
దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. సిరీస్ సమం
దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో భారత్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేసింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 87 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో వాన్ డెర్ డస్సెన్ 20 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో ఆవేష్ ఖాన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. చాహల్ రెండు, హర్షల్ పటేల్, అక్షర్ పటేల్ తలా వికెట్ సాధించారు.
అంతుకుమందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో దినేష్ కార్తీక్(55) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హార్ధిక్ పాండ్యా(46) పరుగులతో రాణించాడు. కాగా కెప్టెన్ పంత్(17), శ్రేయస్ అయ్యర్(4) మరో సారి నిరాశపరిచాడు. ఇక ప్రోటీస్ బౌలర్లలో ఎంగిడీ రెండు వికెట్లు,జాన్సెన్, కేశవ్ మహారాజ్, ప్రిటోరియస్, నోర్ట్జే తలా వికెట్ పడగొట్టారు
వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
నాలుగో టీ20లో విజయం దిశగా భారత్ అడుగులు వేస్తుంది. ఆవేష్ ఖాన్ వేసిన 14 ఓవర్లలో దక్షిణాఫ్రికా వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. వాన్ డెర్ డస్సెన్(20), జాన్సెన్(12),మహారాజ్ పెవిలియన్‌కు చేరారు.
నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
59 పరుగుల వద్ద సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన మిల్లర్.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 11 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 70/4
మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన క్లాసన్.. చాహల్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. క్రీజులో డుస్సెన్(14), మిల్లర్(7) పరుగులతో ఉన్నారు. 9 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 53/23
రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
26 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. ఆవేష్ ఖాన్ బౌలింగ్‌లో ప్రిటోరియస్ డకౌటయ్యాడు. 6 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 35/2
తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
24 పరుగులు వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన డికాక్ రనౌట్ రూపంలో ఔటయ్యాడు.
4 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 22/0
నాలుగు ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోకుండా 22 పరుగుగులు చేసింది. అయితే కెప్టెన్ బావుమా గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో డికాక్(13) , ప్రిటోరియస్ ఉన్నారు.
చెలరేగిన కార్తీక్, హార్ధిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికా టార్గెట్ 170 పరుగులు
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న నాలుగో వన్డేలో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో దినేష్ కార్తీక్(55) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హార్ధిక్ పాండ్యా(46) పరుగులతో రాణించాడు. కాగా కెప్టెన్ పంత్(17), శ్రేయస్ అయ్యర్(4) మరో సారి నిరాశపరిచాడు. ఇక ప్రోటీస్ బౌలర్లలో ఎంగిడీ రెండు వికెట్లు,జాన్సెన్, కేశవ్ మహారాజ్, ప్రిటోరియస్, నోర్ట్జే తలా వికెట్ పడగొట్టారు
18 ఓవర్లకు భారత్ స్కోర్: 140/4
కార్తీక్(43),హార్ధిక్ పాండ్యా(40) పరుగులతో చెలరేగి ఆడుతున్నారు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 140/4
15 ఓవర్లకు భారత్ స్కోర్: 96/4
15 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. క్రీజులో హార్ధిక్ పాండ్యా(23),కార్తీక్(6) పరుగులతో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
81 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన పంత్..కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
12 ఓవర్లకు భారత్ స్కోర్: 78/3
12 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. క్రీజులో పంత్(16),హార్ధిక్ పాండ్యా(23) పరుగులతో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
ఇషాన్ కిషన్(27) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. అన్రిచ్ నోర్ట్జే బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి కిషన్ ఔటయ్యాడు.
6 ఓవర్లకు టీమిండియా స్కోర్: 40/2
6 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్(27) పంత్(1) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన భారత్.. అయ్యర్ ఔట్
24 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 4 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. జాన్సెన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 3 ఓవర్లకు భారత్ స్కోర్: 24/2
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
13 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన గైక్వాడ్.. ఎంగిడి బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20లో టీమిండియా తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడు మార్పులతో బరిలోకి దిగుతుండగా.. టీమిండియా ఎటువంటి మార్పులు చేయలేదు.
తుదిజట్లు
భారత్ : రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా(కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడి, తబ్రైజ్ షమ్సీ, అన్రిచ్ నోర్ట్జే
Comments
Please login to add a commentAdd a comment