అహ్మదాబాద్: భారత్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సందర్శించారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ మహాత్ముడి చిత్రపటానికి నూలుమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రత్యేకత, గాంధీ అనుసరించిన జీవన విధానాలను ట్రంప్ దంపతులకు మోదీ వివరించారు. అనంతరం సబర్మతీ ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో ట్రంప్ సందేశం రాసి సంతకం చేశారు. చదవండి: మొతెరాలో ఇదొక కొత్త చరిత్ర : మోదీ
అద్భుతమైన ప్రియమిత్రుడు ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలంటూ ట్రంప్ సందర్శకుల పుస్తకంలో పేర్కొన్నారు. గొప్ప స్స్నేహితుడైన ప్రధానికి మోదీకి ధన్యవాదాలు. ఇదో అద్భుతమైన సందర్శన అంటూ అక్కడి సందర్శకుల పుస్తకంలో ట్రంప్ రాసుకొచ్చారు. ఆ తర్వాత సబర్మతి ఆశ్రమం నుంచి మొతెరా స్టేడియంలో జరగనున్న 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్లారు.
చదవండి: ‘నమస్తే ట్రంప్’ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment