‘సబర్మతి ఆశ్రమం’ ఎక్కడ ఉంది? | Sabarmati Ashram in Ahmedabad | Sakshi
Sakshi News home page

‘సబర్మతి ఆశ్రమం’ ఎక్కడ ఉంది?

Published Thu, Apr 30 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM

Sabarmati Ashram in Ahmedabad

 1.    అతిపెద్ద నక్షత్రం?
     1) సూర్యుడు    2) ఫ్రాక్సిమా సెంటారీ
     3) బెటల్ గక్స్    4) గనీమెడ్
 
 2.    భూ అంతర్భాగం అత్యధిక సాంద్రత గల పదార్థంతో నిర్మితమై ఉందని మొట్టమొదటిసారిగా ఊహించిన శాస్త్రవేత్త?
     1) న్యూటన్        2) ఐన్‌స్టీన్
     3) సూయిస్    4) వెజ్‌నర్
 
 3.    ఓజోన్ ఆవరణం?
     1) ట్రోపో ఆవరణం    2) స్ట్రాటో ఆవరణం
     3) ఐనో ఆవరణం    4) థర్మో ఆవరణం
 
 4.    కరువులు సంభవించడానికి ప్రధాన కారణం కానిది?
     1) అడవుల నిర్మూలన    2) పట్టణీకరణ
     3) భూతాపం    4) ఎల్ నినో ప్రభావం
 
 5.    హిందూకుష్ పర్వతాల ఉనికి?
     1) భారతదేశం    2) నేపాల్
     3) టిబెట్        4) ఆఫ్గానిస్థాన్
 
 6.    సాధారణంగా నైరుతి రుతుపవనాలు కేరళలో ఎప్పుడు ప్రవేశిస్తాయి?
     1) మే నెల చివరి తేదీ    2) జూన్ మొదటి వారం
     3) జూన్ రెండో వారం    4) మే చివరి వారం
 
 7.    గాలి పారేటట్లుగా ఉండే నేలలు?
     1) నల్ల రేగడి నేలలు    2) ఎర్ర నేలలు
     3) ఒండ్రు నేలలు    4) ఇసుక నేలలు
 
 8.    మనదేశంలో ఏ నీటి వనరు ద్వారా సాగయ్యే నికర వ్యవసాయ భూమి వాటా క్రమక్రమంగా తగ్గుతుంది?
     1) కాల్వలు        2) బావులు
     3) బోరు బావులు    4) చెరువులు
 
 9.    మహబూబ్‌నగర్ జిల్లాలో అధికంగా లభించే అలోహ ఖనిజం?
     1) బాక్సైట్        2) అభ్రకం
     3) ఆస్బెస్టాస్    4) సున్నపురాయి
 
 10.    చోటా నాగ్‌పూర్ పారిశ్రామిక ప్రాంతానికి చెందని నగరం?
     1) అంబాలా     2) జంషెడ్‌పూర్
     3) కుల్టి        4) బొకారో
 
 11.    ముంబై (వి.టి) ఏ రైల్వే మండలానికి ప్రధాన పరిపాలనా కేంద్రం?
     1) ఉత్తర రైల్వే మండలం
     2) పశ్చిమ రైల్వే మండలం
     3) మధ్య రైల్వే మండలం
     4) ఉత్తర మధ్య రైల్వే మండలం
 
 12.    ముంబై నుంచి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గాన ప్రయాణించాలంటే ఏయే జాతీయ రహదారుల నుంచి వెళ్లవలసి ఉంటుంది?
     1) 7, 9 నంబర్ల జాతీయ రహదారులు
     2) 9, 7 నంబర్ల జాతీయ రహదారులు
     3) 5, 6 నంబర్ల జాతీయ రహదారులు
     4) 6, 5 నంబర్ల జాతీయ రహదారులు
 
 13.    కావేరి నది ఎంతదూరం ప్రవహించి సముద్రంలో కలుస్తుంది?
     1) 950 కి.మీ    2) 780 కి.మీ
     3) 1040 కి.మీ    4) 800 కి.మీ
 
 14.    తెలంగాణలో అక్షరాస్యత శాతం?
     1) 67.5    2) 66.7    3) 65.89    4) 66.46
 
 15.    తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని లింగ నిష్పత్తి?
     1) 1000 : 970    2) 1000 : 988
     3) 1000 : 999    4) 1000 : 933
 
 16.    మానవుడు నిప్పును కనిపెట్టిన కాలం?
     1) క్రీ.పూ 25,000 నుంచి క్రీ.పూ 10,000
     2) క్రీ.పూ 10,000 నుంచి క్రీ. పూ 8,000
     3) క్రీ.పూ 8,000 నుంచి క్రీ.పూ 5,000
     4) క్రీ .పూ 5,000 నుంచి క్రీ.పూ 1,000
 
 17.    దక్షిణ భారతదేశంలో అసంఖ్యాకంగా లభించిన ప్రాచీన బంగారు నాణేలు ఎవరికి చెందినవి?
     1) గ్రీకులు        2) ఇండో - అరబిక్‌లు
     3) ఇండో-ఆర్యన్లు     4) రోమన్లు
 
 18.    మలివేదకాలంలో వారణాసి విద్యాలయంతో పాటు అభివృద్ధి చెందిన విశ్వ విద్యాలయం?
     1) తక్షశిల    2) నలంద    3) నాగార్జున    4) ప్రయాగ
 
 19.    బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు?
     1) అంగములు    2) త్రి రత్నాలు
     3) త్రిపీటకములు    4) ఆర్య సత్యాలు
 
 20.    తమ పేర్ల ముందు తల్లి పేరును కూడా చేర్చిన రాజులు?
     1) విష్ణు కుండినులు    2) ఇక్ష్వాకులు
     3) శాతవాహనులు    4) కాకతీయులు
 
 21.    మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసిన వాడు?
     1) అజాత శత్రువు    2) పుష్యమిత్రుడు
     3) బృహద్రధుడు    4) కనిష్కుడు
 
 22.    చంద్రగుప్తుని ఆస్థానంలోని నవరత్నాలనే కవుల్లో లేనివాడు?
     1) వరాహమిహిరుడు    2) కాళిదాస్
     3) ధన్వంతరి    4) ఆర్యభట్ట
 
 23.    దేవరకొండ వెలమ రాజ్య స్థాపకుడు?
     1) రేచర్ల సింగమనాయుడు    2) అనవోత నాయకుడు
     3) మాదా నాయకుడు    4) దాచా నాయకుడు
 
 24.    ‘క్రీడాభిరామం’ను రచించింది?
     1) ప్రతాపరుద్రుడు    2) విద్యా నాధుడు
     3) వల్లభాచార్యుడు    4) జాయపసేనాని
 
 25.    కాకతీయుల కాలంలో ప్రభుత్వోద్యోగులను ఏమని పిలిచేవారు?
     1) నామంకరులు    2) భట్టారకులు
     3) ఆయగారులు    4) తీర్థులు
 
 26.    హైదరాబాద్ నగర నిర్మాణం ఎవరి పర్యవేక్షణలో జరిగేది?
     1) మీర్ జూమ్లా సయ్యద్ జాఫ్రీ
     2) మీర్ జూమ్లా మాదన్న
     3) పీష్వా మీర్ ముమిన్ అస్త్రబది
     4) పీష్వా అమల్ గుజార్
 
 27.    తెలంగాణలో అసఫ్ జాహీల పాలన ఏ సంవత్సరంలో ప్రారంభమయింది?
     1) 1724    2) 1726    3) 1728    4) 1729
 
 28.    దక్కన్ రాజ్యంపై పూర్తి ఆధిపత్యం సాధించిన మొఘల్ చక్రవర్తి?
     1) అక్బర్        2) షాజహాన్
     3) జహంగీర్     4) ఔరంగజేబు
 
 29.    ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం?
     1) 1757    2) 1764    3) 1857    4) 1864
 
 30.    వారన్ హేస్టింగ్స్‌కు సంబంధించని అంశం ఏది?
     1) హిందూ న్యాయసూత్రాలను క్రోఢీకరించాడు
     2) శిస్తు వసూళ్లలో వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు
     3) గ్రామ పంచాయతీ వ్యవస్థను రద్దు చేశాడు
     4) బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు
 
 31.    రాజస్థాన్‌లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారు?
     1) కోలులు    2) మీర్‌లు    3) మోప్లాలు    4) భిల్లులు
 
 32.    మహ్మదీయుల్లో సాంఘిక జాగృతికి జరిగిన ఉద్యమం?
     1) అలీఘర్  2) ఖిలాఫత్      3) వహాభీ     4) పెరైజీ
 
 33.    ‘‘స్వరాజ్యం నా జన్మహక్కు’’అని తిలక్ ఏ ఉద్యమ కాలంలో నినాదం ఇచ్చాడు?
     1) వందేమాతరం     2) సహాయ నిరాకరణ
     3) క్విట్ ఇండియా     4) హోం రూల్
 
 34.    ‘సబర్మతి ఆశ్రమం’ ఎక్కడ ఉంది?
     1) గాంధీనగర్     2) అహ్మదాబాద్
     3) నాగ్‌పూర్     4) ముంబాయి
 
 35.    1919 చట్టం ప్రవే శ పెట్టిన సంస్కరణల ప్రభావాన్ని పరిశీలించేందుకు ఏర్పడిన క మిషన్?
     1) రౌలత్ కమిషన్    2) క్రిప్స్ కమిషన్
     3) సైమన్ కమిషన్     4) క్యాబినేట్ కమిషన్
 
 36.    తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నెహ్రూని ఆహ్వానించిన బ్రిటీష్ వైశ్రాయ్?
     1) మౌంట్ బాటన్     2) వెవెల్
     3) ఇర్విన్         4) లార్డ్ కానింగ్
 
 37.    గోల్కొండ రాజ్య స్థాపకుడు?
     1) సుల్తాన్ కులీ కుతుబ్‌షా
     2) సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా
     3) సుల్తాన్ మహ్మద్ కులీకుతుబ్ షా
     4) సుల్తాన్ అబుల్ హసన్ తానీషా
 
 38.    తెలంగాణలో మొదటి రాజకీయ పత్రిక?
     1) గోల్కొండ     2) తెలంగాణ
     3) నీలగిరి         4) సరోజిని విలాస్
 
 39.    రజాకార్ల నాయకుడు?
     1) నిజాం-ఉల్-ముల్క్
     2) కాశీంరజ్వీ    3) బహదూర్‌మార్ జంగ్
     4) సయ్యద్ రజత్ హుస్సేన్
 
 40.    తెలంగాణలో మొదటి ప్రజాస్వామిక ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పడింది?
     1) 1947     2) 1948     3) 1950     4) 1952
 
 41.    ‘లౌకికతత్వం’ అనగా?
     1) చట్టం ముందు ప్రజలందరు సమానం
     2) సామాజిక ఆర్థిక వ్యత్యాసాలను తగ్గించడం
     3) పాలన నిర్వహణలో మతాల ప్రమేయం ఉండదు
     4) పైవన్నీ
 
 42.    నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఏ రాష్ట్రానికి చెందింది?
     1) మహరాష్ట్ర     2) జమ్మూ క శ్మీర్
     3) ఉత్తర ప్రదేశ్     4) కేరళ
 
 43.    భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్?
     1) బి.ఆర్ అంబేద్కర్
     2) నెహ్రూ        3) బాబూ రాజేంద్రప్రసాద్
     4) సర్దార్ వల్లబాయ్ పటేల్
 
 44.    రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే అభ్యర్థికి ఉండాల్సిన కనీస వయస్సు?
     1) 18 సం.లు     2) 21 సం.లు
     3) 35 సం.లు     4) 45 సం.లు
 
 45.    ఏక పౌరసత్వం అనగా?
     1) రాష్ట్రంలో మాత్రమే పౌరసత్వం
     2) దేశమంతటికీ ఒకే పౌరసత్వం
     3) రాష్ట్రం, దేశంలోనూ ఒకేసారి పౌరసత్వం
     4) రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా ఒకే దాంట్లో పౌరసత్వం
 
 46.    ఒకే రాజ్యసభ సీటు గల కేంద్ర పాలిత ప్రాంతం?
     1) ఢిల్లీ         2) చండీఘర్
     3) పాండిచ్ఛేరి     4) లక్షద్వీప్
 
 47.    తెలంగాణ శాసనమండలి సభ్యుల గరిష్ట పరిమితి?
     1) 60     2) 50     3) 40     4)30
 
 48.    సర్పంచ్‌ను ఎవరు ఎన్నుకుంటారు?
     1) గ్రామసభ సభ్యులు
     2) గ్రామ పంచాయితీ సభ్యులు
     3) గ్రామ ప్రజలు
     4) గ్రామంలో 18 సం.లు నిండిన వయోజనులు
 
 49.    జిల్లా జడ్జిని నియమించే ముందు గవర్నర్ ఎవరిని సంప్రదిస్తారు?
     1) ముఖ్యమంత్రి     2) రాష్ట్రపతి
     3) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి    4) జిల్లా కలెక్టర్
 
 50.    సమాచార హక్కు చట్టం ప్రధాన లక్ష్యం?
     1) పారదర్శకతను పెంచడం
     2) జవాబుదారీతనం పెంచడం
     3) బంధుప్రీతి నివారణ    4) పైవన్నీ
 
 51.    కేంద్రం వసూలు చేసే ప్రత్యక్ష పన్ను
     1) కస్టమ్స్ టాక్స్     2) ఎక్సైజ్ టాక్స్
     3) కార్పొరేషన్ టాక్స్     4) సేల్స్ టాక్స్
 
 52.    {ద వ్యోల్బణం అనగా?
     1) డబ్బు విలువ తగ్గడం
     2) డబ్బు పరిమాణం తగ్గడం
     3) ధరలు పెరగడం     4) పైవన్నీ
 
 53.    {పైవేట్ బ్యాంకుల స్థాపనకు అనుమతులిచ్చే అధికారం ఎవరికి ఉంది?
     1) కేంద్ర ప్రభుత్వం     2) పార్లమెంట్
     3) రిజర్వ్ బ్యాంకు     4) రాష్ట్రపతి
 
 54.    జాతీయ పనికి ఆహార పథకాన్ని ప్రారంభించని సంవత్సరం?
     1) 2001     2) 2002     3) 2003     4) 2004
 
 55.    ‘‘వ్యాట్’’ (గఅఖీ) అనగా?
     1) విలువ ఆధారిత సేవా పన్ను
     2) విలువతో కూడిన పన్ను
     3) విలువతో కూడిన సేవా పన్ను
     4) అమ్మక పు పన్నుపై వేసే సర్ చార్జి
 
 56.    ఆదాయ అసమానతలను తగ్గించటానికి ప్రధానంగా ఉపయోగపడేవి?
     1) పేదరికం-నిరుద్యోగం తగ్గించాలి
     2) భూ సంస్కరణలను పటిష్టంగా అమలు చేయాలి
     3) ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను బాగా అమలు చేయాలి
     4) వ్యవసాయ సంస్కరణలు తీసుకురావాలి
 
 57.    సంకుచిత ద్రవ్యానికి ఉదాహరణ?
     1) కరెన్సీ నోట్లు     2) చెక్కులు
     3) బాండ్లు        4) డిబెంచర్లు
 
 58.    {పభుత్వం చేసే రోజువారీ ఖర్చును ఏమంటారు?
     1) రెవెన్యూ వ్యయం    2) మూలధన వ్యయం
     3) అభివృద్ధి వ్యయం    4) అభివృద్ధేతర వ్యయం
 
 59.    మన రాజ్యాంగంలో బడ్జెట్‌ను ఇలా ప్రస్తావించారు?
     1) ఆదాయ-వ్యయాల నివేదిక
     2) ఆదాయ-వ్యయాల వార్షిక నివేదిక
     3) వార్షిక ఆర్థిక నివేదిక
     4) ఆదాయ-వ్యయాల అంచనాల నివేదిక
 
 60.    నగరీకరణ అంటే?

     1) పట్టణ వలసలు పెరగడం
     2) గ్రామాల నుంచి వలసలు పెరగడం
     3) ఆధునిక వైజ్ఞానికాభివృద్ధి
     4) పట్టణాల పెరుగుదల
 
 సమాధానాలు
 1) 3    2) 1    3) 2    4) 2    5) 4
 6) 2    7) 2    8) 4    9) 3    10) 1
 11) 3    12) 2    13) 4    14) 4    15) 3
 16) 2    17) 4    18) 1    19) 3    20) 3
 21) 2    22) 4    23) 3    24) 3    25) 2
 26) 3    27) 1    28) 4    29) 1    30) 3
 31) 2    32) 1    33) 4    34) 2    35) 3
 36) 2    37) 1    38) 3    39) 2    40) 4
 41) 3    42) 2    43) 3    44) 3    45) 2
 46) 3    47) 3    48) 1    49) 3    50) 4
 51) 3    52) 4    53) 3    54) 4    55) 1
 56) 2    57) 1    58) 1    59) 3    60) 4

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement