'ధోనికి బౌలింగ్ చేయడం పెద్ద సవాల్' | It is a big challenge to bowl against Dhoni saysJadeja | Sakshi
Sakshi News home page

'ధోనికి బౌలింగ్ చేయడం పెద్ద సవాల్'

Published Wed, Dec 16 2015 7:34 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM

It is a big challenge to bowl against Dhoni saysJadeja

రాజ్కోట్: మహేంద్ర సింగ్ ధోనికి బౌలింగ్ చేయడం పెద్ద సవాల్తో కూడుకున్నది అంటున్నాడు టీం ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ఇప్పటి వరకు ఐపీఎల్లో ధోనికి సహచర ఆటగాడిగా ఉన్న జడేజా, చెన్నై సూపర్ కింగ్స్పై నిషేధం నేపథ్యంలో రానున్న తొమ్మిదో ఐపీఎల్ సీజన్లో ధోనికి బౌలింగ్ చేయనున్నాడు.

ఐపీఎల్ వేలంలో రాజ్కోట్ జట్టు జడేజాను సొంతం చేసుకుంది. హోం టీమ్ రాజ్‌కోట్ తరపున ఆడబోతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. పుణే తరపున బరిలోకి దిగనున్న ధోనికి బౌలింగ్ కష్టమని అభిప్రాయపడ్డాడు.  'ధోనికి బౌలింగ్ చేయడం పెద్ద సవాల్తో కూడుకున్నది. ముఖ్యంగా తక్కువ ఓవర్ల ఫార్మాట్లో అది మరింత కష్టం. మంచి మ్యాచ్ ఫినిషర్గా అతనికి ఉన్న గుర్తింపు అందరికీ తెలిసిందే. అయితే జట్టు విజయానికి నా వంతు ప్రయత్నం చేస్తాను' అని తెలిపాడు. రాజ్కోట్ జట్టు తరపున మంచి ప్రదర్శన చేస్తానని జడేజా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ తొమ్మిదవ సీజన్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో అట్టహాసంగా ఏప్రిల్ 9 నుండి ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement