రాజ్‌కోట్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో శిఖర్ ధావన్ తృటిలో సెంచరీ కోల్పోయాడు. ఆది నుంచి నిలకడగా ఆడిన ధావన్ 96 వ్యక్తిగత పరుగుల వద్ద నిష్క్రమించాడు. తన బ్యాట్ నుంచి మరో క్లాస్ ఇన్నింగ్స్ వచ్చినా దాన్ని సెంచరీగా మలచుకోవడంలో ధావన్ విఫలమయ్యాడు. కేన్ రిచర్డ్‌సన్ వేసిన 29 ఓవర్ నాల్గో బంతిని ఫైన్ లెగ్ మీదుగా షాట్ ఆడబోయిన ధావన్ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న స్టార్క్‌కు చిక్కాడు. దాంతో శతాకానికి దగ్గరగా వచ్చిన ధావన్ భారంగా పెవిలియన్ వీడాడు. గత మ్యాచ్‌లో కూడా ధావన్ హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఆసీస్‌తో తొలి వన్డేలో ధావన్ 74 పరుగులు సాధించాడు. (ఇక్కడ చదవండి: ధావన్-కోహ్లి ఎట్ 3 వేలు)
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను ఎప్పటిలాగా రోహిత్-శిఖర్ ధావన్‌లు ఆరంభించారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళుతున్న క్రమంలో రోహిత్(42) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఈ జోడి మొదటి వికెట్‌కు 81 పరుగులు జోడించింది. ఆపై ధావన్‌కు కోహ్లి జతకలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలోనే ధావన్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ జోడి 103 పరుగులు జత చేసిన తర్వాత ధావన్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. కాసేపటికి శ్రేయస్ అయ్యర్(7) పెవిలియన్ చేరాడు. జంపా బౌలింగ్‌లో షాట్ ఆడబోగా అది మిస్ కావడంతో బౌల్డ్ అయ్యాడు.
.
Comments
Please login to add a commentAdd a comment