బాపు బాటలో నడుస్తా: రాహుల్ గాంధీ | Rahul Gandhi says he is follower of Mahatma Gandhi | Sakshi
Sakshi News home page

బాపు బాటలో నడుస్తా: రాహుల్ గాంధీ

Published Thu, Oct 3 2013 12:51 PM | Last Updated on Tue, Aug 21 2018 2:29 PM

బాపు బాటలో నడుస్తా: రాహుల్ గాంధీ - Sakshi

బాపు బాటలో నడుస్తా: రాహుల్ గాంధీ

తాను మహాత్మా గాంధీ సిద్ధాంతాలను పాటిస్తానని, ఆయన అనుచరుడినని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రెండు రోజుల పర్యటన కోసం గురువారం గుజరాత్ వచ్చారు. ఇక్కడి గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని రాహుల్ సందర్శించారు. ఆశ్రమంలో అరగంటకుపైగా గడిపారు.

సబర్మతి ఆశ్రమానికి రావడాన్ని ఎప్పుడూ గౌరవంగా భావిస్తానని రాహుల్ సందర్శకుల పుస్తకంలో రాశారు. ఆయన ఆలోచనలు ఆదర్శనీయమని కొనియాడారు. గుజరాత్ పర్యటనలో భాగంగా రాహుల్.. అహ్మదాబాద్, రాజ్కోట్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం గురించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement