఇందిర బ్రిడ్జి పైనుంచి ఎస్పీ రింగు రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్టు వద్దనున్న మొటెరా స్టేడియంకు చేరుకుంటారు. రోడ్‌షోలో భద్రతా ఏర్పాట్లూ, ట్రాఫిక్ తదితర అంశాలు సహా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు గుజరాత్ హోంమంత్రి ప్రదీప్‌సిన్హా జడేజా చెప్పారు. రోడ్ షోకి ఒక లక్ష మంది రోడ్‌షోలో సుమారు లక్ష మంది ప్రజలు భాగస్వాములవుతారని భావిస్తున్నారు. రోడ్‌షోలో 70 లక్షల మంది జనం పాల్గొంటున్నారని ట్రంప్ చెప్పారు. అయితే లక్ష మంది వరకు రోడ్‌షోలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా వెల్లడించారు. మొటెరాలో కొత్తగా నిర్మిస్తోన్న క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సభను ఉద్దేశించి ఇరువురు నేతలూ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో దాదాపు లక్షా పదివేల మంది ప్రజలు పాల్గొననున్నారు. సర్వాంగ సుందరంగా ఆగ్రా తాజ్‌మహల్‌ని ట్రంప్, ఆయన భార్య మెలానియా దర్శించనున్న నేపథ్యంలో తాజ్‌మహల్ పరిసర ప్రాంతాలను యూపీ ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. తాజ్‌మహల్, పరిసర ప్రాంతాలనూ ముస్తాబు చేస్తున్నారు. తాజ్‌మహల్ పక్కనున్న యమునా తీర ప్రాంతంలోని భారీచెత్తను గత రెండు రోజులుగా తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఖెరియా ఎయిర్‌పోర్టు నుంచి తాజ్‌మహల్ వరకు ఎంజీ రోడ్డుపైన భిక్షాటన చేసేవారిని అక్కడి నుంచి ఖాళీచేయించారు. దారిపొడవునా గోడలకు రంగులు వేశారు. భద్రతాకారణాల రీత్యా దారిలో ఉన్న చెట్లను నరికివేశారు. 20వేల మంది విద్యార్థులు జెండాలతో స్వాగతం పలుకుతారు. రామ్‌లీలా, రాస్లీలా, పంచకుల, నౌతంకి సహా ఆగ్రా, మధుర, బృందావన్‌ల నుంచి కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్న మెలానియా మెలానియా దక్షిణ ఢిల్లీలో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన ‘హ్యాపీనెస్ కరికులమ్’ పాఠశాలను సందర్శించనున్నారు. 25న ఢిల్లీకి చేరుకోనున్న ట్రంప్, మెలానియాలకు సీఎం కేజ్రీవాల్ స్వాగతం పలుకుతారు. పిల్లల్లో ఒత్తిడిని తగ్గించేందుకు గతంలో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ‘హ్యపీనెస్’ పాఠ్యప్రణాళికను ప్రవేశపెట్టారు. ఇందులో 40 నిముషాల పాటు మెడిటేషన్, విశ్రాంతి తదితర కార్యక్రమాలుంటాయి. రోడ్ షోకు డీఆర్డీఓ డ్రోన్ నిరోధక వ్యవస్థ ట్రంప్, మోదీ పాల్గొనే రోడ్ షోలో డీఆర్డీఓ(డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) అభివృద్ధి చేసిన డ్రోన్ నిరోధక వ్యవస్థను వాడనున్నారు. అగ్రనేతల భద్రత కోసం స్థానిక పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్, చేతక్ కమాండో, స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌ల సేవలను వినియోగించుకుంటున్నారు. రోడ్ షో జరిగే ప్రాంతంలోని కీలక, వ్యూహాత్మక ప్రదేశాల్లో వీరిని మోహరిస్తామని క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజయ్ తోమర్ గురువారం తెలిపారు. డ్రోన్‌ను గుర్తించడంతో పాటు, దాన్ని నాశనం చేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. రోడ్ షో సందర్భంగా ఇరువురు నేతలు ఒకే కారులో ప్రయాణిస్తారా? అన్న విషయంపై తమకు సమాచారం లేదని తోమర్ తెలిపారు. అలాగే, ఓపెన్ వెహికిల్‌ను వారు వాడకపోవచ్చన్నారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో తాజ్‌మహల్ పరిసరాలను ముస్తాబుచేస్తున్న దృశ్యం. -
కెమ్ ఛో ట్రంప్!
