Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్‌.. ఇద్దరు ప్లేయర్ల అరంగ్రేటం | Ind vs Eng: Sarfaraz Khan And Dhruv Jurel Got Chance In India's Test Team | Sakshi
Sakshi News home page

Rajkot Test: టీమిండియా బ్యాటింగ్‌.. ఇద్దరు ప్లేయర్ల అరంగ్రేటం

Published Thu, Feb 15 2024 9:15 AM | Last Updated on Thu, Feb 15 2024 9:38 AM

Sarfaraz Khan And Dhruv Jurel Chance In Indian Test Team - Sakshi

India vs England, 3rd Test: రాజ్‌కోట్‌ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య మూడో టెస్ట్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇక, ఈ టెస్టులో టీమిండియా తరఫున సర్ఫరాజ్‌ ఖాన్‌, వికెట్‌ కీపర్‌ ధృవ్‌ జూరెల్‌కు అవకాశం కల్పించడంతో వీరిద్దరూ భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరగ్రేటం చేశారు.

ఇక ఇంగ్లండ్‌ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ స్థానంలో వెటరన్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ తుదిజట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇద్దరు పేసర్లు జేమ్స్‌ ఆండర్సన్‌, మార్క్‌ వుడ్‌లను ఆడించనుంది. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ హైదరాబాద్‌ టెస్టులో.. టీమిండియా విశాఖపట్నం టెస్టులో గెలిచాయి. ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.

తుది జట్ల వివరాలు.. 
టీమిండియా:
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభమన్ గిల్, రజత్ పాటీదార్‌, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లండ్:
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్‌), బెన్ ఫోక్స్(వికెట్‌ కీపర్‌), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement