అహ్మదాబాద్: మహాత్మా గాంధీ స్థాపించిన సబర్మతీ ఆశ్రమం జూన్ 17 నాటికి వందేళ్లు పూర్తిచేసుకుంది. సందర్భంగా ఆశ్రమంలో ఘనంగా నిర్వహించిన వేడుకలకు గాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ‘మై లైఫ్ మై మెసేజ్’, ‘చరాఖా’ గ్యాలరీలను ఆవిష్కరించారు.
అనంతరం ఆశ్రమ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ‘లెటర్స్ టు గాంధీ’, ‘పయనీర్స్ ఆఫ్ సత్యాగ్రహ’ పుస్తకాలను ఆవిష్కరించారు. మహత్మా గాంధీ 1917, జూన్ 17న ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. 1930 మార్చి 12న ప్రఖ్యాత దండి సత్యాగ్రహాన్ని మహాత్ముడు ఇక్కడి నుంచే ప్రారంభించారు.
శత వసంతాల సబర్మతీ
Published Sun, Jun 18 2017 10:30 AM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM
Advertisement
Advertisement