అహ్మదాబాద్/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు గుజరాత్ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్ రాక సందర్భంగా కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా చర్యలను చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మోతెరాలో ప్రధాని మోదీ, ట్రంప్ చేపట్టే తొలి కార్యక్రమానికి ప్రభుత్వం ‘కెమ్ ఛో ట్రంప్’గా నామకరణం చేసింది. గుజరాతీలో ఈ మాటకు..‘ఎలా ఉన్నారు ట్రంప్?’ అని అర్థం. గత ఏడాది అమెరికాలోని హ్యూస్టన్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ పాల్గొన్న ‘హౌడీ మోదీ’ తరహాలోనే ఇది జరగనుంది. ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు, ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు అడుగుపెట్టిన దగ్గర్నుంచీ వారిని అనుక్షణం వెన్నాడి ఉండేందుకు జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) స్నైపర్ బలగాలను మోహరించనుంది. ఎటువంటి అనూహ్య పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పది వేల మందికిపైగా పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తోంది. ప్రముఖుల భద్రతలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, నిఘా విభాగాలతోపాటు అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం కూడా పాలుపంచుకోనున్నాయి. 22 కిలోమీటర్ల రోడ్ షో ఎయిర్‌పోర్టు ప్రాంతం, రోడ్ షో, సబర్మతి ఆశ్రమం, మోతెరా స్టేడియంలో భద్రతను అహ్మదాబాద్ పోలీసులు పర్యవేక్షిస్తారని పోలీస్ డిప్యూటీ కమిషనర్ విజయ్ పటేల్ వెల్లడించారు. ‘బందోబస్తులో 25 మంది ఐపీఎస్ అధికారులు, 65 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 200 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు, 800 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 10 వేల మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నాం. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) ఇప్పటికే ఇక్కడికి చేరుకుంది. ఎన్ఎస్జీ స్నైపర్ యూనిట్లను కీలక ప్రాంతాల్లో మోహరించాం. బాంబు స్క్వాడ్లు నగరంలో ఇప్పటికే తమ పని ప్రారంభించాయి. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం, అటునుంచి మోతెరా స్టేడియం వరకు మొత్తం 22 కిలోమీటర్లు సాగే రోడ్‌షోలో ఎన్ఎస్జీ స్నైపర్ యూనిట్లను మోహరించనున్నాం. అమెరికా సీక్రెట్ సర్వీస్ దళాలతోపాటు నిఘా విభాగం, సీక్రెట్ సర్వీస్ పోలీసులు నిఘాలో పాలుపంచుకుంటున్నారు. అహ్మదాబాద్‌లోని వివిధ హోటళ్లలో బస చేసిన కొత్త అతిథులను, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాం. రోడ్ షోతోపాటు స్టేడియం వద్ద అనుమానాస్పద వస్తువులు గానీ, వ్యక్తులు కనిపించినా తమకు తెలియజేసి, సహకరించాలి’ అని పోలీస్ డిప్యూటీ కమిషనర్ విజయ్ ప్రజలను కోరారు. ఫేస్బుక్ ఇచ్చిన గౌరవం: ట్రంప్ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ తనకు తొలిస్థానం, మోదీకి రెండో స్థానం ప్రకటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్లో ప్రకటించారు. గత నెలలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ట్రంప్..ఫేస్బుక్ తనకు మొదటి స్థానం, భారత ప్రధాని మోదీకి రెండో స్థానం ఇవ్వడాన్ని ప్రస్తావించారు.మోదీ ఫేస్బుక్ ఖాతాలో 4.4 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు 2.75 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. లైక్‌ల దృష్ట్యా చూసినా ఇద్దరి మధ్య అంతరం భారీగా∙ఉంది. మోదీకి 4.45 కోట్ల లైక్‌లు వస్తుండగా, అందులో సగానికి కొద్దిగా ఎక్కువ అంటే 2.6 కోట్లు ట్రంప్‌కు వస్తుంటాయి. రూ.800 కోట్లతో.. అహ్మదాబాద్‌లోని మోతెరాలో రూ.800 కోట్లతో 1.25 లక్షల మంది వీక్షించేందుకు వీలుగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను ట్రంప్‌తో కలిసి మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ‘కెమ్ ఛో ట్రంప్’గా నామకరణం చేశారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ట్రంప్ దంపతులకు బలగాలు గౌరవ వందనం సమర్పిస్తాయి. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం ముందుగా సబర్మతిలోని గాంధీ ఆశ్రమానికి వెళ్లనుంది. ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ సబర్మతి ఆశ్రమ విశిష్టతను వివరించనున్నారు. అక్కడి నుంచి వారు ఇందిరా బ్రిడ్జి మీదుగా మోతెరా స్టేడియంకు చేరుకుంటారు. నూతనంగా నిర్మించిన స్టేడియంలోని సుమారు 1.20 లక్షల మంది ప్రజలు, ప్రముఖులు వారికి స్వాగతం పలుకుతారని పోలీస్ డిప్యూటీ కమిషనర్ విజయ్ పటేల్ చెప్పారు. ‘ప్రభుత్వం పంపిన ప్రత్యేక ఆహ్వానంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు అక్కడికి వస్తున్నారు. కార్యక్రమం అనంతరం వీరంతా తిరిగి నిర్దేశిత మార్గాల్లో వెళ్లిపోతారు. స్టేడియం చుట్టూ ఒకటిన్నర కిలోమీటర్ల ప్రాంతాన్ని భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి’ అని ఆయన తెలిపారు.. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి సబర్మతి వరకు 22 కిలోమీటర్ల మేర సాగే రోడ్‌షోలో కూడా ఎన్ఎస్జీ స్నైపర్ యూనిట్లను మోహరించనున్నారు. వేలాది మంది ప్రజలు రోడ్డుకు రెండువైపులా నిలబడి అతిథులకు స్వాగతం పలకనున్నారు. ఈ మార్గంలో సాంస్కృతిక ఘనతను చాటే పలు చిత్రాలను ఏర్పాటు చేశారు. -
అంతర్జాతీయ వేదికపై భారత్ వెలుగులు
అహ్మదాబాద్ : మహాత్మగాంధీ 150వ జయంతి వేడుకలను ఐక్యరాజ్యసమితి ఘనంగా నిర్వహిస్తోందని, బాపూ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ ప్రపంచంలో ప్రతి సవాల్‌కూ మహాత్మ గాంధీ పరిష్కారాలు సూచించారని చెప్పారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట ఇనుమడిస్తోందని చెప్పుకొచ్చారు. అమెరికాలో తాను యోగ ప్రాధాన్యత వివరించిన తర్వాత అమెరికా ప్రపంచ యోగా డేను గుర్తించిందని అన్నారు. బాపూ మార్గం నిత్యం అనుసరణీయమని స్పష్టం చేశారు. అనంతరం సబర్మతీ ఆశ్రమంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆశ్రమంలో పిల్లలు, వలంటీర్లతో ముచ్చటించిన మోదీ, కొద్దిసేపు సబర్మతీ నదీ తీరంలో గడిపారు. గాంధీజీ సైకత శిల్పాలను వీక్షించారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఆయా కార్యక్రమాల్లో ప్రధాని వెంట ఉన్నారు. -
దండి యాత్ర ప్రారంభమైంది నేడే
-
సరిగ్గా 88 ఏళ్ల క్రితం..
అహ్మదాబాద్: సరిగ్గా 88 ఏళ్ల క్రితం, ఇదే రోజు అంటే, 1930, మార్చి 12వ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి 390 కిలోమీటర్ల దూరంలోని దండికి యాత్రను ప్రారంభించారు. భారత్‌లో విస్తారింగా దొరికే ఉప్పుపై కూడా బ్రిటిష్ పాలకులు పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ ఈ దండియాత్రను ప్రారంభించారు. కేవలం 70 మంది అనుచరులతో గాంధీజీ ఈ యాత్రను ప్రారంభించగా, మార్గమధ్యంలో వేలాది మంది ప్రజలు యాత్రలో కలుస్తూ వచ్చారు. ఏప్రిల్ ఐదవ తేదీ నాడు దండికి గాంధీజీ యాత్ర చేరుకునే సరికి ఆయన వెనకాల మూడు కిలోమీటర్ల దూరం వరకు ప్రజలు యాత్రలో ఉన్నారు. గాంధీజీ 24 రోజులపాటు దండియాత్రను నిర్వహించాక పన్నును ఎత్తేసే వరకు సత్యాగ్రహాన్ని కొనసాగించారు. -
సబర్మతీ ఆశ్రమంలో.. సంప్రదాయ దుస్తుల్లో!
సాక్షి, అహ్మదాబాద్ : భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కుటుంబసభ్యులతో కలిసి సోమవారం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. గుజరాతీ సంప్రదాయ దుస్తులు ధరించి భార్య సోఫీ, పిల్లలు జేవియర్, హడ్రియెన్, ఎల్లా గ్రేస్‌తో కలిసి ట్రూడో సబర్మతి ఆశ్రమాన్ని తిలకించారు. సబర్మతిలోని మహాత్మాగాంధీ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ట్రూడో, ఆయన భార్య సోఫీ చరఖా తిప్పారు. అనంతరం గాంధీనగర్‌లోని అక్షర్ధామ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ట్రూడో ఆదివారం ఉదయం తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భార్య, పిల్లలతో కలిసి తాజ్ మహల్ ఎదురుగా సరదాగా ఫోటోలు దిగారు. భారత్‌లో ఏడు రోజుల అధికారిక పర్యటన కోసం ట్రూడో శనివారం ఢిల్లీకి వచ్చారు. 2012 తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని ట్రూడోనే. ఈ నెల 23 వరకు ఆయన దేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రక్షణ, ఉగ్రవాదం సహా పలు కీలకాంశాలపై ఇరువురు ప్రధానులు చర్చించనున్నారు. అనంతరం 20న ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నిర్మాతలతో ముంబైలో సమావేశమవుతారు. 21న స్వర్ణదేవాలయాన్ని సందర్శించనున్నారు. -
సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన మోదీ
అహ్మదాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సొంత రాష్ట్రంలో పర్యటించారు. గుజరాత్ పర్యటనకు వచ్చిన మోదీ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారఽరు. సబర్మతీ ఆశ్రమం వందవ వార్షికోత్సవ వేడుకలను ప్రధాని ప్రారంభించారు. అనంతరం ఆశ్రమంలో కలియతిరిగి అక్కడి పనులను పరిశీలించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించి మోదీ ఆశ్రమంలోనే మొక్కను నాటారు. చరఖా తిప్పి నూలు వడికారు. ప్రజలందరూ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. -
శత వసంతాల సబర్మతీ
అహ్మదాబాద్: మహాత్మా గాంధీ స్థాపించిన సబర్మతీ ఆశ్రమం జూన్ 17 నాటికి వందేళ్లు పూర్తిచేసుకుంది. సందర్భంగా ఆశ్రమంలో ఘనంగా నిర్వహించిన వేడుకలకు గాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ‘మై లైఫ్ మై మెసేజ్’, ‘చరాఖా’ గ్యాలరీలను ఆవిష్కరించారు. అనంతరం ఆశ్రమ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ‘లెటర్స్ టు గాంధీ’, ‘పయనీర్స్ ఆఫ్ సత్యాగ్రహ’ పుస్తకాలను ఆవిష్కరించారు. మహత్మా గాంధీ 1917, జూన్ 17న ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. 1930 మార్చి 12న ప్రఖ్యాత దండి సత్యాగ్రహాన్ని మహాత్ముడు ఇక్కడి నుంచే ప్రారంభించారు. -
‘సబర్మతి ఆశ్రమం’ ఎక్కడ ఉంది?
1. అతిపెద్ద నక్షత్రం? 1) సూర్యుడు 2) ఫ్రాక్సిమా సెంటారీ 3) బెటల్ గక్స్ 4) గనీమెడ్ 2. భూ అంతర్భాగం అత్యధిక సాంద్రత గల పదార్థంతో నిర్మితమై ఉందని మొట్టమొదటిసారిగా ఊహించిన శాస్త్రవేత్త? 1) న్యూటన్ 2) ఐన్‌స్టీన్ 3) సూయిస్ 4) వెజ్నర్ 3. ఓజోన్ ఆవరణం? 1) ట్రోపో ఆవరణం 2) స్ట్రాటో ఆవరణం 3) ఐనో ఆవరణం 4) థర్మో ఆవరణం 4. కరువులు సంభవించడానికి ప్రధాన కారణం కానిది? 1) అడవుల నిర్మూలన 2) పట్టణీకరణ 3) భూతాపం 4) ఎల్ నినో ప్రభావం 5. హిందూకుష్ పర్వతాల ఉనికి? 1) భారతదేశం 2) నేపాల్ 3) టిబెట్ 4) ఆఫ్గానిస్థాన్ 6. సాధారణంగా నైరుతి రుతుపవనాలు కేరళలో ఎప్పుడు ప్రవేశిస్తాయి? 1) మే నెల చివరి తేదీ 2) జూన్ మొదటి వారం 3) జూన్ రెండో వారం 4) మే చివరి వారం 7. గాలి పారేటట్లుగా ఉండే నేలలు? 1) నల్ల రేగడి నేలలు 2) ఎర్ర నేలలు 3) ఒండ్రు నేలలు 4) ఇసుక నేలలు 8. మనదేశంలో ఏ నీటి వనరు ద్వారా సాగయ్యే నికర వ్యవసాయ భూమి వాటా క్రమక్రమంగా తగ్గుతుంది? 1) కాల్వలు 2) బావులు 3) బోరు బావులు 4) చెరువులు 9. మహబూబ్‌నగర్ జిల్లాలో అధికంగా లభించే అలోహ ఖనిజం? 1) బాక్సైట్ 2) అభ్రకం 3) ఆస్బెస్టాస్ 4) సున్నపురాయి 10. చోటా నాగ్‌పూర్ పారిశ్రామిక ప్రాంతానికి చెందని నగరం? 1) అంబాలా 2) జంషెడ్పూర్ 3) కుల్టి 4) బొకారో 11. ముంబై (వి.టి) ఏ రైల్వే మండలానికి ప్రధాన పరిపాలనా కేంద్రం? 1) ఉత్తర రైల్వే మండలం 2) పశ్చిమ రైల్వే మండలం 3) మధ్య రైల్వే మండలం 4) ఉత్తర మధ్య రైల్వే మండలం 12. ముంబై నుంచి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గాన ప్రయాణించాలంటే ఏయే జాతీయ రహదారుల నుంచి వెళ్లవలసి ఉంటుంది? 1) 7, 9 నంబర్ల జాతీయ రహదారులు 2) 9, 7 నంబర్ల జాతీయ రహదారులు 3) 5, 6 నంబర్ల జాతీయ రహదారులు 4) 6, 5 నంబర్ల జాతీయ రహదారులు 13. కావేరి నది ఎంతదూరం ప్రవహించి సముద్రంలో కలుస్తుంది? 1) 950 కి.మీ 2) 780 కి.మీ 3) 1040 కి.మీ 4) 800 కి.మీ 14. తెలంగాణలో అక్షరాస్యత శాతం? 1) 67.5 2) 66.7 3) 65.89 4) 66.46 15. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని లింగ నిష్పత్తి? 1) 1000 : 970 2) 1000 : 988 3) 1000 : 999 4) 1000 : 933 16. మానవుడు నిప్పును కనిపెట్టిన కాలం? 1) క్రీ.పూ 25,000 నుంచి క్రీ.పూ 10,000 2) క్రీ.పూ 10,000 నుంచి క్రీ. పూ 8,000 3) క్రీ.పూ 8,000 నుంచి క్రీ.పూ 5,000 4) క్రీ .పూ 5,000 నుంచి క్రీ.పూ 1,000 17. దక్షిణ భారతదేశంలో అసంఖ్యాకంగా లభించిన ప్రాచీన బంగారు నాణేలు ఎవరికి చెందినవి? 1) గ్రీకులు 2) ఇండో - అరబిక్‌లు 3) ఇండో-ఆర్యన్లు 4) రోమన్లు 18. మలివేదకాలంలో వారణాసి విద్యాలయంతో పాటు అభివృద్ధి చెందిన విశ్వ విద్యాలయం? 1) తక్షశిల 2) నలంద 3) నాగార్జున 4) ప్రయాగ 19. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు? 1) అంగములు 2) త్రి రత్నాలు 3) త్రిపీటకములు 4) ఆర్య సత్యాలు 20. తమ పేర్ల ముందు తల్లి పేరును కూడా చేర్చిన రాజులు? 1) విష్ణు కుండినులు 2) ఇక్ష్వాకులు 3) శాతవాహనులు 4) కాకతీయులు 21. మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసిన వాడు? 1) అజాత శత్రువు 2) పుష్యమిత్రుడు 3) బృహద్రధుడు 4) కనిష్కుడు 22. చంద్రగుప్తుని ఆస్థానంలోని నవరత్నాలనే కవుల్లో లేనివాడు? 1) వరాహమిహిరుడు 2) కాళిదాస్ 3) ధన్వంతరి 4) ఆర్యభట్ట 23. దేవరకొండ వెలమ రాజ్య స్థాపకుడు? 1) రేచర్ల సింగమనాయుడు 2) అనవోత నాయకుడు 3) మాదా నాయకుడు 4) దాచా నాయకుడు 24. ‘క్రీడాభిరామం’ను రచించింది? 1) ప్రతాపరుద్రుడు 2) విద్యా నాధుడు 3) వల్లభాచార్యుడు 4) జాయపసేనాని 25. కాకతీయుల కాలంలో ప్రభుత్వోద్యోగులను ఏమని పిలిచేవారు? 1) నామంకరులు 2) భట్టారకులు 3) ఆయగారులు 4) తీర్థులు 26. హైదరాబాద్ నగర నిర్మాణం ఎవరి పర్యవేక్షణలో జరిగేది? 1) మీర్ జూమ్లా సయ్యద్ జాఫ్రీ 2) మీర్ జూమ్లా మాదన్న 3) పీష్వా మీర్ ముమిన్ అస్త్రబది 4) పీష్వా అమల్ గుజార్ 27. తెలంగాణలో అసఫ్ జాహీల పాలన ఏ సంవత్సరంలో ప్రారంభమయింది? 1) 1724 2) 1726 3) 1728 4) 1729 28. దక్కన్ రాజ్యంపై పూర్తి ఆధిపత్యం సాధించిన మొఘల్ చక్రవర్తి? 1) అక్బర్ 2) షాజహాన్ 3) జహంగీర్ 4) ఔరంగజేబు 29. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం? 1) 1757 2) 1764 3) 1857 4) 1864 30. వారన్ హేస్టింగ్స్‌కు సంబంధించని అంశం ఏది? 1) హిందూ న్యాయసూత్రాలను క్రోఢీకరించాడు 2) శిస్తు వసూళ్లలో వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు 3) గ్రామ పంచాయతీ వ్యవస్థను రద్దు చేశాడు 4) బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు 31. రాజస్థాన్‌లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారు? 1) కోలులు 2) మీర్లు 3) మోప్లాలు 4) భిల్లులు 32. మహ్మదీయుల్లో సాంఘిక జాగృతికి జరిగిన ఉద్యమం? 1) అలీఘర్ 2) ఖిలాఫత్ 3) వహాభీ 4) పెరైజీ 33. ‘‘స్వరాజ్యం నా జన్మహక్కు’’అని తిలక్ ఏ ఉద్యమ కాలంలో నినాదం ఇచ్చాడు? 1) వందేమాతరం 2) సహాయ నిరాకరణ 3) క్విట్ ఇండియా 4) హోం రూల్ 34. ‘సబర్మతి ఆశ్రమం’ ఎక్కడ ఉంది? 1) గాంధీనగర్ 2) అహ్మదాబాద్ 3) నాగ్‌పూర్ 4) ముంబాయి 35. 1919 చట్టం ప్రవే శ పెట్టిన సంస్కరణల ప్రభావాన్ని పరిశీలించేందుకు ఏర్పడిన క మిషన్? 1) రౌలత్ కమిషన్ 2) క్రిప్స్ కమిషన్ 3) సైమన్ కమిషన్ 4) క్యాబినేట్ కమిషన్ 36. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నెహ్రూని ఆహ్వానించిన బ్రిటీష్ వైశ్రాయ్? 1) మౌంట్ బాటన్ 2) వెవెల్ 3) ఇర్విన్ 4) లార్డ్ కానింగ్ 37. గోల్కొండ రాజ్య స్థాపకుడు? 1) సుల్తాన్ కులీ కుతుబ్‌షా 2) సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా 3) సుల్తాన్ మహ్మద్ కులీకుతుబ్ షా 4) సుల్తాన్ అబుల్ హసన్ తానీషా 38. తెలంగాణలో మొదటి రాజకీయ పత్రిక? 1) గోల్కొండ 2) తెలంగాణ 3) నీలగిరి 4) సరోజిని విలాస్ 39. రజాకార్ల నాయకుడు? 1) నిజాం-ఉల్-ముల్క్ 2) కాశీంరజ్వీ 3) బహదూర్‌మార్ జంగ్ 4) సయ్యద్ రజత్ హుస్సేన్ 40. తెలంగాణలో మొదటి ప్రజాస్వామిక ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1) 1947 2) 1948 3) 1950 4) 1952 41. ‘లౌకికతత్వం’ అనగా? 1) చట్టం ముందు ప్రజలందరు సమానం 2) సామాజిక ఆర్థిక వ్యత్యాసాలను తగ్గించడం 3) పాలన నిర్వహణలో మతాల ప్రమేయం ఉండదు 4) పైవన్నీ 42. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఏ రాష్ట్రానికి చెందింది? 1) మహరాష్ట్ర 2) జమ్మూ క శ్మీర్ 3) ఉత్తర ప్రదేశ్ 4) కేరళ 43. భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్? 1) బి.ఆర్ అంబేద్కర్ 2) నెహ్రూ 3) బాబూ రాజేంద్రప్రసాద్ 4) సర్దార్ వల్లబాయ్ పటేల్ 44. రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే అభ్యర్థికి ఉండాల్సిన కనీస వయస్సు? 1) 18 సం.లు 2) 21 సం.లు 3) 35 సం.లు 4) 45 సం.లు 45. ఏక పౌరసత్వం అనగా? 1) రాష్ట్రంలో మాత్రమే పౌరసత్వం 2) దేశమంతటికీ ఒకే పౌరసత్వం 3) రాష్ట్రం, దేశంలోనూ ఒకేసారి పౌరసత్వం 4) రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా ఒకే దాంట్లో పౌరసత్వం 46. ఒకే రాజ్యసభ సీటు గల కేంద్ర పాలిత ప్రాంతం? 1) ఢిల్లీ 2) చండీఘర్ 3) పాండిచ్ఛేరి 4) లక్షద్వీప్ 47. తెలంగాణ శాసనమండలి సభ్యుల గరిష్ట పరిమితి? 1) 60 2) 50 3) 40 4)30 48. సర్పంచ్‌ను ఎవరు ఎన్నుకుంటారు? 1) గ్రామసభ సభ్యులు 2) గ్రామ పంచాయితీ సభ్యులు 3) గ్రామ ప్రజలు 4) గ్రామంలో 18 సం.లు నిండిన వయోజనులు 49. జిల్లా జడ్జిని నియమించే ముందు గవర్నర్ ఎవరిని సంప్రదిస్తారు? 1) ముఖ్యమంత్రి 2) రాష్ట్రపతి 3) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 4) జిల్లా కలెక్టర్ 50. సమాచార హక్కు చట్టం ప్రధాన లక్ష్యం? 1) పారదర్శకతను పెంచడం 2) జవాబుదారీతనం పెంచడం 3) బంధుప్రీతి నివారణ 4) పైవన్నీ 51. కేంద్రం వసూలు చేసే ప్రత్యక్ష పన్ను 1) కస్టమ్స్ టాక్స్ 2) ఎక్సైజ్ టాక్స్ 3) కార్పొరేషన్ టాక్స్ 4) సేల్స్ టాక్స్ 52. {ద వ్యోల్బణం అనగా? 1) డబ్బు విలువ తగ్గడం 2) డబ్బు పరిమాణం తగ్గడం 3) ధరలు పెరగడం 4) పైవన్నీ 53. {పైవేట్ బ్యాంకుల స్థాపనకు అనుమతులిచ్చే అధికారం ఎవరికి ఉంది? 1) కేంద్ర ప్రభుత్వం 2) పార్లమెంట్ 3) రిజర్వ్ బ్యాంకు 4) రాష్ట్రపతి 54. జాతీయ పనికి ఆహార పథకాన్ని ప్రారంభించని సంవత్సరం? 1) 2001 2) 2002 3) 2003 4) 2004 55. ‘‘వ్యాట్’’ (గఅఖీ) అనగా? 1) విలువ ఆధారిత సేవా పన్ను 2) విలువతో కూడిన పన్ను 3) విలువతో కూడిన సేవా పన్ను 4) అమ్మక పు పన్నుపై వేసే సర్ చార్జి 56. ఆదాయ అసమానతలను తగ్గించటానికి ప్రధానంగా ఉపయోగపడేవి? 1) పేదరికం-నిరుద్యోగం తగ్గించాలి 2) భూ సంస్కరణలను పటిష్టంగా అమలు చేయాలి 3) ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను బాగా అమలు చేయాలి 4) వ్యవసాయ సంస్కరణలు తీసుకురావాలి 57. సంకుచిత ద్రవ్యానికి ఉదాహరణ? 1) కరెన్సీ నోట్లు 2) చెక్కులు 3) బాండ్లు 4) డిబెంచర్లు 58. {పభుత్వం చేసే రోజువారీ ఖర్చును ఏమంటారు? 1) రెవెన్యూ వ్యయం 2) మూలధన వ్యయం 3) అభివృద్ధి వ్యయం 4) అభివృద్ధేతర వ్యయం 59. మన రాజ్యాంగంలో బడ్జెట్‌ను ఇలా ప్రస్తావించారు? 1) ఆదాయ-వ్యయాల నివేదిక 2) ఆదాయ-వ్యయాల వార్షిక నివేదిక 3) వార్షిక ఆర్థిక నివేదిక 4) ఆదాయ-వ్యయాల అంచనాల నివేదిక 60. నగరీకరణ అంటే? 1) పట్టణ వలసలు పెరగడం 2) గ్రామాల నుంచి వలసలు పెరగడం 3) ఆధునిక వైజ్ఞానికాభివృద్ధి 4) పట్టణాల పెరుగుదల సమాధానాలు 1) 3 2) 1 3) 2 4) 2 5) 4 6) 2 7) 2 8) 4 9) 3 10) 1 11) 3 12) 2 13) 4 14) 4 15) 3 16) 2 17) 4 18) 1 19) 3 20) 3 21) 2 22) 4 23) 3 24) 3 25) 2 26) 3 27) 1 28) 4 29) 1 30) 3 31) 2 32) 1 33) 4 34) 2 35) 3 36) 2 37) 1 38) 3 39) 2 40) 4 41) 3 42) 2 43) 3 44) 3 45) 2 46) 3 47) 3 48) 1 49) 3 50) 4 51) 3 52) 4 53) 3 54) 4 55) 1 56) 2 57) 1 58) 1 59) 3 60) 4 -
సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన జింగ్పింగ్
అహ్మదాబాద్: చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ భారత పర్యటన మొదలు పెట్టారు. ఈ మధ్యాహ్నం అహ్మదాబాద్ చేరుకున్న జింగ్పింగ్ కు ఘనస్వాగతం లభించింది. గుజరాత్ ప్రభుత్వం ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. తర్వాత హయాత్ హోటల్ లో జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన జింగ్ పింగ్, ఆయన సతీమణికి ప్రధాని నరేంద్ర మోడీ పుష్పగుచ్చంతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మూడు ఒప్పందాలపై భారత్-చైనా సంతకాలు చేశాయి. సాయంత్రం సబర్మతి ఆశ్రమాన్ని జింగ్పింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా చైనా భాషలో ఉన్న భగవత్ గీతను జింగ్పింగ్కు మోడీ బహూకరించారు. రాత్రికి ఆయన ఢిల్లీ బయలుదేరి వెళతారు.