ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సొంత రాష్ట్రంలో పర్యటించారు.
అహ్మదాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సొంత రాష్ట్రంలో పర్యటించారు. గుజరాత్ పర్యటనకు వచ్చిన మోదీ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారఽరు. సబర్మతీ ఆశ్రమం వందవ వార్షికోత్సవ వేడుకలను ప్రధాని ప్రారంభించారు. అనంతరం ఆశ్రమంలో కలియతిరిగి అక్కడి పనులను పరిశీలించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించి మోదీ ఆశ్రమంలోనే మొక్కను నాటారు. చరఖా తిప్పి నూలు వడికారు. ప్రజలందరూ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.